విండోస్ 8... వినూత్నాలెన్నో..! సాంకేతికం | Windows 8... so trendy! | Sakshi
Sakshi News home page

విండోస్ 8... వినూత్నాలెన్నో..! సాంకేతికం

Published Fri, Sep 20 2013 11:47 PM | Last Updated on Fri, Sep 1 2017 10:53 PM

విండోస్ 8... వినూత్నాలెన్నో..! సాంకేతికం

విండోస్ 8... వినూత్నాలెన్నో..! సాంకేతికం

మీ పీసీలో వాడుతున్న వెబ్‌బ్రౌజర్‌ను చూసి, మీ కంప్యూటర్‌లో ఓఎస్‌ను బట్టి... మీ మనస్తత్వాన్ని అంచనా వేసే ప్రపంచమిది. అందుబాటులోకి వస్తున్న నూతన టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో, దాన్ని ఉపయోగించుకోవడంలో ఏ మాత్రం ఆలస్యం అయినా.. అప్ టు డేట్‌గా లేరు... అనే అభిప్రాయం ఏర్పరుచుకొంటున్నారు. అధునాతన టెక్నాలజీని ఉపయోగించడం కొత్త కాన్ఫిడెన్స్‌ను ఇస్తోంది. ప్రత్యేకమైన గుర్తింపును ఇస్తోంది. ఈ నేపథ్యంలో.. పర్సనల్ కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్స్ విషయంలో... అందులోనూ అప్లికేషన్‌ల విషయంలో అప్ టు డేట్ గా ఉండటం మంచిది. దీనివల్ల సౌకర్యానికి సౌకర్యం, ట్రెండీ అనే ఇమేజ్... రెండూ వస్తాయి. మరి కంప్యూటర్‌ల ఓఎస్ విషయంలో... ఇప్పుడు విండోస్ 8 వాడేవాళ్లు తాము ట్రెండీ  అనుకుంటున్నారు. ఐఓఎస్‌తో నడిచే ఖరీదైన పీసీలను పక్కనపెడితే... మిగతా లాప్‌టాప్‌ల విషయంలో, డెస్క్‌టాప్‌ల విషయంలో విండోస్ 8 స్పెషల్ అట్రాక్షన్‌గా మారింది. ప్రత్యేకించి విండోస్8 లోని అప్లికేషన్‌లు ‘వావ్’ అనిపిస్తున్నాయి. మరి అంతలా ఆకట్టుకుంటున్న ఆ అప్లికేషన్‌లు ఏవంటే...
 
 క్లౌడ్ స్టోరేజ్ కోసం...


 5 జీబీ ఫ్రీస్టోరేజ్‌కు అవకాశం ఇస్తోంది బాక్స్ అనే అప్లికేషన్. పర్సనల్, బిజినెస్ డాటా స్టోరేజ్‌కు బాక్స్ ఉత్తమ పరిష్కారం అంటారు. ఇంకా మైక్రోసాఫ్ట్‌కు చెందిన స్కై డ్రైవ్, ఫైల్ షేరింగ్ కు, క్లౌడ్‌లోని డాటా ఎడిటింగ్‌కు అవకాశమిచ్చే డ్రాప్‌బాక్స్, అంతులేని డాటా స్టోరేజ్‌కు అవకాశమిచ్చే బిట్‌కాసా ఇన్‌ఫెనైట్ స్టోరేజ్ అప్లికేషన్‌లు విండోస్ 8 పై అందుబాటులో ఉన్నాయి. వీటిలో తగినది ఎంపిక చేసుకునే ఛాయిస్ మీదే!
 
 వంటల విషయంలో పోటీ...


 నలభై వేల రెసిపీల ఐడియాలతో ఉన్న ఆల్ రెసిపీస్, కుకింగ్ ట్యుటోరియల్‌గా ఉండే యుమ్‌వైకుకింగ్ కంపానియన్, కొత్త కుకింగ్ బుక్ క్రియేట్ చేయడానికి అవకాశమిచ్చే రెసిపీ హౌస్ అప్లికేషన్‌లున్నాయి. టైమ్డ్ 2 పర్ఫెక్షన్, ఫుడ్‌మ్యాగ్ లు కూడా వంట విషయంలో గైడ్‌గా ఉండే అప్లికేషన్‌లు.
 
 గేమ్ అప్లికేషన్‌లు కూడా...


 విండోస్ 8 పై ఆకట్టుకునే గేమ్ అప్లికేషన్‌లు ఎన్నో అందుబాటులో ఉన్నాయి. స్మార్‌‌టఫోన్‌లో ఉండే గేమ్ అప్లికేషన్‌లకు ధీటుగా ఉంటాయివి. టచ్ స్క్రీన్‌పై ఈ అప్లికేషన్‌లు అదుర్‌‌స అనిపిస్తాయి. గ్రావిటీ గయ్, గేమ్ దేవ్ టైకూన్, రేడియంట్, ర్యాట్ ఆన్ స్నోబోర్డ్, మంకీ ఫ్లైట్, ఎక్స్‌బాక్స్ గేమ్స్, ఫిన్‌బాల్ ఎఫ్‌ఎక్స్ 2, రేడియంట్ డిఫెన్స్, యాంగ్రీ బర్డ్స్ స్పేస్, యాంగ్రీ బర్డ్స్ స్టార్ వార్స్ వంటి గేమ్ అప్లికేషన్‌లు ఉన్నాయి.
 
 ఫొటో ఎడిటింగ్ కోసం...


 విండోస్ ఫోన్‌లో అందుబాటులో ఉన్న ఫొటో ఎడిటర్‌లను పీసీకి మైగ్రేట్ చేశారు. 70 స్టైల్ ఫ్రేమ్స్‌తో ఉండే ఫోటోరూమ్, కిడ్స్ డ్రాయింగ్ ప్రాక్టీస్‌కు ఉపయోగకరంగా ఉండే ఫ్రెష్ పెయింట్, ఫొటో లుక్ మార్చేయగల పర్ఫెక్ట్ 365, ఇంకా గ్యాలరీ హెచ్‌డీ, ఫోటొర్, పికాసా ఆల్బమ్ పెయిడ్ వెర్షన్, స్కెచ్ టచ్.. వంటి ఫొటో ఎడిటింగ్ అప్లికేషన్‌లూ ఉన్నాయి.
 
 మ్యూజిక్ లవర్స్ కోసం...


 విండోస్ 8 మ్యూజిక్ లవర్స్‌ను అలరించడానికి కూడా ఎన్నో అప్లికేషన్‌లను అందుబాటులో ఉంచింది. ఇంటర్నెట్‌లో అనుసంధానమైన ఆప్స్‌తో ఆకట్టుకుంటోంది. వీటిలో ఏడు లక్షల ప్లేలిస్ట్స్‌తో ఉండే 8 ట్రాక్ రేడియో, ఇంకా నోకియా మ్యూజిక్, ఫ్రీ ఇంటర్నెట్ రేడియో అయిన ట్యూనెలన్ రేడియో, రెండు కోట్లకుపైగా ట్రాక్స్ ఉండే 7 డిజిట్ మ్యూజిక్ స్టోర్, పాపులర్ మ్యూజిక్ డిస్కవరీ సర్వీస్ షాజమ్, మ్యూజిక్ ట్యూబ్ వంటి అప్లికేషన్లుఉన్నాయి.
 
 ప్రొడక్టివిటీ కోసం కూడా...


 కేవలం వినోదం కోసమే కాక... విద్య, వృత్తి, వ్యాపార రంగాలకు ఉపయోగపడే అప్లికేషన్‌లను కూడా అందుబాటులో ఉంచింది విండోస్ 8. వీటిలో స్కై డ్రైవ్‌తో సింక్ అయ్యే వన్‌నోట్, డిజిటల్ నోట్ మేకింగ్‌లో బెస్ట్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఎవర్ నోట్‌టచ్, టీమ్ వ్యూయర్ టచ్, పీడీఎఫ్ ఫైల్స్‌ను చ దవడంలో కొత్త ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే పీడీఎఫ్ టచ్ తదితరాలున్నాయి.
 
 రీడింగ్ కోసం..


 చదువరుల కోసం ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్న సైట్‌లలో బెస్ట్ అయిన వాటిని అప్లికేషన్‌లుగా అందుబాటులో ఉంచారు. వీటిలో దాదాపు పదిలక్షల బుక్స్‌తో ఉండే కిండ్లేస్టోర్, మ్యాగజీన్లు, న్యూస్‌పేపర్లను అందుబాటులో ఉంచుతూ... దాదాపు పదిలక్షల పుస్తకాలను ఉచితంగా చదువుకోవడానికి అవకాశమిచ్చే నూక్ తో పాటు పల్స్ న్యూస్, ఫర్ లేటర్, కామిక్స్, న్యూస్‌బెంటో, బుక్‌బజార్ రీడర్, అడోబ్ రీడర్ టచ్, మాగ్నా ఫ్లో వంటి అప్లికేషన్‌లు పుస్తకాల పురుగులకు దివిటీలుగా ఉన్నాయి. అంతేగాక... విజ్ఞానసర్వస్వం వికీపీడియాను ఒక బుక్ రూపంలో అప్లికేషన్‌గా అందుబాటులో ఉంచారు.
 
 ఆన్‌లైన్ షాపింగ్ కోసం...


 ఆన్‌లైన్ షాపింగ్ కోసం చక్కటి సైట్లుగా ఉన్న వాటిని అప్లికేషన్‌ల రూపంలో అందుబాటులో ఉంచారు. ఈ బే, అమజాన్, క్రెయిగ్ లిస్ట్‌ప్లస్ లు అప్లికేషన్‌లుగా ఉన్నాయి. వెబ్‌సైట్‌గా వీటిని బ్రౌజ్ చేయడం కంటే అప్లికేషన్‌లుగా వాడుకోవడం వల్ల సర్ఫింగ్ వేగవంతంగా ఉంటుంది.
 
 సోషల్ నెట్‌వర్కింగ్ కొంచెం కొత్తగా...


 విండోస్ 8 లో ఫేస్‌బుక్ అప్లికేషన్ లేదు. ఈ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌ను వెబ్ బ్రౌజర్ ద్వారా ఓపెన్ చేసుకోవచ్చు. మిగతావాటిలో రెడిట్ ఆన్ రెడ్ హబ్, ట్విటర్, స్కైప్, మెట్రో ట్విట్, స్టంబుల్ అపాన్, ఐఎమ్ ప్లస్.. వంటి సైట్లు అప్లికేషన్‌లుగా అందుబాటులో ఉన్నాయి.
 
 - జీవన్‌రెడ్డి .బి
 
 స్మార్ట్‌ఫోన్ మార్కెటింగ్‌లో విండోస్ 8 ఓఎస్‌కు అప్లికేషన్‌ల లేమి ఉందనే విశ్లేషణలు వినిపిస్తున్నా, మిడిల్ రేంజ్ పీసీ ప్రపంచంలో మాత్రం అప్లికేషన్‌లో విషయంలో ఈ ఆపరేటింగ్ సిస్టమ్ బెస్ట్‌గా నిలుస్తోంది. టచ్ పీసీలకు, సాధారణ టాబ్లెట్‌ల విషయంలో విండోస్ 8 వినూత్నమైన అనుభవంగా నిలుస్తోంది.
 
 ఒక్కో అప్లికేషన్ గురించి ఒక్కో పదంతో తేల్చేసినా  టచ్ పీసీలో వీటిని వాడటంలో ఉండే ఎక్స్‌పీరియన్స్ గురించి చెప్పాలంటే ఎంతో ఉంటుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement