
శాన్‌ఫ్రాన్సిస్కో: ఈ నెల 31 నుంచి మెసేజింగ్ యాప్ వాట్సాప్ సేవలను కొన్ని మొబైల్ ప్లాట్‌ఫాంలకు నిలిపేస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. దీంతో బ్లాక్‌బెర్రీ ఓఎస్, బ్లాక్‌బెర్రీ 10, విండోస్ ఫోన్ 8.0, అంతకంటే పాత ప్లాట్‌ఫాంలకు వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నాయి. వీటికి సంబంధించి భవిష్యత్తులో ఎలాంటి అప్‌డేట్స్ అభివృద్ధి చేయడం లేదని, కొన్ని ఫీచర్లు ఏ సమయంలోనైనా ఆగిపోవచ్చని పేర్కొంది.
ఈ ఓఎస్‌లు వాడుతున్న వారు కొత్త ఓఎస్ వెర్షన్ (ఆండ్రాయిడ్ ఓఎస్ 4.0+, ఐఫోన్ ఓఎస్ 7+, విండోస్ ఫోన్ 8.1+)లోకి అప్‌గ్రేడ్ చేసుకోవడం ద్వారా వాట్సాప్ సేవలను పొందవచ్చని తెలిపింది. అలాగే నోకియా ఎస్40 ఫోన్లలో వాట్సాప్ ఈ నెల 31 తర్వాత పనిచేయదని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment