విండోస్ 8.0, బ్లాక్‌బెర్రీ ఓఎస్, బ్లాక్‌బెర్రీ 10 ఓఎస్ వంటి పాత ప్లాట్‌ఫామ్‌లన్నింటికీ ప్రముఖ మెసేజింగ్ యాప్, వాట్సాప్ పనిచేయడం ఆగిపోయిన సంగతి తెలిసిందే. 2017 డిసెంబర్ 31 నుంచి ఈ ప్లాట్‌ఫామ్స్‌కు వాట్సాప్ పనిచేయదని కంపెనీ ముందస్తుగానే ప్రకటించింది. కానీ బ్లాక్‌బెర్రీ 10 ఓఎస్ యూజర్లకు మరో రెండు వారాలు ఊరట లభించింది. ఈ యూజర్ల ప్లాట్‌ఫామ్‌పై మరో రెండు వారాల పాటు వాట్సాప్ పనిచేస్తుందని తెలిసింది. భవిష్యత్‌లో వాట్సాప్ వినియోగానికి అవసరమైన స్థాయికి సమానంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడానికి పైన పేర్కొన్న ఓఎస్ కలిగిన మొబైల్స్ విఫలం అవుతున్నందు వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సంస్థ స్పష్టంచేసింది. కొంత సమయం కాలం పాటు వాట్సాప్ ఈ యూజర్లకు పనిచేస్తుందని, కానీ స్పందించడంలో కొన్ని మార్పులు ఉంటాయని సంస్థ తెలిపింది.
ఒకవేళ యాప్‌ను తొలగిస్తే, బ్లాక్‌బెర్రీ 10 ఓఎస్ యూజర్లు మరోసారి రీ-రిజిస్ట్రర్ చేసుకోవాల్సినవసరం లేదని, రీ-ఇన్‌స్టాల్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. నెంబర్‌ను ధృవీకరించుకోవాల్సినవసరం కూడా లేదని చెప్పింది. అయితే రెండు వారాల తర్వాత యాప్ 'ఎక్స్‌పైరీ మోడ్' లోకి వెళ్లిపోతుందని, దీంతో పనిచేయడం ఆగిపోతుందని మాత్రం పేర్కొంది. నోకియా ఎస్40కు కూడా ఈ ఏడాది చివరి నుంచి సపోర్టు చేయడం ఆగిపోనుంది. 2.3.7 ఆండ్రాయిడ్ వెర్షన్లు, పాత వాటికి 2020 డిసెంబర్ 1 వరకే సపోర్టు చేయనున్నాయి. ఒకవేళ తమ మెసేజింగ్ యాప్‌ను వాడుకోవాలంటే యూజర్లు కొత్త ఫోన్లలోకి అప్‌గ్రేడ్ కావాలని సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment