BlackBerry
-
భారత్‌లో బ్లాక్‌బెర్రీ ఇన్నోవేషన్ సెంటర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ) ఆధారిత సాఫ్ట్వేర్, సర్వీసెస్ అందిస్తున్న కెనడా సంస్థ బ్లాక్‌బెర్రీ భారత్‌లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, ఇంజనీరింగ్, ఇన్నోవేషన్ సెంటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్నట్టు బుధవారం ప్రకటించింది. 2023 చివరి నాటికి కెనడా తర్వాత ప్రపంచవ్యాప్తంగా బ్లాక్‌బెర్రీ ఐవోటీ విభాగానికి రెండవ అతిపెద్ద కేంద్రంగా ఇది అవతరిస్తుందని వెల్లడించింది. ఆ సమయానికి ఇక్కడ 100 మందికి పైగా ఎంబెడ్డెడ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లను నియమించుకోనున్నట్టు తెలిపింది. సాఫ్ట్వేర్ ద్వారా నియంత్రించగలిగే తదుపరి తరం వాహనాల అభివృద్ధి, ఐవోటీ పరిశ్రమలో ఆధునిక ఆవిష్కరణలు లక్ష్యంగా ఈ కేంద్రం బ్లాక్‌బెర్రీ రూపొందించిన క్యూఎన్ఎక్స్, ఐవీ ఉత్పాదనలపై పనిచేస్తుంది. ఆవిష్కరణలు, ఎంబెడ్డెడ్ సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ డెవలప్మెంట్, ఇంజనీరింగ్ సర్వీసెస్ బాధ్యతలను హైదరాబాద్ బృందం చేపడుతుంది. ‘నైపుణ్యాలు, ఆవిష్కరణలలో బ్లాక్‌బెర్రీ కొనసాగిస్తున్న పెట్టుబడికి ఈ రోజు మరొక మైలురాయి. ప్రపంచ స్థాయి సాఫ్ట్వేర్ ఆవిష్కర్తలకు నిలయంగా భారత ప్రాముఖ్యతను సూచిస్తుంది. ప్రధానంగా ఆటోమొబైల్ రంగంలో ఐవోటీ సాప్ట్వేర్ లీడర్‌గా వేగవంతమైన వృద్ధిని కొనసాగిస్తాం’ అని బ్లాక్‌బెర్రీ ఐవోటీ ప్రెసిడెంట్ మ్యాటిస్ ఎరిక్సన్ తెలిపారు. టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, స్టెల్లాంటిస్, బీఎండబ్లు్య, బాష్, ఫోర్డ్, జీఎం, హోండా, మెర్సిడెస్ బెంజ్, టయోటా, ఫోక్స్‌వ్యాగన్ వంటి సంస్థలు బ్లాక్‌బెర్రీ క్లయింట్లుగా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 21.5 కోట్ల వాహనాల్లో బ్లాక్‌బెర్రీ క్యూఎన్ఎక్స్ వినియోగిస్తున్నారు. -
Blackberry The Fall: ఆ ఆలస్యమే బ్లాక్‌బెర్రీ కొంప ముంచింది
ఒకప్పుడు స్మార్ట్‌ఫోన్ రారాజు. చేతిలో ఆ కంపెనీ ఫోన్ ఉంటే అదో దర్పం. ప్రొఫెషనల్స్‌కి అదొక అవసరం కూడా. ఒకానొక సీజన్లో ఏకంగా ఒక 5 కోట్ల డివైజ్‌లు అమ్ముడు పోయిన చరిత్ర ఉంది. కానీ, అటుపై ఘోరమైన పతనాన్ని చవిచూసింది. అందుకు కారణం ఆలస్యమేనన్న విశ్లేషణ నడుస్తోంది ఇప్పుడు. ‘ఆలస్యం అమృతం విషం’ అంటారు పెద్దలు. రీసెర్చ్ ఇన్ మోషన్(RIM) అలియాస్ బ్లాక్‌బెర్రీ లిమిటెడ్ విషయంలో ఇదే జరిగింది. పోటీతత్వాన్ని తేలికగా తీసుకున్న బ్లాక్‌బెర్రీ.. రాంగ్ స్టెప్పులు వేసింది. నష్టాలను సైతం పట్టించుకోకుండా విలువల పేరుతో ఈ కెనెడియన్ టెలికాం కంపెనీ స్వీయ తప్పిదాలు చేసి పతనం వైపు అడుగు వేసింది. ఇంతకీ బ్లాక్‌బెర్రీ ది రైజ్ అండ్ ది ఫాల్ ఎలా సాగిందో చూద్దాం.. పేజర్లు, హ్యాండ్సెట్ల తయారీతో మొదలైన RIM(బ్లాక్‌బెర్రీ) ప్రస్థానం.. స్మార్ట్‌ఫోన్ రాకతో కొత్త పుంతలు తొక్కింది. పూర్తిగా ఐకానిక్ కీబోర్డుతో పదిహేనేళ్లపాటు కోట్ల మంది యూజర్లను అలరించింది. ఒకానొక టైంలో బ్లాక్‌బెర్రీ.. అమెరికాలో 50 శాతం స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను, ప్రపంచం మొత్తం మీద 20 శాతం మార్కెట్‌ను శాసించింది. 2011, 2012లో ప్రపంచవ్యాప్తంగా రికార్డుస్థాయి హ్యాండ్సెట్ల అమ్మకాలతో సంచలనం సృష్టించిన బ్లాక్‌బెర్రీకి.. పోటీదారుల ఒరవళ్లతో గడ్డుకాలం మొదలైంది. 2016 నుంచి ఏకంగా ఫోన్ల తయారీని నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన బ్లాక్‌బెర్రీ.. తాజాగా సొంత ఓఎస్ ఫోన్లు పని చేయవంటూ ప్రకటించింది. దీంతో కోట్ల ఫోన్లు మూగబోయాయి. ఇంతకీ ఏం జరిగింది? బీజం.. 1984లో మైక్ లాజరడీస్,డౌగ్లస్ ఫ్రాగ్ అనే కెనెడియన్ ఇంజీనీర్లు RIMను ప్రారంభించారు. మొదట్లో ఈ కంపెనీ ఐబీఎంకోసం ఎల్ఈడీ సిస్టమ్, మోడెమ్స్ తో పాటు పేజెస్ వంటి లోకల్ నెట్ వర్కింగ్ కనెక్టివిటీ టెక్నాలజీ డెవలప్ చేసింది. అలాగే ఫిల్మింగ్ ఎడిటింగ్ సిస్టమ్‌ను డిజైన్ చేసింది. అందుకు గాను 1998లో ఆస్కార్ అవార్డ్‌ను గెలుచుకుంది. ఆ తర్వాత 1989లో కెనడియన్ ఫోన్ కంపెనీ అయిన రోజెర్స్ ఫోన్ మెసేజింగ్ కోసం స్పెషల్ గా డిజైన్ చేయబడిన తన మొబైల్ నెట్‌వర్క్‌లో పనిచేసేలా రిమ్(RIM)తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా పేజర్ల తయారీ మొదలుపెట్టింది. 1996లో వాటర్లూ(ఒంటారియో) వేదికగా రిమ్ నుంచి పేజర్లు కలర్ ఫీచర్లతో రిలీజ్ అయ్యాయి. ఫోన్ల రాక.. బ్లాక్ బెర్రీ డివైజ్ 850 1999 నుంచి అధికారికంగా రిలీజ్ అయ్యింది. 2000 సంవత్సరంలో ఫిజికల్ బోర్డుతో కూడిన 957 మోడల్ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ అయ్యింది. 2006లో ట్రాక్ బాల్‌ను అమర్చింది. బిజినెస్ ప్రొఫెషనల్స్ కోసం తీసుకొచ్చిన ఫోన్లు.. సాధారణ జనాలకు సైతం కిక్కు ఇచ్చింది. బ్లాక్ బెర్రీ అంటే.. ముందుగా వచ్చిన అడ్వాన్స్డ్ స్మార్ట్‌ఫోన్ అనే ముద్ర పడింది. 2007లో కంపెనీ ఆదాయం అక్షరాల 3 బిలియన్ డాలర్లు దాటేసింది. బ్లాక్‌బెర్రీ సెల్ ఫోన్లు ఒకప్పుడు చాలా ప్రజాదరణ పొందిన వ్యక్తులు వాటిని "క్రాక్బెర్రీస్" అని పిలిచేవారు. కిమ్ కర్దాషియాన్, బరాక్ ఒబామా లాంటి ప్రముఖులు ఈ ఫోన్లనే వాడేవాళ్లు. పెద్ద కీబోర్డు, మధ్యలో ఐబాల్.. కీ సెటప్‌తో ప్రత్యేకంగా ఆకర్షించేవి ఫోన్లు. అందులో నెట్ ఇన్కమ్ 631 మిలియన్ డాలర్లు. ఈ లోపు బ్లాక్‌బెర్రీ స్ఫూర్తితో యాపిల్ ఐఫోన్లను తీసుకొచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా స్టీవ్ జాబ్స్ అంగీకరించడం విశేషం. పైగా ఇకపై బ్లాక్‌బెర్రీకి తాము గట్టి పోటీ ఇవ్వబోతున్నామంటూ ఆయన ప్రకటించాడు కూడా. కానీ, బ్లాక్‌బెర్రీ మాత్రం ఏనాడూ యాపిల్‌ను పోటీగా చూడలేదు. అదే కొంప ముంచింది. ఏడాదికో అప్డేట్ లేకపాయే! 2008లో రిలీజ్ అయిన ఫ్లిప్ఫోన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో సంచలనం సృష్టించింది. అయితే ఆ వెంటనే వచ్చిన టచ్ మోడల్ మాత్రం అట్టర్ ప్లాప్ అయ్యింది. అదే సమయంలో ఐఫోన్ అమ్మకాలు మొదలైనా ఖరీదు ఎక్కువ కావడంతో బ్లాక్‌బెర్రీ హవానే నడిచింది. అలా 2011 వరకు బ్లాక్‌బెర్రీ ఫోన్ల డామినేషన్ కొనసాగింది. అయితే స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో వస్తున్న మార్పును పసిగట్టడంలో బ్లాక్‌బెర్రీ ఘోరంగా విఫలమైంది. ఐఫోన్లో ప్రతీ ఏడాది ఓ అప్డేట్ రావడం, ఆపై మోటోరోలా అమ్మకాల సంచలనం కొనసాగడంతో బ్లాక్‌బెర్రీ పతనం చిన్నగా మొదలైంది. అదే సమయంలో టార్చ్, ప్లేబుక్ టాబ్లెట్ అంటూ ఇన్నోవేషన్లు చేసిందే తప్ప.. అప్డేట్కి ప్రయత్నించలేదు. దీంతో ఆ తర్వాత వచ్చిన మోడల్స్ ఏవీ పెద్దగా అమ్ముడుపోలేదు. బోర్ కొట్టించాయి. సొంత యాప్ స్టోర్ బ్లాక్‌బెర్రీలో మరో ఫెయిల్యూర్ అంశం. యాపిల్, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌లా మ్యాజిక్ చేయలేకపోయింది. ఎంత ప్రయత్నించినా.. చిన్న చిన్న ఫీచర్లు తీసుకొచ్చేందుకు బోలెడంత సమయం తీసుకునేది. ఇదంతా యూజర్లకు విసుగు తెప్పించింది. తోటి పోటీదారులు ఫ్రంట్ బ్యాక్ కెమెరాలంటూ అడ్వాన్స్డ్ ఫీచర్లు తెస్తుంటే.. బ్లాక్‌బెర్రీ మాత్రం అక్కడే ఆగిపోయింది. దీంతో పతనం ఉధృతి పెరిగింది. 2009లో 20 శాతానికి పడిపోయిన బ్లాక్‌బెర్రీ మార్కెట్.. మూడేళ్లలో 5 శాతానికి పడిపోయింది. అయితే 2013లో టచ్ మోడల్స్ స్పెసిఫికేషన్స్ వచ్చినప్పటికీ.. అప్పటికే చాలా ఆలస్యమైంది. అదే ఏడాది రిమ్ అధికారికంగా బ్లాక్‌బెర్రీ అనే పేరును ప్రమోట్ చేసుకుంది. కానీ, ఆ వ్యూహం కూడా బెడిసి కొట్టింది. కస్టమర్లు, యూజర్ల పట్ల నిజాయితీగా ఉందనుకునే తప్పా.. పతనాన్ని ఊహించలేదు. 2016 చివరి క్వార్టర్‌కు చేరుకునే సరికి.. 432 మిలియన్ల స్మార్ట్‌ఫోన్‌లో అమ్ముడుపోయినవి కొన్నే. దీంతో స్మార్ట్‌ఫోన్ మార్కెట్ షేర్ సున్నాకు చేరింది. చేతులు మారినా.. 2015 నుంచి బ్లాక్‌బెర్రీ ఆపరేటింగ్ సిస్టమ్‌ను నిలిపివేసి.. సొంత ఓఎస్ ప్లేస్‌లో ఆండ్రాయిడ్ భాగస్వామిగా సాగుతున్నాయి. స్మార్ట్ ఫోన్ ఆవిష్కరణలో సంచలనాలకు నెలవైన బ్లాక్‌బెర్రీ లిమిటెడ్.. అనూహ్యంగా ఓనర్షిప్ నుంచి పక్కకు జరిగింది. 2016లో చైనీస్ కన్జూమర్ ఎలక్ట్రిక్ కంపెనీ టీసీఎల్.. బ్లాక్‌బెర్రీని కొనుగోలు చేసింది. బ్లాక్‌బెర్రీ 10, బ్లాక్బెరర్రీ వోఎస్‌లతో పని చేసింది. 1999 నుంచి కెనెడియన్ కంపెనీ బ్లాక్‌బెర్రీ లిమిటెడ్ (RIM) ఆధ్వర్యంలో పని చేసి.. 2016 నుంచి బీబీ మెరాహ్ పుతిహ్(ఇండోనేషియా), ఒప్టిమస్ ఇన్ఫ్రాకమ్(ఇండియా), టీసీఎల్ కార్పొరేషన్ భాగస్వామ్యంతో నడిచింది. అయితే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా టీసీఎల్ కార్పొరేషన్ మాత్రమే బ్లాక్‌బెర్రీ డెవలపర్‌గా ఉంది. కస్టమైజ్డ్ ఆప్షన్స్, సెక్యూరిటీ ఫీచర్స్.. ఇలా ఎన్నో.. 2018లో రిలీజ్ అయ్యింది. BlackBerry KeyOne అండ్ Key2 వంటి స్మార్ట్ఫోన్లను పరిచయం చేసింది టీసీఎల్. ఇక జనవరి 4, 2022 తేదీ నుంచి బ్లాక్‌బెర్రీ మోడల్స్ ఫోన్లలో బ్లాక్‌బెర్రీ ఆపరేటింగ్ సిస్టమ్‌ను పూర్తిగా నిలిపివేశాయి. కానీ బ్లాక్‌బెర్రీ ఫోన్లలో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న ఫోన్లపై ఎలాంటి ప్రభావం ఉండదని తెలిపింది. 2021 నుంచి టెక్సాస్‌కు చెందిన స్టార్టప్ ఆన్వార్డ్మొబిలిటీ 5జీ బ్లాక్‌బెర్రీ స్మార్ట్ఫోన్ల లైసెన్స్‌ను చేజిక్కించుకుంది. స్మార్ట్‌ఫోన్ మార్కెట్ నుంచి బ్లాక్‌బెర్రీ ఫోన్లు ఇంకా పూర్తిగా కనుమరుగు కాకపోయి ఉండొచ్చు.. కానీ, క్లాసిక్ టచ్‌తో వచ్చిన ఫోన్లు, ఫీచర్లు, సొంత సాఫ్ట్వేర్ మాత్రం ఇక కనిపించవు. బహుశా.. రాబోయే రోజుల్లో ఆ పేరు కనుమరుగు అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అదే జరిగితే.. బ్లాక్‌బెర్రీ నోస్టాల్జియా కేటగిరీలో చేరిపోవడం ఖాయం. -సాక్షి, వెబ్‌స్పెషల్ -
స్మార్ట్ ఫోన్ ఇండస్ట్రీలో కింగ్..జనవరి నుంచి ఆ స్మార్ట్ ఫోన్ ఇక కనిపించదు!
స్మార్ట్ ఫోన్ ఇండస్ట్రీని 14ఏళ్లపాటు కింగ్‌లా ఏలిన బ్లాక్ బెర్రీ ఇప్పుడు మరింత కనుమరుగు కానుంది. జనవరి 4నుంచి బ్లాక్ బెర్రీ తన ఆపరేటింగ్ సిస్టమ్ బ్లాక్ బెర్రీ ఓఎస్, బ్లాక్ బెర్రీ ప్లే బుక్ ఓఎస్ సేవల్ని నిలిపివేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. దీంతో బ్లాక్ బెర్రీ యూజర్లు వారిఫోన్లలో ఓఎస్ 7.1, బీబీ 10లలో ఫోన్‌కాల్స్, ఎస్ఎంఎస్లతో పాటు ఎమెర్జెన్సీ నెంబర్లు పనిచేయవు. అంతేకాదు బ్లాక్ బెర్రీ సంస్థ సైతం తన యూజర్లను హెచ్చరించింది. సంబంధిత ఫోన్లలో వైఫై, మొబైల్ డేటా, బ్లాక్ బెర్రీ యాప్స్ బ్లాక్ బెర్రీ లింక్, బ్లాక్ బెర్రీ డెస్క్ ట్యాప్ మేనేజర్, బ్లాక్ బెర్రీ ప్రొటెక్ట్, బ్లాక్ బెర్రీ మెసెంజర్, బ్లాక్ బెర్రీ బ్లెండ్ యాప్స్ ఫంక్షనింగ్ పూర్తిగా ఆగిపోనున్నట్లు చెప్పింది. కింగ్ మేకర్ నుంచి ఎందుకు పతనం అయ్యింది ►1984లో కెనడాకు చెందిన మైక్ లాజరడీస్,డౌగ్లస్ ఫ్రాగ్ అనే ఇద్దరు ఇంజినీర్లు రీసెర్చ్ ఇన్ మోషన్ పేరుతో ఓ కంపెనీనీ ప్రారంభించారు. మొదట్లో ఈ కంపెనీ ఐబీఎంకోసం ఎల్ఈడీ సిస్టమ్, మోడెమ్స్ తో పాటు పేజెస్ వంటి లోకల్ నెట్ వర్కింగ్ కనెక్టివిటీ టెక్నాలజీ డెవలప్ చేసింది. అలాగే ఫిల్మింగ్ ఎడిటింగ్ సిస్టమ్‌ను డిజైన్ చేసింది. అందుకు గాను 1998లో ఆస్కార్ అవార్డ్‌ను గెలుచుకుంది. ►ఆ తర్వాత 1989లో కెనడియన్ ఫోన్ కంపెనీ అయిన రోజెర్స్ ఫోన్ మెసేజింగ్ కోసం స్పెషల్ గా డిజైన్ చేయబడిన తన మొబైల్ నెట్‌వర్క్‌లో పనిచేసేలా ఆర్ఐఎమ్తో ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో మొబైల్ మెసేజింగ్‌లో ఎక్స్పర్ట్ గా 1996లో ఎంతో వేగంగా ఎస్టాబ్లిష్ అయ్యింది. ►అలా 2000సంవత్సరంలో బ్లాక్ బెర్రీ తన మొట్టమొదటి ఫోన్ బ్లాక్ బెర్రీ 957ను మార్కెట్లో పరిచయం చేసింది. ఈ ఫోన్లో ఉండే క్వాలిటీ కీ ప్యాడ్ బటన్స్ బ్లాక్ బెర్రీ ఫ్రూట్స్ షేప్‌లో ఉంటాయి. అందుకే ఆర్ఐఎం కంపెనీ బ్లాక్ బెర్రీతో మార్కెటింగ్ చేయడం ప్రారంభించాయి. ►అప్పట్లో ఈ బ్రాండ్ ఫోన్ విడుదలైన కొద్దికాలానికే సంవత్సరానికి 50మిలియన్ల ఫోన్లను అమ్మి సరికొత్త రికార్డ్లను క్రియేట్ చేసింది. అందుకే ఈ డివైజెస్‌ను క్రాక్ బెర్రీ అనిపిలుస్తారు. అమెరికాలో 50శాతం మార్కెట్‌ను వరల్డ్‌వైడ్ 50శాతం మార్కెట్‌ను కలిగి ఉంది. ►ఇప్పుడున్న ఐఫోన్లు, ఆండ్రాయిడ్ ఫోన్లు రాకముందే యూజర్లకు స్మార్ట్ ఫోన్ టెక్నాలజీని పరిచయం చేసింది ఈ బ్లాక్ బెర్రీ. తర్వాత స్మార్ట్ ఫోన్లు ఎన్ని వచ్చినా మర్కెట్లో పోటీని తట్టుకుంటూ వచ్చింది. ఈ క్రమంలో ఐకానిక్ కీబోర్డ్ తో బ్లాక్ బెర్రీ ఫోన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. కొంత కాలం బాగున్నా స్టైలిష్ అండ్ డిగ్నిటీకి సింబాలిక్ గా చెప్పుకునే బ్లాక్ బెర్రీని హార్డ్‌వేర్ దిగ్గజం ఆపిల్, సాఫ్ట్వేర్ దిగ్గజం గూగుల్ కంపెనీలు వరుసగా ఆండ్రాయిడ్ వెర్షన్‌ను విడుదల చేయడంతో చతికిల బడింది. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా కొత్త కొత్త ఇన్నోవేషన్‌తో యూజర్ ను అట్రాక్ట్ చేయలేకపోతుంది. ►బ్లాక్ బెర్రీ ఆపరేటింగ్ సిస్టమ్ 2000తో ఆ కంపెనీ గ్రో అవ్వడానికి మరింత బలం చేకూరినట్లైంది. కానీ ఐఓఎస్, ఆండ్రాయిండ్ కలిసొచ్చినప్పుడు..వాటికి ధీటుగా ఆ ఫోన్ సపోర్ట్ చేయలేకపోయింది. ప్రపంచం మొత్తం అప్డేట్ అవుతున్నా..బ్లాక్ బెర్రీ మాత్రం మూసధోరణిలోనే కొనసాగింది. ►యూజర్లు ఎంటర్టైన్మెంట్ ను బాగా ఇష్టపడేవారు. యూజర్ల అటెక్షన్ను యాపిల్, గూగుల్ లు గ్రాబ్ చేసినట్లుగా.. బ్లాక్ బెర్రీ అట్రాక్ట్ చేయలేకపోయింది. ►ఫోన్ వాడే యూజర్లు ఫోన్లతో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలో గూగుల్, యాపిల్లు నేర్పించాయి. తమ ఫోన్లతో యూజర్లు ఇంకేం చేయొచ్చో నేర్పించాయి. పగలు, రాత్రి తేడా లేకుండా యూజర్లు ఫోన్లకు అతుక్కుపోయేలా చేశాయి. అలాంటి అప్లికేషన్లు యాప్స్టోర్లను అందిస్తూ వచ్చాయి. ఈ విషయంలో కూడా బ్లాక్ బెర్రీ ఫెయిల్ అయ్యింది. ► బ్లాక్ బెర్రీ మాతృసంస్థ రీసెర్చ్ ఇన్ మోషన్ లిమిటెడ్' టెక్నాలజీ వరల్డ్ ఓ కింగ్ మేకర్. కానీ మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా కొత్త కొత్త ఇన్నోవేషన్స్‌పై ఫోకస్ చేయలేకపోయింది. అందుకే యూజర్ మైండ్ సెట్‌ను క్యాచ్ చేయలేకపోయింది. చదవండి: స్మార్ట్ ఫోన్ ఫీచర్లు లీక్..కొత్త ఏడాది ప్రారంభంలోనే లాంచింగ్..అదిరిపోయే డిజైన్లతో! -
మార్కెట్లోకి బ్లాక్‌బెర్రీ ఎవాల్వ్ స్మార్ట్‌ఫోన్
న్యూఢిల్లీ: పూర్తిగా భారత్‌లో ఉత్పత్తి అయిన రెండు అధునాతన స్మార్ట్ఫోన్లను ప్రీమియం బ్లాక్‌బెర్రీ గురువారం మార్కెట్లో విడుదలచేసింది. ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఓఎస్, 5.99 అంగుళాల డిస్ప్లేతో ఈ రెండు ఫోన్లు అందుబాటులోకి రానున్నట్లు భారత్‌లో బ్లాక్‌బెర్రీ మొబైల్స్‌ను ఉత్పత్తి చేస్తున్న ఆప్టిమస్ ఇన్ఫ్రాకామ్ తెలిపింది. ఎవాల్వ్ ఎక్స్ పేరిట విడుదలైన మొబైల్ ధర రూ.34,990 కాగా, 6జీబీ ర్యామ్, 64 జీబీ అంతర్గత స్టోరేజీ స్పెషల్ ఫీచర్స్‌గా ఉన్నట్లు వెల్లడించింది. ఎవాల్వ్ ధర రూ.24,990గా నిర్ణయించింది. ఈ నెలాఖరులో ఫోన్లు అందుబాటులో ఉండనున్నాయని పేర్కొంది. -
సరికొత్త ఫీచర్లతో బ్లాక్‌బెర్రీ స్మార్ట్ఫోన్లు
సాక్షి, న్యూఢిల్లీ: బ్లాక్‌బెర్రీ తన నూతన స్మార్ట్ఫోన్లను గురువారం విడుదల చేసింది. బ్లాక్‌బెర్రీ ఎవాల్వ్, ఎవాల్వ్ ఎక్స్ డివైస్‌లను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఎవాల్వ్ స్మార్ట్‌ఫోన్ ధర ను రూ.24,990 గా, ఎవాల్వ్ఎక్స్ ధరను రూ.34,990గాను నిర్ణయించింది. ఎవాల్వ్ ఎక్స్ స్మార్ట్ఫోన్లు ఆగస్టు చివరినాటికి, ఎవాల్వ్ స్మార్ట్‌ఫోన్ సెప్టెంబర్ నాటికి ప్రత్యేకంగా అమెజాన్‌లో నియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి. దీంతోపాటు వీటిపై జియో రూ.3,950 క్యాష్‌బ్యాక్‌ను అందివ్వనుంది. అలాగే ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోళ్లపై 5శాతం డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తోంది. భారీ బ్యాటరీ, 18:9 రేషియో బెజెల్‌లెస్ స్క్రీన్, వైర్‌లైస్ చార్జింగ్, ఫేస్ అన్‌లాక్ సపోర్ట్‌తో వస్తున్న తొలి బ్లాక్ బెర్రీ మొబైల్స్‌గా ఇవి నిలవనున్నాయి. మొమరీ విస్తరణకు సంబంధించి ఎవాల్స్లో 4జీబీ ర్యామ్‌ను, 256 ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్‌ను అవకాశాన్ని అందిస్తోంది. ఇది తప్ప ఈ రెండు స్మార్ట్ఫోన్ల ఫీచర్లు దాదాపు ఒకేలా ఉన్నాయి. ఎవాల్వ్ ఎక్స్ ఫీచర్లు 5.99 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 450 ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 8.1 ఓరియో 6జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 2 టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ 13+13 ఎంపీ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా 4000ఎంఏహెచ్ బ్యాటరీ -
బ్లాక్‌బెర్రీ కీ సిరీస్‌లో మరో ఫోన్
-
అద్భుత ఫీచర్లతో బ్లాక్‌బెర్రీ కీ2
న్యూయార్క్: బ్లాక్‌బెర్రీ మరో సరికొత్త ఫోన్‌తో బ్లాక్‌బెర్రీ అభిమానులను ఆకట్టుకునేందుకు సిద్ధమైంది. టీసీఎల్ లైసెన్స్‌తో వివిధ మార్కెట్లలో ఈ స్మార్ట్ఫోన్లను విక్రయిస్తున్న టీసీఎల్ బ్లాక్‌బెర్రీ కీ సిరీస్‌లో మరో డివైస్‌ను న్యూయార్క్‌లో లాంచ్ చేసింది. కీ1కి సక్సెసర్‌గా తాజాగా కీ2 పేరుతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తెచ్చింది. డీటెక్, లాకర్, పవర్ సెంటర్ లాంటి బిల్ట్ ఇన్ సెక్యూరిటీ ఫీచర్లు డ్యుయల్ రియర్ కెమెరా, క్వర్టీ (ఫిజికల్) కీబోర్డు ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. బ్లాక్అండ్ సిల్వర్ కలర్స్ లో లభిస్తున్న దీని ధర సుమారు రూ.43,893గా ఉండనుంది. అమెరికా లో ప్రీఆర్డర్లు మొదలయ్యాయనీ, ఈ నెల చివరినుంచి షిప్పింగ్ మొదలవుతుందని కంపెనీ తెలిపింది. బ్లాక్‌బెర్రీ కీ2 ఫీచర్లు 4.5 అంగుళాల ఐపిఎస్ డిస్ప్లే 1620×1080 రిజల్యూషన్ క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 660 ఆక్టాకోర్ ప్రాసెసర్ స్టోరేజ్ ఆండ్రాయిడ్ ఓరియో 8.1 6జీబీర్యామ్, 64జీబీ స్టోరేజ్ 12+12 ఎంపీ రియర్ కెమెరా 8 ఎంపీ సెల్పీ కెమెరా 3500ఎంఏహచ్ బ్యాటరీ క -
ఆ యూజర్లకు వాట్సాప్ మరికొన్ని రోజులు..
విండోస్ 8.0, బ్లాక్‌బెర్రీ ఓఎస్, బ్లాక్‌బెర్రీ 10 ఓఎస్ వంటి పాత ప్లాట్‌ఫామ్‌లన్నింటికీ ప్రముఖ మెసేజింగ్ యాప్, వాట్సాప్ పనిచేయడం ఆగిపోయిన సంగతి తెలిసిందే. 2017 డిసెంబర్ 31 నుంచి ఈ ప్లాట్‌ఫామ్స్‌కు వాట్సాప్ పనిచేయదని కంపెనీ ముందస్తుగానే ప్రకటించింది. కానీ బ్లాక్‌బెర్రీ 10 ఓఎస్ యూజర్లకు మరో రెండు వారాలు ఊరట లభించింది. ఈ యూజర్ల ప్లాట్‌ఫామ్‌పై మరో రెండు వారాల పాటు వాట్సాప్ పనిచేస్తుందని తెలిసింది. భవిష్యత్‌లో వాట్సాప్ వినియోగానికి అవసరమైన స్థాయికి సమానంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడానికి పైన పేర్కొన్న ఓఎస్ కలిగిన మొబైల్స్ విఫలం అవుతున్నందు వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సంస్థ స్పష్టంచేసింది. కొంత సమయం కాలం పాటు వాట్సాప్ ఈ యూజర్లకు పనిచేస్తుందని, కానీ స్పందించడంలో కొన్ని మార్పులు ఉంటాయని సంస్థ తెలిపింది. ఒకవేళ యాప్‌ను తొలగిస్తే, బ్లాక్‌బెర్రీ 10 ఓఎస్ యూజర్లు మరోసారి రీ-రిజిస్ట్రర్ చేసుకోవాల్సినవసరం లేదని, రీ-ఇన్స్టాల్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. నెంబర్‌ను ధృవీకరించుకోవాల్సినవసరం కూడా లేదని చెప్పింది. అయితే రెండు వారాల తర్వాత యాప్ 'ఎక్స్పైరీ మోడ్' లోకి వెళ్లిపోతుందని, దీంతో పనిచేయడం ఆగిపోతుందని మాత్రం పేర్కొంది. నోకియా ఎస్40కు కూడా ఈ ఏడాది చివరి నుంచి సపోర్టు చేయడం ఆగిపోనుంది. 2.3.7 ఆండ్రాయిడ్ వెర్షన్లు, పాత వాటికి 2020 డిసెంబర్ 1 వరకే సపోర్టు చేయనున్నాయి. ఒకవేళ తమ మెసేజింగ్ యాప్‌ను వాడుకోవాలంటే యూజర్లు కొత్త ఫోన్లలోకి అప్‌గ్రేడ్ కావాలని సూచించింది. -
31 నుంచి వాట్సాప్ పనిచేయదు
శాన్ఫ్రాన్సిస్కో: ఈ నెల 31 నుంచి మెసేజింగ్ యాప్ వాట్సాప్ సేవలను కొన్ని మొబైల్ ప్లాట్‌ఫాంలకు నిలిపేస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. దీంతో బ్లాక్‌బెర్రీ ఓఎస్, బ్లాక్‌బెర్రీ 10, విండోస్ ఫోన్ 8.0, అంతకంటే పాత ప్లాట్‌ఫాంలకు వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నాయి. వీటికి సంబంధించి భవిష్యత్తులో ఎలాంటి అప్డేట్స్ అభివృద్ధి చేయడం లేదని, కొన్ని ఫీచర్లు ఏ సమయంలోనైనా ఆగిపోవచ్చని పేర్కొంది. ఈ ఓఎస్‌లు వాడుతున్న వారు కొత్త ఓఎస్ వెర్షన్ (ఆండ్రాయిడ్ ఓఎస్ 4.0+, ఐఫోన్ ఓఎస్ 7+, విండోస్ ఫోన్ 8.1+)లోకి అప్‌గ్రేడ్ చేసుకోవడం ద్వారా వాట్సాప్ సేవలను పొందవచ్చని తెలిపింది. అలాగే నోకియా ఎస్40 ఫోన్లలో వాట్సాప్ ఈ నెల 31 తర్వాత పనిచేయదని పేర్కొంది. -
ఈ మొబైల్స్‌లో ఇక వాట్సాప్ పనిచేయదు!
శాన్ఫ్రాన్సిస్కో : వివిధ మొబైల్ ఫ్లాట్‌ఫాంలపై డిసెంబర్ 31, 2017 తర్వాత మెసేజింగ్ యాప్ వాట్సాప్ నిలిచిపోనున్నాయి. ఈ విషయాన్ని కంపెనీ బ్లాగ్ ద్వారా ధృవీకరించింది. బ్లాక్‌బెర్రీ ఓఎస్, బ్లాక్‌బెర్రీ 10, విండోస్ ఫోన్ 8.0, దాని కంటే పాత ఫ్లాట్‌ఫాంలకు వాట్సాప్ తన సేవలను నిలిపివేస్తున్నట్లు సోమవారం తెలిపింది. వీటికి సంబంధించి భవిష్యత్తులో ఎలాంటి అప్డేట్స్ అభివృద్ధి చేయడం లేదని, కొన్ని ఫీచర్లు ఏ సమయంలోనైనా పనిచేయకపోవడం ఆగిపోవచ్చునని వెల్లడించింది. భవిష్యత్తులో తమ యాప్ ఫీచర్లను ఇంకా అభివృద్ధి చేద్దామనుకుంటున్నామని, కానీ ఈ ఫ్లాట్‌ఫాంలకు అంత సామర్థ్యం లేదని చెప్పింది. ఈ ఓఎస్‌లు వాడుతున్న వారు వెంటనే కొత్త ఓఎస్ వెర్షన్(ఆండ్రాయిడ్ ఓఎస్ 4.0+, ఐఫోన్ ఓఎస్ 7+, విండోస్ ఫోన్ 8.1+)లోకి అప్‌గ్రేడ్ కావాలని సూచించారు. అప్పుడే మీరు వాట్సప్‌ను వినియోగించుకునేందుకు వెసులుబాటు కలుగుతుందని తెలిపారు. ఇది మాకు ఒక కఠినమైన నిర్ణయం, కానీ వాట్సాప్ ద్వారా వినియోగదారులు మరింత మంది స్నేహితులు, కుటుంబం, ప్రియమైన వారిని తో సన్నిహితంగా ఉండేలా, ఉన్నతమైన ఫీచర్లను మెరుగైన సౌలభ్యాన్ని అందిస్తున్నాం. ఈ క్రమంలో అప్‌గ్రేడ్ చేసుకోవాలసింది రికమెండ్ చేశాం’’ అని వాట్సాప్ తన బ్లాగులో పేర్కొంది. ఈ సంవత్సరం చివరి నాటికి వాట్సాప్ బంద్ అయ్యే మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ బ్లాక్ బెక్రీ, ఓఎస్, 10 విండోస్ ఫోన్ 8.0 , అంతకంటే పాతవి దీనితోపాటు నోకియా ఎస్ 40 ఫోన్లలో వాట్సాప్ డిసెంబర్ 31,2018 తరువాత పనిచేయదని పేర్కొంది. ఫిబ్రవరి 1, 2020 తర్వాత ఆండ్రాయిడ్ 2.3.7 , అంతకంటే పాత వెర్షన్లలో కూడా వాట్సాప్ సేవలను నిలిపి వేయనుంది. కాగా 2016 లో వివిధ మొబైల్ ఫ్లాట్‌ఫాంలలో వాట్స్అప్ సేవలు నిలిపివేత గురించి మొదటిసారి ప్రకటించింది. ఆ తరువాత మరికొన్ని ఓఎస్‌లలో ఈ గడువును జూన్ 30, 2017 వరకు పొడిగిస్తున్నట్టు పేర్కొంది. తాజాగా గడువు డిసెంబరు 31, 2017తో ముగియనుందని తెలిపింది. -
బ్లాక్‌బెర్రీ మోషన్ స్మార్ట్‌ఫోన్, ఫీచర్లివే!
చైనీస్ ఫోన్ తయారీదారి టీసీఎల్, బ్లాక్‌బెర్రీ మోషన్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఐకానిక్ బ్రాండు బ్లాక్‌బెర్రీపై ఎంతో కాలంగా వేచిచూస్తున్న కొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను ఈ కంపెనీ విడుదల చేసింది. బ్లాక్‌బెర్రీ మోషన్ అచ్చం కీవన్ స్మార్ట్‌ఫోన్ మాదిరిగానే ఉంది. ఈ ఫోన్ తొలుత యూఏఈ, సౌదీ అరేబియా వంటి మధ్య తూర్పు మార్కెట్లలోకి అందుబాటులోకి రానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు ఏ విధంగా ఉన్నాయో ఓ సారి చూద్దాం.. మిడ్-రేంజ్ డ్యూయల్ సిమ్ ఆండ్రాయిడ్ 7.1.1 నోగట్ 5.5 అంగుళాల హెచ్డీ డిస్ప్లే ఫిజికల్ హోమ్ బటన్ డ్రాగన్ట్రైల్ గ్లాస్ ప్రొటెక్షన్ స్నాప్‌డ్రాగన్ 625 ఎస్ఓసీ ప్రాసెసర్ 4జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజ్ 2 టీబీ వరకు విస్తరణ మెమరీ 4000 ఎంఏహెచ్ బ్యాటరీ 12 ఎంపీ రియర్ కెమెరా 8 ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ముందు వైపు ఫింగర్‌ప్రింట్ స్కానర్ ధర 460 డాలర్లు. -
బ్లాక్‌బెర్రీ కొత్త స్మార్ట్‌ఫోన్ త్వరలో.. ధర?
కెనడియన్ స్మార్ట్‌ఫోన్ మేకర్ బ్లాక్ బెర్రీ త్వరలో భారతదేశంలో త్వరలో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయనుంది. తాజా నివేదికల ప్రకారం బ్లాక్‌బెర్రీ స్మార్ట్‌ఫోన్ 'కీవన్' ను ఆగస్టు 1వ తేదీన ఇండియన్ మార్కెట్లో విడుదల చేయనుంది. ఈ ఏడాది ఫిబ్రవరి వరల్డ్ కాంగ్రెస్ లో దీన్ని ప్రదిర్శించింది. కంపెనీ హార్డ్ వేర్ పార్టనర్ టీసీఎల్ భాగస్వామ్యంతో దీన్ని రూపొందించింది. దీని ధర సుమారు రూ.43వేలుగా నిర్ణయించినట్టు సమాచారం. కాగా లేటెస్ట్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంతో వస్తున్న ఈ కీ వన్ స్మార్ట్‌ఫోన్ ఆపిల్ ఐ ఫోన్ 7 కు ఇది గట్టిపోటీకానుందని భావిస్తున్నారు. బ్లాక్‌బెర్రీ కీవన్ ఫీచర్లు... 4.5 ఇంచ్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే 1620 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 7.1.1 నూగట్, 3 జీబీ ర్యామ్ 32 జీబీ స్టోరేజ్ 256జీబీ వరకు ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ 12 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా ఫింగర్‌ప్రింట్ సెన్సార్ 3505 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 3.0 -
వరల్డ్ మోస్ట్ సెక్యుర్ స్మార్ట్‌ఫోన్ ఇదేనట!
ప్రపంచంలో అత్యంత సురక్షితమైన స్మార్ట్‌ఫోన్‌ను బ్లాక్ బెర్రీ ఆవిష్కరించింది. "డీటీఈకే 50" పేరుతో ఈ నూతన స్మార్ట్ ఫోన్‌ను బ్లాక్ బెర్రీ తీసుకొచ్చింది. దీని ధర అమెరికా మార్కెట్లో 299 డాలర్లు(దాదాపు 20,000). ఆగస్టు 8 నుంచి ఈ ఫోన్ షిప్పింగ్ ప్రారంభించబోతున్నట్టు కంపెనీ వెల్లడించింది. ప్రపంచంలో ఉన్న ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ అన్నింటిలో కెల్లా ఈ ఫోనే అత్యంత సురక్షితమైనదని బ్లాక్ బెర్రీ చెబుతోంది. ఈ ఫోన్ ప్రీబుకింగ్స్ ను యూఎస్, కెనడా, యూకే, ఫ్రాన్స్, స్పెయిన్, ఇటలీ, నెదర్లాండ్స్ లో తన ఆన్లైన్ సైటులో అందుబాటులో ఉంచింది. అయితే ఇండియన్ బ్లాక్ బెర్రీ ఫ్యాన్స్ ఈ ఫోన్ కోసం మరికొన్ని నెలలు వేచిచూడాల్సి ఉందని కంపెనీ పేర్కొంది. భారత మార్కెట్లో ఈ ఫోన్ రూ.25,000కు లాంచ్ కావొచ్చని తెలుస్తోంది. మల్టిఫుల్ సెక్యురిటీ ఫీచర్లను కంపెనీ ఈ ఫోన్లో పొందుపర్చింది. ఫుల్ డిస్క్ ఎన్ క్రిప్షన్, మాల్వేర్ ప్రొటెక్షన్, సెక్యుర్ బూట్, వాచ్డాక్స్, బిజినెస్-క్లాస్ ఈమెయిల్, కొలాబోరేషన్ టూల్స్, సెక్యుర్ వాయిస్, మెసేజింగ్ ఎన్క్రిప్టడ్కి ఐఎమ్, బీబీఎమ్ ప్రొటక్షన్ ఈ ఫోన్లో పొందుపర్చిన సెక్యురిటీ ఫీచర్లు. ఈ ఫోన్ ప్రత్యేకతలేమిటో ఓసారి చూద్దాం.. 5.2 అంగుళాల స్క్రాచ్ రెసిస్టెంట్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే క్వాల్ కామ్ స్నాప్‌డ్రాగన్ 617 ఆక్టా కోర్ ప్రాసెసర్ 3జీబీ ర్యామ్ 16జీబీ ఇంటర్నెల్ స్టోరేజ్ 2టీబీ విస్తరణ మెమరీ ఆండ్రాయిడ్ 5.0 మార్ష్‌మాలో 13 మెగాపిక్సెల్ వెనుక కెమెరా విత్ పీడీఏఎఫ్ డ్యూయల్ టోన్ ఎల్ఈడీ ఫ్లాస్ 8 మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ 2610 ఎంఏహెచ్, ఫాస్ట్ చార్జింగ్ -
ఇక ఆ ఫోన్లకు వాట్సాప్ పనిచేయదట..!
ఫేస్ బుక్ కు చెందిన పాపులర్ మెసేజింగ్ సర్వీసు వాట్సాప్, ఇక సింబియాన్ ఫోన్లకు పనిచేయదట. డిసెంబర్ 31 నుంచి ఈ సర్వీసును సింబియాన్ ఫోన్లకు ఆపివేయబోతున్నట్టు వాట్సాప్ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సింబియాన్ ఫోన్ యూజర్లకు దీనికి సంబంధించిన నోటిఫికేషన్లు వాట్సాప్ నుంచి అందాయి. "దురదృష్టవశాత్తు, 31/12/2016 నుంచి మీ ఫోన్లకు వాట్సాప్ పనిచేయదు. ఎందుకంటే మీ ఫోన్లకు ఈ యాప్ సపోర్టు చేయకపోతుండటంతో సర్వీసులను ఆపివేస్తున్నాం" అని వాట్సాప్ నుంచి యూజర్లు నోటిఫికేషన్లు పొందారు. వాట్సాప్ ఈ విషయాన్ని తన అధికారిక బ్లాగ్ పోస్టులో కూడా పొందుపర్చింది. అన్ని బ్లాక్ బెర్రీ ఓఎస్ వెర్షన్లకి(బ్లాక్ బెర్రీ10కి కూడా), నోకియాస్ సింబియాన్ ఎస్40, సింబియాన్ ఎస్60 వెర్షన్, 2.1 ఎక్లైర్, 2.2 ఫ్రోయో, విండోస్ ఫోన్ 7.1 టోటింగ్ డివైజ్ లకు ఈ ఏడాది చివరి నుంచి వాట్సాప్ సర్వీసులు ఆపివేస్తున్నారు. 2009లో వాట్సాప్ ను ఆవిష్కరించిన సమయంలో, బ్లాక్ బెర్రీ, సింబియాన్ ఆపరేటింగ్ సిస్టమ్ లే వాట్సాప్ వృద్ధికి సహకరించాయి. ఆ సమయంలో కేవలం 25 శాతమే ఆండ్రాయిడ్, ఐఓఎస్ వెర్షన్ డివైజ్ లు వాట్సాప్ వృద్ధికి తోడ్పడ్డాయి. బ్లాక్ బెర్రీ, సింబియాన్ ఫోన్లకు వాట్సాప్ పనిచేయదని ఆ కంపెనీ ప్రకటించిన కొన్ని రోజులకే, బ్లాక్ బెర్రీ 10 డివైజ్ లకు మార్చి 31 నుంచి ఫేస్ బుక్ సపోర్టును ఆపివేస్తున్నామని ఫేస్ బుక్ కంపెనీ కూడా ప్రకటించింది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఈ డివైజ్ విఫలమవుతుండటంలో ఈ సర్వీసును నిలిపివేయనున్నట్టు కంపెనీలు పేర్కొంటున్నాయి. ఆండ్రాయిడ్, ఐఓఎస్ లు ప్రతి ఏడాది కొత్త వెర్షన్ లతో స్మార్ట్ ఫోన్లను తయారుచేసి, మార్కెట్లోకి ఆవిష్కరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే బ్లాక్ బెర్రీ, ఆండ్రాయిడ్ ఫోన్ల తయారీకి పూనుకోగా.. ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్స్ తయారీదారు ఫిన్ లాండ్ ఆధారిత హెచ్ ఎమ్డీ కంపెనీతో కలిసి నోకియా పనిచేయడం ప్రారంభించింది. -
బ్లాక్ బెరీకి భారీ నష్టాలు
లండన్: కెనడా మొబైల్ కంపెనీ బ్లాక్ బెరీ ఊహించని విధంగా నష్టాలు చవిచూసింది. స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు బాగా పడిపోవడంతో గత రెండేళ్లలో ఎన్నడులేని విధంగా భారీగా నష్టపోయింది. ఈ ఏడాది మొదటి ఆర్థిక త్రైమాసికంలో కేవలం 5 లక్షల ఫోన్లు మాత్రమే విక్రయించింది. దీంతో కంపెనీకి సుమారు రూ.4500 కోట్ల (670 మిలియన్ డాలర్లు) నష్టం వాటిల్లింది. గతేడాది మొదటి త్రైమాసికంలో 6 లక్షల ఫోన్లు విక్రయించింది. ఫోన్ల అమ్మకాలు పెంచుకునేందుకు బ్లాక్ బెరీ చేసిన పునర్ వ్యవస్థీకరణ ప్రయత్నాలు ఫలించలేదు. గతేడాది ఆండ్రాయిడ్ ఓఎస్ తో ప్రివ్ స్మార్ట్ ఫోన్లు ప్రవేశపెట్టింది. అయినప్పటికీ ఫోన్ల అమ్మకాలు ఏమాత్రం పెరగలేదు. హేండ్ సెట్ల బిజినెస్ తో పెద్దగా లాభం లేదని బ్లాక్ బెరీ సీఈవో జాన్ చెన్ అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఫోన్ల అమ్మకాల నుంచి వైదొలగాలని బ్లాక్ బెరీ భావిస్తోంది. దీనిపై సెప్టెంబర్ లో నిర్ణయం ప్రకటిస్తామని తెలిపింది. ఈ ఏడాది చివరి నాటికి బ్లాక్ బెరీ ఓఎస్ 10కు సేవలు నిలిపివేస్తామని వాట్సప్ ఇప్పటికే ప్రకటించింది. బ్లాక్ బెరీ ప్లాట్ ఫామ్ నుంచి వైదొలుగుతున్నట్టు ఇటీవలే ఫేస్బుక్ వెల్లడించింది. -
బ్లాక్‌బెర్రీ నుంచి మరో కొత్త ఆండ్రాయిడ్ ఫోన్.!
న్యూఢిల్లీ: బ్లాక్‌బెర్రీ నుంచి మరో కొత్త ఆండ్రాయిడ్ ఫోన్ త్వరలో మార్కెట్లోకి రానుంది. ఇప్పటికే తన తొలి ఆండ్రాయిడ్ ఫోన్ ప్రివ్ పేరుతో రిలీజ్ చేసిన బ్లాక్‌బెర్రీ.. తక్కువ ధరలో ఫోన్ ను అందుబాటులో తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇటీవల న్యూఢిల్లీ వచ్చిన బ్లాక్‌బెర్రీ సీఈఓ జాన్ చెన్ ఈ విషయాన్ని తెలియజేశారు. ప్రివ్ ధర ఎక్కువ ఉండటంతో పాటు, దానికి తోడు నిలబడే మరో ఫోన్ ఏదీ సంస్థ నుంచి లేకపోవడం వల్లే విజయం సాధించలేకపోయిందని చెప్పారు. బ్లాక్‌బెర్రీ ఓఎస్10 విజయంపై స్పందిస్తూ మొబైల్స్‌లో భారీ విజయాన్ని సాధించలేకపోయినా.. ప్రభుత్వాలు ఈ ఓఎస్‌ను ఉపయోగించడానికి ఇష్టపడుతున్నాయని తెలిపారు. మిగతా ఫోన్ల మాదిరి బ్లాక్‌బెర్రీ ఇండియాలో పెద్ద మొత్తాన్ని పెట్టుబడి పెడుతున్నట్లు చెప్పారు. రాబోయే ఆండ్రాయిడ్ మొబైల్ ధర ఇండియాలో రూ.25,000లు ఉంటుందని తెలిపారు. -
వాట్సాప్ సేవలు బంద్!
న్యూఢిల్లీ: బ్లాక్‌బెర్రీ, నోకియా ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే మొబైల్ హ్యాండ్సెట్లలో వాట్సాప్ మెసెంజర్ సేవలు నిలిచిపోనున్నాయి. బ్లాక్‌బెర్రీ (బ్లాక్‌బెర్రీ 10 సహా), నోకియా ఎస్40, నోకియా సింబియాన్ ఎస్60, ఆండ్రాయిడ్ 2.1, 2.2, విండోస్ ఫోన్ 7.1 ఓఎస్‌లపై నడిచే ఫోన్లలో వాట్సాప్ మెసెంజర్ సేవలను ఈ ఏడాది చివరి నాటికి నిలిపివేస్తున్నట్లు వాట్సాప్ సంస్థ ప్రకటించింది. ప్రస్తుతం అంతర్జాతీయంగా ఉన్న మొబైల్ హ్యాండ్‌సెట్స్‌లో దాదాపు 99.5 శాతం వరకు ఫోన్లు గూగుల్, మైక్రోసాఫ్ట్, యాపిల్ కంపెనీల ఆపరేటింగ్ సిస్టమ్ (ఓఎస్)పై పనిచేస్తున్నాయని తెలిపింది. అత్యధిక ప్రజలు ఉపయోగిస్తున్న ఓఎస్‌పైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరించినట్లు పేర్కొంది. ఫేస్బుక్ 2014 ఫిబ్రవరిలో వాట్సాప్‌ను 19 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. -
ఆ ఫోన్లలో వాట్సప్ పనిచేయదు!
న్యూ ఢిల్లీ: ఇంతకు ముందు మార్కెట్లో మాంచి క్రేజ్ ఉన్న ఫోన్లు కొన్ని ఇప్పుడు పరిమిత సంఖ్యలో వాడుకలో ఉన్నాయి. ఇటీవల ఫేస్బుక్ ఆధీనంలోకి వెళ్లిపోయిన వాట్సప్.. ఇలాంటి కొన్ని మొబైల్‌లలో ఈ సంవత్సరాంతానికి తమ సేవలను నిలిపేయాలని భావిస్తోంది. ఈ జాబితాలో ఒకప్పటి పాపులర్ మొబైల్‌లు ఉన్నాయి. అన్ని బ్లాక్ బెర్రీ ఆపరేటింగ్ సిస్టం వర్షన్ మొబైల్లకు( బ్లాక్ బెర్రీ 10తో సహా), నోకియాకు చెందిన సింబియాన్ యస్40, సింబియాన్ యస్60 వెర్షన్లకు సేవలను నిలిపేయాలని వాట్సప్ సంస్థ నిర్ణయం తీసుకుంది. 2009లో వాట్సప్‌ను ప్రారంభించినప్పుడు ఇప్పుడున్న మొబైల్ మార్కెట్‌కు భిన్నమైన పరిస్థితులు అప్పుడు ఉన్నాయి. మార్కెట్లోని 70 శాతం ఫోన్లకు బ్లాక్ బెర్రీ, నోకియా సంస్థలే ఆపరేటింగ్ సిస్టంను సమకూర్చేవి. ఇప్పుడు మాత్రం యాపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్ సంస్థలు ఆపరేటింగ్ సిస్టంలు అందిస్తున్న మొబైల్‌లు 99 శాతం మార్కెట్‌ను ఆక్రమించాయి. ఈ నేపథ్యంలో ఎక్కువమంది వినియోగదారులు ఉపయోగించే మొబైల్ ఫోన్లకు అనుకూలంగా తమ మెసేజింగ్ యాప్ పనిచేసేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వాట్సప్ సంస్థ ఓ ప్రకటనలో వెల్లడించింది. -
బ్లాక్ బెర్రీ తొలి ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ ‘ప్రివ్’
న్యూఢిల్లీ: కెనడాకు చెందిన ప్రముఖ మొబైల్ హ్యాండ్సెట్స్ తయారీ కంపెనీ బ్లాక్‌బెర్రీ తొలిసారిగా ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై(ఓఎస్) పనిచేసే స్మార్ట్‌ఫోన్ ‘ప్రివ్’ను భారత మార్కెట్లో ఆవిష్కరించింది. దీని ధర రూ.62,990. లాలీపాప్ ఓఎస్‌పై పనిచేసే ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5.4 అంగుళాల తెర, 1.8 గిగాహెర్ట్జ్ హెక్జా కోర్ క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ మెమరీ, సింగిల్ సిమ్, 4జీ, 18 ఎంపీ రియర్ కెమెరా, 2 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 3,410 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి తదితర ప్రత్యేకతలు ఉన్నట్లు కంపెనీ తెలిపింది. ‘ప్రివ్’ స్మార్ట్ఫోన్లు జనవరి 30 నుంచి అమెజాన్‌లో, బ్లాక్‌బెర్రీ అధికారిక భాగస్వాముల ఔట్లెట్స్, స్టోర్లలో అందుబాటులో ఉంటాయని, ఈ మొబైల్ వినియోగదారుల సమాచార భద్రతకు ఎలాంటి ప్రమాదం ఉండదని బ్లాక్‌బెర్రీ ఇండియా ఎండీ నరేంద్ర నాయక్ తెలిపారు. -
బ్లాక్‌బెర్రి.. కొత్త పోర్షే స్మార్ట్‌ఫోన్
ధర రూ.99,990 న్యూఢిల్లీ : బ్లాక్‌బెర్రి కంపెనీ పోర్షే డిజైన్ పి9983 గ్రాఫైట్ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లోకి తెచ్చింది. అత్యున్నత స్థాయి ప్రొఫెషనల్స్‌ను దృష్టిలో పెట్టుకొని అం దిస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.99,990 అని బ్లాక్‌బెర్రి ఇండియా డెరైక్టర్ (సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్)హితేశ్ షా చెప్పారు. పోర్షే డిజైన్ సంస్థచే ఈ ఫోన్‌ను డిజైన్ చేయించి అత్యున్నత స్థాయి నాణ్యత గల మెటీరియల్స్‌తో ఈ ఫోన్‌ను రూపొందించామని వివరించారు. గ్లాస్ లా ఉండే కీస్, గ్రాఫైట్ స్టెయిన్లెస్ స్టీల్ కలర్ ఫ్రేమ్‌తో ఈ ఫోన్‌ను రూపొందించామని తెలిపారు. ఈ క్వెర్టీ కీబోర్డ్ స్మార్ట్‌ఫోన్ బ్లాక్‌బెర్రి ఓఎస్ 10పై పనిచేస్తుందని, 1.5 గిగాహెట్జ్ డ్యుయల్-కోర్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ ఎస్4 ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 64 జీబీ మెమరీ, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమరీ, 3.1 అంగుళాల డిస్ప్లే, 8 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, 2 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 2,100 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలున్నాయని వివరించారు. -
ఒబామా ’స్మార్ట్’ కాదట!
వాషింగ్టన్: బరాక్ ఒబామా చేతిలో అత్యాధునిక ‘బ్లాక్‌బెర్రీ’ ఉంటుంది. ఆయనకేంటి అమెరికా అధ్యక్షుడు... ప్రపంచం గుప్పిట్లో ఉంటుందనుకుంటే పొరపాటే. ఒబామా కనీసం ఓ ఎస్సెమ్మెస్ కూడా పంపలేరు. వాడటం తెలియక కాదు... భద్రతాకారణాల రీత్యా రికార్డింగ్ సౌకర్యం ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను ఆయన వాడటం నిషిద్ధం. ‘ఓ ట్వీట్ చేయలేను, ఎస్సెమ్మెస్ ఇవ్వలేను, మెయిల్ చేయలేను... అయినా నా చేతిలో బ్లాక్‌బెర్రీ ఉంది’ అని ఏబీసీ న్యూస్‌తో మాట్లాడుతూ అమెరికా అధ్యక్షుడు వాపోయారు. -
బ్లాక్ బె ర్రీ నుంచి లీప్ 4జీ స్మార్ట్‌ఫోన్
బార్సిలోనా: బ్లాక్‌బెర్రీ కంపెనీ మధ్య రేంజ్ 4జీ స్మార్ట్‌ఫోన్, లీప్‌ను అందిస్తోంది. దాదాపు రూ.17,000(275 డాలర్లు) ధర ఉన్న ఈ ఫోన్‌ను ఇక్కడ జరుగుతున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో ఆవిష్కరించింది. శామ్సంగ్, యాపిల్ కంపెనీలకు దీటుగా, యువ నిపుణులు లక్ష్యంగా తెస్తున్న ఈ ఫోన్‌ను వచ్చే నెల కల్లా యూరప్ మార్కెట్లోకి అందుబాటులోకి తెస్తామని కంపెనీ పేర్కొంది. 5 అంగుళాల ఆల్-టచ్ స్క్రీన్, బ్లాక్‌బెర్రీ 10.3..1 ఆపరేటింగ్ సిస్టమ్, 16 జీబీ స్టోరేజ్, 8 మెగా పిక్సెల్ కెమెరా, 2,800 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలున్నాయని వివరించింది. ఈ లీప్ ఫోన్‌తో పాటు స్లైడర్ కీబోర్డ్ ఉన్న డ్యుయల్-కర్వ్డ్ టచ్‌స్క్రీన్‌ను ఈ ఏడాదిలోనే అందించనున్నామని కంపెనీ పేర్కొంది. ప్రస్తుతానికి ఈ ఫోన్‌ను ది స్లైడ్ పేరుతో వ్యవహరిస్తున్నామని బ్లాక్‌బెర్రీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జాన్ షెన్ చెప్పారు. హై-ఎండ్ పోర్షే ఎడిషన్ బ్లాక్బెర్రిలో త్వరలో ఫాలోఆప్ వేరియంట్‌ను అందిస్తామని తెలిపారు. -
బ్లాక్‌బెర్రీపై శామ్సంగ్ కన్ను..!
⇒ షేరుకి 15.49 డాలర్ల ఆఫర్ ⇒ డీల్ విలువ దాదాపు 7.5 బిలియన్ డాలర్లు న్యూయార్క్: పూర్వ వైభవం కోసం తంటాలు పడుతున్న స్మార్ట్‌ఫోన్స్ తయారీ సంస్థ బ్లాక్‌బెర్రీని దక్కించుకోవడంపై శామ్సంగ్ ఎలక్ట్రానిక్స్ తాజాగా దృష్టి పెట్టింది. ఇందుకోసం బ్లాక్‌బెర్రీ ఒక్కో షేరుకి 13.35-15.49 డాలర్లు ఇవ్వజూపుతోంది. ఇది బ్లాక్‌బెర్రీ ప్రస్తుత షేరు ధరతో పోలిస్తే 38%-60% అధికం. దీని ప్రకారం చూస్తే డీల్ విలువ దాదాపు 6-7.5 బిలియన్ డాలర్ల మేర ఉండొచ్చని అంచనా. ఇరు కంపెనీల ప్రతినిధులు ఇటీవలే దీనిపై చర్చించేందుకు సమావేశమైనట్లు సమాచారం. అయితే, బ్లాక్‌బెర్రీ మాత్రం ఈ వార్తలను తోసిపుచ్చింది. శామ్సంగ్తో ఎలాంటి చర్చలూ జరపడం లేదని స్పష్టం చేసింది. ఇటీవల వచ్చిన అనేక టేకోవర్ ఆఫర్లను సైతం కంపెనీ తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బ్లాక్‌బెర్రీ పునర్వ్యవస్థీకరణ ప్రయత్నాల్లో ఉన్న నేపథ్యంలో.. ఆ ప్రక్రియ పూర్తయితే ఇప్పుడొస్తున్న ఆఫర్ల కంటే మరింత అధిక వాల్యుయేషన్ రాగలదని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. భవిష్యత్‌లో బ్లాక్‌బెర్రీ అసెట్స్ విలువ భారీగా పెరిగే అవకాశం ఉండటంతో శామ్సంగ్ 7.5 బిలియన్ డాలర్ల ఆఫర్ గొప్పదేమీ కాకపోవచ్చని వారి వాదన. శామ్సంగ్ ఇప్పటికే తమ గెలాక్సీ హ్యండ్సెట్స్కి సంబంధించి బ్లాక్‌బెర్రీతో కలిసి పనిచేస్తోంది. కార్పొరేట్ మార్కెట్లోకి ఎంట్రీ పాస్.. సాధారణ మార్కెట్లోకి చొచ్చుకుపోయినంతగా కార్పొరేట్ మార్కెట్లోకి శామ్సంగ్ దూసుకెళ్లలేకపోయింది. అనేక మొబైల్స్ తయారీ సంస్థల రాకతో ప్రస్తుతం సాధారణ మార్కెట్లో పోటీ తీవ్రతరమైపోయింది. పైగా హైఎండ్ మార్కెట్లో యాపిల్‌తో పోటీపడాల్సి వస్తోంది. మరోవైపు బ్లాక్‌బెర్రీ బలం కార్పొరేట్లే. ఈ నేపథ్యంలోనే సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న బ్లాక్‌బెర్రీని కొనుగోలు చేస్తే కార్పొరేట్ మార్కెట్‌నూ దక్కించుకోవచ్చన్నది శామ్సంగ్ వ్యూహం. డీల్‌కు అడ్డంకులూ ఉన్నాయి.. బ్లాక్‌బెర్రీని కొనుగోలు చేయడంలో శామ్సంగ్ పలు అడ్డంకులను అధిగమించాల్సి ఉంటుంది. అన్నింటి కన్నా ముందుగా బ్లాక్‌బెర్రీని మళ్లీ గాడిలో పెట్టడానికి ప్రయత్నిస్తున్న కీలక షేర్‌హోల్డరు ఫెయిర్‌ఫ్యాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్ చైర్మన్ ప్రేమ్ వత్స గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి. అలాగే కెనడా, అమెరికా నియంత్రణ సంస్థలు కూడా ఓకే చెప్పాల్సి ఉంటుంది. కెనడా చట్టం కింద బ్లాక్‌బెర్రీని విదేశీ సంస్థ కొనుగోలు చేయాలంటే ముందుగా ప్రభుత్వం అనుమతి ఉండాలి. గతంలో చైనాకి చెందిన లెనొవొ గ్రూప్.. బ్లాక్‌బెర్రీ కొనుగోలుకి ప్రయత్నించినప్పటికీ భద్రతా కారణాల రీత్యా కెనడా ప్రభుత్వం అనుమతించ లేదు. తనకు లాభదాయకంగా ఉండే కొన్ని విభాగాలను మాత్రమే శామ్సంగ్ కొనాలనుకుంటే.. విక్రయిచేందుకు బ్లాక్‌బెర్రీ యాజమాన్యం అంగీకరించకపోవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో శామ్సంగ్ డీల్ ప్రయత్నాలు ఎంతవరకూ సఫలం అవుతాయన్నది చూడాల్సిందే. బ్లాక్‌బెర్రీ నేపథ్యమిదీ.. 1984లో రీసెర్చ్ ఇన్ మోషన్ సంస్థ పేరిట ప్రారంభమైన బ్లాక్‌బెర్రీ.. ఇతర కంపెనీల కన్నా చాలా ముందుగానే స్మార్ట్ఫోన్లకు శ్రీకారం చుట్టి కార్పొరేట్ మార్కెట్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. అయితే, శరవేగంగా దూసుకొచ్చిన ఆండ్రాయిడ్, యాపిల్ ఫోన్లతో పోటీ పడలేక బ్లాక్‌బెర్రీ చతికిలబడింది. భారీ నష్టాల్లో నుంచి ఇప్పుడిప్పుడే కోలుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఇటీవలే క్లాసిక్ హ్యాండ్‌సెట్‌ను ప్రవేశపెట్టింది. కంపెనీ పోర్ట్‌ఫోలియోలో ప్రస్తుతం 44,000 పైచిలుకు పేటెంట్లు ఉన్నాయి. గతేడాది ఆగస్టులో ఖాతాల ప్రకారం చూసినా వీటి విలువే 1.43 బిలియన్ డాలర్ల పైచిలుకు ఉంటుంది. మార్కెట్ విలువ కింద లెక్కగడితే మరింత ఎక్కువే ఉంటుందని అంచనా. -
ఒబామా ఏ ఫోను వాడతారో తెలుసా!!
మన చేతుల్లో రకరకాల ఫోన్లు ఇప్పుడు తిరుగుతున్నాయి. రోజుకో కొత్త మోడల్ ఫోను దిగుతోంది. అయితే.. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఏ ఫోను వాడతారో, దాని ఫీచర్లేంటో తెలుసా? ఇప్పటివరకు ఉన్న అమెరికా అధ్యక్షులందరిలోకీ బాగా సాంకేతిక నిపుణుడైన ఒబామా ఎప్పుడూ బ్లాక్ బెర్రీ ఫోనునే ఉపయోగిస్తారు. ఎందుకో చూద్దామా.. అమెరికా అధ్యక్షుడి ఫోనుకు భద్రత అత్యంత ముఖ్యం. ఎంతటి నిపుణుడైన హ్యాకర్ అయినా.. ఆ ఫోనును ముట్టుకోలేని పరిస్థితి ఉండాలి. ముఖ్యంగా గూఢచారులు ఆయన ఎప్పుడు, ఎవరితో, ఏం మాట్లాడుతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. వాళ్లకు అందకుండా ఉండాలి. ఒబామా దాదాపు దశాబ్ద కాలం నుంచి బ్లాక్‌బెర్రీ ఫోనునే ఉపయోగిస్తున్నారు. కానీ, 2008లో దాన్ని వదిలిపెట్టి, ఎన్ఎస్ఏ అందించిన సెక్టెరా ఎడ్జ్ ఫోను ఉపయోగించడం మొదలుపెట్టారు. ఆ తర్వాత కొంతకాలానికి మళ్లీ ఆయన గొంతునే పాస్‌వర్డ్‌గా ఉపయోగించే బ్లాక్‌బెర్రీ ఫోను ఆయన చేతికి వచ్చింది. హ్యాకర్లు ఛేదించగలరనుకునే ప్రతి ఒక్క అంశాన్నీ ఈ ఫోనులో చేర్చారు. అందులో గేమ్స్ ఉండనే ఉండవు. సెల్ఫీ కెమెరా ఉండదు, ఎస్ఎంఎస్ ఇవ్వడానికీ కుదరదు. కానీ అత్యాధునికమైన ఎన్క్రిప్షన్ ఫీచర్లు మాత్రం ఉంటాయి. ఈ ఫోనులోంచి కేవలం 10 నెంబర్లకు మాత్రమే ఫోన్ చేయడానికి కుదురుతుంది. అదే తరహా ఎన్క్రిప్షన్ ఉన్న ఫోన్లకే దీన్నుంచి కాల్స్ వెళ్తాయి. ఉపాధ్యక్షుడు జో బిడెన్, భార్య మిషెల్, కొందరు సలహాదారులు, భద్రతా చీఫ్ మాత్రమే ఆయన నుంచి కాల్స్ అందుకోగలరు. ఐఎంఈఐ నెంబరును కూడా ఈ ఫోను దాచేస్తుంది. దాంతో దాన్ని ట్రాక్ చేయడం అసాధ్యం అవుతుంది. అందువల్ల వైట్‌హౌస్ కమ్యూనికేషన్ ఏజెన్సీ వాళ్లు ఒబామా ఎక్కడికెళ్లినా ఓ సెక్యూర్ బేస్ స్టేషన్ వెంట తీసుకెళ్లాలి. అప్పుడే ఆ ఫోను పనిచేస్తుంది. సాధారణంగా ఈ సెక్యూర్ బేస్ స్టేషన్.. ఒబామా ఉపయోగించే ఎయిర్‌ఫోర్స్ వన్ విమానంలో ఉంటుంది. ఇది వాషింగ్టన్‌తో ఉపగ్రహం ద్వారా అనుసంధానం అయి ఉంటుంది. -
స్టార్ట్అప్ విలేజెస్‌కి బ్లాక్‌బెర్రీ సపోర్ట్
ఎగ్జిక్యూటివ్స్ కోసం ‘పాస్‌పోర్ట్’ స్మార్ట్‌ఫోన్ రూ. 49,990 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఏర్పాటు చేస్తున్న స్టార్ట్అప్ విలేజ్‌లతో కలిసి పనిచేయడానికి బ్లాక్ బెర్రీ ఉత్సాహం చూపిస్తోంది. ‘టిహబ్’ పేరుతో తెలంగాణలోను, ఆంధప్రదేశ్ ప్రభుత్వం వైజాగ్‌లో ఏర్పాటు చేస్తున్న స్టార్ట్అప్ విలేజీల్లో పనిచేసే డెవలపర్స్‌కి కావల్సిన సాంకేతిక సహకారాన్ని అందించడానికి సిద్థంగా ఉన్నట్లు బ్లాక్‌బెర్రీ ఇండియా డెరైక్టర్ అన్ని మాథ్యూ తెలిపారు. కొచ్చిన్ స్టార్ట్అప్ విలేజ్‌లో ఏర్పాటు చేసిన రూబస్ ల్యాబ్ విధానంలోనే తెలుగు రాష్ట్రాల్లో అడుగులు వేయనున్నట్లు ఆమె తెలిపారు. గురువారం హైదరాబాద్‌లో ప్రత్యే కించి ఎగ్జిక్యూటివ్‌లకు బ్లాక్‌బెర్రీ స్మార్ట్‌ఫోన్ ‘పాస్‌పోర్ట్’ను లాంఛనంగా మార్కెట్లోకి విడుదల చేసిన సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడారు. దీని ధర రూ.49,900.