మార్కెట్ లోకి బ్లాక్ బెర్రీ Z3 స్మార్ట్ ఫోన్! | BlackBerry launches Z3 in India | Sakshi
Sakshi News home page

మార్కెట్ లోకి బ్లాక్ బెర్రీ Z3 స్మార్ట్ ఫోన్!

Published Wed, Jun 25 2014 5:16 PM | Last Updated on Tue, Nov 6 2018 5:26 PM

మార్కెట్ లోకి బ్లాక్ బెర్రీ Z3 స్మార్ట్ ఫోన్! - Sakshi

మార్కెట్ లోకి బ్లాక్ బెర్రీ Z3 స్మార్ట్ ఫోన్!

న్యూఢిల్లీ: మొబైల్ ఫోన్ కంపెనీ బ్లాక్ బెర్రీ బుధవారం Z3 పేరుతో స్మార్ట్ ఫోన్ ను మార్కెట్ లోకి బుధవారం విడుదల చేసింది. భారత మార్కెట్ లో Z3 ఖరీదు 15,990 రూపాయలు. Z3కి ఐదు ఇంచుల డిస్ ప్లే ఉంటుందని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ఫాక్స్ కాన్ తో కలిసి స్మార్ట్ ఫోన్ విడుదల చేసినట్టు బ్లాక్ బెర్రీ ప్రతినిధి సునీల్ లవానీ వెల్లడించారు. 
 
తొలిసారిగా బ్లాక్ బెర్రీ మ్యాప్స్ అనే ఆప్ ను అందిస్తోందని.. ఈ యాప్ 2D మ్యాప్ లు అందుబాటులో ఉంటాయని, లోకల్ సర్చ్, వాయిస్ తో జీపీఎస్ నావిగేషన్ సిస్టం ఈ స్మార్ట్ ఫోన్ ప్రత్యేకత అని వెల్లడించారు. అనుబంధ కంపెనీ షోరూలంలో జూన్ 25 నుంచి మార్కెట్ లో అందుబాటులో ఉంటాయని లవానీ తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement