బ్లాక్‌బెర్రి.. కొత్త పోర్షే స్మార్ట్‌ఫోన్ | The new Porsche Blackberry smartphone | Sakshi
Sakshi News home page

బ్లాక్‌బెర్రి.. కొత్త పోర్షే స్మార్ట్‌ఫోన్

Published Sat, Aug 15 2015 1:21 AM | Last Updated on Sun, Sep 3 2017 7:27 AM

బ్లాక్‌బెర్రి.. కొత్త  పోర్షే స్మార్ట్‌ఫోన్

బ్లాక్‌బెర్రి.. కొత్త పోర్షే స్మార్ట్‌ఫోన్

ధర రూ.99,990
 
న్యూఢిల్లీ : బ్లాక్‌బెర్రి కంపెనీ పోర్షే డిజైన్ పి9983 గ్రాఫైట్ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లోకి తెచ్చింది. అత్యున్నత స్థాయి ప్రొఫెషనల్స్‌ను దృష్టిలో పెట్టుకొని అం దిస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.99,990 అని బ్లాక్‌బెర్రి ఇండియా డెరైక్టర్ (సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్)హితేశ్ షా చెప్పారు. పోర్షే డిజైన్ సంస్థచే ఈ ఫోన్‌ను డిజైన్ చేయించి అత్యున్నత స్థాయి నాణ్యత గల మెటీరియల్స్‌తో ఈ ఫోన్‌ను రూపొందించామని వివరించారు. గ్లాస్ లా ఉండే కీస్, గ్రాఫైట్ స్టెయిన్‌లెస్ స్టీల్ కలర్ ఫ్రేమ్‌తో ఈ ఫోన్‌ను రూపొందించామని తెలిపారు.

ఈ క్వెర్టీ కీబోర్డ్ స్మార్ట్‌ఫోన్ బ్లాక్‌బెర్రి ఓఎస్ 10పై పనిచేస్తుందని, 1.5 గిగాహెట్జ్ డ్యుయల్-కోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ ఎస్4 ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 64 జీబీ మెమరీ, 128 జీబీ  ఎక్స్‌పాండబుల్ మెమరీ, 3.1 అంగుళాల డిస్‌ప్లే, 8 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, 2 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 2,100 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలున్నాయని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement