సరికొత్త ఫీచర్లతో బ్లాక్‌బెర్రీ స్మార్ట్‌ఫోన్లు | BlackBerry Evolve, Evolve X launched in India | Sakshi
Sakshi News home page

సరికొత్త ఫీచర్లతో బ్లాక్‌బెర్రీ స్మార్ట్‌ఫోన్లు

Aug 2 2018 4:31 PM | Updated on Aug 2 2018 4:31 PM

BlackBerry Evolve, Evolve X launched in India  - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  బ్లాక్‌బెర్రీ తన నూతన స్మార్ట్‌ఫోన్లను గురువారం విడుదల చేసింది. బ్లాక్‌బెర్రీ ఎవాల్వ్‌, ఎవాల్వ్‌ ఎక్స్‌ డివైస్‌లను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఎవాల్వ్‌ స్మార్ట్‌ఫోన్‌ ధర ను రూ.24,990 గా, ఎవాల్వ్‌ఎక్స్‌ ధరను రూ.34,990గాను నిర్ణయించింది. ఎవాల్వ్‌ ఎక్స్‌ స్మార్ట్‌ఫోన్లు ఆగస్టు చివరినాటికి, ఎవాల్వ్‌ స్మార్ట్‌ఫోన్‌ సెప్టెంబర్‌ నాటికి ప్రత్యేకంగా అమెజాన్లో నియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి. దీంతోపాటు వీటిపై జియో రూ.3,950 క్యాష్‌బ్యాక్‌ను అందివ్వనుంది. అలాగే ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్‌ కార్డ్‌ ద్వారా కొనుగోళ్లపై 5శాతం డిస్కౌంట్‌ను ఆఫర్‌ చేస్తోంది.

భారీ బ్యాటరీ, 18:9 రేషియో బెజెల్‌లెస్‌ స్క్రీన్‌, వైర్‌లైస్‌ చార్జింగ్‌, ఫేస్‌ అన్‌లాక్‌ సపోర్ట్‌తో వస్తున్న తొలి బ్లాక్‌ బెర్రీ మొబైల్స్‌గా ఇవి నిలవనున్నాయి. మొమరీ విస్తరణకు సంబంధించి ఎవాల్స్‌లో 4జీబీ ర్యామ్‌ను, 256 ఎక్స్‌పాండబుల్‌ స్టోరేజ్‌ను అవకాశాన్ని అందిస్తోంది.  ఇది తప్ప ఈ రెండు స్మార్ట్‌ఫోన్ల ఫీచర్లు దాదాపు ఒకేలా ఉన్నాయి.

ఎవాల్వ్‌ ఎక్స్‌ ఫీచర్లు
5.99 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే
1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 450 ప్రాసెసర్
ఆండ్రాయిడ్‌ 8.1 ఓరియో
6జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్,
2 టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
13+13 ఎంపీ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు
16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
4000ఎంఏహెచ్‌ బ్యాటరీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement