అద్భుత ఫీచర్లతో బ్లాక్‌బెర్రీ కీ2 | BlackBerry Key2 with dual cameras launch | Sakshi
Sakshi News home page

అద్భుత ఫీచర్లతో బ్లాక్‌బెర్రీ కీ2

Published Fri, Jun 8 2018 5:16 PM | Last Updated on Fri, Jun 8 2018 8:00 PM

BlackBerry Key2 with dual cameras launch - Sakshi

న్యూయార్క్‌: బ్లాక్‌బెర్రీ మరో సరికొత్త ఫోన్‌తో బ్లాక్‌బెర్రీ అభిమానులను ఆకట్టుకునేందుకు సిద్ధమైంది. టీసీఎల్‌ లైసెన్స్‌తో వివిధ మార్కెట్లలో  ఈ స్మార్ట్‌ఫోన్లను విక్రయిస్తున్న  టీసీఎల్‌ బ్లాక్‌బెర్రీ కీ సిరీస్‌లో మరో డివైస్‌ను  న్యూయార్క్‌లో లాంచ్‌  చేసింది.  కీ1కి సక్సెసర్‌గా తాజాగా  కీ2  పేరుతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తెచ్చింది. డీటెక్‌, లాకర్‌, పవర్‌ సెంటర్‌​ లాంటి బిల్ట్‌ ఇన్‌ సెక్యూరిటీ ఫీచర్లు  డ్యుయల్‌ రియర్‌ కెమెరా, క్వర్టీ (ఫిజికల్‌) కీబోర్డు ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి.  బ్లాక్‌అండ్‌  సిల్వర్‌ కలర్స్‌ లో  లభిస్తున్న దీని ధర సుమారు   రూ.43,893గా ఉండనుంది.  అమెరికా లో ప్రీఆర్డర్లు మొదలయ్యాయనీ, ఈ నెల చివరినుంచి షిప్పింగ్‌ మొదలవుతుందని కంపెనీ తెలిపింది.

బ్లాక్‌బెర్రీ  కీ2 ఫీచర్లు
4.5 అంగుళాల ఐపిఎస్ డిస్‌ప్లే
1620×1080 రిజల్యూషన్‌
క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ 660 ఆక్టాకోర్‌ ప్రాసెసర్‌
స్టోరేజ్‌ ఆండ్రాయిడ్‌ ఓరియో 8.1
6జీబీర్యామ్‌, 64జీబీ స్టోరేజ్‌
12+12 ఎంపీ రియర్‌ కెమెరా
8 ఎంపీ సెల్పీ కెమెరా
3500ఎంఏహచ్‌ బ్యాటరీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement