స్మార్ట్ ఫోన్ ఇండస్ట‍్రీని 14ఏళ్లపాటు కింగ్‌లా ఏలిన బ్లాక్ బెర్రీ ఇప్పుడు మరింత కనుమరుగు కానుంది. జనవరి 4నుంచి బ్లాక్ బెర్రీ తన ఆపరేటింగ్ సిస్టమ్ బ్లాక్ బెర్రీ ఓఎస్, బ్లాక్ బెర్రీ ప్లే బుక్ ఓఎస్ సేవల్ని నిలిపివేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. దీంతో బ్లాక్ బెర్రీ యూజర్లు వారిఫోన్‌లలో ఓఎస్ 7.1, బీబీ 10లలో ఫోన్‌కాల్స్, ఎస్‌ఎంఎస్‌లతో పాటు ఎమెర్జెన్సీ నెంబర్‌లు పనిచేయవు.
అంతేకాదు బ్లాక్ బెర్రీ సంస్థ సైతం తన యూజర్లను హెచ్చరించింది. సంబంధిత ఫోన్‌లలో వైఫై, మొబైల్ డేటా, బ్లాక్ బెర్రీ యాప్స్ బ్లాక్ బెర్రీ లింక్, బ్లాక్ బెర్రీ డెస్క్ ట్యాప్ మేనేజర్, బ్లాక్ బెర్రీ ప్రొటెక్ట్, బ్లాక్ బెర్రీ మెసెంజర్, బ్లాక్ బెర్రీ బ్లెండ్ యాప్స్ ఫంక్షనింగ్ పూర్తిగా ఆగిపోనున్నట్లు చెప్పింది.
కింగ్ మేకర్ నుంచి ఎందుకు పతనం అయ్యింది
►1984లో కెనడాకు చెందిన మైక్ లాజరడీస్,డౌగ్లస్ ఫ్రాగ్ అనే ఇద్దరు ఇంజినీర్లు రీసెర్చ్ ఇన్ మోషన్ పేరుతో ఓ కంపెనీనీ ప్రారంభించారు. మొదట్లో ఈ కంపెనీ ఐబీఎంకోసం ఎల్‌ఈడీ సిస్టమ్, మోడెమ్స్ తో పాటు పేజెస్ వంటి లోకల్ నెట్ వర‍్కింగ్ కనెక్టివిటీ టెక్నాలజీ డెవలప్ చేసింది. అలాగే ఫిల్మింగ్ ఎడిటింగ్ సిస్టమ్‌ను డిజైన్ చేసింది. అందుకు గాను 1998లో ఆస్కార్ అవార్డ్‌ను గెలుచుకుంది.
►ఆ తర్వాత 1989లో కెనడియన్ ఫోన్ కంపెనీ అయిన రోజెర్స్ ఫోన్ మెసేజింగ్ కోసం స్పెషల్ గా డిజైన్ చేయబడిన తన మొబైల్ నెట్‌వర్క్‌లో పనిచేసేలా ఆర్‌ఐఎమ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో మొబైల్ మెసేజింగ్‌లో ఎక్స్‌పర్ట్ గా 1996లో ఎంతో వేగంగా ఎస్టాబ‍్లిష్ అయ్యింది.
►అలా 2000సంవత్సరంలో బ్లాక్ బెర్రీ తన మొట్టమొదటి ఫోన్ బ్లాక్ బెర్రీ 957ను మార్కెట్‌లో పరిచయం చేసింది. ఈ ఫోన్‌లో ఉండే క్వాలిటీ కీ ప్యాడ్ బటన్స్ బ్లాక్ బెర్రీ ఫ్రూట్స్ షేప్‌లో ఉంటాయి. అందుకే ఆర్‌ఐఎం కంపెనీ బ‍్లాక్ బెర్రీతో మార్కెటింగ్ చేయడం ప్రారంభించాయి.
►అప్పట్లో ఈ బ్రాండ్ ఫోన్ విడుదలైన కొద్దికాలానికే సంవత్సరానికి 50మిలియన్ల ఫోన్‌లను అమ్మి సరికొత్త రికార్డ్‌లను క్రియేట్ చేసింది. అందుకే ఈ డివైజెస్‌ను క్రాక్ బెర్రీ అనిపిలుస్తారు. అమెరికాలో 50శాతం మార్కెట్‌ను వరల్డ్‌వైడ్ 50శాతం మార్కెట్‌ను కలిగి ఉంది.
►ఇప్పుడున్న ఐఫోన్‌లు, ఆండ్రాయిడ్ ఫోన్‌లు రాకముందే యూజర్లకు స్మార్ట్ ఫోన్ టెక్నాలజీని పరిచయం చేసింది ఈ బ్లాక్ బెర్రీ. తర్వాత స్మార్ట్ ఫోన్‌లు ఎన్ని వచ్చినా మర్కెట్‌లో పోటీని తట్టుకుంటూ వచ్చింది. ఈ క్రమంలో ఐకానిక్ కీబోర్డ్ తో బ్లాక్ బెర్రీ ఫోన్‌ను మార్కెట్‌లో విడుదల చేసింది. కొంత కాలం బాగున్నా స్టైలిష్ అండ్ డిగ్నిటీకి సింబాలిక్ గా చెప్పుకునే బ్లాక్ బెర్రీని హార్డ్‌వేర్ దిగ్గజం ఆపిల్, సాఫ్ట్‌వేర్ దిగ్గజం గూగుల్ కంపెనీలు వరుసగా ఆండ్రాయిడ్ వెర్షన్‌ను విడుదల చేయడంతో చతికిల బడింది. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా కొత్త కొత్త ఇన్నోవేషన్‌తో యూజర్ ను అట్రాక్ట్ చేయలేకపోతుంది.
►బ్లాక్ బెర్రీ ఆపరేటింగ్ సిస్టమ్ 2000తో ఆ కంపెనీ గ్రో అవ్వడానికి మరింత బలం చేకూరినట్లైంది. కానీ ఐఓఎస్, ఆండ్రాయిండ్ కలిసొచ్చినప్పుడు..వాటికి ధీటుగా ఆ ఫోన్ సపోర్ట్ చేయలేకపోయింది. ప్రపంచం మొత్తం అప్‌డేట్ అవుతున్నా..బ్లాక్ బెర్రీ మాత్రం మూసధోరణిలోనే కొనసాగింది.
►యూజర్లు ఎంటర్‌టైన్మెంట్ ను బాగా ఇష్టపడేవారు. యూజర్ల అటెక్షన్‌ను యాపిల్, గూగుల్ లు గ్రాబ్ చేసినట్లుగా.. బ్లాక్ బెర్రీ అట్రాక్ట్ చేయలేకపోయింది.
►ఫోన్ వాడే యూజర్లు ఫోన్‌లతో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలో గూగుల్, యాపిల్‌లు నేర్పించాయి. తమ ఫోన్‌లతో యూజర్లు ఇంకేం చేయొచ్చో నేర్పించాయి. పగలు, రాత్రి తేడా లేకుండా యూజర్లు ఫోన్‌లకు అతుక్కుపోయేలా చేశాయి. అలాంటి అప్లికేషన్‌లు యాప్‌స్టోర్‌లను అందిస్తూ వచ్చాయి. ఈ విషయంలో కూడా బ్లాక్ బెర్రీ ఫెయిల్ అయ్యింది.
► బ్లాక్ బెర్రీ మాతృసంస్థ రీసెర్చ్ ఇన్ మోషన్ లిమిటెడ్' టెక్నాలజీ వరల్డ్ ఓ కింగ్ మేకర్. కానీ మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా కొత్త కొత్త ఇన్నోవేషన్స్‌పై ఫోకస్ చేయలేకపోయింది. అందుకే యూజర్ మైండ్ సెట్‌ను క్యాచ్ చేయలేకపోయింది.
చదవండి: స్మార్ట్ ఫోన్ ఫీచర్లు లీక్..కొత్త ఏడాది ప్రారంభంలోనే లాంచింగ్..అదిరిపోయే డిజైన్‌లతో!
Comments
Please login to add a commentAdd a comment