జాతీయ, అంతర్జాతీయ సంస్థలు చైనాకు గుడ్ బైకు చెప్పనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే టెక్ దిగ్గజం యాపిల్ తన ఐఫోన్‌ల తయారీని చైనాలో నిలిపి వేసి భారత్‌లో ప్రారంభించనున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా గూగుల్ సైతం తన ఫ్లాగ్ షిప్ బ్రాండ్స్‌ను డ్రాగన్ కంట్రీలో కాకుండా భారత్‌లో ఉత్పత్తి చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.
చైనాలో పెరిగిపోతున్న కోవిడ్-19 కేసులు, ప్రభుత్వ ఆంక్షలతో దిగ్గజ సంస్థలు సతమతమవుతున్నాయి. ఈ తరుణంలో గూగుల్ తన పిక్సెల్ స్మార్ట్‌ఫోన్‌ల 5లక్షల నుంచి 10లక్షల యూనిట్ల తయారీ కోసం బిడ్‌లను సమర్పించాలని భారత్‌కు చెందిన స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థల్ని కోరింది. తాజాగా గూగుల్ నిర్ణయాన్ని ఊటంకిస్తూ.. ఓ నివేదిక హైలెట్ చేసింది.
ఐఫోన్
చైనా నుంచి బయటకొచ్చిన రెండు నెలల తర్వాత యాపిల్ సంస్థ ..భారత్‌లో ఐఫోన్ 14 తయారీని ప్రారంభించాలని యోచిస్తోందంటూ బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. భారత్‌లో తయారీని వేగవంతం చేయడానికి యాపిల్ సరఫరాదారులతో కలిసి పనిచేస్తోంది. దేశం నుండి మొదటి ఐఫోన్ 14 లు అక్టోబర్ చివరలో లేదా నవంబర్‌లో పూర్తయ్యే అవకాశం ఉందంటూ బ్లూమ్‌బెర్గ్ ప్రస్తావించింది.
టాటా
ప్రముఖ దేశీయ టెక్ దిగ్గజం టాటా యాపిల్‌కు చెందిన తైవాన్ సరఫరాదారు విస్ట్రన్ కార్పొరేషన్‌తో చర్చలు జరుపుతోంది. ఐఫోన్ల అసెంబ్లింగ్, అలాగే ఎలక్ట్రానిక్స్ తయారీ జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. చర్చలు సఫలమైతే త్వరలో టాటా సంస్థ ఆధ్వర్యంలో యాపిల్ ఐఫోన్‌లు తయారు కానున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment