స్మార్ట్‌ఫోన్లలో యాపిల్ కంపెనీ ఐఫోన్లకు ఉన్న క్రేజ్ వేరు. ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన డిమాండ్ యాపిల్ ఫోన్లకు సొంతం. అంతటి ప్రాముఖ్యత సంపాదించుకున్న యాపిల్ తాజాగా ఓ రికార్డ్ సృష్టించింది. మార్కెట్ విలువ పరంగా మరే కంపెనీ చేరలేని రేర్ ఫీట్‌ని సాధించి తన బ్రాండ్‌ని మరో సారి నిరూపించుకుంది. మార్కెట్ విలువలో యాపిల్ కంపెనీ గురువారం ఒక్క రోజే 190.9 బిలియన్ డాలర్ల పెరిగింది. ఈ విషయాన్ని బ్లూమ్‌బర్డ్ డేటా వెల్లడించింది.
దీంతో ప్రస్తుతం యాపిల్ మార్కెట్ విలువ 2.34 ట్రిలియన్ డాలర్లకు చేరింది. అదే సమయంలో, ఇతర మూడు టెక్ దిగ్గజాల మార్కెట్ విలువు $2.306 ట్రిలియన్లకు చేరింది. గూగుల్ పేరెంట్ ఆల్ఫాబెట్ మార్కెట్ విలువ (1.126 ట్రిలియన్ డాలర్లు), అమెజాన్ (939.78 బిలియన్ డాలర్లు), ఫేస్‌బుక్ పేరెంట్ మెటా (240.07 బిలియన్ డాలర్లు) ఉన్నాయని యాహూ ఫైనాన్స్ డేటా వెల్లడించింది.
అసలే ఆర్థిక మాంద్యం భయాలతో కంపెనీ మార్కెట్ విలువలు ఆశించినంత స్థాయిలో ఫలితాలు ఇవ్వడం లేదన్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో యాపిల్ ఈ స్థాయిలో మార్కెట్ విలువను చూసి మిగిలిన కంపెనీలు షాక్‌లో ఉన్నాయి. గత వారం, యాపిల్ మార్కెట్ విలువ ఆల్ఫాబెట్ ఇంక్, అమెజాన్, మెటా మార్కెట్ విలువ కంటే ఎక్కువగా పెరిగింది.
సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో ఆపిల్ ఆదాయ ఫలితాలు రెండంకెల వృద్ధిని నమోదు చేసిందని చీఫ్ ఎగ్జిక్యూటివ్ టిమ్ కుక్ గత నెలలో తెలిపారు. యాపిల్ ప్రస్తుతం ప్రీమియం స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో 37% వాటాను కలిగి ఉండగా, దేశంలో మొత్తం స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో 3% మార్కెట్ వాటాను కలిగి ఉంది.
చదవండి: హైదరాబాద్: జియో 5జీ సేవలు కావాలంటే.. మీ స్మార్ట్‌ఫోన్‌లో ఇలా చేయాల్సిందే!
Comments
Please login to add a commentAdd a comment