worth
-
Tejasvi Surya Assets: ఎంపీ అయిన ఐదేళ్లలో 30 రెట్లు పెరిగిన ఆస్తులు!
దేశంలో ఒకవైపు ఎన్నికల వేడి, మరోవైపు వేసవి తాపం.. రెండు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల సన్నాహాలు ప్రారంభించాయి. పలువురు నేతలు తమ నామినేషన్లను దాఖలు చేశారు. బెంగళూరు సౌత్ నుంచి బీజేపీ నేత తేజస్వి సూర్య కూడా తన నామినేషన్ దాఖలు చేశారు. తెజస్వీ సూర్య బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన సందర్భంలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా ఆయన వెంట ఉన్నారు. సూర్య తన అఫిడవిట్లో తన మొత్తం ఆస్తుల విలువ రూ.4.10 కోట్లుగా పేర్కొన్నారు. తనకు ఎలాంటి స్థిరాస్తి లేదని బీజేపీ ఎంపీ వివరించారు. కాగా ఆయన 2019 లోక్‌సభ ఎన్నికల్లో తన ఆస్తుల విలువ రూ.13 లక్షలుగా చూపించారు. ఇప్పుడు వాటి విలువ 31.5 శాతాన్ని దాటింది. సూర్య మొత్తం ఆస్తుల విలువ రూ.4.10 కోట్లు. మ్యూచువల్ ఫండ్స్‌లో రూ.1.99 కోట్లు పెట్టుబడి పెట్టారు. అలాగే రూ.1.79 కోట్లకు పైగా విలువైన షేర్లను కొనుగోలు చేశారు. మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్‌లో అధికంగా పెట్టుబడులు పెట్టానని, మార్కెట్లో బూమ్ కారణంగా తన సంపద పెరిగిందని సూర్య తన అఫిడవిట్లో వివరించారు. సూర్య ..బెంగళూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ లీగల్ స్టడీస్ పూర్వ విద్యార్థి. కర్ణాటక హైకోర్టులో న్యాయవాది. బసవనగుడి ఎమ్మెల్యే రవి సుబ్రమణ్యం మేనల్లుడు. ప్రస్తుతం బెంగళూరు సౌత్ ఎంపీగా ఉన్నారు. 2019లో కాంగ్రెస్ అభ్యర్థి హరిప్రసాద్‌పై మూడు లక్షలకు పైగా ఓట్లతో విజయం సాధించారు. కాగా ఎన్నికల సంఘం తెలిపిన వివరాల ప్రకారం ఈసారి దేశవ్యాప్తంగా ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. -
మురికి వాడ నుంచి ఏకంగా రూ. 900 కోట్ల సామ్రాజ్యానికి యజమానిగా!
ఆమె ఎలాంటి డిగ్రీలు చేయలేదు. మురికి వాడల్లో పెరిగింది. అడుగడుగున అవమానాలు, కష్టాలు కడగళ్లే. అన్నింటిని ఓర్చుకుని మెరుగుపడుతుందనుకునే లోపే ఓ పెనువిషాదం అగాధంలో పడేసింది. ఒకరకంగా అదే ఆమెలో కసి పెంచి చిన్న చితక ఉద్యోగాలు కాదు వ్యాపారవేత్తగా కోట్లు గడించాలనుకునే ఆలోచనకు తెరతీసింది. అదే ఆమెను నేడు 900 కోట్ల సామ్రజ్యానికి అధిపతి చేసింది. పైగా రియల్ స్మమ్డాగ్ మిలియనీర్‌గా ప్రశంసలుందుకునేలా చేసింది కూడా. ఆమె పేరు కల్పనా సరోజ్. మహారాష్ట్రలోని విదర్భలో దళిత కుటుంబంలో జన్మించింది. ఆమె తండ్రి కానిస్టేబుల్ కావడంతో పోలీస్ క్వార్టర్స్‌లోనే ఆమె కుటుంబ నివశించేది. అయితే దళిత కుటుంబం కావడంతో సమాజంలో దారుణమైన వివక్షణు ఎదుర్కొంది. ఆమెకు మగ్గురు సోదరీమణలు, ఇద్దరు సోదరులు ఉన్నారు. చిన్నతనంలో పాఠశాలల్లో జరిగే ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడానికి వీల్లేకుండా నిషేధించారు టీచర్లు. కనీసం తోటి విద్యార్థులతో కూర్చోకూడదు, తినకూడదు. అందుకు పాఠశాల టీచర్లు, తోటి విద్యార్థుల తల్లిదండ్రులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునేవారు కాదు. అయినప్పటికీ తనను చదువుకోడానికి అంగీకరించడమే గొప్ప బహుమతిగా భావించింది కల్పనా సరోజ్. ప్రతిభావంతురాలైనప్పటికీ దళితురాలు కావడంతో చిన్నతనంలోనే పెళ్లి చేసేశారు ఆమె కుటుంబ సభ్యులు. భర్తతో కలిసి ముంబైకు చేరుకుంది. అక్కడ అత్తారింట్లో మొత్తం పదిమంది వ్యక్తులు ఉండే కుటుంబంలో ఆమె గొడ్డు చాకిరీ చేయాల్సి వచ్చేది. దీంతో ఆమెకు పోషకాహరం లోపం తలెత్తి నీరసించిపోయింది. ఆమె స్థితిని చూసి చలించిపోయినన తండ్రి అక్కడ నుంచి ఆమెను తీసుకొచ్చేశాడు. అయితే చుట్టుపక్కల వాళ్లు కూతుర్ని పుట్టింట్లో పెట్టుకుంటారా! అని ఈసడించడం మొదలుపెట్టారు. ఈ అవమానాలను తట్టుకోలేక ఏకంగా రెండు బాటిళ్ల ఎలుకల మందు తాగేసింది కల్పనా సరోజ్. ఆమె అత్త దీన్ని గమనించడంతో కొద్దిలో ప్రాణాపాయం తప్పింది. దేవుడిచ్చిన ఈ రెండో అవకాశాన్ని ఆత్మనూన్యతతో వృధా చేసుకోకూడదని గట్టిగా నిర్ణయించుకుంది. మళ్లీ ముంబైకి తిరిగొచ్చి తన మేనమామతో కలిసి ఉండాలని నిశ్చయించుకుంది. అప్పుడే అసిస్టెంట్ టైలర్‌గా పనిచేస్తూ ఆ వృత్తిలో మంచిగా రాణించింది. దీంతో ఒక గదిలో గడిపే ఆమె కుటుంబం కాస్త ఫ్లాట్‌లోకి వెళ్లింది. పరిస్థితి మెరుగుపడుతుందని అనుకునేలోపు చెల్లి అనారోగ్యం ఆమె కుటుంబాన్ని ఓ కుదుపు కుదిపేసింది. ఆమె వైద్యానికి సరిపడా డబ్బులు లేకపోవడంతోనే మరణించిందన్న విషయం ఆమెలో గట్టి కసిని పెంచింది. ఏదో చిన్నా చితకా ఉద్యోగాలతో సరిపెట్టకూడదు తాను వ్యాపారవేత్తగా ఎదగాల్సిందేనని గట్టిగా డిసైడ్ అయ్యిపోయింది కల్పనా సరోజ్. ఊహించని ములుపు.. అప్పుడే ప్రభుత్వం అందించే పథకాల గురించి తెలుసుకుంది. వెంటనే లోన్‌కి అప్లై చేసి చిన్న ఫర్నీచర్ వ్యాపారాన్ని ప్రారంభించింది. అత్యాధునిక ఫర్నిచర్లను చాలా చౌక రేటుకే విక్రయిస్తు లాభాలు గడిస్తుంది. ఓ పక్క టైలరింగ్ కూడా కొనసాగించింది. అలా రోజుకి దాదాపు పదహారు గంటలు పనిచేసేది. సరిగ్గా ఆ టైంలో రియల్ ఎస్టేట్ వివాదంలో చిక్కుకుంది. రెండేళ్ల పాటు న్యాయపోరాటం చేసి భూమికి సంబంధించిన లిటిగేషన్‌ను పరిష్కరించింది. ఇదే ఆమెకు అప్పులో ఊబిలో చిక్కుకున్న మెటల్ ఇంజనీరింగ్ కంపెనీ కమానీ ట్యూబ్స్ కార్మికులు బాధ్యతను స్వీకరించే అవకాశం తెచ్చిపెట్టింది. ఇది ఆమె తన తొలి ఆరర్డర్గా భావించి పదిమంది సభ్యులతో కూడిన బృందంతో ఆ కంపెనీని మళ్లీ లాభాల బాట పట్టించింది. ఆ తర్వాత ఆ కంపెనీకే చైర్ పర్సన్‌గా బాధ్యతలు చేపట్టింది. అలా ఇవాళ సుమారు 900 కోట్ల సామ్రాజ్యాని అధిపతి అయ్యింది కల్పనా సరోజ్. పైగా డిగ్రీలు, ఎంబీయేలు నన్ను ఈ స్థితికి తీసుకురాలేదని, కేవలం పట్టుదల, ఆత్మవిశ్వాసమే తనను ఈ స్థాయికి తీసుకొచ్చాయని సగర్వంగా చెబుతోంది కల్పనా సరోజ్. ఆమె స్థైర్యానికి, తెగువకు హ్యాట్సాఫ్ అనాల్సిందే కదూ!. (చదవండి: మహిళలు తప్పక తెలుసుకోవాల్సిన పది సేఫ్టీ యాప్‌లు ఇవే..!) -
భారీగా తగ్గిన ఎక్స్(ట్విటర్) విలువ.. మస్క్ నిర్ణయాలే కారణమా?
ప్రపంచ కుబేరుడు 'ఎలాన్ మస్క్' (Elon Mask) ఎక్స్ (ట్విటర్) సంస్థను 2022లో 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసాడు. కంపెనీ మస్క్ సొంతం చేసుకున్నప్పటి నుంచి ఎంతోమంది ఉద్యోగులను తొలగించారు, లోగో మార్చారు, ఆఖరికి పేరు కూడా మార్చేశాడు. ఇప్పుడు కంపెనీ విలువ భారీగా తగ్గిపోయింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిన మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ 'ఎక్స్' (ట్విటర్) విలువ ప్రస్తుతం 19 బిలియన్ డాలర్లకు చేరి ఆర్థికంగా కష్టాల్లో పడింది. స్టాక్ ధరలు పడిపోవడం, ప్రకటనల ఆదాయం తగ్గిపోవడంతో సంస్థ విలువ తగ్గిపోయినట్లు మస్క్ అంగీకరించినట్లు సమాచారం. ట్విట్టర్ సంస్థను మస్క్ కొనుగోలు చేసిన సంవత్సరం తరువాత దాని విలువ సుమారు 55 శాతం తగ్గిపోయింది. కంపెనీ కష్టాల్లో ఉన్న సమయంలో కూడా సంస్థ భవిష్యత్తు గురించి తాను ఆశాజనకంగా ఉన్నానని మస్క్ వెల్లడించాడు. డేటింగ్ సర్వీస్, జాబ్ రిక్రూట్మెంట్ వంటి వాటితో 'ఎక్స్'ను వర్సిటైల్ యాప్‌గా మార్చాలనుకుంటున్నట్లు చెబుతున్నారు. ఇదీ చదవండి: 81.5 కోట్ల భారతీయుల ఆధార్ వివరాలు లీక్ - అమ్మడానికి సిద్దమైన హ్యాకర్! మస్క్ యాజమాన్యం కింద కంపెనీ ఆర్థికంగా చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చిందని, ఆయన తీసుకునే నిర్ణయాల వల్ల ప్రకటనదారులు కూడా దూరమైనట్లు చెబుతున్నారు. దీంతో కంపెనీపై 13 బిలియన్ డాలర్ల ఋణభారం పడింది, దీనికి సంవత్సరానికి 1.2 బిలియన్ డాలర్ల వడ్డీ చెల్లింపులు జరుగుతున్నట్లు సమాచారం. ఇదీ చదవండి: జనవరి 1 నుంచి బీమాలో కొత్త రూల్స్ - తెలుసుకోవాల్సిందే! 'ఎక్స్'లో పోస్ట్ చేయడానికి డబ్బు చెల్లించాలని, ఎక్స్ సబ్స్క్రిప్షన్లు ప్లాన్ వంటివి ప్రవేశపెడుతున్నారు. ఇవన్నీ కూడా కంపెనీకి మరిన్ని సమస్యలను తెచ్చిపెట్టే అవకాశం ఉంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ఎక్కువగా ఉన్న ఈ రోజుల్లో ఇలాంటి నిర్ణయాలు సాధారణ వినియోగదారులను దూరం చేస్తాయి. -
రూ.7.19 కోట్ల విలువైన ఏనుగు దంతాలు పట్టివేత
సాక్షి, చెన్నై: చెన్నైలో ఏనుగు దంతాలను అక్రమంగా విక్రయించే ప్రయత్నం చేసిన వారిని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ)– చెన్నై అధికారులు ఆదివారం రాత్రి అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.7.19 కోట్ల విలువైన 4.03 కేజీల బరువు కలిగిన రెండు దంతాలను సీజ్ చేశారు. వన్య ప్రాణుల రక్షణ చట్టం వైల్డ్‌లైఫ్ ప్రొటెక్షన్ చట్టం 2023 కింద తొలి కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే... డీఆర్ఐ– చెన్నై అధికారులకు అందిన రహస్య సమాచారం మేరకు సెంట్రల్, టీ నగర్ పరిసరాల్లో ప్రత్యేక నిఘా బృందాలు కాపు కాశాయి. ఏనుగు దంతాలను టీ నగర్లో ఓ చోట విక్రయించే ప్రయత్నం చేసిన ఏడుగురిని డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి రెండు ఏనుగు దంతాలను స్వా«దీనం చేసుకున్నారు. ఓ వాహనం కూడా సీజ్ చేశారు. 2023 ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి వచ్చిన వన్యప్రాణుల రక్షణ చట్టం తాజా సవరణ మేరకు.. నిషేధ వస్తువులను సీజ్ చేసే అధికారం కస్టమ్స్ అధికారులకు సైతం కలి్పంచారు. దీంతో ఈ చట్టం కింద చెన్నై డీఆర్ఐ అధికారులు తొలి కేసును నమోదు చేశారు. పట్టుబడ్డ ఏడుగురిని, ఏనుగు దంతాలు, వాహనాన్ని తమిళనాడు చీఫ్ వైల్డ్ లైఫ్ అధికారులకు అప్పగించారు. (చదవండి: ప్రమాదం జరిగి 4 రోజులు .. ఇంకా గుర్తించని 101 మృతదేహాలు..) -
ట్విట్టర్ ను ఎక్కువ ధర పెట్టి కొన్న మస్క్
-
ఆ విలువ లేని డిగ్రీలే భారత్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్నాయ్!
భారత్‌లోని విద్యా విధానం, డిగ్రీలు గురించి అమెరికాలోని బ్లూమ్‌బెర్గ్ చెందిన ఓ టాలెంట్ అసెస్మెంట్ సంస్థ వీబాక్స్ సర్వే చేసింది. తన అధ్యయనం ప్రకారం భారత్‌లో దాదాపు రూ.900 కోట్లు విద్యారంగంపై ఖర్చుపెడుతోందని, వేగంగా కొత్త కళాశాలలు పుట్టుకొస్తున్నాయని పేర్కొంది. అయినప్పటికీ యువత ఎలాంటి నెపుణ్యాలు లేని గ్యాడ్యుయేట్లుగా మిగిలిపోతున్నారని సర్వే తెలిపింది. ఇదే భారత ప్రధాన ఆర్ధిక వ్యవస్థను కుంటిపరుస్తోందని చెప్పింది. ఉద్యోగం వస్తుదనే ఆశతో రెండు, మూడు డిగ్రీలు చేస్తున్నట్లు వెల్లడించింది. అంతేగాదు కుప్పలు తెప్పలుగు పుట్టుకొస్తున్న ప్లేస్మెంట్లు ఇచ్చే ఇన్స్టిట్యూట్ల వైపు ఆకర్షితులై వేలకు వేలు డబ్బు వెచ్చించి..చివరి ఉద్యోగాలు లేక నానాపాట్లు పడుతున్నారని పేర్కొంది. అల్ఫాబేట్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ కంపెనీల సీఈవోలు సుందర్ పిచాయ్, సత్య నాదేళ్ల వంటి వారికి భారత్‌లోని అత్యున్నత విద్యా సంస్థల్లో చోటు దక్కకపోవడం అత్యంత విచిత్రం అని కూడా పేర్కొంది. ఇక్కడ టాప్ సంస్థల తోపాటుగా చిన్నప్రైవేట్ విద్యా సంస్థలు కూడా ఉన్నాయని తెలిపింది. వాటిల్లో తక్కువ శిక్షణ కూడిన ఉపాధ్యాయులను నియమించుకుని, ఔట్ డేటెడ్ పాఠ్యాంశాలను చెబుతున్నట్లు వెల్లడించింది. అందువల్ల అలాంటి సంస్థల్లో డిగ్రీలు చేసిన ఎలాంటి ఉద్యోగాలు పొందే అవకాశం ఉండకపోవడంతో నిరుద్యోగులు మిగిలిపోతున్నట్లు వీబాక్స్ వెల్లడించింది. కానీ భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద జనాభాను కలిగి ఉన్న దేశమని, ఎక్కువ మంది యువకుల ఉండటం వల్ల కలిగే ప్రయోజనాలు గూర్చి ఆర్భాటంగా చెబుతుందని పేర్కొంది. వృద్ధి పరంగా భారత్ ప్రపంచవ్యాప్తంగా శరవేగంగా దూసుకువెళ్తున్నప్పటకీ ..నిరుద్యోగం 7% కంటే ఎక్కువ ఉందని సర్వే పేర్కొంది. ఇదే దాని ప్రధాన ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తోందని కూడా తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీకి ఇది ఒక పెద్ద సవాలుగా ఉందని వెల్లడించింది. భారత్‌లోని విద్యా వ్యవస్థలో పలు లోపాలను ప్రస్తావిస్తూ..విద్యార్థులకు క్లాస్రూమ్ నాలెడ్జ్ తప్ప ప్రాక్టీకల్ నాలెడ్జ్ లేకుండా చేయడంతో ఉద్యోగాలు రాక పలు సమస్యలు ఎదుర్కొంటున్నట్లు సర్వే పేర్కొంది. కొన్ని పేరున్న మెడికల్ కాలేజీలు ఆస్పత్రులు లేకుండానే అడ్మిషన్లు ఇచ్చి వారిని ఎలా మోసం చేస్తున్నారో కూడా వివరించింది. అయినప్పటికీ విద్యార్థులు అలాంటి కాలేజీల్లోనే ఏదో రకంగా జాయిన్ అయిపోతున్నారని, డిగ్రీ సంపాదిస్తే చాలు అన్నట్లు ఉంటున్నారని చెప్పుకొచ్చింది. కాగా, ఇలాంటి డిగ్రీలు విలువలేనివని, దీంతో ఏటా మిలియన్ల మంది నిరుద్యోగులుగా మారిపోతున్నారని ఢిల్లీ యూనివర్సిటీ డీన్, ప్రభుత్వానికి మార్గ నిర్దేశం చేసే సెంట్రల్ అడ్వైజరీ బోర్డు ఆప్ ఎడ్యకేషన్ మాజీ సభ్యుడు అనిల్ సద్గోపాల్ అన్నారు. అలాగే మానవ వనరుల సంస్థ ఎస్హెచ్ఎల్ చేసిన ఒక అధ్యయనంలో కేవలం 3.8% ఇంజనీర్లు మాత్రమే స్టార్టప్‌లలో సాఫ్ట్వేర్ సంబంధిత ఉద్యోగాలలో ఉపాధి పొందేందుకు అవసరమైన నైపుణ్యాలను కలిగి ఉన్నారని గుర్తించింది. అంతేగాదు ఇన్ఫోసిస్ లిమిటెడ్ మాజీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్,ప్రైవేట్ ఈక్విటీ సంస్థ ఆరిన్ క్యాపిటల్ సహ వ్యవస్థాపకుడు మోహన్‌దాస్ పాయ్ మాట్లాడుతూ..ఐటి పరిశ్రమలో ఉద్యోగం సంపాదించాలంటే గ్రాడ్యుయేట్లకు ముందు శిక్షణ అవసరం. చాలామంది గ్రాడ్యుయేట్ పూర్తి చేసుకుని బయటకు వచ్చిన వారందరికీ ఉద్యోగం చేసే నేపుణ్యాలు లేవన్నారు. అందువల్లే ఏటా నిరుద్యోగుల ఎక్కువ అవుతున్నారని ఇది అత్యంత ప్రమాదకరమైని అన్నారు. ఉద్యోగాలు లేక నేర ప్రవృత్తికి అలవాటు పడుతున్నట్లు కూడా చెప్పుకొచ్చారు. అంతేగాదు ఇండియా బ్రాండ్ ఈక్వీటీ ఫౌండేషన్ ప్రకారం భారత్‌లో విద్యా పరిశ్రమ అధ్యయనం ప్రయకారం భారత్‌లో 2025 నాటికి విద్యారంగం కోసం దాదాపు రూ. 1800 కోట్లు కేటాయిస్తుందని అంచనా. ఇది యూఎస్‌లోని విద్యా సంస్థలతో పోలిస్తే తక్కువే. భారత్‌లో విద్యపై ప్రభుత్వ వ్యయం జీడీపీలో 2.9% వద్దే నిలిచిపోయిందని, ఇది ప్రభుత్వం నిర్ధేశించుకున్న లక్ష్యం కంటే చాలా తక్కువే అని ఈక్వీటి ఫౌండేషన్ వెల్లడించింది. (చదవండి: వేరొకరి ఇంటి డోర్‌బెల్ మోగించాడని చంపేందుకు యత్నం..చివరికి..) -
అప్పట్లో రియల్ ఎస్టేట్ కింగ్.. ఇప్పుడేమో లక్షల కోట్ల ఆస్తిని కోల్పోయి
జీవితంలో ఏ నిమిషం ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. అదృష్టం కలిసొచ్చి ధనవంతునిగా మారడం, కాలం కలిసిరాకపోతే అదే బిలియనీర్ స్థాయి నుంచి బీదవాడుగానూ మారుతుంటారు. ప్రస్తుతం చైనాకు చెందిన ఓ సంపన్న వ్యక్తి పరిస్థితి సరిగ్గా ఇలానే ఉంది. వివరాల్లోకి వెళితే.. డ్రాగన్ దేశంలో అత్యంత సంపన్నుల్లో ఒకరైన ఎవర్‌గ్రాండ్ గ్రూప్ చైర్మన్ హుయ్ కా యన్ కు ఊహించని షాక్ తగిలింది. కరోనా మహ్మామారి దెబ్బ, ఆర్థిక మాంద్యం ప్రభావాల కారణంగా తన సంపదలో ఆయన దాదాపు 93 శాతం కోల్పోయారు. భారీ షాక్.. 93 శాతం ఆస్తి పోయింది.. గతంలో హుయ్ ఆస్తి విలువ 42 బిలియన్ డాల్లరు ఉండగా, ఆసియాలోనే రెండు అత్యంత సంపన్నుడిగా పెరు కూడా సంపాదించారు. అయితే ప్రస్తుతం అది 3 బిలియన్ల డాలర్లకు తగ్గిపోయిందని బ్లాంబర్గ్ ఇండెక్స్ వెల్లడించింది. తన కంపెనీని కాపాడుకోవడంలో భాగంగా ఈ బిలియనీర్ తన ఇళ్లు, ప్రైవేట్ జెట్లను కూడా అమ్మకున్నట్లు సమాచారం. 2021 నుంచి చైనాలో రియల్ ఎస్టేట్ పడిపోవడంతో సంస్థ నష్టాలపాలైంది. 2020లో $110 బిలియన్ల కంటే పైగా అమ్మకాలతో పాటు 280 కంటే ఎక్కువ నగరాల్లో 1,300పైగా డెవలప్మెంట్ ప్రాజెక్ట్‌లతో బిజీబిజీగా ఉన్న ఈ సంస్థ తాజాగా అప్పులు ఊబీలో కూరుకపోయింది. అంతేకాకుండా ఈ గ్రూప్ ప్రస్తుతం ఆ దేశంలో అత్యంత రుణాలు కలిగిన సంస్థగా నిలిచింది. 2008 నుంచి సీపీపీసీసీలో(CPPCC), 2013 నుంచి అందులోని ఎలైట్ 300-సభ్యుల స్టాండింగ్ కమిటీలో హుయ్ కా యన్ భాగంగా ఉన్నారు. అయితే ఇటీవల తన సంపద దారుణంగా పడిపోయిన నేపథ్యంలో గత సంవత్సరం వార్షిక సమావేశానికి హాజరుకావద్దని సమాచారం రావడంతో పాటు వచ్చే ఐదేళ్లపాటు సీపీపీసీసీని ఏర్పాటు చేసే వ్యక్తుల తాజా జాబితా నుంచి ఆయనను మినహాయించారు. చదవండి: బిలియనీర్ గౌతం అదానీకి ఝలక్, 24 గంటల్లో.. -
ఇకనైనా మారాలి మస్క్.. ఒక్క రోజులో 63వేల కోట్లు తుడిచిపెట్టుకుపోయాయి!
ట్విట్టర్‌కు సారథ్య బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సర్వత్రా విమర్శలు ఎదుర్కొంటున్న ఆ సంస్థ సీఈవో, టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌కు మరో భారీ షాక్ ఎదురైంది.ట్విటర్లోని ఊహించని పరిణామాలు, టెస్లాపై ప్రభావం చూపుతున్నాయి. దెబ్బతో మస్క్ సంపద కొవ్వొత్తిలా కరుగుతోంది. ఇటీవల, ప్రపంచంలోని అత్యంత ధనవంతుడు అనే స్థానం నుంచి కిందకు పడిన సంగతి తెలిసిందే. తాజాగా టెస్లా షేర్లు అమ్మకాలతో మస్క్ సంపదతో మంగళవారం ఒక్క రోజే 7.7 బిలియన్ డాలర్లు ( రూ.63.72 వేల కోట్లు) ఆవిరయ్యాయి. ఈ ఏడాది మస్క్ సంపద 122.6 బిలియన్ డాలర్లు తరిగిపోయింది. ట్విటర్ ఎఫెక్ట్.. టెస్లా పై పడుతోందా? ఏం జరుగుతోందంటే...పలు రేటింగ్ ఏజెన్సీలు తమ ధరల లక్ష్యాలను తగ్గించడంతో టెస్లా షేర్లు మంగళవారం దాదాపు 6 శాతం పడిపోయి రెండేళ్ల కనిష్ట స్థాయి $140.86కి చేరాయి. మరో వైపు మస్క్ దృష్టి ట్విట్టర్ వైపు ఎక్కువగా పోయిందని, ఇది టెస్లాకు హాని కలిగిస్తోందని బ్రోకరేజ్ హౌస్‌లు నమ్ముతున్నాయి. వీటితో పాటు ట్విటర్‌కు నిధులను సమకూర్చేందుకు మస్క్ మరిన్ని టెస్లా షేర్లను విక్రయించే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామాలన్నీ కలిసి టెస్టా షేర్ల అమ్మకానికి కారణమవుతున్నాయి. ఇదిలా ఉండగా.. టెస్లా బ్రాండ్ దెబ్బతింటుందని ఇన్వెస్టర్లు భయపడుతున్నారని ఓ బ్రోకరేజ్ సంస్థ తెలిపింది. అదే సమయంలో, మరొక బ్రోకరేజ్ సంస్ధ ట్విట్టర్ కారణంగా మస్క్ పరధ్యానం టెస్లాకు ప్రమాదాన్ని పెంచుతోందని, అందుకే షేర్లు తగ్గుతోందని అభిప్రాయపడింది. ప్రస్తుతం మస్క్ 148 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచ కుబేరుల జాబితాలో 2 వ స్థానంలో ఉన్నారు. 161 బిలియన్ డాలర్లతో బెర్నాల్డ్ ఆర్నాల్డ్ తొలి స్థానంలో, 127 బిలియన్ డాలర్లతో అదానీ మూడో స్థానంలో ఉన్నారు. చదవండి: ఆరేళ్లలో బ్యాంకింగ్ రుణ మాఫీ ఎన్ని లక్షల కోట్లు తెలుసా? -
బాబోయ్, సరికొత్త రికార్డ్ సృష్టించిన యాపిల్ సంస్థ.. షాక్‌లో ప్రత్యర్థి కంపెనీలు!
స్మార్ట్ఫోన్లలో యాపిల్ కంపెనీ ఐఫోన్లకు ఉన్న క్రేజ్ వేరు. ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన డిమాండ్ యాపిల్ ఫోన్లకు సొంతం. అంతటి ప్రాముఖ్యత సంపాదించుకున్న యాపిల్ తాజాగా ఓ రికార్డ్ సృష్టించింది. మార్కెట్ విలువ పరంగా మరే కంపెనీ చేరలేని రేర్ ఫీట్‌ని సాధించి తన బ్రాండ్‌ని మరో సారి నిరూపించుకుంది. మార్కెట్ విలువలో యాపిల్ కంపెనీ గురువారం ఒక్క రోజే 190.9 బిలియన్ డాలర్ల పెరిగింది. ఈ విషయాన్ని బ్లూమ్‌బర్డ్ డేటా వెల్లడించింది. దీంతో ప్రస్తుతం యాపిల్ మార్కెట్ విలువ 2.34 ట్రిలియన్ డాలర్లకు చేరింది. అదే సమయంలో, ఇతర మూడు టెక్ దిగ్గజాల మార్కెట్ విలువు $2.306 ట్రిలియన్లకు చేరింది. గూగుల్ పేరెంట్ ఆల్ఫాబెట్ మార్కెట్ విలువ (1.126 ట్రిలియన్ డాలర్లు), అమెజాన్ (939.78 బిలియన్ డాలర్లు), ఫేస్బుక్ పేరెంట్ మెటా (240.07 బిలియన్ డాలర్లు) ఉన్నాయని యాహూ ఫైనాన్స్ డేటా వెల్లడించింది. అసలే ఆర్థిక మాంద్యం భయాలతో కంపెనీ మార్కెట్ విలువలు ఆశించినంత స్థాయిలో ఫలితాలు ఇవ్వడం లేదన్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో యాపిల్ ఈ స్థాయిలో మార్కెట్ విలువను చూసి మిగిలిన కంపెనీలు షాక్‌లో ఉన్నాయి. గత వారం, యాపిల్ మార్కెట్ విలువ ఆల్ఫాబెట్ ఇంక్, అమెజాన్, మెటా మార్కెట్ విలువ కంటే ఎక్కువగా పెరిగింది. సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో ఆపిల్ ఆదాయ ఫలితాలు రెండంకెల వృద్ధిని నమోదు చేసిందని చీఫ్ ఎగ్జిక్యూటివ్ టిమ్ కుక్ గత నెలలో తెలిపారు. యాపిల్ ప్రస్తుతం ప్రీమియం స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో 37% వాటాను కలిగి ఉండగా, దేశంలో మొత్తం స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో 3% మార్కెట్ వాటాను కలిగి ఉంది. చదవండి: హైదరాబాద్: జియో 5జీ సేవలు కావాలంటే.. మీ స్మార్ట్‌ఫోన్‌లో ఇలా చేయాల్సిందే! -
భారీ దోపిడీని ఛేదించిన చిత్తూరు పోలీసులు
-
పాంచ్ పటాకా: రూ.331 కోట్ల సంపద సీజ్
న్యూఢిల్లీ: నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తాయిలాలుగా అందిస్తున్న డబ్బులు, ఆభరణాలు, సామగ్రి, పరికరాలు, బహుమతులు పెద్ద ఎత్తున పట్టుబడుతున్నాయి. ఈసారి ఎప్పుడు లేనంతగా ఏకంగా రూ.300 కోట్లకు పైగా సంపదను ఎన్నికల సంఘం స్వాధీనం చేసుకుంది. ఎన్నికలు జరుగుతున్న తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, అసోంతోపాటు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిల్లో విచ్చలవిడిగా డబ్బుతో పాటు ఇతర తాయిలాలు తరలిస్తున్నారు. ఎన్నికల సంఘం పటిష్ట చర్యలు చేపట్టి విస్తృతంగా తనిఖీలు చేస్తుండడంతో భారీగా సంపద లభిస్తోంది. 2016తో పోలిస్తే ఇప్పటివరకు పట్టుబడిన సంపద రెట్టింపులో ఉందని ఎన్నికల సంఘం బుధవారం ప్రకటించింది. ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసినప్పటి నుంచి ఇప్పటివరకు పట్టుబడ్డ సంపద విలువ అక్షరాల రూ.331.47 కోట్లు. అయితే గతంలో 2016లో జరిగిన ఎన్నికల సందర్భంగా పట్టుబడ్డ సంపద రూ.225.17 కోట్లు. ఎన్నికల ప్రారంభంలోనే ఇంత నగదు పట్టుబడగా ఎన్నికలు ముగిసే నాటికి ఎంత డబ్బు పట్టుబడుతుందోనని అధికార వర్గాలతో పాటు ప్రజలు సందేహం వ్యక్తం చేస్తున్నారు. పట్టుబడ్డ సంపదను ఎన్నికల సంఘం రాష్ట్రాలవారీగా వర్గీకరించింది. తమిళనాడు రూ.127 కోట్లు పశ్చిమ బెంగాల్ రూ.112.59 కోట్లు అస్సాం రూ.63 కోట్లు కేరళ రూ.21.77 కోట్లు పుదుచ్చేరి రూ.5.72 కోట్లు ఈ పట్టుబడ్డ సంపదలో తమిళనాడు అగ్రస్థానంలో ఉండగా అసోం చివరి స్థానంలో ఉంది. ఈ ఎన్నికల సందర్భంగా ఎన్నికల సంఘం ప్రత్యేకంగా 295 మందిని వ్యయ పరిశీలకులను నియమించింది. ఎన్నికల్లో ధన ప్రవాహాన్ని కట్టడి చేసేందుకు ఈ పరిశీలకులు పని చేయనున్నారు. ఓటర్లకు ఎరగా డబ్బు, ఆభరణాలు, బహుమతులు పంపిణీ చేయడం చట్టరీత్యా నేరం. అందుకోసం ఎన్నికల సంఘం తాయిలాల పంపకాన్ని అడ్డుకుంటోంది. చదవండి: అధికారంలోకి వస్తే ‘అమ్మ మృతి’ మిస్టరీ చేధిస్తాం చదవండి: తాజా మాజీ ముఖ్యమంత్రికి అధిష్టానం షాక్ Record Seizures worth Rs. 331 crores made in Expenditure Monitoring Process in ongoing Assembly Elections, 2021 in States of Assam, West Bengal, Tamil Nadu, Kerala and Union Territory of Puducherry. (1/n) Further details follow in press release — Sheyphali Sharan (@SpokespersonECI) March 17, 2021 -
తెలంగాణలో మద్యం జాతర
సాక్షి, హైదరాబాద్: మందుబాబులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. రాష్ట్రంలో లాక్డౌన్ అమల్లోకి వచ్చిన 45 రోజుల తర్వాత బుధవారం మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. ఇంకేముంది... మందుబాబులు పండుగ చేసుకున్నారు. మండే ఎండను, భారీ క్యూలను సైతం లెక్క చేయకుండా మద్యం కోసం ఆరాటపడ్డారు. చేతిలో బాటిల్ పడగానే పట్టరాని సంతోషంతో ఇంటికి వెళ్లిపోయి ఎంచక్కా లాగించేసి దూప తీర్చుకున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే బుధవారం ఉదయం 10 గంటల నుంచి రాష్ట్రంలో ఎక్కడ చూసినా మద్యం విక్రయాలే. ఆ ప్రాంతం.. ఈ ప్రాంతం... ఆ జిల్లా... ఈ జిల్లా... ఆ ఊరు... ఈ ఊరు అనే తేడా లేకుండా ఎక్కడ వైన్‌షాపు ఉన్నా ఆ షాపు ముందు భారీ క్యూలే దర్శనమిచ్చాయి. మద్యం ప్రియులు కొన్నిచోట్ల మీటర్ల దూరం బారులు తీరి భౌతిక దూరం పాటిస్తూ మరీ కొనుక్కున్నారు. బుధవారం ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా రూ.90 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయని ఎక్సైజ్ శాఖ అంచనా వేస్తోందంటే ఏ స్థాయిలో మందు బాబులు జేబులు ఖాళీ చేసుకున్నారో అర్థం చేసుకోవచ్చు. చదవండి: వైద్యానికి డబ్బుల్లేక మాజీ ఎమ్మెల్యే కొడుకు మృతి ఉదయం నుంచే బారులు... కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం.. మద్యం విక్రయాలకు అనుమతినిస్తూ రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం మేరకు బుధవారం ఉదయం నుంచి రాష్ట్రంలో మద్యం అమ్మకాలు ప్రారంభమయ్యాయి. దీంతో మార్చి 22న జనతా కర్ఫ్యూ సందర్భంగా మూతపడ్డ వైన్‌షాపుల షట్టర్లు తెరుచుకున్నాయి. ఉదయం 10 గంటల నుంచి షాపులు తెరవాలని ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో 8 గంటల నుంచే మందుబాబులు వైన్‌షాపుల దగ్గర చక్కర్లు ప్రారంభించారు. 9 గంటల సమయంలో ఎక్సైజ్, పోలీస్ సహకారంతో క్యూ కట్టడం ప్రారంభమయింది. యువకులు, మధ్య వయస్కులు, వయసు మీద పడ్డవారు, మహిళలు, యువతులు... అంతా లైన్లలోకి వచ్చేశారు. 10 గంటలు కాగానే షాపుల షట్టర్లు లేశాయి. మందుబాబులు తమకు ఇష్టమైన బ్రాండ్ లిక్కర్‌ను కొనుక్కుని తీసుకెళ్లారు. తొలిరోజు కావడంతో మద్యాన్ని భారీగా కొనుగోలు చేశారు రాష్ట్ర ప్రజలు. మళ్లీ పరిస్థితి ఎలా ఉంటుందో అన్న ఆలోచనతో బుధవారమే చేతిలో ఉన్న డబ్బులకు తగినంత మందు కొనుక్కెళ్లారు. సికింద్రాబాద్ బోయిన్‌పల్లిలో భౌతిక దూరం లేకుండా.. ధరలు పెరిగినా పట్టించుకోలేదు... మద్యం దుకాణాలు తెరిచారన్న ఆనందంతో మందు బాబులు మద్యం ధరలు పెరిగాయన్న విషయాన్ని కూడా పట్టించుకోలేదు. చీప్ లిక్కర్‌పై 11 శాతం, ఇతర మద్యంపై 16 శాతం ప్రత్యేక సెస్ విధించడంతో బుధవారం రాష్ట్రంలోని అన్ని రకాల మద్యం ధరలూ పెరిగాయి. ఫుల్‌బాటిల్ చీప్ లిక్కర్‌పై రూ.40, మీడియం బ్రాండ్లపై రూ.80, ప్రీమియం బ్రాండ్లపై రూ.120 చొప్పున పెంచగా.. స్కాచ్, ఫారిన్ బ్రాండ్‌పై రూ.160, బీర్లపై రూ.30 అదనపు భారాన్ని ప్రభుత్వం మోపింది. అయితే పెరిగిన మద్యం ధరలు కొంత గందరగోళానికి కారణమయ్యాయి. బుధవారం ఉదయం షాపులు తెరిచే సమయానికి బ్రేవరేజెస్ కార్పొరేషన్ నుంచి పెరిగిన ధరలపై స్పష్టత రాకపోవడంతో ఒక్కో ప్రాంతంలో ఒక్కో బ్రాండ్‌ను ఒక్కో రేటుకు అమ్మాల్సి వచ్చింది. చదవండి: ఆసుపత్రుల్లో ఓపీ షురూ మధ్యాహ్నానికి కొంత స్పష్టత వచ్చినా ధరల గందరగోళం మాత్రం సాయంత్రం వరకు సాగింది. ప్రీమియం, మీడియం బ్రాండ్లపై రూ.100 నుంచి రూ.300 వరకు పెంచి అమ్మారు. ఎక్సైజ్ శాఖ అంచనా ప్రకారం.. బుధవారం ఒక్కరోజే రాష్ట్రంలో రూ.90 కోట్ల మేర మద్యం అమ్మకాలు జరిగాయి. వాస్తవానికి, సాధారణ రోజుల్లో రోజుకు మద్యం విక్రయాలు రూ.35 కోట్ల మేర జరుగుతాయి. అయితే, బుధవారం మద్యం ప్రియులు పెద్ద ఎత్తున కొనుగోళ్లు జరపడంతో ఈ విలువ రెండింతల కన్నా ఎక్కువ పెరిగిపోయిందని అధికారులు చెబుతున్నారు. ఒక్క హైదరాబాద్‌లోనే రూ.50 కోట్ల వరకు విక్రయాలు జరిగి ఉంటాయని అంటున్నారు. ఆదిలాబాద్ పట్టణం వినాయక్‌చౌక్‌లోని ఓ వైన్ షాప్ వద్ద.. డిపోలకు భారీగా ఇండెంట్లు... ఇటీవల సేకరించిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలో మార్చి 22 నాటికి రూ.110 కోట్ల విలువైన మద్యం స్టాక్ అందుబాటులో ఉండగా, బుధవారం రూ.90 కోట్ల స్టాక్ అయిపోవడంతో డిపోల నుంచి సరుకు షాపులకు చేరుస్తున్నారు. వైన్స్ యాజమాన్యాలు కూడా తొలిరోజు నుంచే డిపోలకు భారీ ఇండెంట్లు పెట్టడంతో డిపోలకు కూడా సరుకును వేగవంతంగా చేర్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. డిపోల నుంచి షాపులకు రాత్రి 7 గంటల తర్వాత సరుకు తరలించేలా చర్యలు తీసుకోవాలని డిపోల సిబ్బంది, ఎక్సైజ్ అధికారులు, వైన్స్ యజమానులకు కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. అలాగే పెరిగిన రేట్ల ప్రకారం ప్రభుత్వానికి వైన్‌షాపు యజమానులు చెల్లించాల్సిన వ్యాట్‌ను నేడు కట్టించుకోనున్నారు. ఈ మేరకు గురువారం చలాన్ల రూపంలో ప్రభుత్వానికి చెల్లించాలని వైన్‌షాప్ యజమానులకు ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. దూరం దూరం.. సాయంత్రానికి మాయం... భౌతిక దూరం పాటించాలని, ఎక్కడైనా తేడా వస్తే మళ్లీ మద్యం దుకాణాలు మూసేస్తామని సీఎం కేసీఆర్ చెప్పిన విషయం తెలిసిందే. దీంతో దుకాణాలు ఎక్కడ మూసేస్తారో అనే ఆలోచనతో ఉదయం నుంచి మందుబాబులు భౌతిక దూరం నిబంధనను పాటించారు. మాస్క్ లేకపోతే మద్యం ఇవ్వరేమో అనే జాగ్రత్త కూడా తీసుకుని ఏదో రకమైన మాస్కు కట్టుకుని క్యూలో నిలబడ్డారు. అయితే సాయంత్రం 6 గంటలకు షాపులు మూసేస్తారన్న సమయంలో అప్పటి వరకు క్యూలో ఉన్న మందుబాబులు మందు దొరుకుతుందో.. లేదో అనే ఆదుర్దాతో భౌతిక దూరాన్ని మర్చిపోయారు. పోలీసులు, ఎక్సైజ్ సిబ్బంది కూడా ఆ సమయంలో చాలా చోట్ల ఏమీ చేయలేకపోయారు. -
ఎయిర్‌టెల్‌లో వాటాలు అమ్మేసిన మెరిల్ లించ్
న్యూఢిల్లీ: భారతీ ఎయిర్‌టెల్‌లో మెరిల్లించ్ తనకున్న వాటాల్లో సింహ భాగాన్ని విక్రయించేసింది. ఎయిర్‌టెల్‌లో మెరిల్‌లించ్‌కు డిసెంబర్ త్రైమాసికం ముగిసే నాటికి 5.09 కోట్ల షేర్లుండగా, వీటిలో 3.87 కోట్ల షేర్లను మంగళవారం సగటున ఒక్కో షేరును రూ.499.1 చొప్పున విక్రయించింది. ఇది 0.97 శాతం వాటాకు సమానం. ఈ షేర్లను ఎస్ఆర్ఎస్ పార్ట్నర్స్ (కేమాన్) ఎల్ఎల్సీ కొనుగోలు చేసింది. ఈ లావాదేవీ విలువ రూ.1,931.23 కోట్లు. బీఎస్ఈలో ఎయిర్టెల్ షేరు క్రితం ముగింపుతో పోలిస్తే 1.43 శాతం నష్టంతో రూ.496.90 వద్ద ముగిసింది. -
ఆస్కార్ విలువెంతో తెలిస్తే షాక్!
బంగారం వర్ణంలో మెరిసిపోయే ఆస్కార్ కు వినోద రంగంలో ఉన్న గౌరవం అంతా ఇంతా కాదు. ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ గోల్డెన్ ఆస్కార్‌ను ఒక్కసారైనా ఇంటికి తీసుకెళ్లాలి అని ప్రతి ఒక్క ఆర్టిస్టూ ఎన్నో కలలు కంటూ ఉంటారు. కానీ ఆ అదృష్టం కొద్దిమందికే వరిస్తూ ఉంటోంది. బంగారు రంగుల్లో మెరిసిపోయే ఈ ఆస్కార్ విలువెంతో అసలు ఎప్పుడైనా, ఎవరైనా గెస్ చేశారా? ఈ ఆస్కార్ విలువ కేవలం 10 డాలర్లేనట అంటే భారతీయ కరెన్సీ ప్రకారం రూ.666 మాత్రమే. అయితే ఈ విగ్రహం తయారుచేయడానికి అయ్యే ఖర్చు మాత్రం 400 డాలర్లు(రూ.26,655). ఒకవేళ దీన్ని ఆక్షన్‌కు పెట్టాలనుకుంటే రూల్స్ ప్రకారం ఈ ట్రోఫికి 10 డాలర్లను అకాడమీ ఆఫ్ మోషన్ ఫిక్చర్ ఆర్ట్ అండ్ సైన్సెస్(ఏఎమ్పీఏఎస్) కు చెల్లించాల్సి ఉంటుంది. 2015 నుంచి ఈ నిబంధనను కోర్టు అమలుచేస్తూ వస్తోంది. ఈ రూల్‌ను సమర్థిస్తూ వస్తున్న ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు, ఆస్కార్ విన్నర్ స్టీవెన్ స్పీల్ బర్గ్, బెట్ డేవిస్, క్లార్క్ గేబుల్కు చెందిన ఆస్కార్లపై 1.36 మిలియన్ డాలర్లు ఖర్చు చేశారు. వీటిని తిరిగి అకాడమీకి విరాళంగా ఇవ్వడానికే ఆయన ఇంత ఖర్చు చేశారట. -
బంగారం ఎక్కడ దాచారంటే..
న్యూఢిల్లీ: బంగారం అక్రమ రవాణాలో అక్రమార్కుల తీరు నిఘా అధికారులను సైతం నివ్వెర పరుస్తోంది. బేబీ డైపర్స్ నుంచి శరీర అవయవాలు దాకా దేన్నీ వదలకుండా పసిడి అక్రమంగా తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఢిల్లీ విమానాశ్రయంలో తనిఖీలు నిర్వహిస్తున్న కస్టమ్స్ అధికారులకు ఇలాంటి షాకింగ్ అనుభవం ఎదురైంది. ఇందిరాగాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ వింత చెప్పు అధికారులను ఆకర్షించింది. అనుమానంతో ఆరాతీస్తే సుమారు రూ. 27 లక్షల విలువైన బంగారం పట్టుబడింది. ఇండియన్ పాస్ పోర్ట్ తో ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న ఇద్దరు ప్రయాణికులనుంచి బుధవారం దీన్ని స్వాధీనం చేసుకున్నారు. సాధారణంగా కనిపించే స్లిప్పర్స్ లో భారీగా బంగారం పట్టుబడటం అక్రమార్కుల అనుసరిస్తున్న విధానానికి అద్దం పట్టింది. అయినా....చివరికి నిఘా కన్నుకు చిక్కక తప్పలేదు. బ్యాంకాక్ నుంచి ఢిల్లీకి చేరుకున్న వీరినుంచి 938 గ్రాముల ఈ బంగారాన్నిఅధికారులు సీజ్ చేశారు. 118 చిన్న చిన్న ముక్కలుగా చెప్పుల్లోదాచి పెట్టిన ఈ బంగారం మార్కెట్ విలువ రూ.26.96లక్షలని అధికారులు తెలిపారు. కస్టమ్స్ చట్టం 1962 110 సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేశామని చెప్పారు. ఈ కేసులో ఇరువురిని అనుమానితులుగా అదుపులోకి విచారిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన డీమానిటైజేషన్ తరువాత బంగారం అక్రమ రవాణా బాగా పెరిగింది. అనేక రెట్లు పెరిగి పోయిందని అధికారులు చెబుతున్నారు. ఈ వారంలోనే దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడినుంచి అట్టపెట్టెల్లో నల్లని ఇన్సులేట్ టేప్ తో అతికించిన గోల్డ్ ఫాయిల్స్ ను అధికారులు స్వాదీనం చేసుకున్నారు. 700 గ్రాములున్న దీని విలువ రూ.18.5 లక్షలు. ఢిల్లీ విమానాశ్రయం నుంచి 2012-2013 కాలంలో 6.6 కిలోల బంగారం స్వాధీనం చేసుకోగా, 2013-2014 లో ఇది 384 కేజీలు పెరిగింది. 2014, 15 సంవత్సరాల్లో 574 కిలోలుగా ఉంది. అయితే 2016 లో మాత్రం 220 కిలోలకు పైగానే అధికారులకు చిక్కింది. దీని విలువ సుమారు రూ 60 కోట్లు. -
కోట్లు కొల్లగొట్టిన మడోన్నా కాస్టూమ్స్