దేశంలో ఒకవైపు ఎన్నికల వేడి, మరోవైపు వేసవి తాపం.. రెండు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల సన్నాహాలు ప్రారంభించాయి. పలువురు నేతలు తమ నామినేషన్లను దాఖలు చేశారు. బెంగళూరు సౌత్ నుంచి బీజేపీ నేత తేజస్వి సూర్య కూడా తన నామినేషన్ దాఖలు చేశారు.
తెజస్వీ సూర్య బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన సందర్భంలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా ఆయన వెంట ఉన్నారు. సూర్య తన అఫిడవిట్‌లో తన మొత్తం ఆస్తుల విలువ రూ.4.10 కోట్లుగా పేర్కొన్నారు. తనకు ఎలాంటి స్థిరాస్తి లేదని బీజేపీ ఎంపీ వివరించారు. కాగా ఆయన 2019 లోక్‌సభ ఎన్నికల్లో తన ఆస్తుల విలువ రూ.13 లక్షలుగా చూపించారు. ఇప్పుడు వాటి విలువ 31.5 శాతాన్ని దాటింది. సూర్య మొత్తం ఆస్తుల విలువ రూ.4.10 కోట్లు. మ్యూచువల్ ఫండ్స్‌లో రూ.1.99 కోట్లు పెట్టుబడి పెట్టారు. అలాగే రూ.1.79 కోట్లకు పైగా విలువైన షేర్లను కొనుగోలు చేశారు. మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్‌లో అధికంగా పెట్టుబడులు పెట్టానని, మార్కెట్‌లో బూమ్ కారణంగా తన సంపద పెరిగిందని సూర్య తన అఫిడవిట్‌లో వివరించారు.
సూర్య ..బెంగళూరు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లీగల్ స్టడీస్ పూర్వ విద్యార్థి. కర్ణాటక హైకోర్టులో న్యాయవాది. బసవనగుడి ఎమ్మెల్యే రవి సుబ్రమణ్యం మేనల్లుడు. ప్రస్తుతం బెంగళూరు సౌత్ ఎంపీగా ఉన్నారు. 2019లో కాంగ్రెస్ అభ్యర్థి హరిప్రసాద్‌పై మూడు లక్షలకు పైగా ఓట్లతో విజయం సాధించారు. కాగా ఎన్నికల సంఘం తెలిపిన వివరాల ప్రకారం ఈసారి దేశవ్యాప్తంగా ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment