tejasvi
-
జైస్వాల్ సొంత అన్న.. తొలి హాఫ్ సెంచరీ! టీమిండియా ఓపెనర్ రియాక్షన్ వైరల్
టీమిండియా స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ తన సోదరుడు తేజస్వి జైస్వాల్‌పై ప్రశంసలు కురిపించాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో తొలి అర్ధ శతకం బాదినందుకు అతడిని అభినందించాడు. కాగా ఉత్తరప్రదేశ్‌లో జన్మించిన యశస్వి జైస్వాల్‌కు ముగ్గురు తోబుట్టువులు.. ఇద్దరక్కలు, ఓ అన్న ఉన్నారు.ఇటీవలే అరంగేట్రంయశస్వి సోదరుడు తేజస్వి కూడా క్రికెటర్‌గా రాణించాలనే ఆశయంతో ఉన్నాడు. ఈ క్రమంలో దేశవాళీ క్రికెట్లో ఇటీవలే అరంగే ట్రం చేవాడు. త్రిపుర జట్టుకు ఆడుతూ.. తాజా రంజీ ట్రోఫీ సీజన్లో సూపర్ హాఫ్ సెంచరీ సాధించాడు. బరోడాతో మ్యాచ్‌లో 159 బంతులు ఎదుర్కొని 12 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 82 పరుగులు రాబట్టాడు.అంతేకాదు.. ఈ మ్యాచ్‌లో ఒక వికెట్‌ను కూడా తేజస్వి జైస్వాల్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ నేపథ్యంలో త్రిపుర- బరోడా మ్యాచ్‌కు సంబంధించిన స్కోరు కార్డును యశస్వి జైస్వాల్ ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేశాడు. అన్న తేజస్వి జైస్వాల్ ఇన్నింగ్స్‌ను హైలైట్ చేసి అతడిని అభినందించాడు.డ్రాగా ముగిసిన మ్యాచ్‌కాగా రంజీ ట్రోఫీ 2024-25 సీజన్లో భాగంగా అగర్తల వేదికగా త్రిపుర- బరోడా జట్ల మధ్య నవంబరు 6న మ్యాచ్ మొదలైంది. ఇందులో టాస్ గెలిచిన త్రిపుర తొలుత బౌలింగ్ చేసింది. ఈ క్రమంలో బరోడా జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో 235 పరుగులకు ఆలౌట్ అయింది.ఇందుకు బదులుగా ఆతిథ్య త్రిపుర తమ మొదటి ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్ల నష్టానికి 482 పరుగుల వద్ద స్కోరును డిక్లేర్ చేసింది. అయితే, ఈ నాలుగు రోజుల మ్యాచ్‌లో శనివారమే చివరి రోజు. ఈ క్రమంలో వికెట్లు పడకుండా జాగ్రత్త పడ్డ బరోడా.. ఆట ముగిసే సరికి నాలుగు వికెట్ల నష్టానికి 241 పరుగుల వద్ద నిలిచింది. దీంతో ఫలితం తేలక మ్యాచ్ డ్రాగా ముగిసింది.ఒకే ఒక్క విజయంకాగా తేజస్వి జైస్వాల్ తమ్ముడు యశస్వి మాదిరే ఎడమచేతి వాటం బ్యాటర్. అయితే, ఆల్‌రౌండర్ అయిన తేజస్వి రైటార్మ్ మీడియం పేసర్ కావడం విశేషం. ఇక ఈ సీజన్లో త్రిపుర తొలుత ఒడిశాతో మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. తర్వాతి మ్యాచ్‌లో మేఘాలయపై ఇన్నింగ్స్ 17 పరుగుల తేడాతో గెలిచింది.టీమిండియా ఓపెనర్‌గా పాతుకుపోయిన యశస్విఅనంతరం.. ముంబైతో మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. తాజాగా బరోడా జట్టుతో మ్యాచ్‌లోనూ ఫలితం తేల్చలేకపోయింది. ఇదిలా ఉంటే.. యశస్వి జైస్వాల్ దేశవాళీ క్రికెట్లో ముంబైకి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఐపీఎల్‌లోనూ సత్తా చాటిన ఈ లెఫ్టాండ్ బ్యాటర్.. ప్రస్తుతం టీమిండియాలో టెస్టు, టీ20 ఓపెనర్‌గా పాతుకుపోయాడు.ముఖ్యంగా టెస్టు అరంగేట్రం(2023)లోనే 23 ఏళ్ల యశస్వి భారీ శతకం(171) బాదాడు. ఇప్పటి వరకు అంతర్జాతీయ కెరీర్లో 14 టెస్టులు ఆడి 1407 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఇందులో మూడు సెంచరీలు, రెండు ద్విశతకాలు ఉండటం విశేషం. ఇక భారత్ తరఫున 23 టీ20లు ఆడిన యశస్వి ఓ శతకం సాయంతో 723 రన్స్ చేశాడు. తదుపరి అతడు ఆస్ట్రేలియా పర్యటనలో బోర్డర్- గావస్కర్ ట్రోఫీతో బిజీకానున్నాడు.చదవండి: స్టార్ ఓపెనర్ రీ ఎంట్రీ.. శ్రేయస్ అయ్యర్ కూడా! కానీ అతడు మిస్! -
Tejasvi Surya Assets: ఎంపీ అయిన ఐదేళ్లలో 30 రెట్లు పెరిగిన ఆస్తులు!
దేశంలో ఒకవైపు ఎన్నికల వేడి, మరోవైపు వేసవి తాపం.. రెండు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల సన్నాహాలు ప్రారంభించాయి. పలువురు నేతలు తమ నామినేషన్లను దాఖలు చేశారు. బెంగళూరు సౌత్ నుంచి బీజేపీ నేత తేజస్వి సూర్య కూడా తన నామినేషన్ దాఖలు చేశారు. తెజస్వీ సూర్య బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన సందర్భంలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా ఆయన వెంట ఉన్నారు. సూర్య తన అఫిడవిట్లో తన మొత్తం ఆస్తుల విలువ రూ.4.10 కోట్లుగా పేర్కొన్నారు. తనకు ఎలాంటి స్థిరాస్తి లేదని బీజేపీ ఎంపీ వివరించారు. కాగా ఆయన 2019 లోక్‌సభ ఎన్నికల్లో తన ఆస్తుల విలువ రూ.13 లక్షలుగా చూపించారు. ఇప్పుడు వాటి విలువ 31.5 శాతాన్ని దాటింది. సూర్య మొత్తం ఆస్తుల విలువ రూ.4.10 కోట్లు. మ్యూచువల్ ఫండ్స్‌లో రూ.1.99 కోట్లు పెట్టుబడి పెట్టారు. అలాగే రూ.1.79 కోట్లకు పైగా విలువైన షేర్లను కొనుగోలు చేశారు. మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్‌లో అధికంగా పెట్టుబడులు పెట్టానని, మార్కెట్లో బూమ్ కారణంగా తన సంపద పెరిగిందని సూర్య తన అఫిడవిట్లో వివరించారు. సూర్య ..బెంగళూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ లీగల్ స్టడీస్ పూర్వ విద్యార్థి. కర్ణాటక హైకోర్టులో న్యాయవాది. బసవనగుడి ఎమ్మెల్యే రవి సుబ్రమణ్యం మేనల్లుడు. ప్రస్తుతం బెంగళూరు సౌత్ ఎంపీగా ఉన్నారు. 2019లో కాంగ్రెస్ అభ్యర్థి హరిప్రసాద్‌పై మూడు లక్షలకు పైగా ఓట్లతో విజయం సాధించారు. కాగా ఎన్నికల సంఘం తెలిపిన వివరాల ప్రకారం ఈసారి దేశవ్యాప్తంగా ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. -
గ్రేటర్ పోరు: మాటల యుద్ధం.. వివాదాస్పదం!
సాక్షి, హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా బీజేపీ-ఎంఐఎం పార్టీల నడుమ విద్వేశపూరిత ప్రసంగాలు దుమారం రేపుతున్నాయి. మొన్నటి వరకు ప్రశాంతంగా ఉన్న నగరంలో నేతలు హాట్ కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. నువ్వానేనా అనే రీతిలో ఇరు పార్టీల నేతలు నోటికి పనిచేప్తున్నారు. ఒకరిని మించి మరొకరు రెచ్చగొట్టే ప్రసంగాలతో, విద్వేశపూరిత వ్యాఖ్యలతో విరుచుకుపడుతున్నారు. బీజేపీ బెంగళూరు ఎంపీ తేజస్వీ సూర్య రాకతో మొదలైన గ్రేటర్ రాజకీయ వేడి నేటికి తారాస్థాయికి చేరింది. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గత మంగళవారం హైదరాబాద్ నగరంలో పర్యటించిన సూర్య.. ఎంఐఎం నేతలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పాకిస్తాన్ ఏజెంట్‌గా పనిచేస్తున్నారని విమర్శించారు. (అక్బరుద్దీన్‌కు కేటీఆర్ కౌంటర్) అంతేకాకుండా పాకిస్తాన్ జాతిపిత మహ్మద్ అలీ జిన్నాతో పోల్చారు. దేశ విభజన సమయంలో హైదరాబాద్ సంస్థానాన్ని పాకిస్తాన్లో విలీనం చేయాలని జిన్నా డిమాండ్ చేశారని, ఒవైసీ కూడా అదే ఆలోచన విధానం ఉన్న వ్యక్తి అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ దేశాల నుంచి వలసవచ్చిన ముస్లింలు పాతబస్తీలో అక్రమంగా నివాసముంటున్నారని ఆరోపనలు గుప్పించారు. హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున రొహింగ్యాలు, పాకిస్తాన్ ఓట్లు ఉన్నాయని ఆరోపించారు. పాకిస్తాన్ మద్దతు దారులే ఎంఐఎం పార్టీలో ఉన్నారని వ్యాఖ్యానించారు. ‘అక్బరుద్దీన్, అసదుద్దీన్ సోదరులకు నేను ఒక్క విషయం మాత్రం స్పష్టంగా చెప్పగలను. ఇది నిజాం నవాబు పాలన కాదు. హిందు హృదయ సామ్రాట్ నరేంద్ర మోదీ సామ్రాజ్యం’అంటూ విరుచుకుపడ్డారు. (అదే జరిగితే.. దారుసలాంని కూల్చుతాం) పాతబస్తీలో సర్జికల్ స్ట్రైక్ ఇక తేజస్వీ సూర్య విమర్శలపై ఒవైసీ ఘాటుగా స్పందించారు. హైదరాబాద్‌లో పాకిస్తాన్, రొహింగ్యా ఓటర్లు ఉంటే కేంద్రహోం మంత్రి అమిత్ షా ఏం చేస్తున్నారు..? నిద్రపోతున్నారా? అంటూ ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ అనుమతితోనే భాగ్యనగరంలోని రొహింగ్యాలకు షెల్టర్ ఇచ్చారని ఒవైసీ గుర్తుచేశారు. మరోవైపు మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు, మాజీ సీఎం ఎన్టీఆర్‌లపై ఒవైసీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. పీవీ, ఎన్టీఆర్ ఘాట్స్‌ను కూల్చివేస్తామంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సైతం వివాదాస్పద వ్యాఖ్యలతో అలజడి సృష్టిస్తున్నారు. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తే పాతబస్తీలో సర్జికల్ స్ట్రైక్ చేస్తామన్న ఆయన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. సంజయ్ కామెంట్స్ తెలంగాణలోనే కాకుండా దేశ వ్యాప్తంగానూ హాట్ టాపిక్‌గా మారాయి. (పాతబస్తీలో సర్టికల్ స్ట్రైక్) మరోవైపు గ్రేటర్ ఎన్నికల సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన నాయకుల ప్రసంగాలపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల మధ్య చిచ్చుపెట్టే విధంగా రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రజలను ఆకట్టుకునే విధంగా పథకాలు, మేనిఫేస్టోలు తయారుచేసి, ఓటర్లను ఆకర్శించాలే గానీ ఇలా రెబ్బగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయవద్దని హితవు పలుకుతున్నారు. మొత్తానికి జీహెచ్ఎంసీ ఎన్నికలు రాజధానిలో వేడిపుట్టిస్తున్నాయి. చివరికి గ్రేటర్ పీఠం ఎవరికి దక్కుతుందో వేచి చూడాలి. తేజస్వీపై కేసు నమోదు.. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య పై ఓయూ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అనుమతి లేకుండా క్యాంపస్‌లోకి ప్రవేశించడాని ఓయూ రిజిస్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్యాంపస్‌లో విరుద్ధంగా సభ నిర్వహించారంటు ఫిర్యాదులో పేర్కొన్నారు. రిజిస్టర్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. కేసులు పెట్టి బీజేపీ ని ఆపలేరని, ఎన్ని కేసులు కావాలంటే అన్ని కేసులు పెట్టండి అంటూ ట్విటర్లో తేజస్వి సవాల్ విసిరారు. ఎన్ని కేసులు పెడితే బీజేపీ అంత బలంగా తయారు అవుతుందని వ్యాఖ్యానించారు. -
‘ఆ ఎంపీని తొలగించండి’
బెంగళూర్ : బీజేపీ ఎంపీ, ఆ పార్టీ యువజన విభాగం చీఫ్ తేజస్వి సూర్య బెంగళూర్‌పై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. బెంగళూర్ ఉగ్ర అడ్డాగా మారుతోందని ఆయన చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కర్ణాటకలో పాలక పార్టీ బీజేపీ కాగా, బెంగళూర్ ప్రతిష్టను దిగజార్చేలా తేజస్వి వ్యాఖ్యలున్నాయని కాంగ్రెస్ మండిపడింది. బెంగళూర్ ప్రతిష్టను మంటగలిపిన తేజస్విని తక్షణమే తొలగించాలని, ఆయన వ్యాఖ్యలు బీజేపీకి అవమానకరమని కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ డిమాండ్ చేశారు. కాగా, గత కొన్నేళ్లుగా భారత సిలికాన్ వ్యాలీగా పేరొందిన బెంగళూర్ ఉగ్రకార్యకలాపాలకు కేంద్రంగా మారిందని తేజస్వి సూర్య ఆదివారం వ్యాఖ్యానించారు. పలువురు ఉగ్రవాదుల అరెస్ట్, స్లీపర్ సెల్స్ గుట్టును ఎన్ఐఏ రట్టు చేసిన ఉదంతాలు ఈ అంశాన్ని స్ప్టష్టం చేస్తున్నాయని అన్నారు. నగరంలోని కేజే హళ్లి, డీజే హళ్లి ప్రాంతాల్లో ఇటీవల జరిగిన మూక దాడులను ఈ సందర్భంగా ఎంపీ ప్రస్తావించారు. నగరంలో ఎన్ఐ విభాగాన్ని ఏర్పాటు చేయాలని తాను కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కోరానని దక్షిణ బెంగళూర్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఎంపీ తేజస్వి చెప్పారు. దీనిపై త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకుంటామని అమిత్ షా హామీ ఇచ్చారని ఎంపీ తెలిపారు. చదవండి : సెంట్రల్ జైలుకు నటి రాగిణి -
వివాదంలో బీజేపీ ఎంపీ.. ట్వీట్ తొలగింపు
బెంగళూరు : బీజేపీ యువ ఎంపీ తేజస్వి సూర్య గతంలో చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు ఆయనను వివాదంలోకి నెట్టింది. 2015లో అరబ్ మహిళల శృంగార జీవితాన్ని టార్గెట్ చేస్తూ తేజస్వి చేసిన ట్వీట్‌పై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఐదేళ్ల కిందట తేజస్వి చేసిన ఈ ట్వీట్‌పై అరబ్ దేశాలకు చెందిన పలువురు ప్రముఖులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఒక ప్రజా నాయకుడు స్త్రీలకు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ ప్రశ్నిస్తున్నారు. తేజస్వీ బీజేపీకే కాకుండా మొత్తం దేశ ప్రజల అవమానపడేలా చేశారని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. తేజస్వీ ట్వీట్‌పై కర్ణాటక కాంగ్రెస్ కూడా తీవ్రంగా స్పందించింది. తేజస్వీ సూర్య లాంటి చేసే చెత్త కామెంట్లపై బీజేపీ చర్యలు తీసుకోదని కాంగ్రెస్ నేత శ్రీవత్స ఆరోపించారు. దీని వెనక ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా ప్రోత్సహం ఉందని మండిపడ్డారు. దీనివల్ల ఇబ్బందులు పడేది మాత్రం భారతీయులు అని అన్నారు. అయితే ఆ ట్వీట్‌పై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఆయన ఆ ట్వీట్‌ను తొలగించారు. తేజస్వీ ట్వీట్ తొలగించిన తర్వాత కూడా ఆ వివాదం ఆగలేదు. తేజస్వీ చర్యను పిరికి చర్యగా పేర్కొంటూ పలువురు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. -
యాంకర్ తేజస్విని ఆత్మహత్య..
కంకిపాడు (పెనమలూరు) : అనుమానాస్పద స్థితిలో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని ఈడుపుగల్లు ఎంబీఎంఆర్ కాలనీలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గుంటూరు జిల్లాకు చెందిన మట్టపల్లి పవన్‌కుమార్, తేజస్విని (25) ఐదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. రెండేళ్ల క్రితం పెద్దల సమక్షంలో ఘనంగా వివాహ వేడుక జరిపించారు. వీరికి ఒక పాప. కొద్ది కాలంగా ఈడుపుగల్లులోని ఎంబీఎంఆర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. పవన్ కుమార్ ఉయ్యూరులోని బజాజ్ రిలయన్స్‌లో పని చేస్తున్నాడు. తేజస్విని విజయవాడలోని ఓ చానల్లో న్యూస్ రీడర్‌గా పని చేశారు. ఇటీవల పవన్‌కుమార్ షిర్డీ వెళ్లాడు. శనివారం సాయంత్రం తేజస్వినికి, అత్త అన్నపూర్ణాదేవికి మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకున్న తేజస్విని సాయంత్రం అయినా తీయలేదు. విషయం తెలుసుకున్న పోలీసులు ఇంటి కిటికీలో నుంచి చూడగా గదిలోని ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని ఉండటాన్ని గుర్తించారు. తలుపులు పగలకొట్టి లోనికి వెళ్లిన పోలీసులు తేజస్విని మృతి చెందినట్లు నిర్ధారించుకుని వివరాలు సేకరించారు. తేజస్విని స్నేహితురాలి ద్వారా గుంటూరు జిల్లా నరసరావుపేటలోని ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అర్థరాత్రి సమయంలో వారు ఈడుపుగల్లు చేరుకున్నారు. వారి సమక్షంలో తేజస్విని మృతదేహాన్ని కిందికి దించి పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సీఐ కె. శివాజీ ఘటనా స్థలాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. 174వ సెక్షన్ కింద అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
హీరోలు అనుకుంటున్నారు కొడుకులు!
అమ్మాయిని బస్సులో ముట్టుకుంటేనే భయంతో ఆ అమ్మాయి మళ్లీ బస్సెక్కడానికి కొన్ని రోజులు పడుతుంది. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతుర్ని మనమే ఒక మాట అనం. ఈ దరిద్రులు.. ఆమె ప్రయాణిస్తున్న ప్రతిచోటా వెంబడిస్తూనే ఉన్నారు! ఛేజ్ చేస్తూనే ఉన్నారు! బస్సు కొంత నయం... నలుగురూ ఉంటారు. ఒంటరిగా టూ వీలర్ మీదో, కారులోనో వెళుతూ అమ్మాయి కనిపిస్తే ఇక ఈ నీచులకు అడ్డూ ఆపూ ఉంటుందా? ‘ఇది తప్పురా’ అని.. ఇంట్లో వాళ్ల అమ్మ చెప్పదా? లేక.. ‘ఆంబోతులా తిరుగురా’ అని వాళ్ల నాన్న చెప్పాడా? కొవ్వుతో కలిగిన బలుపుతో కలిసిన ఈ మదాంధుల్ని చెప్పుతో కొడితే లాభం లేదు. చట్టమే వీళ్లను తన చెప్పుచేతల్లోకి తీసుకుని కొత్త మార్గంలో నడిపించేలా చేయాలి. సినిమాలు చూసో.. వాళ్ల నాయన పలుకుబడిని చూసో.. హీరోలు అనుకుంటున్నారు కొడుకులు!! వీరేందర్ సింగ్ కుందు, ఐ.ఎ.ఎస్. రాష్ట్ర ప్రభుత్వ అదనపు కార్యదర్శి టూరిజం డిపార్ట్మెంట్ – హర్యానా ఐ.ఎ.ఎస్.లు ఎవరూ సాధారణంగా ప్రజలను ఉద్దేశించి బహిరంగ లేఖలు రాయరు. కానీ వీరేందర్ సింగ్ కుందు 2017 ఆగస్టు 6 ఆదివారం ఫేస్బుక్లో ఒక లేఖను పోస్ట్ చేశారు! అయితే ఆ లేఖను ఆయన ఒక ఐ.ఎ.ఎస్. అధికారిగా రాయలేదు. ఒక సగటు ఆడపిల్ల తండ్రిగా రాశారు. ‘నిన్న అర్ధరాత్రి నా కూతురు వర్ణికకు ఒక భయానకమైన అనుభవం ఎదురైంది. డ్యూటీ ముగించుకుని ఆమె తన కారులో ఇంటికి వస్తుండగా, ఇద్దరు గూండాలు టాటా సఫారీలో ఆమెను వెంబడించారు. నా కూతురు గుండె నిబ్బరంతో వారి నుంచి వేగంగా తప్పించుకుని, కారును వేగంగా డ్రైవ్ చూస్తూనే పోలీసులకు ఫోన్ చేసింది. ఆ తర్వాత కూడా వాళ్లు ఆమె దారిని పదే పదే అడ్డగించారు. కొన్ని కిలోమీటర్ల్ల దూరం వరకు అలా చేశారు. ఒకచోటైతే వాళ్లలో ఒకడు టాటా సఫారీలోంచి దూకేసి, నా కూతురి కారులోకి దూరే ప్రయత్నం చేశాడు. ఈ లోపు పోలీస్‌లు రావడంతో వారు పారిపోయారు. మా అమ్మాయి ధైర్యంగా అయితే తప్పించుకోగలిగింది కానీ, ఆ భయం నుంచి ఇంకా తేరుకోలేదు. అందుకు ఇంకా కొంత సమయం పట్టేలా ఉంది. ఇద్దరు కూతుళ్ల తండ్రిగా నేనీ విషయాన్ని ఇక్కడితో వదిలిపెట్టాలని అనుకోవడం లేదు. ఇదంతా మీకు చెప్పడానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి : ఇదీ వాస్తవంగా జరిగింది అని చెప్పడం. రెండు.. ఒకవేళ అవసరమైతే మద్దతు కూడగట్టుకోవడం కోసం. ఈ పోరాటాన్ని నేను ఆపదలచుకోలేదు. దోషులకు శిక్ష పడకపోతే ఇంకా ఎంతోమంది కూతుళ్లకు ఈ దుస్థితి రావచ్చు. వాళ్లందరూ నా కూతురంత అదృష్టవంతులు కాకపోవచ్చు. అలాంటి వారి కోసం ఎవరో ఒకరు నిలబడాలి. నేను నిలబడుతున్నాను. నిలబడగలిగినంత కాలం నిలబడతాను.’ ఇదీ వీరేందర్ సింగ్ కుందు రాసిన లేఖ. సోషల్ మీడియాలో ఈ లేఖ చదివిన వాళ్లంతా ఆ గూండాలపై విరుచుకు పడ్డారు. కానీ రణవీర్ భట్టీ అనే వ్యక్తి మాత్రం వీరేందర్ సింగ్ మీద విరుచుకు పడ్డాడు! రణవీర్ భట్టి హర్యానా బీజేపీ ఉపాధ్యక్షుడు! ‘‘అసలు అంత రాత్రప్పుడు ఆ పిల్లకు రోడ్ల మీద ఏం పని?’’ అన్నది రణవీర్ భట్టీ ప్రశ్న. ఆయన ప్రశ్నకు సమాధానం కాదు కానీ.. వర్ణిక.. డిస్క్ జాకీ. ఆ వేళప్పుడే ఆమె డ్యూటీ అయిపోతుంది. రోజూ ఆ వేళప్పుడే ఆమె తన కారులో ఇంటికి బయల్దేరుతుంది. ఆమె రోజూ వెళ్లొచ్చే రోడ్డు ఒకటే. కానీ ఆ గూండాల కారణంగా ఆ రోజు రాత్రి ఆమె రోడ్లన్నిటి మీదా పరుగులు తీయాల్సి వచ్చింది.. వాళ్ల నుంచి ఎస్కేప్ అవడానికి. ఆ రోజు వర్ణికను కిడ్నాప్ చేసేందుకు వేట కుక్కల్లా వెంటపడిన ఆ ఇద్దరు ఆగంతకులలో ఒకడు వికాస్ బరాలా. హర్యానా బీజేపీ చీఫ్ సుభాష్ బరాలా కొడుకు. ఇంకొడు వికాస్ స్నేహితుడు అశీష్ కుమార్. మొదట వికాస్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు వి.ఐ.పి. కొడుకని తెలిసి వదిలేశారు. తర్వాత వర్ణిక, ఆమె తండ్రి ఫేస్బుక్లో పోస్టులు పెట్టడం, మీడియా ఒత్తిడి తేవడంతో వికాస్‌ను అరెస్ట్ చేశారు. ఆ వెంటనే వికాస్ తండ్రి పార్టీలో తన పదవికి రాజీనామా చేశాడు. ప్రస్తుతం వర్ణిక కేసు విచారణ జరుగుతోంది. ఈ సందర్భంగా.. గతంలో విఐపీ పుత్రరత్నాలు చేసిన కొన్ని ఘనకార్యాలను ఒకసారి చూద్దాం. మార్చి 2016 సుశీల్ కుమార్ సన్నాఫ్ రావెల కిషోర్ సుశీల్ మంత్రిగారి అబ్బాయి. నాన్నగారు సోషల్ వెల్ఫేర్ మినిస్టర్. బంజారా హిల్స్‌లో నడుచుకుంటూ వెళుతున్న ఒక మహిళా టీచర్‌ను సుశీల్ కారులో వెంబడించారు. ఆమె గట్టిగా కేకలు వేయడంతో నలుగురూ గుమికూడారు. పోలీసులు బాధితురాలి కంప్లైంట్ తీసుకున్నారు. సుశీల్‌పై ఐ.పి.సి. సెక్షన్ 354 మోలెస్టేషన్ కేసును నమోదు చేశారు. జూన్ 2015 రితురాజ్ సన్నాఫ్ ప్రణతి ఫుకాన్ ప్రణతి ఫుకాన్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే. చేనేత, జౌళి ఉత్పతులు, సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి. ఆమె ఉండడం అస్సాంలో. తనయుడు రితురాజ్ ఉండడం బెంగళూరులో. ఫ్రెండ్స్‌తో కలిసి ఏదో బిజినెస్ చేస్తున్నాడు. పదేళ్ల బాలికను రేప్ చేసి, ఆ చిన్నారి మరణానికి కారణం అయ్యాడన్న ఫిర్యాదుపై సంజయ్ నగర్ పోలీసులు రితురాజ్పై కేసు ఫైల్ చేశారు. బాలిక తల్లి వీళ్ల దగ్గరే ఆఫీస్ అసిస్టెంట్‌గా పని చేస్తుంటుంది. అయితే విషయాన్ని పై అధికారులు బైటకు పొక్కనీయలేదు. మంత్రి గారి కొడుకును, అతడి స్నేహితులను తప్పించే ప్రయత్నాలు జరిగాయి. జూలై 2014 సురేశ్ బదానా సన్నాఫ్ హేమ్‌సింగ్ బదానా హేమ్‌సింగ్ రాజస్థాన్ పౌర సరఫరాల శాఖ మంత్రి. ఆయన సుపుత్రుడు సురేశ్ అల్వార్‌లోని షాలిమార్ కాలనీలోకి.. కోళ్ల గంపలోకి దూరిన పిల్లిలా.. దూరాడు. ఒక యువతిని అసభ్యంగా కామెంట్ చేశాడు. నలుగురూ పట్టుకుని తన్నబోతే కాలనీలోని 308 క్వార్టర్లోకి దూరి తలుపేసుకున్నాడు. అది నాన్నగారికి ప్రభుత్వం కేటాయించిన క్వార్టరే. ఎవరొచ్చి తలుపు తట్టినా తియ్యలేదు. అర్ధరాత్రెప్పుడో బాల్కనీ లోంచి గోడ దూకి తప్పించుకున్నాడు. పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. జూన్ 2013 ఆదర్శ్ సన్నాఫ్ జోస్ తెట్టాయిల్ అప్పటికి లె ట్టాయిల్ కేరళ అపోజిషన్ లీడర్. ఎల్.డి.ఎఫ్. పార్టీ నాయకుడు. అంతకు ముందు రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి. ఆయన నియోజకవర్గం అంగమల్లి. అక్కడి ఓ యువతి ఈ తండ్రీ కొడుకులిద్దరూ తనను లైంగికంగా వేధించారని కేసు పెట్టింది. ‘అబ్బే.. అలాంటిదేమీ లేదు. నా వెనుక పెద్ద రాజకీయ కుట్ర జరుగుతోంది’ అని తప్పించుకోబోయాడు. విశేషం ఏంటంటే.. ఈ కేసులో తండ్రే ప్రధాన నిందితుడు. కొడుకు రెండో నిందితుడు. జూలై 2011 రోహిత్ సన్నాఫ్ అటనేషియో మాన్సెరెట్ మాన్సెరెట్ గోవా విద్యాశాఖ మంత్రి. గోవాలో ఉంటున్న ఒక జర్మన్ మైనర్ బాలికను రేప్ చేసిన కేసులో 2008 నవంబరులో రోహిత్‌ను అరెస్ట్ చేశారు. ఆ అమ్మాయికి అసభ్యకరమైన మెజేస్‌లు కూడా అతడు పంపించినట్లు రూడీ అయింది. అయితే మాన్సెరెట్ తన పలుకుబడితో కొడుక్కి శిక్ష పడకుండా కాపాడుకుంటూ వచ్చాడు. కేసు నాలుగేళ్లు నడిచింది. చివరికి కోర్టు రోహిత్‌ను నిర్దోషిగా వదిలిపెట్టింది. జనవరి 2008 తేజస్వీ, తేజ్ ప్రతాప్.. సన్స్ ఆఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు ఢిల్లీలో జరిగింది ఈ ఘటన. న్యూ ఇయర్ వేడుకల్లో ఆయన ఇద్దరు కుమారులు కన్నూమిన్నూ కానకుండా అమ్మాయిల్నీ వేధించారు. గుర్తు తెలియని యువకులు వారికి దేహశుద్ధి చేశారు. ఈ తోపులాటలో తేజస్వి, తేజ్ ప్రతాప్‌ల గన్‌మెన్ తుపాకీని ఎవరో లాక్కున్నారు. దానిపై కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్లినప్పుడు వీళ్ల భాగోతం అంతా బయటపడింది. ముందు అశోకా హోటల్ దగ్గర కొందరు ఆడపిల్లల్ని ఏడిపించారు. తర్వాత కన్నాట్ ప్లేస్‌లో టీజ్ చేశారు. ఢిల్లీ–హర్యానా బార్డర్‌లోని ఛతార్పూర్లో పార్టీ ఉంటే, అక్కడికి వెళ్లి తిరిగి వచ్చేటప్పుడు మెహ్రాలీ దగ్గర ఫామ్ హౌస్ దగ్గర అమ్మాయిల మీద చెయ్యి వేశారు. అదిగో అప్పుడే ఇద్దర్నీ పట్టుకుని లోకల్ హీరోలు కొట్టేశారు. ముఖాలు వాచిపోయాయి. ప్రథమ చికిత్స కోసం అన్నదమ్ముల్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వీళ్లమీద కేసు మాత్రం నమోదు కాలేదు! ఏడుగురు అక్కచెల్లెళ్లు ఉన్న ఈ ఇద్దరు ప్రబుద్ధులు అమ్మాయిల్ని ఏడిపించడం ఏమిటో! డిసెంబర్ 2007 మిస్టర్ ‘హూ?’ గ్రాండ్ సన్ ఆఫ్ ఎ సీనియర్ లీడర్ దేశంలోని మిగతా కేసుల్లోనైనా ప్రబుద్ధులెవరో, వారి సుపుత్రులెవరో పేర్లు తెలిశాయి కానీ, పదేళ్ల క్రితం ఆంధ్ర ప్రదేశ్‌లోని విజయవాడలో జరిగిన ఆయేషా హత్య కేసులో దోషులెవరో ఇంతవరకు తేల్లేదు. ప్రస్తుతం ఈ కేసును సీబీఐ కి ఇవ్వాలా వద్దా అని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఆయేషా హత్యను చేసింది ఓ సీనియర్ కాంగ్రెస్ లీడర్ మనవడు అన్న ఆరోపణలు వచ్చాయి. అయితే సత్యంబాబు అనే యువకుడిని హంతకుడిగా నిర్థారించి, పదేళ్ల జైలు శిక్ష తర్వాత నిర్దోషిగా ఈ ఏడాదే విడుదల చేశారు. ఇన్నేళ్లలోనూ అసలు నేరస్థుడు దొరకలేదంటే.. వెనుక వీఐపీల ప్రెజర్ ఉన్నట్లేనని అనుకోవాల్సి వస్తోంది. లైంగిక వేధింపులకు పాల్పడుతున్న వి.ఐ.పి.ల పుత్రరత్నాలు తమ తండ్రుల పలుకుబడితో కేసుల నుండి, శిక్షల నుండి తప్పించుకుంటున్నారు. ఈ ధోరణి వల్ల సగటు బాధితురాలు న్యాయం కోసం పోరాడే మానసిక స్థయిర్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. -
‘అనుక్షణం’... థ్రిల్
హైదరాబాద్‌లో వరుసగా స్త్రీ హత్యలు జరుగుతుంటాయి. దీని వెనుక హస్తం ఎవరిది? అనే నేరపరిశోధన నేపథ్యంలో సాగే కథాంశంతో విష్ణు హీరోగా రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వం వహించిన చిత్రం ‘అనుక్షణం’. ‘అమ్మాయిలూ జాగ్రత్త’ అనేది ఉపశీర్షిక. తేజస్వీ, మధుశాలినీ ఇందులో కథానాయికలు. అరియానా, వివియానా సమర్పణలో రూపొందిన ఈ చిత్రం ప్రచార చిత్రాలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. చిత్రదర్శక, నిర్మాతలు కొత్తగా ఆలోచించి ఆన్లైన్లో వేలం పాట ద్వారా ఈ చిత్రాన్ని పంపిణీ చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఆ వేలంపాటకు సంబంధించిన వెబ్‌సైట్‌ని ఈ కార్యక్రమంలోనే ప్రారంభించారు. వర్మ మాట్లాడుతూ- ‘‘ఈ సినిమాకు సంబంధించిన పూర్తి సమాచారం ఈ వెబ్సైట్లో ఉంటుంది. ఇదేదో ఒకరిద్దరం తీసుకున్న నిర్ణయం కాదు. దీనివెనుక చాలామంది ఆలోచన ఉంది’’ అని చెప్పారు. ‘‘బ్రహ్మానందం పాత్ర ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుంది. ప్రేక్షకులను థ్రిల్‌కి గురి చేసే సినిమా ఇది. ఆగస్ట్ 15న సినిమాను విడుదల చేస్తాం’’ అని విష్ణు తెలిపారు. ఈ చిత్రానికి నిర్మాతలు: విజయ్, గజేంద్రనాయుడు, పార్థసారధి. -
ఐస్‌క్రీమ్‌ది కీలక పాత్ర!
‘‘సాంకేతికంగా సినిమా ఎంత గొప్పగా ఉన్నా కథా కథనాలు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండాలి. అప్పుడే సినిమా విజయం సాధిస్తుంది. కథా కథనాల్ని గొప్పగా చూపించడానికి టెక్నాలజీ ఉపయోగపడుతుంది’’ అని రామ్‌గోపాల్ వర్మ చెప్పారు. నవదీప్, తేజశ్వి జంటగా ఆయన దర్శకత్వంలో తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్న చిత్రం ‘ఐస్‌క్రీమ్’. ఈ చిత్రం ప్రచార చిత్రాలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా రామ్‌గోపాల్ వర్మ మాట్లాడుతూ -‘‘ఓ టీజర్‌ని ఫ్లోకేమ్ టెక్నాలజీతో తీశాం. భవిష్యత్తులో ఈ టెక్నాలజీ భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఓ కొత్త విప్లవం తీసుకొస్తుంది. నేనిప్పటివరకు తీసిన అన్ని చిత్రాలకన్నా ‘ఐస్‌క్రీమ్’ భిన్నంగా ఉంటుంది. కథలో ఐస్‌క్రీమ్‌కి కీలక పాత్ర ఉంది కాబట్టే, దాన్నే టైటిల్‌గా పెట్టాం’’ అని చెప్పారు. రామసత్యనారాయణ మాట్లాడుతూ- ‘‘అప్పట్లో ‘శివ’ సినిమా చూసినప్పుడు ఒక్కసారైనా వర్మతో ఫొటో దిగాలనుకున్నాను. కానీ, ఏకంగా ఆయనతో సినిమా నిర్మించే అవకాశం వచ్చింది. ఈ చిత్రం సంచలన విజయం సాధిస్తుంది’’ అన్నారు. వర్మ దర్శకత్వంలో సినిమా చేయడం తమ అదృష్టమని నవదీప్, తేజశ్వి చెప్పారు.