ఐస్‌క్రీమ్‌ది కీలక పాత్ర! | 'Ice Cream' is very different from my previous films : RGV | Sakshi
Sakshi News home page

ఐస్‌క్రీమ్‌ది కీలక పాత్ర!

Published Thu, Jun 19 2014 10:49 PM | Last Updated on Sat, Sep 2 2017 9:04 AM

ఐస్‌క్రీమ్‌ది కీలక పాత్ర!

ఐస్‌క్రీమ్‌ది కీలక పాత్ర!

 ‘‘సాంకేతికంగా సినిమా ఎంత గొప్పగా ఉన్నా కథా కథనాలు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండాలి. అప్పుడే సినిమా విజయం సాధిస్తుంది. కథా కథనాల్ని గొప్పగా చూపించడానికి టెక్నాలజీ ఉపయోగపడుతుంది’’ అని రామ్‌గోపాల్ వర్మ చెప్పారు. నవదీప్, తేజశ్వి జంటగా ఆయన దర్శకత్వంలో తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్న చిత్రం ‘ఐస్‌క్రీమ్’. ఈ చిత్రం ప్రచార చిత్రాలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా రామ్‌గోపాల్ వర్మ మాట్లాడుతూ -‘‘ఓ టీజర్‌ని ఫ్లోకేమ్ టెక్నాలజీతో తీశాం. భవిష్యత్తులో ఈ టెక్నాలజీ భారతీయ చలనచిత్ర  పరిశ్రమలో ఓ కొత్త విప్లవం తీసుకొస్తుంది.
 
  నేనిప్పటివరకు తీసిన అన్ని చిత్రాలకన్నా ‘ఐస్‌క్రీమ్’ భిన్నంగా ఉంటుంది. కథలో ఐస్‌క్రీమ్‌కి కీలక పాత్ర ఉంది కాబట్టే, దాన్నే టైటిల్‌గా పెట్టాం’’ అని చెప్పారు. రామసత్యనారాయణ మాట్లాడుతూ- ‘‘అప్పట్లో ‘శివ’ సినిమా చూసినప్పుడు ఒక్కసారైనా వర్మతో ఫొటో దిగాలనుకున్నాను. కానీ, ఏకంగా ఆయనతో సినిమా నిర్మించే అవకాశం వచ్చింది. ఈ చిత్రం సంచలన విజయం సాధిస్తుంది’’ అన్నారు. వర్మ దర్శకత్వంలో సినిమా చేయడం తమ అదృష్టమని నవదీప్, తేజశ్వి చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement