‘అనుక్షణం’... థ్రిల్ | Ram Gopal Varma to auction rights for new film online | Sakshi
Sakshi News home page

‘అనుక్షణం’... థ్రిల్

Published Sun, Aug 3 2014 12:11 AM | Last Updated on Sat, Sep 2 2017 11:17 AM

‘అనుక్షణం’... థ్రిల్

‘అనుక్షణం’... థ్రిల్

 హైదరాబాద్‌లో వరుసగా స్త్రీ హత్యలు జరుగుతుంటాయి. దీని వెనుక హస్తం ఎవరిది? అనే నేరపరిశోధన నేపథ్యంలో సాగే కథాంశంతో విష్ణు హీరోగా రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వం వహించిన చిత్రం ‘అనుక్షణం’. ‘అమ్మాయిలూ జాగ్రత్త’ అనేది ఉపశీర్షిక. తేజస్వీ, మధుశాలినీ ఇందులో కథానాయికలు. అరియానా, వివియానా సమర్పణలో రూపొందిన ఈ చిత్రం ప్రచార చిత్రాలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. చిత్రదర్శక, నిర్మాతలు కొత్తగా ఆలోచించి ఆన్‌లైన్‌లో వేలం పాట ద్వారా ఈ చిత్రాన్ని పంపిణీ చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.
 
  ఆ వేలంపాటకు సంబంధించిన వెబ్‌సైట్‌ని ఈ కార్యక్రమంలోనే ప్రారంభించారు. వర్మ మాట్లాడుతూ- ‘‘ఈ సినిమాకు సంబంధించిన పూర్తి సమాచారం ఈ వెబ్‌సైట్‌లో ఉంటుంది. ఇదేదో ఒకరిద్దరం తీసుకున్న నిర్ణయం కాదు. దీనివెనుక చాలామంది ఆలోచన ఉంది’’ అని చెప్పారు. ‘‘బ్రహ్మానందం పాత్ర ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుంది. ప్రేక్షకులను థ్రిల్‌కి గురి చేసే సినిమా ఇది. ఆగస్ట్ 15న సినిమాను విడుదల చేస్తాం’’ అని విష్ణు తెలిపారు. ఈ చిత్రానికి నిర్మాతలు: విజయ్, గజేంద్రనాయుడు, పార్థసారధి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement