అందుకే.. అతనికి నేను బానిసను : మోహన్‌బాబు
‘‘సినిమా తప్ప మరొకటి తెలియని వ్యక్తి రామ్‌గోపాల్‌వర్మ. అతని సమయపాలన, క్రమశిక్షణ చూసి నేను ఫిదా అయిపోయాను. అతనికి బానిసనై పోయాను. ఎంతో మంది మహామహుల దగ్గర నేను పనిచేశాను. కానీ వర్మ దగ్గర పనిచేసింది ఒకే ఒక్క సినిమా. ఆ ఒక్క సినిమాకే నా అభిమాన దర్శకుడయ్యాడు. అందుకే అతను నా డార్లింగ్’’ అని డా.మోహన్‌బాబు అన్నారు. విష్ణు కథానాయకునిగా రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వంలో ఆర్.విజయ్‌కుమార్, గజేంద్రనాయుడు, పార్థసారధి నాయుడు నిర్మించిన చిత్రం ‘అనుక్షణం’.
‘అమ్మాయిలూ జాగ్రత్త’ ఉపశీర్షిక. ఈ చిత్రం ప్రచార చిత్రాలను మంగళవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. మోహన్‌బాబు మాట్లాడుతూ -‘‘సినిమా లాభాల్లో నలుగురికే కాకుండా... వందలాది మందిని భాగస్తుల్ని చేయాలనే వర్మ ఆలోచన గొప్పది. నేనూ, పరుచూరి గోపాలకృష్ణ కలిసి రష్ చూశాం. ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తించాడు వర్మ’’ అని చెప్పారు. రామ్‌గోపాల్‌వర్మ చెబుతూ -‘‘ వేలం పాట ద్వారా బిజినెస్ అనే ఆలోచనను ముందు విష్ణుకు చెప్పాను. అతను మౌనంగా ఉండిపోయాడు. ‘స్వతహాగా నిర్మాత అయిన విష్ణు ఇంత రిస్క్ ఎందుకు చేస్తాడు’ అనుకున్నాను.
అయితే... రెండు గంటల్లో విష్ణు దగ్గర్నుంచి ఫోన్ వచ్చింది. ‘ఇమ్మీడియట్‌గా ఈ బిజినెస్ చేద్దాం. నాన్నగారికి విపరీతంగా నచ్చింది’ అన్నాడు. విష్ణు ఆలోచనాపరుడు. టెక్నికల్‌గా కూడా చాలా పట్టున్న వ్యక్తి’’ అని తెలిపారు. విష్ణు మాట్లాడుతూ -‘‘ఇప్పటివరకూ ఈ వేలంలో అయిదొందల మంది పాల్గొన్నారు. వారిలో చాలామంది ఎన్నారైలు కూడా ఉన్నారు. అనుకున్న దానికంటే... ఎన్నో రెట్ల స్పందన వచ్చింది’’ అన్నారు. పరుచూరి గోపాలకృష్ణ, మధుశాలిని కూడా మాట్లాడారు.