‘నా ప్రియమైన స్నేహితుడు గర్వపడుతున్నాడు’ | Mohan babu tweet on rangasthalam movie | Sakshi
Sakshi News home page

‘నా ప్రియమైన స్నేహితుడు గర్వపడుతున్నాడు’

Published Tue, Apr 3 2018 4:33 PM | Last Updated on Tue, Apr 3 2018 4:34 PM

Mohan babu tweet on rangasthalam movie - Sakshi

మెగా పవర్‌ స్టార్ రామ్‌ చరణ్‌ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్‌ హిట్ సినిమా రంగస్థలం. గత శుక్రవారం రిలీజ్‌ అయిన ఈ సినిమా తొలి రోజు నుంచే హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్‌ సీస్‌లోనూ రికార్డ్ కలెక్షన్లు సాధిస్తున్న ఈ సినిమా ప్రపంచ వ్యాప‍్తంగా వందకోట్ల గ్రాస్‌ను సాధించి సత్తా చాటింది. చరణ్ కెరీర్‌ లోనే బిగ్గెస్ట్‌ హిట్స్‌ లో ఒకటిగా నిలిచింది. చిట్టిబాబుగా అద్భుతమైన నటన కనబరిచిన రాంచరణ్‌కు టాలీవుడ్ ప్రముఖల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. తాజాగా రంగస్థలంపై నటుడు మోహన్ బాబు ట్విట్టర్‌లో కామెంట్స్‌ చేశారు.

‘రంగం స్థలం సినిమా గురించి మంచి టాక్ వింటున్నాను. చరణ్, మూవీ యూనిట్‌కు కంగ్రాంట్స్. త్వరలో నేను సినిమా చూస్తాను. కొడుకులు ఎంచుకున్న రంగాల్లో అద్భుతంగా రాణించడం చూసి ఏ తండ్రి అయినా గర్వపడతాడు.. ఇప్పుడు నా ప్రియమైన స్నేహితుడు చిరంజీవి కూడా అంతే గర్వపడుతున్నాడని అనుకుంటున్నా..’  అంటూ ఆయన ట్వీట్ చేశారు. 

అంతేకాకుండా ఈ చిత్రంపై వివాదాస్పద దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ కూడా  తనదైన రీతిలో స్పందించాడు. రంగస్థలం సినిమా చాలా బాగుందని, రాంచరణ్‌ మైండ్‌ బ్లోయింగ్‌, ఫెంటాస్టిక్‌ అని.. హేయ్‌ సుక్కూ నీకు 3 ముద్దులంటూ ఎమోజీలను పోస్ట్‌ చేశాడు వర్మ.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement