Madhu Shalini
-
చిరు, పవన్ సినిమాల్లో ఛాన్స్.. కానీ బ్యాడ్ లక్.. ఈ నటిని గుర్తుపట్టారా? (ఫొటోలు)
-
సైలెంట్‌గా తమిళ హీరోను పెళ్లాడిన తెలుగు హీరోయిన్..
Actress Madhu Shalini Married To Tamil Hero Gokul Anand In Hyderabad: ఇటీవలే ప్రముఖ డైరెక్టర్ విఘ్నేష్ శివన్‌ను పెళ్లి చేసుకుని ఓ ఇంటి కోడలైంది లేడీ సూపర్ స్టార్ నయన తార. తాజాగా మరో హీరోయిన్ పెళ్లి పుస్తకాన్ని తెరిచింది. సైలెంట్‌గా వివాహం చేసుకుని అభిమానులుక సర్ప్రైజ్ ఇచ్చింది. ఆమె ఎవరో కాదు. ఇటీవల '9 అవర్స్' వెబ్ సిరీస్‌తో అలరించిన మధు శాలిని. తమిళ హీరో గోకుల్ ఆనంద్‌తో మధు శాలిని వివాహం గురువారం (జూన్ 16) హైదరాబాద్‌లో జరిగింది. ఈ వివాహ వేడుకకు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. తమ వివాహ వేడుక గురించి సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. తమిళ సినిమా పంచాక్షరంలో మధు శాలిని, గోకుల్ నటించారు. ఈ మూవీ టైమ్‌లోనే ఇద్దరి మధ్య చిగురించిన స్నేహ్నం.. ప్రేమగా, తర్వాత వివాహం బంధంగా మారిందని సమచారం. అల్లరి నరేష్ హీరోగా నటించిన కితకితలు సినిమాలో రెండో హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది తెలుగు అందం మధు శాలిని. తర్వాత ఒక విచిత్రం, అగంతకుడు, కింగ్ (ఓ సాంగ్), వాడు-వీడు, గోపాల గోపాల వంటి తదితర చిత్రాల్లో నటించింది. అలాగే గోకుల్ అరడజను తమిళ సినిమాల్లో, వెబ్ సిరీస్‌ల్లో నటించాడు. చదవండి: కాలేజ్‌లో డ్యాన్స్ చేసిన సాయి పల్లవి.. వీడియో వైరల్.. డేటింగ్ సైట్లో తల్లి పేరు ఉంచిన కూతురు.. అసభ్యకరంగా మెసేజ్‌లు బిజినెస్‌మేన్ కిడ్నాపర్‌గా మారితే.. Thank you for all the love we’ve received. We look forward to the new chapter of our lives with hope and gratitude in our hearts. Love MADHU SHALINI & GOKUL ♥️ pic.twitter.com/6YLREAZo8L — MADHU SHALINI (@iamMadhuShalini) June 17, 2022 -
ముగ్గురు ఖైదీలు, మూడు దొంగతనాలు.. '9 అవర్స్' రివ్యూ
టైటిల్: 9 అవర్స్ (వెబ్ సిరీస్) నటీనటులు: తారక రత్న, మధుశాలిని, అజయ్, రవిప్రకాశ్, వినోద్ కుమార్, బెనర్జీ, సమీర్ తదితరులు మూల కథ: మల్లాది కృష్ణమూర్తి 'తొమ్మిది గంటలు' నవల సమర్పణ, స్క్రీన్‌ప్లే: క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం: నిరంజన్ కౌషిక్, జాకబ్ వర్గీస్ సంగీతం: శక్తికాంత్ కార్తీక్ సినిమాటోగ్రఫీ: మనోజ్ రెడ్డి విడుదల తేది: జూన్ 2, 2022 (డిస్లీ ప్లస్ హాట్‌స్టార్) ప్రముఖ రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి రాసిన 'తొమ్మిది గంటలు' నవల ఆధారంగా తెరకెక్కిన వెబ్ సిరీస్ '9 అవర్స్'. ఈ వెబ్ సిరీస్‌కు క్రిష్ స్క్రీన్‌ప్లే అందించగా, నిరంజన్ కౌషిక్, జాకబ్ వర్గీస్ దర్శకత్వం వహించారు. చాలా గ్యాప్ తర్వాత తారక రత్న ఈ వెబ్ సిరీస్‌తో ఓటీటీ ఎంట్రీ ఇచ్చాడు. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ స్పెషల్స్‌గా వచ్చిన ఈ వెబ్ సిరీస్‌ను క్రిష్ తండ్రి జాగర్లమూడి సాయిబాబు, రాజీవ్ రెడ్డి నిర్మించారు. హాట్‌స్టార్‌లో జూన్ 2 నుంచి స్ట్రీమింగ్ అవుతున్న ఈ '9 అవర్స్' వెబ్ సిరీస్ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. కథ: ఈ వెబ్ సిరీస్ కథ 1985 కాలంలో జరుగుతుంది. ముగ్గురు చొప్పున తొమ్మిది మంది మూడు బ్యాంక్‌లను దొంగతనం చేసేందుకు వెళ్తారు. ఈ మూడు దొంగతనాలకు రాజమండ్రి సెంట్రల్ జైలులోని ముగ్గురు ఖైదీలు ఒక్కో బ్రాంచ్‌కు ప్రాతినిధ్యం వహిస్తారు. అయితే వాటిలో రెండు దొంగతనాలు విజయవంతగా పూర్తి చేస్తారు. కానీ కోఠి బ్రాంచ్‌లో రాబరీ జరుగుతున్నట్లు పోలీసులకు తెలియడంతో దొంగలు చిక్కుల్లో పడతారు. మరీ ఆ దొంగలు పోలీసుల నుంచి ఎలా బయటపడ్డారు ? బంధీలుగా ఉన్న బ్యాంక్ ఉద్యోగులు, కస్టమర్లు తప్పించుకోడానికి ఏం చేశారు ? ఈ దొంగతనాల వెనుక అసలు ఎవరున్నారు ? అనేది తెలియాలంటే కచ్చితంగా ఈ వెబ్ సిరీస్ చూడాల్సిందే. విశ్లేషణ: 1985లో జరుగుతున్న దొంగతనం బ్యాక్‌డ్రాప్‌కు తగినట్లుగా సినిమాటోగ్రఫీ బాగుంది. ఒకేసారి మూడు చోట్ల మూడు దొంగతనాలు జరగడం అనే అంశం ఆసక్తిగా ఉంటుంది. జైలు నుంచి వెళ్లిన ఖైదీలు 9 గంటల్లో మూడు రాబరీలు చేసుకుని మళ్లీ జైలుకు రావాలి. అయితే ఈ 9 గంటలను 9 ఎపిసోడ్స్‌గా మలిచారు. ఒకేసారి మూడు రాబరీలు చేయాలన్న కాన్సెప్ట్ బాగున్నా సిరీస్ ప్రారంభం ఎపిసోడ్స్ కొంచెం బోరింగ్‌గా ఉంటాయి. బ్యాంకు ఉద్యోగులు, దొంగతనానికి వచ్చిన వారి జీవిత కథలు ఒక్కో ఎపిసోడ్లో చూపించారు. అవి అక్కడక్కడ సాగదీతగా అనిపిస్తాయి. భర్త చనిపోతే వితంతు పరిస్థితి ఎలా ఉంటుంది ? భార్యభర్తల బంధం తదితర అంశాలను ఆకట్టుకునేలా చూపించారు. అప్పడప్పుడు వచ్చే ట్విస్ట్‌లు చాలా ఆకట్టుకుంటాయి. బంధీలుగా ఉన్న ఉద్యోగులు బయటపడే మార్గాలు, పోలీసుల అంచనాలను పటాపంచలు చేసే దొంగల తెలివి చాలా బాగా చూపించారు. ఈ సీన్లు బాగా ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇంట్రెస్టింగ్గా సాగుతున్న కథనంలో అక్కడక్కడా వచ్చే కామెడీ సీన్లు కావాలని జొప్పించినట్లే ఉంటాయి. సిరీస్‌లో అనేక అంశాలను టచ్ చేశారు. అందుకే కథనం చాలా స్లోగా అనిపిస్తుంది. అక్కడక్కడ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగుంది. టైటిల్ 9 అవర్స్ కాబట్టి ఎపిసోడ్లను కూడా 9గా చేశారు. అదే మైనస్ అయింది. అలా కాకుండా 5 ఎపిసోడ్స్‌లో సిరీస్ ముగిస్తే సూపర్ థ్రిల్లింగ్‌గా ఉండేది. ఎవరెలా చేశారంటే? చాలా కాలం తర్వాత తారక రత్నకు మంచి పాత్రే దొరికందని చెప్పవచ్చు. కానీ ఆ పాత్ర హైలెట్‌గా నిలిచే సన్నివేశాలు ఎక్కడా లేవు. జర్నలిస్ట్‌గా మధుశాలిని పాత్ర కూడా అంతంతమాత్రమే. కానీ రాబరీలో బంధీలుగా ఉన్న పాత్రధారులు ఆకట్టుకున్నారు. దొంగతనంలో కూడా తన కామవాంఛ తీర్చుకునే సహోద్యోగి పాత్రలో గిరిధర్ మెప్పించాడు. అజయ్, వినోద్ కుమార్, బెనర్జీ, ప్రీతి అస్రానీ, సమీర్, అంకిత్ కొయ్య, రవివర్మ, జ్వాల కోటి, రవిప్రకాష్ వారి నటనతో బాగానే ఆకట్టుకున్నారు. ఒక్కొక్క అంశాన్ని, జీవిత కథలను చెప్పే కథనం స్లోగా సాగిన మలుపులు, రాబరీ ప్లానింగ్ ఆశ్చర్యపరుస్తాయి. ఓపికతో చూస్తే మంచి డీసెంట్ వెబ్ సిరీస్ ఇది. అయితే ఈ దొంగతనాలు ఎందుకు చేస్తున్నారు అనే తదితర విషయాలపై ముగింపు ఇవ్వలేదు. దీన్ని బట్టి చూస్తే ఈ సిరీస్‌కు సెకండ్ సీజన్ రానున్నట్లు తెలుస్తోంది. -
హీరోయిన్ మధు శాలిని అదిరే స్టిల్స్
-
బిర్యానీ బేబీస్ అర్చన, మధుశాలిని
-
అక్కడ ఆయనను ముద్దు పెట్టుకోవడం అవసరం!
-మధుశాలిని ‘‘ ‘చీకటి రాజ్యం’లో కమల్‌హాసన్ గారితో ముద్దు సీన్లో నటించా. సాధారణంగా ప్రతి సినిమాలో కిస్ అనేది రొమాంటిక్ సీన్లో చూపిస్తుంటారు. కానీ ఈ సినిమాలో అక్కడ కమల్ గారిని ముద్దు పెట్టుకోవడం కథకు అవసరం. ఈ సినిమా చూసిన వాళ్లందరికీ ఆ ముద్దు సీన్ కన్విన్సింగ్‌గా అనిసిస్తుంది’’ అని నటి మధుశాలిని చెప్పారు. ఇటీవల విడుదలైన ‘చీకటి రాజ్యం’లో మధుశాలిని కీలకపాత్ర పోషించారు. ఈ సంద ర్భంగా ఆమె మాట్లాడుతూ -‘‘ కమల్ హాసన్ గారంటే ఇష్టం. ఆయన సినిమాకు ఆడిషన్స్ చేస్తున్నారని తెలిసి వెళ్లాను. వెంటనే ఓకే చెప్పారు. ఆయన దగ్గర చాలా నేర్చుకున్నా. నేను త్వరలో తమిళ, మలయా ళాల్లో సినిమాలు చేయ నున్నా. తెలుగులో మంచి పాత్రల కోసం ఎదురు చూస్తున్నా’’ అని తెలిపారు. -
ఆ అనుభవాలను డైరీలో భద్రంగా దాచుకుంటా
చెన్నై: ప్రముఖ నటుడు, దర్శకుడు కమల్ హాసన్ నిర్మిస్తున్న 'చీకటి రాజ్యం' సినిమాలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న తెలుగు నటి మధుశాలిని ఆనందంలో మునిగి తేలుతోంది. కమల్ హాసన్ అంతటి గొప్పనటుడితో కలిసి నటించడం తనకు చెప్పలేనంత సంతోషంగా ఉందంటూ మురిసిపోతోంది. ఆయనతో కలిసి నటించడం...తన నటనకు మరింత పరిణతి వచ్చిందని చెబుతోంది. తనలోని నటనా కౌశల్యాన్ని బయటకు తేవడానికి ఇదో మంచి అవకాశమని మధుశాలిని తెలిపింది. మొదటిరోజు షూటింగ్లో పాల్గొన్న తాను టెన్షన్‌తో ఉన్న విషయాన్ని కమల్ గమనించి, తనకు చాలా ధైర్యం చెప్పారని మధుశాలిని తెలిపింది. మొదటి రోజు షూటింగ్ అనుభవాన్ని తన డైరీలో రాసుకుంటానంటోంది. ఆ అనుభవాలను చాలా భద్రంగా దాచుకుంటానని, కమల్‌తో కలిసి పనిచేస్తున్న ప్రతిరోజూ కొత్తగా ఉంటోందనీ, ... చాలా విషయాలు నేర్చుకున్నట్లు చెప్పింది. తమిళంలో 'అవన్ ఇవన్' సినిమా తరువాత, తనకు కమల్ సార్ చిత్రంలో మంచి అవకాశం లభించిందని ఆమె గుర్తు చేసుకుంది. బాలనటుడిగా సినీ రంగప్రవేశం చేసి సుదీర్ఘ అనుభవం సాధించినా కమల్ హాసన్‌లో కొంచెం కూడా గర్వం కనిపించలేదని మధుశాలిని పేర్కొంది. ఇప్పటికీ సెట్లో శ్రద్ధగా కూర్చుని, అనుకున్న ఔట్పుట్ వచ్చేదాకా ఆయన కష్టపడతారని చెప్పింది. బాలీవుడ్ లెజెండ్, సూపర్ స్టార్ అమితాబ్‌తో ....రాంగోపాల్ వర్మ 'డిపార్ట్మెంట్'లో నటించినా, కేవలం సెట్లో మాత్రమే బిగ్ బీ నటన చూసి మురిసిపోవడం తప్ప, తమ మధ్య పెద్దగా సీన్లు లేవని తెలిపింది. అయితే చీకటిరాజ్యం సినిమాలో కమల్ సార్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా థ్రిల్లింగ్‌గా ఉందని మురిసిపోతోంది. కాగా తెలుగు, తమిళ భాషల్లో కమల్ హాసన్ నిర్మిస్తున్న సినిమా చీకటి రాజ్యం ఈ దీపావళికి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. రాజేష్ ఎం సెల్వ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, త్రిష, సంపత్ రాజ్ నటిస్తున్నారు. 'స్లీప్‌లెస్ నైట్' అనే ఫ్రెంచ్ థ్రిల్లర్ మూవీని రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.. -
జూలై21 పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు
ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు: వరుణ్ సందేశ్ (నటుడు);మధుశాలిని (నటి) ఈ రోజు పుట్టిన వారి సంవత్సర సంఖ్య 9. ఇది కుజునికి సంబంధించినది కాబట్టి ఈ సంవత్సరం సంపూర్ణత, సంతృప్తి, కార్యసిద్ధికి సంకేతంగా ఉంటుంది. మీ పుట్టిన తేదీ 21 (2=1=3). ఇది దేవ గురువైన బృహస్పతికి సంబంధించినది కాబట్టి స్నేహశీలిగా, మంచి సలహాదారుగా సంఘంలో పేరు వస్తుంది.ఈ సంవత్సరం బృహస్పతి, కుజుల కలయిక వల్ల మీరు చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాలను మంచి ప్లానింగ్‌తో, ధైర్యసాహసాలతో చేసి బాగా అభివృద్ధి సాధిస్తారు. కార్యదక్షులుగా, సమర్థులుగా గుర్తింపు వస్తుంది. రియల్ ఎస్టేట్, మార్కెటింగ్, విద్యారంగం, క్రీడారంగాలలోని వారికి బాగుంటుంది. సంగీతం, లలిత కళలలో ప్రవేశం ఉన్న వారు బాగా రాణిస్తారు. లక్కీ నంబర్స్: 1,3,9; లక్కీ కలర్స్: ఎల్లో, రెడ్, పింక్, సిల్వర్; లక్కీడేస్: ఆది, మంగళ, గురువారాలు. లక్కీ మంత్స్: జనవరి, ఫిబ్రవరి, మే, సెప్టెంబర్, అక్టోబర్; సూచనలు: దక్షిణామూర్తి ఆరాధన, సుబ్రహ్మణ్యేశ్వరునికి అభిషేకం చేయడం, గురువులను, మతపెద్దలను గౌరవించడం మంచిది. అయితే కుజుడి దుష్ర్పభావం వల్ల పదునైన ఆయుధాల వల్లగానీ, వాహనాల వల్లగానీ ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అలాగే దూకుడుగా మాట్లాడటం వల్ల నష్టం జరగవచ్చు. అందువల్ల ఆయా విషయాలలో అప్రమత్తత అవసరం. - డాక్టర్ మహ్మద్ దావూద్ -
ఆ ముద్దుగుమ్మ మధుశాలినే!
చాలా కాలం తరువాత కమలహాసన్ నేరుగా తెలుగులో నటిస్తున్న కొత్త సినిమా ‘చీకటి రాజ్యం’. తెలుగు, తమిళాల్లో (తమిళ టైటిల్ ‘తూంగావనమ్’) ఏకకాలంలో నిర్మాణమవుతున్న ఈ సినిమాలో కమలహాసన్ సరసన త్రిష నటిస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ ప్రారంభమవడాని కన్నా ముందే ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను మీడియా మీట్లో కమలహాసన్ స్వయంగా విడుదల చేశారు. తుపాకీ పట్టుకొని, ముఖం కనిపించని ఒకమ్మాయిని గాఢంగా ముద్దాడుతున్న కమల్ లాంటి ఫోటోలన్నీ ఈ ‘థ్రిల్లర్’ పట్ల ఆసక్తి పెంచాయి. ఇంతకీ ఆ బొమ్మలో ముద్దిస్తున్న అమ్మాయి ఎవరని చర్చ జరిగింది. ఆ నటి ఎవరన్నది చిత్ర యూనిట్ క్లారిటీ ఇవ్వలేదు కానీ, త్రిష కావచ్చేమో అని ఊహాగానాలు రేగాయి. అయితే, ఆ నటి మరెవరో కాదు... మన తెలుగమ్మాయి మధుశాలిని అని తేలింది. కూచిపూడి నర్తకి, ఇ.వి.వి. ‘కితకితలు’ దగ్గర నుంచి ఇటీవలి ‘గోపాల... గోపాల’ దాకా పలు చిత్రాల్లో నటించిన వర్ధమాన కథానాయిక మధుశాలిని ఈ సినిమాతో బంపర్ ఛాన్స్ కొట్టేశారు. తమిళంలో విశాల్, ఆర్యల ‘అవన్ - ఇవన్’లోనూ నటించిన మధుశాలినికి ఇది పెద్ద ఆఫరనే చెప్పాలి. ఈ ముద్దు సీన్ ఫస్ట్‌లుక్‌లో ముఖంగా కనిపించకుండా ఆసక్తి రేపిన ఆమెది ఈ సినిమాలో చాలా కీలకమైన పాత్ర. ఇప్పటికే కొన్ని రోజుల షూటింగ్‌లోనూ ఆమె పాల్గొన్నారు. థ్రిల్లర్ సినిమా కావడంతో అంతకు మించి వివరాలు ఎవరూ వెల్లడించడం లేదు. కమలహాసన్, త్రిష, ప్రకాశ్‌రాజ్, మధుశాలిని తదితర ముఖ్య తారాగణమంతా పాల్గొనగా, ఇప్పటికి దాదాపు పది రోజులుగా హైదరాబాద్ పరిసరాల్లో ఈ చిత్రం షూటింగ్ జరుగుతోంది. ‘‘మరో రెండు, మూడు రోజులు ఇక్కడే షూటింగ్ సాగుతుంది. తరువాయి షెడ్యూల్ చెన్నైలో ప్లాన్ చేస్తున్నాం’’ అని చిత్ర యూనిట్ వర్గాలు వెల్లడించాయి. ఇటీవలే షార్ట్‌ఫిల్మ్ ‘సీతావలోకనం’లో సీతగా అందంగా కనిపించిన మధుశాలినికి ఇటు తెలుగు, అటు తమిళాల్లో వచ్చే ఈ పెద్ద సినిమాతో బ్రేక్ వస్తుందేమో! -
సీతగా మధుశాలిని
‘‘ఈ చిత్రదర్శకుడు తక్కువ మాట్లాడి, ఎక్కువ పని చేస్తాడు. ట్రైలర్ చాలా బాగుంది. సీతగా మధుశాలిని బాగుంది’’ అని ప్రముఖ దర్శకుడు కె.విశ్వనాథ్ అన్నారు. మాదల వేణు దర్శకత్వంలో మధుశాలిని, ప్రగతి, మీనాకుమారి ముఖ్య తారలుగా అడకా వెంకటేశ్ యాదవ్ నిర్మించిన చిత్రం ‘సీతావలోకనం’. ఈ చిత్రం ప్రచార చిత్రాల ఆవిష్కరణ వేడుకలో ముఖ్య అతిథులుగా కె. విశ్వనాథ్, తమ్మారెడ్డి భరద్వాజ్, కొండవీటి జ్యోతిర్మయి పాల్గొన్నారు. సీత పాత్రలో ఒకప్పుడు అంజలీదేవిగారు, ఇటీవల నయనతార అద్భుతంగా ఒదిగిపోయారు. ఈ పాత్రలో మధుశాలిని కూడా బాగుందని భరద్వాజ్ అన్నారు. ఇందులోని సీత పాత్ర గురించి తనతో నిర్మాత చర్చించారని జ్యోతిర్మయి తెలిపారు. సీత అంతర్ముఖాన్ని ఆవిష్కరించే చిత్రం ఇదని దర్శకుడు మాదల వేణు తెలిపారు. వేణు చెప్పిన కథ నచ్చి, ఈ చిత్రం నిర్మించానని నిర్మాత అన్నారు. వేణు తనతో కూచిపూడి నృత్య రూపకం చేయించాలనుకున్నారని, చివరికి ఇంత మంచి చిత్రంలో చక్కని పాత్ర ఇచ్చారని మధుశాలిని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: ఘంటశాల విశ్వనాథ్, కెమెరా: యస్.వి. విశ్వేశ్వర్. -
సినిమా రివ్యూ: అనుక్షణం
భారీ విజయాలు చేజిక్కకపోయినా...తక్కువ బడ్జెట్‌తో ఎక్కువ లాభాలను సొంతం చేసుకుంటున్న రాంగోపాల్ వర్మ తాజాగా మంచు విష్ణుతో కలిసి 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై ‘అనుక్షణం’ చిత్రాన్ని రూపొందించారు. సెప్టెంబర్ 13 తేది శనివారం విడుదలైన 'అనుక్షణం' విజయం, లాభాల్ని దక్కించుకునేలా ఉన్నాయా అనే విషయాన్ని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే. సీతారాం(సూర్య) ఓ సైకో, సీరియల్ కిల్లర్. హైదరాబాద్ నగరంలో వరుస హత్యలతో మహిళ లను భయబ్రాంతులకు గురి చేయడమే కాకుండా.. పోలీసు విభాగానికి సవాల్‌గా మారుతాడు. వరుస హత్యల హంతకుడ్ని పట్టుకోవడం పోలీస్ ఆఫీసర్ గౌతమ్‌కు అగ్నిపరీక్షగా మారుతుంది. సీరియల్ కిల్లర్‌ను గౌతమ్, పోలీసు విభాగం పట్టుకోవడానికి అనుసరించిన వ్యూహాలు ఏంటి? వరుస హత్యలకు ఎలా అడ్డుకట్టవేశారనేది క్లుప్తంగా చిత్ర కథ. సీతారాం పాత్రలో సీరియల్ కిల్లర్‌గా సూర్య నటించడం కంటే .. జీవించాడని చెప్పవచ్చు. సూర్య తన లుక్స్, బిహేవియర్‌తో గుబులు రేపాడు. కొత్త నటుడైనా... నటుడిగా మంచి పరిణతి ప్రదర్శించాడు. ఈ చిత్రంలో కీలక పాత్రను పోషించడం ద్వారా మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు. వరుస హత్యల కేసు దర్యాప్తు, సీరియల్ కిల్లర్ హంతకుడి పట్టుకునే పోలీస్ ఆఫీసర్ గౌతమ్‌గా మంచు విష్ణు నటించాడు. ఓ పోలీస్ ఆఫీసర్ కావాల్సిన ఎక్స్ప్రెషన్స్, లుక్స్, నడక, స్టైల్‌ను పండించడంలో మంచు విష్ణు తన మార్కును చూపించారు. ఓ డిఫెరెంట్ లుక్‌తో విష్ణు ఆకట్టుకున్నాడు. అమెరికాలో వరుస హత్యలపై అధ్యయనం చేసిన రీసెర్చర్‌గా రేవతి కనిపించారు. పోలీసు విభాగానికి సహాయం అందించే పాత్రలో రేవతి తన పాత్ర మేరకు పర్వాలేదనిపించారు. టీవీ యాంకర్‌గా మధు శాలిని, గౌతమ్ భార్య తేజస్వినీలు, నవదీప్, సుజిత్‌లు ఓకే అనిపించారు. సాంకేతిక విభాగాల పనితీరు ఈ చిత్రంలో ఫోటోగ్రఫి, రీరికార్డింగ్లది కీలక పాత్ర. ప్రేక్షకులను ఆక ట్టుకోవడంలో ఈ రెండు విభాగాలు ప్రధాన పాత్ర పోషించాయి. టెంపో, మూడ్, ఆంబియెన్స్ రిఫ్లెక్ట్ చేయడానికి లైటింగ్‌ను చక్కగా వాడుకున్నారు. సాంకేతిక అంశాలను బాలెన్స్ చేస్తూ వర్మ చిత్రీకరించిన తీరు బాగుంది. ఇలాంటి అంశాలతో తెరకెక్కించి విధానంలో వర్మది అందె వేసిన చెయ్యి అనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దర్శకుడి పనితీరు: ఆనందం కోసమే వరుస హత్యలకు పాల్పడే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టాప్ సీరియల్ కిల్లర్ జీవితాలతో స్పూర్తి పొంది ‘అనుక్షణం చిత్రం రూపొందించారనేది స్పష్టంగా అర్ధమవుతుంది. సీరియల్ కిల్లర్ బిహేవియర్‌ను చక్కగా చిత్రీకరించారు. హత్యల నేపథ్యంలో మీడియా తీరును తన స్టైల్ తెరపైనా చూపించారు. ఎప్పటిలాగే టెక్నికల్ అంశాలను తన కావాల్సిన స్టైల్లో వినియోగించుకున్నారు. క్లైమాక్స్‌ను హడావిడిగా ముగించేడం.. కథ, కథనంలో అక్కడక్కడా కొన్ని లోపాలున్నా.. టెక్నికల్ అంశాలతో కవర్ చేశాడంలో వర్మ సఫలమయారు. అయితే గత కొద్ది కాలంగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్న వర్మ చిత్రాల కంటే ’అనుక్షణం’ బాగుంటడం ఆయన అభిమానులకు ఊరట. ఇంట్లో టెలివిజన్‌లో క్రైమ్ ఎపిసోడ్లతో ఆనందించే వీక్షకులకు క్రైమ్, హారర్ అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రం థ్రిల్‌కు గురిచేయడం ఖాయం. -- అనుముల రాజబాబు -
‘అనుక్షణం’... థ్రిల్
హైదరాబాద్‌లో వరుసగా స్త్రీ హత్యలు జరుగుతుంటాయి. దీని వెనుక హస్తం ఎవరిది? అనే నేరపరిశోధన నేపథ్యంలో సాగే కథాంశంతో విష్ణు హీరోగా రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వం వహించిన చిత్రం ‘అనుక్షణం’. ‘అమ్మాయిలూ జాగ్రత్త’ అనేది ఉపశీర్షిక. తేజస్వీ, మధుశాలినీ ఇందులో కథానాయికలు. అరియానా, వివియానా సమర్పణలో రూపొందిన ఈ చిత్రం ప్రచార చిత్రాలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. చిత్రదర్శక, నిర్మాతలు కొత్తగా ఆలోచించి ఆన్లైన్లో వేలం పాట ద్వారా ఈ చిత్రాన్ని పంపిణీ చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఆ వేలంపాటకు సంబంధించిన వెబ్‌సైట్‌ని ఈ కార్యక్రమంలోనే ప్రారంభించారు. వర్మ మాట్లాడుతూ- ‘‘ఈ సినిమాకు సంబంధించిన పూర్తి సమాచారం ఈ వెబ్సైట్లో ఉంటుంది. ఇదేదో ఒకరిద్దరం తీసుకున్న నిర్ణయం కాదు. దీనివెనుక చాలామంది ఆలోచన ఉంది’’ అని చెప్పారు. ‘‘బ్రహ్మానందం పాత్ర ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుంది. ప్రేక్షకులను థ్రిల్‌కి గురి చేసే సినిమా ఇది. ఆగస్ట్ 15న సినిమాను విడుదల చేస్తాం’’ అని విష్ణు తెలిపారు. ఈ చిత్రానికి నిర్మాతలు: విజయ్, గజేంద్రనాయుడు, పార్థసారధి. -
ఆకట్టుకున్న అంధుల కార్ ర్యాలీ
మాదాపూర్, న్యూస్‌లైన్: అంధుల చూపే మార్గంలో కారును నడిపే ప్రక్రియ అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. బ్రెయిలీ లిపి బోర్డు ఆధారంగా కారు ర్యాలీ గమ్యస్థానానికి చేరుకోవడాన్ని అంతా ఆసక్తిగా తిలకించారు. ఆదివారం గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్ వద్ద ఎయిర్‌సెల్ ఆధ్వర్యంలో నిర్వహించిన అంధుల కార్ ర్యాలీని సినీనటి మధుషాలిని ప్రారంభించారు. ఇందులో 50 కార్లు పాల్గొన్నాయి. కారులో అంధునితోపాటు ఓ డ్రైవర్ ఉంటారు. అంధుడు కారు ముందు సీట్లో కూర్చోని బ్రెయిలీ పటం ద్వారా చేసే సూచనల మేరకు డ్రైవర్ కారును నడుపుతూ గమ్యస్థానానికి చేరుకోవడం ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం. సమయం, వేగం, దూరం పద్ధతి ద్వారా ఈ ర్యాలీ 50 కిలోమీటర్ల మేరకు ప్రయాణించనున్నట్లు, విజేతలకు బహుమతి ప్రదానం చేయనున్నట్టు ఎయిర్‌సెల్ రీజినల్ బిజినెస్ హెడ్ (సౌత్) హమీబక్షి తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో భవన నిర్మాణాలు చేపట్టేందుకు అవసరమైన నిధుల సమీకరణకు కోసం ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టినట్టు ఆయన పేర్కొన్నారు. ఇలాంటి ప్రదర్శన చూడలేదు: మధుషాలిని కంటి చూపు లేక ప్రపంచాన్ని చూడలేని వారు తమ ప్రతిభతో కారు ర్యాలీలో పాల్గొని గమ్యస్థానాన్ని చేరడం మరుపురాని అనుభూతిని కలిగించిందని సినీ నటి మధుషాలిని అన్నారు. అంధుల కారు ర్యాలీని తాను ఇప్పటివరకు చూడలేదన్నా రు. ఇలాంటి కార్యక్రమాలు సమాజానికి ఎంతో అసవరమన్నారు. -
వైఎస్ వంటి లీడర్ వస్తేనే.. వ్యవసాయం పండగవుతుంది
వైఎస్సార్ పేరు వింటేనే రైతుల మోముల్లో చిరునవ్వులు వెల్లివిరుస్తాయి. మాదీ వ్యవసాయకుటుంబమే. మా నాన్న ఎప్పుడూ వైఎస్ పాలన గురించే చెబుతుంటారు. రైతు చల్లగా ఉంటేనే దేశం బాగుంటుంది. దేశాభివృద్ధి, సమాజప్రగతి మొదట అన్నదాత నుంచే మొదలవ్వాలి. అలాంటి రైతు సంక్షేమం కోసం పాటుపడే నేతలనే ప్రజలు ఎన్నుకోవాలి. ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటుహక్కును వినియోగించుకోవాలి. ఓటును అమ్ముకుంటే ఐదేళ్లు కష్టాలు పడాలి. నాకు రాజకీయపార్టీలతో సంబంధం లేదు. అయితే వైఎస్‌లాంటి నేతలు పాలకులు కావాలి. ప్రతి ఒక్కరూ ఆలోచించి అలాంటి నేతలకు ఓటెయ్యాలి. - మధుశాలిని, హీరోయిన్ -
పిల్లల కలల్నే పెద్దలూ కనాలి
తల్లి లీగల్ ఎక్స్పర్ట్. తండ్రి వ్యవసాయం. పెద్దబ్బాయ్ బీకాం కంప్యూటర్స్. చిన్నబ్బాయ్ ఎం.ఎస్ అమ్మాయి మధుశాలిని! అదేంటి?! మధుశాలిని అన్నది పేరు కదా, క్వాలిఫికేషన్‌లా చెప్పారు! అవును. పేరే పెద్ద క్వాలిఫికేషన్. మధు ఫైన్ ఆర్ట్స్ చేశారు. కూచిపూడి నేర్చుకున్నారు. బొమ్మలు వేశారు. ఫ్యాషన్ మోడలింగ్ చేశారు. ప్రస్తుతం... తెలిసిందే, సినిమాల్లో నటిస్తున్నారు. తండ్రి మొక్కల పెంపకంలో మునిగిపోయారు కాబట్టి పిల్లల పెంపకమంతా తల్లి రాజకుమారే తీసుకున్నారు. ముఖ్యంగా ఆడపిల్ల పెంపకం! సెట్స్‌లో ఇప్పుడు కూతురికి తోడుగా ఉంటున్నట్లే... బాల్యం నుంచీ ప్రతి అడుగులోనూ తనకు తోడుగా ఉన్నారు రాజకుమారి. ‘‘పిల్లల్ని కంటాం. తర్వాత వారి కెరియర్ గురించి కలలు కంటాం. తప్పు లేదు కానీ, పిల్లల కలలు వేరేగా ఉన్నప్పుడు వారు కోరుకున్నదే చెయ్యనివ్వడం పెద్దల బాధ్యత’’ అంటారు రాజకుమారి. ఆ బాధ్యతను నిర్వర్తించడంలో కూతురికి ఆమె చేసిన దిశానిర్దేశమే ఈవారం ‘లాలిపాఠం’. తల్లిదండ్రులు... పిల్లల కెరీర్‌ను మలచగలరు కానీ నిర్ణయించలేరు అంటారు సినీనటి మధుశాలిని తల్లి రాజకుమారి. ‘‘మాకు ఫలానా ప్రొఫెషన్ ఇష్టం కాబట్టి ఆ కోర్సునే చదవండి అని ఒత్తిడి చేయడం వల్ల ప్రయోజనం ఉండదు. మా అమ్మాయి ఎనిమిదవ తరగతిలోనే ‘మెడిసిన్, ఇంజినీరింగ్ వద్దు, నాకు ఫైన్ ఆర్ట్స్ ఇష్టం’ అని చెప్పేసింది. పెద్దబ్బాయి ప్రదీప్ చంద్ర బీకామ్ కంప్యూటర్స్ చేశాడు. చిన్నబ్బాయి శరత్చంద్ర న్యూజిలాండ్‌లో ఎం.ఎస్ చదువుతున్నాడు. నేను లాయర్‌గా ఫ్యామిలీ కోర్టు కేసులు చూసేదాన్ని.చాలామంది ‘మేము పిల్లలందరినీ ఒకేలాగ పెంచాం, అందరూ బాగున్నారు, వీడే ఇలాగయ్యాడు’ అంటుంటారు. నిజానికి పిల్లలందరినీ ఒకేలా పెంచడం సాధ్యం కాదు. పిల్లలందరూ ఒకలా ఉండరు, ఒకరికి సున్నితంగా, ఒకరికి గట్టిగా చెప్పాల్సి వస్తుంది. లక్షణాలను బట్టి వ్యవహరించాలి’’ అంటారామె. పిల్లల బాల్యం అంతా నేనే!! ‘‘మావారు వ్యవసాయం చూసుకుంటూ ఎక్కువగా జహీరాబాద్‌లోనే ఉంటారు. పిల్లలతో నేను హైదరాబాద్‌లో ఉండాల్సి రావడంతో మా పిల్లల బాల్యం అంతా నేనే కనిపిస్తాను. మధు విషయానికి వస్తే తను చిన్నప్పటి నుంచి దుస్తులను భుజం మీద వేసుకుని, నడుముకు చుట్టుకుని అద్దంలో చూసుకుంటూ ర్యాంప్ మీద నడుస్తున్నట్లు ఫీలవుతూ క్యాట్‌వాక్ చేసేది. ఫ్యామిలీ ఫొటోలు తీసుకుంటున్నప్పుడు కూడా తను వైవిధ్యమైన పోజులిచ్చేది. ఇవన్నీ చూసినప్పుడు మా అన్నయ్య సరదాగా ‘మధు మోడల్ అవుతుంది’ అనేవాడు. అయితే మధు తాను మోడలింగ్ చేస్తానన్నప్పుడు మాత్రం ఇల్లంతా ఒక్కసారిగా ‘మోడలింగ్.. ఆ!’ అని ఉలిక్కిపడింది. మన ఇంట్లో ఎవరైనా ఈ ఫీల్డులో ఉన్నారా అంటూ ప్రశ్నలు ఎదురయ్యాయి. మధు ఇష్టమే మా వారి ఇష్టం! మాది మతాంతర వివాహం. మా వారు హమీద్ ఎవరినీ నొప్పించే మనిషి కాదు. మేమిద్దరం పరస్పర వైవిధ్యమైన నేపథ్యాల నుంచి వచ్చిన వాళ్లం కావడంతో మొదట్లోనే ఒక అవగాహనకు వచ్చేశాం. ఒకరి అభిరుచులను మరొకరు గౌరవించుకోవడం, ఒకరి పర్సనల్ స్పేస్‌ని మరొకరు ప్రభావితం చేయకపోవడం వంటి పరిణితి వచ్చేసింది. ఆయనైతే మధు ఇష్టాల దగ్గరికి వచ్చేటప్పటికి సంప్రదాయ పరిధులను అతిక్రమించడానికి కూడా సిద్ధమయ్యారు. మోడలింగ్ రంగాన్ని ఎంచుకోవడం, సినిమారంగ ప్రవేశం, వస్త్రధారణ వంటి అనేక విషయాల్లో ఆయన ఒక్కటొక్కటిగా తనను తాను సడలించుకుంటూ వచ్చారు. దేనికీ నో చెప్పేవారు కాదు. నటన హాబీ కాదు వృత్తి! నాకు మాత్రం మధుని కూచిపూడి డాన్సర్‌ని చేయాలని ఉండేది, నేర్పించాను కూడ. పెద్దయిన తర్వాత మధు సల్సా కూడా ప్రాక్టీస్ చేసింది. మోడల్‌గా ఫ్యాషన్ షోలు చేసింది. ఒకసారి మ్యాగజీన్ కవర్ పేజీ మీద మధు ఫొటో చూసిన ఇవివి సత్యనారాయణగారు ‘కితకితలు’ సినిమాలో హీరోయిన్గా ఆఫర్ ఇచ్చారు. సినిమాలో చేయడమా మానడమా అనే డైలమా ఇంట్లో. తనకేమో సినిమాల్లో చేయాలని ఉంది. అప్పుడు మేమంతా తనకి కౌన్సెలింగ్ ఇచ్చాం. ‘ఇది హాబీలా చేసేది కాదు, ప్రొఫెషనల్‌గా ఉండాలి. పైగా సినిమా రంగంలో చాలా సులభంగా గాసిప్స్ పుడతాయి. వాటికి తట్టుకుని నిలబడగలగాలి. వాటిని ఎంత వరకు స్వీకరించాలో అంతవరకే తీసుకోవాలి. ప్రతి విషయానికీ అందరికీ సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన పనిలేదు. కానీ ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ పని చేసినా దానికి మొదటగా నీకు నువ్వు సమాధానం చెప్పుకుంటూ ఆ తర్వాత కుటుంబానికి వివరిస్తే చాలు’ అని చెప్పాం. నీ స్థానంలో నేనే ఉంటే... మధు నిర్ణయం తీసుకునే ముందు చాలా విశ్లేషణాత్మకంగా పరిశీలిస్తుంది. తనకు నిర్ణయం తీసుకోలేని పరిస్థితి తమిళ ‘అవన్ - ఇవన్’ (తెలుగులో వాడు-వీడు) సినిమా విషయంలో ఎదురైంది. ఆ సినిమాకి కథాపరంగా హీరోయిన్ కొన్ని సీన్లలో గుండుతో కనిపించాలి. ఆ సినిమా కోసం గుండు చేయించుకుంటే మళ్లీ జుట్టు వచ్చే వరకు ఇతర ప్రాజెక్టులేవీ చేయడానికి వీలుకాదని ఆలోచనలో పడింది. అప్పుడు నేను ‘నీ స్థానంలో నేను ఉంటే గుండు గురించి ఆలోచించను, వెంటనే అంగీకరిస్తాను’ అనే ఒక్కమాటనే అన్నాను. తను వెంటనే ఓకే చెప్పింది. తర్వాత కథలో కొద్ది మార్పుల కారణంగా గుండు చేయించుకోవాల్సిన అవసరమే రాలేదు.మధు సినిమారంగంలో అడుగుపెట్టినప్పుడు మరీ చిన్నపిల్ల. అందుకే మధుకి తోడుగా వెళ్తుండేదాన్ని’’ అన్నారు రాజకుమారి. కళల కుటుంబమే కానీ... ‘‘కళారంగం మాకు కొత్తకాదు, కానీ సినిమా అంటే వచ్చే గుర్తింపు వేరు. మధు నటిగా మారిన తర్వాత మా చిన్నబ్బాయి ఫ్రెండ్స్ వచ్చి ఆటోగ్రాఫ్ అడిగేవారు. మా వాడు మాత్రం ‘అక్కా! నిన్ను ఆటోగ్రాఫ్ అడుగుతున్నారేంటి’ అని ఆశ్చర్యపోయేవాడు’’ అన్నారామె. ‘పిల్లలు తప్పుదారి పడతారేమో అనే సందేహం వచ్చినప్పుడు కొన్ని ఉదాహరణలతో ప్రమాదాలను వివరిస్తాను, అంతకు మించి వాళ్ల పర్సనల్ స్పేస్‌లోకి చొరపడను. పిల్లల ఫోన్ నా దగ్గరే ఉన్నా వాళ్లకు ఎవరి నుంచికాల్స్ వచ్చాయి, ఏ మెసేజ్‌లు ఉన్నాయని చూడను. మధు మూడీగా ఉంటే మా పెద్దబ్బాయి పసిగట్టేస్తాడు. మధు టెన్షన్ పడుతోంది, ఏంటో అడుగు అని పురమాయిస్తాడు’ అంటున్నప్పుడు రాజకుమారి ముఖంలో తల్లిగా గెలిచాననే తృప్తి కనిపించింది. - వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి మధుశాలిని నటించిన చిత్రాలు అందరివాడు, నా ప్రాణం కంటే ఎక్కువ, నాయకుడు, కితకితలు, ఒక విచిత్రం, ఆగంతకుడు, స్టేట్ రౌడీ. పళనియప్ప కల్లూరి (తమిళం), కింగ్, పాత్తినారు (తమిళం), కారాలు మిరియాలు, అవన్ ఇవన్ (తమిళం), డిపార్ట్మెంట్ (హిందీ), నాగవల్లి (కన్నడం), భూత్ రిటర్న్ (హిందీ), పొగ, హ్యాపీ జర్నీ, సత్య 2.