
వైఎస్ వంటి లీడర్ వస్తేనే.. వ్యవసాయం పండగవుతుంది
వైఎస్సార్ పేరు వింటేనే రైతుల మోముల్లో చిరునవ్వులు వెల్లివిరుస్తాయి. మాదీ వ్యవసాయకుటుంబమే. మా నాన్న ఎప్పుడూ వైఎస్ పాలన గురించే చెబుతుంటారు. రైతు చల్లగా ఉంటేనే దేశం బాగుంటుంది. దేశాభివృద్ధి, సమాజప్రగతి మొదట అన్నదాత నుంచే మొదలవ్వాలి. అలాంటి రైతు సంక్షేమం కోసం పాటుపడే నేతలనే ప్రజలు ఎన్నుకోవాలి. ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటుహక్కును వినియోగించుకోవాలి. ఓటును అమ్ముకుంటే ఐదేళ్లు కష్టాలు పడాలి. నాకు రాజకీయపార్టీలతో సంబంధం లేదు. అయితే వైఎస్‌లాంటి నేతలు పాలకులు కావాలి. ప్రతి ఒక్కరూ ఆలోచించి అలాంటి నేతలకు ఓటెయ్యాలి.
- మధుశాలిని, హీరోయిన్