* వైఎస్సార్ సీపీ మేనిఫెస్టో: వ్యవసాయం
* నాటి రాజన్న బాటే... నేడు జగన్ ఇస్తున్న భరోసా
* వ్యవసాయ రంగ సంక్షేమానికి మేనిఫెస్టోలో పెద్దపీట
* సాగుకు 7 గంటలు నిరంతరాయంగా ఉచిత కరెంటు
* గిట్టుబాటు ధర కోసం రూ.3,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి
* ప్రాసెసింగ్, గ్రేడింగ్, ప్యాకేజింగ్, మార్కెటింగ్ సదుపాయాలు
* భూసార పరీక్షలు, సాగు సూచనల కోసం ‘102’ వాహనాలు
* మూడు వ్యవసాయ వర్సిటీలు, రెండు జిల్లాలకో వ్యవసాయ డిగ్రీ కాలేజీ, పరిశోధన కేంద్రం
* ‘103’ పేరుతో సంచార పశువైద్య శాలలు..
* రైతు చెంతకే వైద్యం.. మండలానికో పశు వైద్యశాల
* పంట నిల్వ సమస్యల పరిష్కారానికి అదనపు గోదాములు
* రైతును ఆదుకునేందుకు రూ.2 వేల కోట్లతో ప్రకృతి
* వైపరీత్యాల నిధి.. రెండో పంట నాటికే పరిహారం
* బిందు సేద్యానికి 90 % సబ్సిడీ, మత్స్య పరిశోధన కాలేజీ, కేంద్రం
* వ్యవసాయానికి ఇద్దరు మంత్రుల నియామకం
* ఆరు నూరైనా సాగుకు ఉచిత విద్యుత్, వడ్డీ లేని పంట రుణాలు
* విత్తు వేసేనాటికే రైతులకు బ్యాంకు రుణాలు
రైతు బాంధవుడైన రాజన్న ఆశయాల సాధనే లక్ష్యంగా ఆయన వారసుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి... వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో కూడా రైతు ప్రయోజనాలకే అత్యధిక ప్రాధాన్యమిచ్చారు. దుక్కి దున్నింది మొదలు, మొక్క ఎదిగే దాకా, పంట చేతికొచ్చేదాకా, చక్కని ధరకు అమ్ముడయేదాకా... అడుగడుగునా సర్కారే రైతు నేస్తమయ్యేలామేనిఫెస్టోలో ప్రకటించిన రైతు సంక్షేమ చర్యలు..
మూడు వ్యవసాయ వర్సిటీలు
* వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే రాష్ట్రంలో మూడు వ్యవసాయ విశ్వవిద్యాలయాల ఏర్పాటు చేస్తుంది
* ప్రతి రెండు జిల్లాలకు ఒక వ్యవసాయ డిగ్రీ కళాశాల
* పంటలను బట్టి రెండు జిల్లాలకో వ్యవసాయ పరిశోధన కేంద్రం
* పురుగు మందుల నాణ్యత, పర్యవేక్షణ బాధ్యతలు ఈ పరిశోధన కేంద్రాలకే
102 సేవలు
* భూసార పరీక్షలు, వ్యవసాయ సూచనల కోసం మొబైల్ క్లినిక్‌లు ఏర్పాటు చేయడం దీని లక్ష్యం
* రైతులు 102 నంబర్‌కు ఫోన్ చేయగానే వారి పొలాల వద్దకే వాహనాలొచ్చి నమూనాలు సేకరిస్తాయి
103 సేవలు
* 103 నంబర్‌కు ఫోన్ చేయగానే 20 నిమిషాల్లోనే సంచార పశువైద్యశాల రైతు ముందే ప్రత్యక్షమవుతుంది
* అవసరమైన వైద్య సేవలను అప్పటికప్పుడే అందిస్తారు. అంతేగాక మండలానికో పశు వైద్యశాల ఏర్పాటు చేస్తారు
రూ. 2,000 కోట్లతో ప్రకృతి వైపరీత్యాల నిధి
* {పకృతి వైపరీత్యాలతో పంట నష్టం జరిగినప్పుడు తక్షణం అంచనాలు వేసి, వీలైనంత త్వరగా రైతులకు పరిహారం చెల్లించడం దీని లక్ష్యం
* రెండో పంట వేసే నాటికే రైతు చేతికి పరిహారం అందేలా చూస్తారు
వడ్డీలేని రుణాలు
* రైతులకు వడ్డీ లేని పంట రుణాలు అందిస్తారు
* యాంత్రీకరణను ప్రోత్సహించడానికి వ్యవసాయ యంత్రాల కొనుగోలుపై రైతులకు సబ్సిడీలిస్తారు
రుణ మాఫీ కోసం కేంద్రంపై ఒత్తిడి
* వరదలు, తుఫాన్లు; కరవు కాటకాలతో రైతులు అల్లాడుతూ అప్పుల ఊబిలో కూరుకుపోతున్నందున సరికొత్త రుణమాఫీ పథకాన్ని ప్రవేశపెట్టాలని కేంద్రంపై వైఎస్సార్‌సీపీ ఒత్తిడి తెస్తుంది
అదనపు గోదాములు
* శీతల గిడ్డంగులు, ఆధునిక గిడ్డంగుల నిర్మాణం వైఎస్సార్‌సీపీ లక్ష్యం
* వ్యవసాయోత్పత్తుల నిల్వకు రైతు పడే బాధలు అన్నీ ఇన్నీ కాదు. అందుకే ఒక్కోటీ 40 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో గిడ్డంగులు ఏర్పాటు చేస్తాం
ప్రాసెసింగ్ సదుపాయాలు
* వ్యవసాయ ప్రాసెసింగ్, గ్రేడింగ్, ప్యాకేజింగ్, మార్కెటింగ్ సదుపాయాలను మరింత విస్తరిస్తాం
* తద్వారా ఉత్పత్తులు పాడవ్వకుండా నిల్వచేసుకునే సదుపాయం రైతులకు కలగజేస్తాం
ఇద్దరు వ్యవసాయ మంత్రులు
* వ్యవసాయ రంగానికి ఇద్దరు మంత్రులను నియమిస్తాం
* ఒకరు వ్యవసాయ ఉత్పత్తులను పర్యవేక్షిస్తారు
* మరొకరు పంట నిల్వ కార్యక్రమాలను పర్యవేక్షిస్తారు
* ఏటా సాధారణ బడ్జెట్‌తో పాటు వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెడతాం
డ్రిప్ ఇరిగేషన్‌కు 90 శాతం సబ్సిడీ
* పండ్లతోటల పెంపకానికి కీలకమైన బిందు సేద్యానికి కావాల్సిన పెట్టుబడిని, పరికరాలను 90 శాతం సబ్సిడీతో అందిస్తాం
చేపల పరిశోధన కాలేజీ
* సీమాంధ్రలో మత్స్యకారులను మరింతగా ప్రోత్సహించేందుకు కొత్తగా ఫిషరీస్ కాలేజీ, ఆక్వా రీసెర్చ్ సెంటర్ ప్రారంభిస్తాం
ఆరునూరైనా ఉచిత విద్యుత్
* వ్యవసాయానికి 9 గంటలు ఉచిత విద్యుత్‌ను ఆరు నూరైనా అందిస్తాం
* ఇందులో 7 గంటల పాటు పగలే నిరంతరాయంగా ఇస్తాం ఎంత ఖర్చయినా భరిస్తాం
గిట్టుబాటు ధర కోసం స్థిరీకరణ నిధి
* దిగుబడి, గిట్టుబాటు ధరలను సమతుల్యం చేసేందుకు రూ.3,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాం
సకాలంలో రుణాలు
* పెట్టుబడుల్లేని దుస్థితి నుంచి రైతులను గట్టెక్కించేందుకు, విత్తు వేసేనాటికే వారికి బ్యాంకు రుణాలందేలా చర్యలు చేపడతాం
సీడ్ విలేజ్
* వైఎస్ హయాంలో ప్రారంభించిన ‘సీడ్ విలేజ్’ను తిరిగి కొనసాగిస్తాం
* దీనిద్వారా రైతులు ఉత్పత్తి చేసే విత్తనాలకు మార్కెట్ రేటు లభిస్తుంది
* కార్పొరేట్ విత్తనాలు కాకుండా రైతు ఇంటి పంటనే విత్తనంగా మార్చే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఊరి ముంగిటికే తెస్తాం
* ఈ కార్యక్రమాన్ని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అనుసంధానిస్తాం
సహకార ఉద్యమం
* ప్రభుత్వం, వాణిజ్య బ్యాంకుల క్రియాశీల మద్దతుతో ప్రతి జిల్లాలో ఒకట్రెండు గ్రామాలను ఎంపిక చేసి, సమీకృత విధానం ద్వారా సహకార పద్దతిలో వ్యవసాయ సాగును ముందుకు తీసుకెళ్తాం.
* ఆధునిక సమాచార వ్యవస్థను రైతుకు అనుకూలంగా మార్చే పద్ధతులను ఇందులో క్రోడీకరిస్తాం
సరికొత్త అధ్యాయానికి నాంది
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళిక రైతులకు మేలు చేసేదిగా ఉంది. రైతులకు మద్దతు ధర ఇచ్చేందుకు రూ.3 వేల కోట్లతో స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తామనడం హర్షణీయం. వ్యవసాయ శాఖకు ఇద్దరు మంత్రులను నియమించాలన్న నిర్ణయం వినూత్నం. రైతులకు వడ్డీలేని రుణం, వ్యవసాయ యంత్రాల కొనుగోలుపై సబ్సిడీ ఇవ్వడం వల్ల వ్యవసాయాన్ని ప్రోత్సహించినట్లవుతుంది. దీనివల్ల రైతులు వ్యవసాయానికి దూరం కారు. ప్రకృతి విపత్తుల సమయంలో కేంద్ర సాయం కోసం ఎదురుచూడకుండా రూ.రెండువేల కోట్లతో కార్పస్‌ఫండ్ ఏర్పాటు చేస్తామనడం అభినందించదగ్గ విషయం. ఏరకంగా చూసినా వైఎస్సార్ సీపీ ఎన్నికల ప్రణాళిక ఉన్నతంగా ఉంది. ఇది సరికొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందని భావిస్తున్నా.
- డాక్టర్ పాములపర్తి రామారావు, వైస్ ప్రిన్సిపాల్,
అనంతలక్ష్మి ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల, వరంగల్