జూలై21 పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు | July 21 birthday celebrated Celebrities | Sakshi
Sakshi News home page

జూలై21 పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

Published Mon, Jul 20 2015 10:21 PM | Last Updated on Sun, Sep 3 2017 5:51 AM

జూలై21 పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

జూలై21 పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు: వరుణ్ సందేశ్ (నటుడు);మధుశాలిని (నటి)
 
ఈ రోజు పుట్టిన వారి సంవత్సర సంఖ్య 9. ఇది కుజునికి సంబంధించినది కాబట్టి ఈ సంవత్సరం సంపూర్ణత, సంతృప్తి, కార్యసిద్ధికి సంకేతంగా ఉంటుంది. మీ పుట్టిన తేదీ 21 (2=1=3). ఇది దేవ గురువైన బృహస్పతికి సంబంధించినది కాబట్టి స్నేహశీలిగా, మంచి సలహాదారుగా సంఘంలో పేరు వస్తుంది.ఈ సంవత్సరం బృహస్పతి, కుజుల కలయిక వల్ల మీరు చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాలను మంచి ప్లానింగ్‌తో, ధైర్యసాహసాలతో చేసి బాగా అభివృద్ధి సాధిస్తారు. కార్యదక్షులుగా, సమర్థులుగా గుర్తింపు వస్తుంది. రియల్ ఎస్టేట్, మార్కెటింగ్, విద్యారంగం, క్రీడారంగాలలోని వారికి బాగుంటుంది.

సంగీతం, లలిత కళలలో ప్రవేశం ఉన్న వారు బాగా రాణిస్తారు. లక్కీ నంబర్స్: 1,3,9; లక్కీ కలర్స్: ఎల్లో, రెడ్, పింక్, సిల్వర్; లక్కీడేస్: ఆది, మంగళ, గురువారాలు. లక్కీ మంత్స్: జనవరి, ఫిబ్రవరి, మే, సెప్టెంబర్, అక్టోబర్; సూచనలు: దక్షిణామూర్తి ఆరాధన, సుబ్రహ్మణ్యేశ్వరునికి అభిషేకం చేయడం, గురువులను, మతపెద్దలను గౌరవించడం మంచిది. అయితే కుజుడి దుష్ర్పభావం వల్ల పదునైన ఆయుధాల వల్లగానీ, వాహనాల వల్లగానీ ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అలాగే దూకుడుగా మాట్లాడటం వల్ల నష్టం జరగవచ్చు. అందువల్ల ఆయా విషయాలలో అప్రమత్తత అవసరం.
   - డాక్టర్ మహ్మద్ దావూద్

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement