సీతగా మధుశాలిని | sita role madhu shalini in sitavalokanam | Sakshi
Sakshi News home page

సీతగా మధుశాలిని

Published Wed, Sep 24 2014 11:27 PM | Last Updated on Sat, Sep 2 2017 1:54 PM

సీతగా మధుశాలిని

సీతగా మధుశాలిని

‘‘ఈ చిత్రదర్శకుడు తక్కువ మాట్లాడి, ఎక్కువ పని చేస్తాడు. ట్రైలర్ చాలా బాగుంది. సీతగా మధుశాలిని బాగుంది’’ అని ప్రముఖ దర్శకుడు కె.విశ్వనాథ్ అన్నారు. మాదల వేణు దర్శకత్వంలో మధుశాలిని, ప్రగతి, మీనాకుమారి ముఖ్య తారలుగా అడకా వెంకటేశ్ యాదవ్ నిర్మించిన చిత్రం ‘సీతావలోకనం’. ఈ చిత్రం ప్రచార చిత్రాల ఆవిష్కరణ వేడుకలో ముఖ్య అతిథులుగా కె. విశ్వనాథ్, తమ్మారెడ్డి భరద్వాజ్, కొండవీటి జ్యోతిర్మయి పాల్గొన్నారు. సీత పాత్రలో ఒకప్పుడు అంజలీదేవిగారు, ఇటీవల నయనతార అద్భుతంగా ఒదిగిపోయారు.
 
  ఈ పాత్రలో మధుశాలిని కూడా బాగుందని భరద్వాజ్ అన్నారు. ఇందులోని సీత పాత్ర గురించి తనతో నిర్మాత చర్చించారని జ్యోతిర్మయి తెలిపారు. సీత అంతర్ముఖాన్ని ఆవిష్కరించే చిత్రం ఇదని దర్శకుడు మాదల వేణు తెలిపారు. వేణు చెప్పిన కథ నచ్చి, ఈ చిత్రం నిర్మించానని నిర్మాత అన్నారు. వేణు తనతో కూచిపూడి నృత్య రూపకం చేయించాలనుకున్నారని, చివరికి ఇంత మంచి చిత్రంలో చక్కని పాత్ర ఇచ్చారని మధుశాలిని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: ఘంటశాల విశ్వనాథ్, కెమెరా: యస్.వి. విశ్వేశ్వర్.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement