
‘‘డైరెక్టర్ స్టీవెన్ స్పీల్ బర్గ్ తీసిన ‘డ్యూయల్’ చిత్రంలో నటీనటుల ముఖం కనిపించదు. అలాంటి నేపథ్యంలో ‘రా రాజా’ సినిమా తీసి దర్శకుడు శివ ప్రసాద్ ధైర్యం చేశాడు. ఇది చాలా పెద్ద ప్రయోగం’’ అని దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ అన్నారు. బి. శివ ప్రసాద్ దర్శకత్వంలో పద్మ సమర్పణలో శ్రీ పద్మిణి సినిమాస్ బ్యానర్‌పై రూపొందిన చిత్రం ‘రా రాజా’. బూర్లే హరి ప్రసాద్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా, కిట్టు లైన్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన ఈ సినిమా మార్చి 7న విడుదల కానుంది.
ఈ మూవీ రిలీజ్ డేట్ పోస్టర్‌ను తమ్మారెడ్డి భరద్వాజ్ రిలీజ్ చేసి, మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో ముఖాలు కనిపించవు. కథే ముందుకు వెళ్తుంటుంది. ఇది అద్భుతమైన ఐడియా. ఇది సక్సెస్ అయితే హీరోలు, స్టార్లతో పని లేకుండా అద్భుతమైన చిత్రాలు, ప్రయోగాలు చేయొచ్చని అంతా ముందుకు వస్తారు’’ అన్నారు. ‘‘మా చిత్రంలో నటీనటుల ముఖాలు కనిపించవు. కథ, కథనమే ముఖ్యంగా ఈ మూవీని తీశాం. ఇది ఒక ప్రయోగం’’ అన్నారు డైరెక్టర్ శివప్రసాద్.
Comments
Please login to add a commentAdd a comment