Actress Madhu Shalini Married To Tamil Hero Gokul Anand In Hyderabad: ఇటీవలే ప్రముఖ డైరెక్టర్ విఘ్నేష్ శివన్‌ను పెళ్లి చేసుకుని ఓ ఇంటి కోడలైంది లేడీ సూపర్ స్టార్ నయన తార. తాజాగా మరో హీరోయిన్ పెళ్లి పుస్తకాన్ని తెరిచింది. సైలెంట్‌గా వివాహం చేసుకుని అభిమానులుక సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఆమె ఎవరో కాదు. ఇటీవల '9 అవర్స్' వెబ్ సిరీస్‌తో అలరించిన మధు శాలిని. తమిళ హీరో గోకుల్ ఆనంద్‌తో మధు శాలిని వివాహం గురువారం (జూన్ 16) హైదరాబాద్‌లో జరిగింది. ఈ వివాహ వేడుకకు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.
తమ వివాహ వేడుక గురించి సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. తమిళ సినిమా పంచాక్షరంలో మధు శాలిని, గోకుల్ నటించారు. ఈ మూవీ టైమ్‌లోనే ఇద్దరి మధ్య చిగురించిన స్నేహ్నం.. ప్రేమగా, తర్వాత వివాహం బంధంగా మారిందని సమచారం. అల్లరి నరేష్ హీరోగా నటించిన కితకితలు సినిమాలో రెండో హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది తెలుగు అందం మధు శాలిని. తర్వాత ఒక విచిత్రం, అగంతకుడు, కింగ్ (ఓ సాంగ్), వాడు-వీడు, గోపాల గోపాల వంటి తదితర చిత్రాల్లో నటించింది. అలాగే గోకుల్ అరడజను తమిళ సినిమాల్లో, వెబ్ సిరీస్‌ల్లో నటించాడు.
చదవండి: కాలేజ్‌లో డ్యాన్స్ చేసిన సాయి పల్లవి.. వీడియో వైరల్..
డేటింగ్ సైట్‌లో తల్లి పేరు ఉంచిన కూతురు.. అసభ్యకరంగా మెసేజ్‌లు
బిజినెస్‌మేన్ కిడ్నాపర్‌గా మారితే..
Thank you for all the love we’ve received. We look forward to the new chapter of our lives with hope and gratitude in our hearts.
— MADHU SHALINI (@iamMadhuShalini) June 17, 2022
Love MADHU SHALINI & GOKUL ♥️ pic.twitter.com/6YLREAZo8L
Comments
Please login to add a commentAdd a comment