బెంగళూరు : బీజేపీ యువ ఎంపీ తేజస్వి సూర్య గతంలో చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు ఆయనను వివాదంలోకి నెట్టింది. 2015లో అరబ్ మహిళల శృంగార జీవితాన్ని టార్గెట్ చేస్తూ తేజస్వి చేసిన ట్వీట్‌పై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఐదేళ్ల కిందట తేజస్వి చేసిన ఈ ట్వీట్‌పై అరబ్ దేశాలకు చెందిన పలువురు ప్రముఖులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఒక ప్రజా నాయకుడు స్త్రీలకు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ ప్రశ్నిస్తున్నారు. తేజస్వీ బీజేపీకే కాకుండా మొత్తం దేశ ప్రజల అవమానపడేలా చేశారని ఓ నెటిజన్ కామెంట్ చేశారు.
తేజస్వీ ట్వీట్‌పై కర్ణాటక కాంగ్రెస్ కూడా తీవ్రంగా స్పందించింది. తేజస్వీ సూర్య లాంటి చేసే చెత్త కామెంట్లపై బీజేపీ చర్యలు తీసుకోదని కాంగ్రెస్ నేత శ్రీవత్స ఆరోపించారు. దీని వెనక ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా ప్రోత్సహం ఉందని మండిపడ్డారు. దీనివల్ల ఇబ్బందులు పడేది మాత్రం భారతీయులు అని అన్నారు. అయితే ఆ ట్వీట్‌పై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఆయన ఆ ట్వీట్‌ను తొలగించారు. తేజస్వీ ట్వీట్ తొలగించిన తర్వాత కూడా ఆ వివాదం ఆగలేదు. తేజస్వీ చర్యను పిరికి చర్యగా పేర్కొంటూ పలువురు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment