
బెంగళూరు: మహా శివరాత్రి సందర్బంగా నిన్న(బుధవారం) కోయంబత్తూరులో జగ్గీ వాసుదేవ్(సద్గురు) నిర్వహించిన ఈవెంట్ కు కర్ణాటక డిప్యూటీ సీఎం, కాంగ్రెస్ కీలక నేత డీకే శివ కుమార్ హాజరుకావడం ఆ పార్టీలో తీవ్ర ఆందోళన రేకెత్తించింది. ఆ ఈవెంట్ కు సద్గురుతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో డీకే శివకుమార్ స్టేజ్ షేర్ చేసుకున్నారు. దీనికి కర్ణాటక కాంగ్రెస్ తో పాటు జాతీయ కాంగ్రెస్ కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. బీజేపీ, ఆర్ఎస్ఎస్ భావాజాలాలతో ఏర్పాటు చేసిన సద్గురు ఈవెంట్ కు డీకే శివ కుమార్ వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందనేది కాంగ్రెస్ ప్రశ్నగా ఉంది.
దీనిపై ఏఐసీసీ సెక్రటరీ పీవీ మోహన్ తన సోషల్ మీడియా హ్యాండిల్ ‘ఎక్స్’లో తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. శివ కుమార్ ట్యాగ్ చేసి మరీ పీవీ మోహన్ వివరణ అడిగారు. కాంగ్రెస్ సీనియర్ రాహుల్ గాంధీని పదే పదే విమర్శించే వారి ఈవెంట్ వెళ్లడమే కాకుండా, అందుకు థాంక్యూ చెప్పడాన్ని ఇక్కడ పీకే మోహన్ ప్రశ్నించారు.
రాహుల్ చెప్పేది అదే.. అలా ఉంటే పార్టీని వదిలేయండని..
శివ కుమార్ టార్గెట్ చేస్తూ చేసిన పోస్ట్ పై పీకే మోహన్ వివరణ ఇచ్చారు. ‘ నేను ఇక్కడ ఎవర్నీ విమర్శించడం లేదు. శివ కుమార్ భావజాలంపై నా అభిప్రాయం ఏమిటో నేను చెప్పాను. జగ్గీవాసుదేవ్ భావజాలం.. బీజేపీ, ఆర్ఎస్ఎస్ ల భావజాలమే. దీనికి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకం. మాది సెక్యులర్ పార్టీ. మా నాయకుడు రాహుల్ గాంధీ పదే పదే చెప్పేది కూడా అదే. ఎవరైనా ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఉంటే పార్టీని వదిలేయొచ్చని చెబుతూనే ఉన్నారు. అదే నేను నా పోస్ట్ ద్వారా తెలియజేశాను’ అని పీకే మోహన్ పేర్కొన్నారు.
Thanking for an invitation from someone who mocks RG, the hope of the nation&aligns with RSS’s narratives,while serving as a president of a secular party, it misleads party workers. It is Conviction rather than compromise ensures the party’s growth. Otherwise, it damages the core pic.twitter.com/x9hnxhbfF6
— PV.MOHAN (@pvmohanINC) February 26, 2025
Comments
Please login to add a commentAdd a comment