sadguru
-
పిల్లలు వద్దనుకోవడంపై ఉపాసన క్లారిటీ..
Upasana Konidela Gave Clarity On Childrens: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. మెగా కోడలిగానే కాకుండా సామాజిక అంశాల్లో చురుగ్గా పాల్గొంటుంది. అయితే ఇటీవల ఓ కార్యక్రమంలో భాగంగా పిల్లలపై తనకు వచ్చే ప్రశ్నల గురించి సద్గురు వద్ద ప్రస్తావించిన విషయం తెలిసిందే. ఇందులో సద్గురు 'ఆమెకు సమాధానంగా ప్రస్తుతం పెరిగిపోతున్న జనాభా వల్ల పిల్లలను కనకపోవడమే మంచింది. ఇలా పిల్లలను వద్దనుకునేవారికి అవార్డు ఇస్తాను' అని తెలిపారు. అయితే ఈ వీడియో చూసిన నెటిజన్లు జనాభా తగ్గించడం కోసమే ఉపాసన దంపతులు పిల్లలను వద్దనుకుంటున్నారా అంటూ పెద్ద ఎత్తున కామెంట్లు చేశారు. అయితే తన గురించి ఈ కామెంట్లపై ఉపాసన తాజాగా స్పందించారు. 'ఓ మై గాడ్, ఇది నిజం కాదు. దయచేసి నేను ఏమన్నానో నిర్ణయానికి వచ్చే ముందు పూర్తి వీడియోను చూడండి' అని రాసుకొచ్చారు. అలాగే పిల్లలు వద్దనుకునే వాళ్లకు సద్గురు అవార్డు ఇస్తానని చెప్పారు. అయితే 'ఆ అవార్డు తీసుకునేందుకు మా తాతయ్య ఒప్పుకోవడం లేదు' అని ఇదివరకే ఉపాసన పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆ బహుమానం వద్దంటే పిల్లలు కావాలని అర్థం అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. చదవండి: మళ్లీ పొట్టి దుస్తుల్లో రష్మిక పాట్లు.. వీడియో వైరల్ రామ్ గోపాల్ వర్మ 'లడ్కీ'కి హిట్ టాక్.. మరిన్ని థియేటర్లలో.. An absolute honour to be in conversation with @SadhguruJV amazing as usual, every topic made so much sense. Truly practical considering the circumstances the world is facing today. A must watch ! Sadhguru-Thatha’s not letting me accept your award 🤗❤️ Thank you #ATA pic.twitter.com/Xvl7K9W3Yb — Upasana Konidela (@upasanakonidela) July 4, 2022 -
పెళ్లై 10 ఏళ్లు, పిల్లలు లేరంటూ సద్గురును అడిగిన ఉపాసన
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్- ఉపాసనలది చూడముచ్చటైన జంట. ఎంతో అన్యోన్యంగా ఉండే దంపతులు ఇటీవలే పదవ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. అయితే ఇప్పటికీ వీరికి సంతానం లేదు. అది వాళ్ల వ్యక్తిగత విషయమైనప్పటికీ నెట్టింట్లో ఎప్పుడూ దీని గురిం చర్చ సాగుతూనే ఉంటుంది. ఉపాసనకు సైతం తరచూ ఈ ప్రశ్న ఎదురవుతున్నా ఏదో ఒకలా దాన్ని దాటవేస్తూ వచ్చింది. తాజాగా ఆధ్యాత్మిక గురువు సద్గురు దగ్గర పిల్లలను కనడం గురించి అడిగేసింది ఉపాసన. 'నేను పెళ్లి చేసుకుని పదేండ్లవుతోంది. నా వైవాహిక జీవితం చాలా చాలా సంతోషంగా సాగుతోంది. నా కుటుంబాన్ని, నా జీవితాన్ని నేను ఎంతగానో ప్రేమిస్తున్నాను. కానీ ప్రజలు మాత్రం నా లైఫ్‌లోని ఆర్ఆర్ఆర్ గురించే ఎక్కువ చర్చించుకుంటున్నారు. ఫస్ట్ ఆర్.. నా రిలేషన్షిప్ గురించి, సెకండ్ ఆర్.. రీ ప్రొడ్యూస్(పిల్లలను కనే సామర్థ్యం), మూడో ఆర్.. లైఫ్‌లో నా రోల్.. వీటి గురించే జనాలు ఎక్కువగా చర్చిస్తున్నారు' అని చెప్పుకొచ్చింది. ఈ ప్రశ్నకు సద్గురు ఆసక్తికరంగా సమాధానాలిచ్చారు. 'రిలేషన్ అనేది నీ వ్యక్తిగత విషయం. అందులో ఎవరూ తలదూర్చకూడదు. రెండోది రీప్రొడ్యూస్.. పిల్లలను కనకుండా ఉండేవారందరికీ నేను అవార్డులిస్తాను. ఈ తరం వాళ్లు పిల్లలని కనాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పటికే ప్రపంచ జనాభా మరీ అధికమైపోయింది. ఒకవేళ నువ్వు ఆడపులివి అయి ఉంటే మాత్రం కచ్చితంగా పిల్లల్ని కనమని సలహా ఇచ్చేవాడిని. ఎందుకంటే అవి అంతరించిపోతున్నాయి. కానీ మనం అంతరించడం లేదు. ఇప్పటికే మనం ఈ భూమి మీద ఎక్కువ సంఖ్యలో ఉన్నాం' అని సద్గురు బదులిచ్చారు. ఆయన సమాధానం విన్న ఉపాసన.. మీరు ఇలా చెప్పారు కదా! ఇక మీకు మా అమ్మ, అత్తయ్యగారి నుంచి ఫోన్లు వస్తాయని సరదాగా చమత్కరించింది. దీంతో ఆయన కూడా అలాంటి అమ్మలు, అత్తల నుంచి తనకు ఎన్నో ఫోన్లు వస్తుంటాయ్ అని నవ్వేశారు. మొత్తానికి ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. చదవండి: హీరో విశాల్‌కు గాయాలు.. నిలిచిపోయిన సినిమా షూటింగ్ వారిద్దరూ కలిసి ఎలా ఉంటారో చూస్తా.. నరేష్ మూడో భార్య రమ్య శపథం -
ఈశా వేడుకల్లో సింగర్ మంగ్లీ స్వరాలు
సాక్షి,సిటీబ్యూరో: ప్రస్తుత సంగీత ప్రపంచంలో గాయని మంగ్లీది ప్రత్యేక స్థానం అని చెప్పనవసరం లేదు. జానపదాలు మొదలు బతుకమ్మ పాటల వరకు తన గానామృతంతో అందరినీ అలరిస్తోంది. ప్రతి పండుగకు తన కొత్త పాట సందడి చేయాల్సిందే. తన యాసతో ప్రకృతి, సంస్కృతి మిళితమైన జానపదాలు మొదలు సినిమా పాటల్లోనూ దూసుకుపోతుంది. వీటితో పాటు దక్షిణ భారతదేశంలో ఎవరికీ దక్కని అవకాశం మంగ్లీకి దక్కింది. ఆధ్యాత్మిక ప్రపంచంలో అతిపెద్ద వేదికైన కోయంబత్తూర్‌లోని ఈశా ఫౌండేషన్ నిర్వహించే మహాశివరాత్రి వేడుకల్లో తన గొంతును వినిపించనుంది. ప్రతి శివరాత్రికి ఈశా యోగా కేంద్రంలో ఘనంగా వేడుకలు జరగడం విదితమే. అయితే ఈసారి కోవిడ్ కారణంగా isha.sadhguru.org/msrలో ఇంగ్లిష్తో పాటు 11 భారతీయ భాషల్లో లైవ్ స్ట్రీమ్ చేయనున్నారు. ఇందులో భాగంగా గురువారం సాయంత్రం 6 గంటల నుంచి శుక్రవారం ఉదయం 6 గంటల వరకు పలు ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా మహాశివుడిని స్మరిస్తూ ఐదు పాటలు పాడనున్నట్లు మంగ్లీ తెలిపింది. కార్యక్రమంలో ప్రముఖ కళాకారులు పార్థివ్ గోహిల్, ఆంధోని దాసన్, కబీర్ కేఫ్, సందిప్ నారాయణ్ తదితరులు ప్రదర్శనలు ఇవ్వనున్నారు. -
దేహయంత్ర నియంత్రణ
యోగా ‘అంగమర్దన’ అనేది నేడు పూర్తిగా మరుగున పడిపోయిన ఒక ప్రత్యేకమైన యోగా విధానం. ఎటువంటి పరికరాల అవసరం లేకుండా చేయగలిగే తీవ్రమైన వ్యాయామం ఇది. మీకు కావలిసింది ఆరు బై ఆరు అడుగుల స్థలం మాత్రమే. ఆ తర్వాత ఇందులో మీరు చేసేదంతా మీ శరీరంతోనే. ఇది మీ శరీర బరువు, వేగాల సాయంతో మీ కండరాల యొక్క వంగే గుణాన్ని పెంచి క్రమక్రమంగా ఎంతో భిన్నమైన శారీరక సామర్థ్యాన్నీ, దృఢత్వాన్నీ కలిగిస్తుంది. మేము ప్రస్తుతం నేర్పిస్తున్నది ఒక 25 నిమిషాల ప్రక్రియే. కానీ ఇది ఆరోగ్యపరంగా, శ్రేయస్సుపరంగా అద్భుతాలను సృష్టించగలదు. శక్తిమంతమైన శరీరాన్ని నిర్మించడంలో, ఇది బరువులతో జిమ్‌లో చేసే వ్యాయామమంత సమర్థవంతమైనది. అదే సమయంలో ఇది వ్యవస్థ మీద ఎటువంటి అనవసరమైన ఒత్తిడిని కలిగించదు. ‘అంగమర్ధన’ అంటే అర్థం మీ అవయవాల మీద ఆధిపత్యం లేదా నియంత్రణ కలిగి ఉండటం. మీరు ఏ పని చేయదలచుకున్నా, మీ అవయవాల మీద ఎంత ఆధిపత్యం కలిగి ఉన్నారన్న విషయమే మీరు ఆ పనిని ఎంత బాగా చేయగలరు అనే దానిని నిర్ణయిస్తుంది. నేను ఒక క్రీడాకారుల జట్టులోనో, మరో దాంట్లోనో చేరి రాణించడం గురించి మాట్లాడటం లేదు. మీరు మీ మనుగడ కోసం చేసే పనులకు, మీ ముక్తి కోసం చేసే పనులకు మధ్య ఉన్న వ్యత్యాసం గురించి మాట్లాడుతున్నాను. మీరు మీ ముక్తి కోసం ఏదైనా చేయాలంటే, మీ అవయవాల మీద మీకు కొంత నియంత్రణ ఉండాలి. మీరు దీన్ని కేవలం ఒక వ్యాయామంగా చూసినా అంగమర్దన సరితూగుతుంది. కండరాలను దృఢం చేయడం, కొవ్వు తగ్గించడం అనేవి కేవలం సహ ప్రయోజనాలు మాత్రమే. ఈ సాధనతో మనం ముఖ్యంగా చేసేది మన శక్తిని ఒక స్థాయికి తీసుకెళ్ళి, దానిలో ఒక సమగ్రతను తీసుకురావడమే. అసలు విషయం ఏమిటంటే మిమ్మల్ని మీరు పూర్తి సామర్థ్యంతో పనిచేసే వ్యక్తిగా మలచుకోవాలి. ఎందుకంటే పూర్తి సామర్థ్యంతో పనిచేసే వ్యక్తిని మాత్రమే అత్యున్నత విషయాలను గ్రహించగలిగే స్థాయికి తీసుకెళ్ళగలం. ఒక వ్యక్తి నడిచే పద్ధతిని చూస్తే, అతను సరైన శారీరక వ్యాయామం చేసాడా, లేదా అనేది స్పష్టమౌతుంది. ఒక వ్యక్తి ముఖం చూస్తే, అతను తన మెదడును సరిగ్గా ఉపయోగించుకున్నాడా లేదా చెప్పవచ్చు. అలాగే మీరు నిశితంగా చూస్తే, ఒకరి శక్తి సరిగ్గా ఉత్తేజితం చేయబడిందా లేదా అనేది స్పష్టంగా తెలుస్తుంది. ఒకరు ఏమి చేయగలరో, ఏమి చేయలేరో నిర్ణయించబడేది దీని ఆధారంగానే. మీ శక్తులపై మీకు పూర్తి నియంత్రణ ఉంటే, మీరు వాటిని విస్ఫోటనం చెందించవచ్చు. చాలా మంది ఏవో పెద్ద అనుభూతులను కోరుకుంటారు. కానీ దానికి అనుగుణంగా, అంటే ఆ అనుభూతులను పొందేందుకు యోగ్యంగా శరీరాన్ని మలచుకోవడానికి వారు సుముఖంగా ఉండరు. యోగాలో మీరు ఒక అనుభవం కోసం తాపత్రయపడరు. మీరు కేవలం దాన్ని పొందేందుకు సంసిద్ధులవుతారు, అంతే. అందుకు మీ అవయవాల మీద మీకు కొంత నియంత్రణ ఉండాలి. ప్రేమాశీస్సులతో... - మీ సద్గురు