![Elephant Tusks Weighing 4 kg Worth Rs 7 Crore In Chennai Owned DRI - Sakshi](/styles/webp/s3/article_images/2023/06/6/teeth.jpg.webp?itok=CteRkN_r)
సాక్షి, చెన్నై: చెన్నైలో ఏనుగు దంతాలను అక్రమంగా విక్రయించే ప్రయత్నం చేసిన వారిని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ)– చెన్నై అధికారులు ఆదివారం రాత్రి అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.7.19 కోట్ల విలువైన 4.03 కేజీల బరువు కలిగిన రెండు దంతాలను సీజ్ చేశారు. వన్య ప్రాణుల రక్షణ చట్టం వైల్డ్‌లైఫ్ ప్రొటెక్షన్ చట్టం 2023 కింద తొలి కేసు నమోదు చేశారు.
వివరాల్లోకి వెళితే... డీఆర్‌ఐ– చెన్నై అధికారులకు అందిన రహస్య సమాచారం మేరకు సెంట్రల్, టీ నగర్ పరిసరాల్లో ప్రత్యేక నిఘా బృందాలు కాపు కాశాయి. ఏనుగు దంతాలను టీ నగర్‌లో ఓ చోట విక్రయించే ప్రయత్నం చేసిన ఏడుగురిని డీఆర్‌ఐ అధికారులు పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి రెండు ఏనుగు దంతాలను స్వా«దీనం చేసుకున్నారు. ఓ వాహనం కూడా సీజ్ చేశారు.
2023 ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి వచ్చిన వన్యప్రాణుల రక్షణ చట్టం తాజా సవరణ మేరకు.. నిషేధ వస్తువులను సీజ్ చేసే అధికారం కస్టమ్స్ అధికారులకు సైతం కలి్పంచారు. దీంతో ఈ చట్టం కింద చెన్నై డీఆర్‌ఐ అధికారులు తొలి కేసును నమోదు చేశారు. పట్టుబడ్డ ఏడుగురిని, ఏనుగు దంతాలు, వాహనాన్ని తమిళనాడు చీఫ్ వైల్డ్ లైఫ్ అధికారులకు అప్పగించారు.
(చదవండి: ప్రమాదం జరిగి 4 రోజులు .. ఇంకా గుర్తించని 101 మృతదేహాలు..)
Comments
Please login to add a commentAdd a comment