ఎయిర్‌టెల్‌లో వాటాలు అమ్మేసిన మెరిల్‌ లించ్‌ | Merrill Lynch arm sells Airtel shares worth Rs1,931 crore | Sakshi
Sakshi News home page

ఎయిర్‌టెల్‌లో వాటాలు అమ్మేసిన మెరిల్‌ లించ్‌

Published Wed, Jan 17 2018 12:23 AM | Last Updated on Wed, Jan 17 2018 12:23 AM

Merrill Lynch arm sells Airtel shares worth Rs1,931 crore - Sakshi

న్యూఢిల్లీ: భారతీ ఎయిర్‌టెల్‌లో మెరిల్‌లించ్‌ తనకున్న వాటాల్లో సింహ భాగాన్ని విక్రయించేసింది. ఎయిర్‌టెల్‌లో మెరిల్‌లించ్‌కు డిసెంబర్‌ త్రైమాసికం ముగిసే నాటికి 5.09 కోట్ల షేర్లుండగా, వీటిలో 3.87 కోట్ల షేర్లను మంగళవారం సగటున ఒక్కో షేరును రూ.499.1 చొప్పున విక్రయించింది. ఇది 0.97 శాతం వాటాకు సమానం. ఈ షేర్లను ఎస్‌ఆర్‌ఎస్‌ పార్ట్‌నర్స్‌ (కేమాన్‌) ఎల్‌ఎల్‌సీ కొనుగోలు చేసింది. ఈ లావాదేవీ విలువ రూ.1,931.23 కోట్లు. బీఎస్‌ఈలో ఎయిర్‌టెల్‌ షేరు క్రితం ముగింపుతో పోలిస్తే 1.43 శాతం నష్టంతో రూ.496.90 వద్ద ముగిసింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement