వాట్సాప్ సేవలు బంద్!
న్యూఢిల్లీ: బ్లాక్‌బెర్రీ, నోకియా ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే మొబైల్ హ్యాండ్‌సెట్లలో వాట్సాప్ మెసెంజర్ సేవలు నిలిచిపోనున్నాయి. బ్లాక్‌బెర్రీ (బ్లాక్‌బెర్రీ 10 సహా), నోకియా ఎస్40, నోకియా సింబియాన్ ఎస్60, ఆండ్రాయిడ్ 2.1, 2.2, విండోస్ ఫోన్ 7.1 ఓఎస్‌లపై నడిచే ఫోన్లలో వాట్సాప్ మెసెంజర్ సేవలను ఈ ఏడాది చివరి నాటికి నిలిపివేస్తున్నట్లు వాట్సాప్ సంస్థ ప్రకటించింది. ప్రస్తుతం అంతర్జాతీయంగా ఉన్న మొబైల్ హ్యాండ్‌సెట్స్‌లో దాదాపు 99.5 శాతం వరకు ఫోన్లు గూగుల్, మైక్రోసాఫ్ట్, యాపిల్ కంపెనీల ఆపరేటింగ్ సిస్టమ్ (ఓఎస్)పై పనిచేస్తున్నాయని తెలిపింది. అత్యధిక ప్రజలు ఉపయోగిస్తున్న ఓఎస్‌పైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరించినట్లు పేర్కొంది. ఫేస్‌బుక్ 2014 ఫిబ్రవరిలో వాట్సాప్‌ను 19 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది.