ఒబామా ఏ ఫోను వాడతారో తెలుసా!! | the highly secured phone of barrack obama and its features | Sakshi
Sakshi News home page

ఒబామా ఏ ఫోను వాడతారో తెలుసా!!

Published Tue, Jan 20 2015 5:40 PM | Last Updated on Thu, Apr 4 2019 3:20 PM

ఒబామా ఏ ఫోను వాడతారో తెలుసా!! - Sakshi

ఒబామా ఏ ఫోను వాడతారో తెలుసా!!

మన చేతుల్లో రకరకాల ఫోన్లు ఇప్పుడు తిరుగుతున్నాయి. రోజుకో కొత్త మోడల్ ఫోను దిగుతోంది. అయితే.. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఏ ఫోను వాడతారో, దాని ఫీచర్లేంటో తెలుసా? ఇప్పటివరకు ఉన్న అమెరికా అధ్యక్షులందరిలోకీ బాగా సాంకేతిక నిపుణుడైన ఒబామా ఎప్పుడూ బ్లాక్ బెర్రీ ఫోనునే ఉపయోగిస్తారు. ఎందుకో చూద్దామా..

అమెరికా అధ్యక్షుడి ఫోనుకు భద్రత అత్యంత ముఖ్యం. ఎంతటి నిపుణుడైన హ్యాకర్ అయినా.. ఆ ఫోనును ముట్టుకోలేని పరిస్థితి ఉండాలి. ముఖ్యంగా గూఢచారులు ఆయన ఎప్పుడు, ఎవరితో, ఏం మాట్లాడుతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. వాళ్లకు అందకుండా ఉండాలి.

ఒబామా దాదాపు దశాబ్ద కాలం నుంచి బ్లాక్బెర్రీ ఫోనునే ఉపయోగిస్తున్నారు. కానీ, 2008లో దాన్ని వదిలిపెట్టి, ఎన్ఎస్ఏ అందించిన సెక్టెరా ఎడ్జ్ ఫోను ఉపయోగించడం మొదలుపెట్టారు. ఆ తర్వాత కొంతకాలానికి మళ్లీ ఆయన గొంతునే పాస్వర్డ్గా ఉపయోగించే బ్లాక్బెర్రీ ఫోను ఆయన చేతికి వచ్చింది.

హ్యాకర్లు ఛేదించగలరనుకునే ప్రతి ఒక్క అంశాన్నీ ఈ ఫోనులో చేర్చారు. అందులో గేమ్స్ ఉండనే ఉండవు. సెల్ఫీ కెమెరా ఉండదు, ఎస్ఎంఎస్ ఇవ్వడానికీ కుదరదు. కానీ అత్యాధునికమైన ఎన్క్రిప్షన్ ఫీచర్లు మాత్రం ఉంటాయి.

ఈ ఫోనులోంచి కేవలం 10 నెంబర్లకు మాత్రమే ఫోన్ చేయడానికి కుదురుతుంది. అదే తరహా ఎన్క్రిప్షన్ ఉన్న ఫోన్లకే దీన్నుంచి కాల్స్ వెళ్తాయి. ఉపాధ్యక్షుడు జో బిడెన్, భార్య మిషెల్, కొందరు సలహాదారులు, భద్రతా చీఫ్ మాత్రమే ఆయన నుంచి కాల్స్ అందుకోగలరు.

ఐఎంఈఐ నెంబరును కూడా ఈ ఫోను దాచేస్తుంది. దాంతో దాన్ని ట్రాక్ చేయడం అసాధ్యం అవుతుంది. అందువల్ల వైట్హౌస్ కమ్యూనికేషన్ ఏజెన్సీ వాళ్లు ఒబామా ఎక్కడికెళ్లినా ఓ సెక్యూర్ బేస్ స్టేషన్ వెంట తీసుకెళ్లాలి. అప్పుడే ఆ ఫోను పనిచేస్తుంది.

సాధారణంగా ఈ సెక్యూర్ బేస్ స్టేషన్.. ఒబామా ఉపయోగించే ఎయిర్ఫోర్స్ వన్ విమానంలో ఉంటుంది. ఇది వాషింగ్టన్తో ఉపగ్రహం ద్వారా అనుసంధానం అయి ఉంటుంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement