బ్లాక్బెర్రీ నుంచి మరో కొత్త ఆండ్రాయిడ్ ఫోన్.!
న్యూఢిల్లీ: బ్లాక్బెర్రీ నుంచి మరో కొత్త ఆండ్రాయిడ్ ఫోన్ త్వరలో మార్కెట్లోకి రానుంది. ఇప్పటికే తన తొలి ఆండ్రాయిడ్ ఫోన్ ప్రివ్ పేరుతో రిలీజ్ చేసిన బ్లాక్బెర్రీ.. తక్కువ ధరలో ఫోన్ ను అందుబాటులో తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇటీవల న్యూఢిల్లీ వచ్చిన బ్లాక్బెర్రీ సీఈఓ జాన్ చెన్ ఈ విషయాన్ని తెలియజేశారు. ప్రివ్ ధర ఎక్కువ ఉండటంతో పాటు, దానికి తోడు నిలబడే మరో ఫోన్ ఏదీ సంస్థ నుంచి లేకపోవడం వల్లే విజయం సాధించలేకపోయిందని చెప్పారు.
బ్లాక్బెర్రీ ఓఎస్10 విజయంపై స్పందిస్తూ మొబైల్స్లో భారీ విజయాన్ని సాధించలేకపోయినా.. ప్రభుత్వాలు ఈ ఓఎస్ను ఉపయోగించడానికి ఇష్టపడుతున్నాయని తెలిపారు. మిగతా ఫోన్ల మాదిరి బ్లాక్బెర్రీ ఇండియాలో పెద్ద మొత్తాన్ని పెట్టుబడి పెడుతున్నట్లు చెప్పారు. రాబోయే ఆండ్రాయిడ్ మొబైల్ ధర ఇండియాలో రూ.25,000లు ఉంటుందని తెలిపారు.