బ్లాక్ బె ర్రీ నుంచి లీప్ 4జీ స్మార్ట్‌ఫోన్ | leap 4G smartphone from black berry | Sakshi
Sakshi News home page

బ్లాక్ బె ర్రీ నుంచి లీప్ 4జీ స్మార్ట్‌ఫోన్

Published Wed, Mar 4 2015 12:56 AM | Last Updated on Sat, Sep 2 2017 10:14 PM

బ్లాక్ బె ర్రీ నుంచి లీప్ 4జీ స్మార్ట్‌ఫోన్

బ్లాక్ బె ర్రీ నుంచి లీప్ 4జీ స్మార్ట్‌ఫోన్

బార్సిలోనా: బ్లాక్‌బెర్రీ కంపెనీ మధ్య రేంజ్ 4జీ స్మార్ట్‌ఫోన్, లీప్‌ను అందిస్తోంది. దాదాపు రూ.17,000(275 డాలర్లు) ధర ఉన్న ఈ ఫోన్‌ను ఇక్కడ జరుగుతున్న  మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో ఆవిష్కరించింది. శామ్‌సంగ్, యాపిల్ కంపెనీలకు దీటుగా, యువ నిపుణులు లక్ష్యంగా తెస్తున్న ఈ ఫోన్‌ను వచ్చే నెల కల్లా యూరప్ మార్కెట్లోకి అందుబాటులోకి తెస్తామని కంపెనీ పేర్కొంది. 5 అంగుళాల ఆల్-టచ్ స్క్రీన్, బ్లాక్‌బెర్రీ 10.3..1 ఆపరేటింగ్ సిస్టమ్, 16 జీబీ స్టోరేజ్, 8 మెగా పిక్సెల్ కెమెరా, 2,800 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలున్నాయని వివరించింది.


 ఈ లీప్ ఫోన్‌తో పాటు స్లైడర్ కీబోర్డ్ ఉన్న  డ్యుయల్-కర్వ్‌డ్ టచ్‌స్క్రీన్‌ను  ఈ ఏడాదిలోనే అందించనున్నామని కంపెనీ పేర్కొంది. ప్రస్తుతానికి ఈ ఫోన్‌ను ది స్లైడ్ పేరుతో వ్యవహరిస్తున్నామని బ్లాక్‌బెర్రీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జాన్ షెన్ చెప్పారు. హై-ఎండ్ పోర్షే ఎడిషన్ బ్లాక్‌బెర్రిలో త్వరలో ఫాలోఆప్ వేరియంట్‌ను అందిస్తామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement