Mobile World Congress
-
మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2024: వీటికే అవార్డ్స్..
ఫిబ్రవరి 26 నుంచి బార్సిలోనాలో ప్రారంభమైన 'మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2024' (MWC 2024)లో అనేక కొత్త ఉత్పత్తులు కనిపించాయి. ఇందులో స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్స్ వంటివి ఉన్నాయి. ఎండబ్ల్యుసీ 2024 వేదికపై కొన్ని ఉత్పత్తులు ఆండ్రాయిడ్ అథారిటీ బెస్ట్ ఆఫ్ MWC 2024 అవార్డులు గెలుచుకున్నాయి. ఆండ్రాయిడ్ అథారిటీ బెస్ట్ ఆఫ్ MWC 2024 అవార్డులు గెలుచుకున్న ఉత్పత్తులు షియోమీ 14 అల్ట్రా లెనోవా ట్రాన్స్పరెంట్ ల్యాప్‌టాప్ హానర్ మ్యాజిక్ 6 ప్రో శామ్సంగ్ గెలాక్సీ రింగ్ ZTE నుబియా ప్యాడ్ 3D 2 హానర్ మ్యాజిక్‌బుక్ ప్రో 16 టెక్నో పోలార్ఏస్ అండ్ కెమోన్ 30 ప్రీమియర్ పాయింట్ ఎంసీ02 నథింగ్ ఫోన్ 2ఏ ఒప్పో ఎయిర్ గ్లాస్ 3 వన్‌ప్లస్ వాచ్ 2 మోటోరోలా స్మార్ట్ కనెక్ట్ నుబియా ఫ్లిప్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ఎక్స్80 / ఫాస్ట్ కనెక్ట్ 7900 హానర్ ఐ-ట్రాకింగ్ టెక్ -
కళ్ళముందే సరికొత్త ప్రపంచం.. మొదలైన 'మొబైల్ వరల్డ్ కాంగ్రెస్' ఈవెంట్
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న '2024 మొబైల్ వరల్డ్ కాంగ్రెస్' (MWC 2024) ఈవెంట్ ఈ రోజు ప్రారంభమైంది. స్పెయిన్‌లోని బార్సిలోనాలో ప్రారంభమైన MWC 2024 ఈవెంట్ ఈ రోజు నుంచి గురువారం (ఫిబ్రవరి 26 నుంచి 29) వరకు జరుగుతుంది. ఇందులో అనేక స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలు స్మార్ట్ఫోన్లను, యాక్సెసరీలను, ఏఐ టెక్నాలజీతో కూడిన ఆవిష్కరణలను ప్రవేశపెట్టనున్నాయి. ఈ ఈవెంట్లో శాంసంగ్, షావోమీ, రియల్మీ, వివో, మోటొరోలా, లెనోవో, ఇన్ఫీనిక్స్, టెక్నో వంటి అనేక టెక్ కంపెనీలు తమ సరికొత్త స్మార్ట్ఫోన్లను ప్రపంచానికి పరిచయం చేయనున్నాయి. ల్యాప్‌టాప్‌ల విషయానికి వస్తే.. ఇందులో హెచ్‌పీ, లెనోవో, డెల్, అసుస్ మొదలైన కంపెనీలు ఉన్నట్లు తెలుస్తోంది. మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2024లో ఎక్కువగా ఏఐ బేస్డ్ మోడల్స్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. గత కొన్ని సంవత్సరాల నుంచి పెరుగుతున్న ఏఐ టెక్నాలజీని దృష్టిలో ఉంచుకుని టెక్ కంపెనీలు చాలా వరకు తమ ఉత్పత్తులలో కూడా ఏఐ ఫీచర్స్ అందించాలని సంకల్పించాయి. ఇదీ చదవండి: కోడింగ్ అవసరమే లేదు!.. ఎన్విడియా సీఈఓ కీలక వ్యాఖ్యలు గత ఏడాది ఈ ఈవెంట్ సందర్శించడానికి ఏకంగా లక్షల మంది జనం వెళ్లినట్లు సమాచారం. ఈ సంవత్సరం ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం. ఈ ఈవెంట్లో లాంచ్ కావడానికి దిగ్గజ కంపెనీల ఉత్పత్తులు సిద్ధంగా ఉన్నాయి. 29వ తేదీ వరకు ఈ ఉత్పత్తులను మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2024లో ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. -
ఫిషింగ్ కట్టడికి తాన్లా పరిష్కారం
బార్సిలోనా: ఈ–మెయిల్స్, మొబైల్‌కు సైబర్ నేరగాళ్లు పంపే లింక్స్‌ను ఓపెన్ చేసి డబ్బులు పోగొట్టుకుంటున్న ఘటనలు రోజూ చూస్తున్నాం. ఇలాంటి ఫిషింగ్ సందేశాలు సబ్స్క్రైబర్లకు చేరకుండా నిరోధించే టెక్నాలజీని క్లౌడ్ కమ్యూనికేషన్స్ సేవల్లో ఉన్న హైదరాబాద్ కంపెనీ తాన్లా ప్లాట్‌ఫామ్స్ అభివృద్ధి చేసింది. ప్రస్తుతం వొడాఫోన్ ఐడియా నెట్‌వర్క్‌లో పరీక్షలు జరుగుతున్నాయి. బార్సిలోనాలో జరుగుతున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్–2023 సందర్భంగా ఈ సాంకేతికతను ట్రాయ్ చైర్మన్ పి.డి.వాఘేలా చేతుల మీదుగా ఆవిష్కరించారు. ‘యాంటీ–ఫిషింగ్‌కు పరిష్కారాన్ని భారత్‌లో అభివృద్ధి చేశాం. సమస్య ప్రపంచవ్యాప్తంగా ఉంది. తాన్లా యాంటీ–ఫిషింగ్ ప్లాట్‌ఫామ్ ఒక నిమిషంలో మోసాన్ని గుర్తిస్తుంది. ఈ సాంకేతికత కోసం అంతర్జాతీయంగా ఆసక్తి కనబరుస్తున్నారు’ అని తాన్లా ప్లాట్‌ఫామ్స్ ఫౌండర్, చైర్మన్, సీఈవో డి.ఉదయ్ రెడ్డి తెలిపారు. మోసగాళ్లను ఏరివేయడానికి నియంత్రణ సంస్థలకు ఇది సాయపడుతుందని అన్నారు. వాయిస్ కాల్ ఆధారిత మోసాలకు చెక్ పెట్టేందుకు సొల్యూషన్స్‌ను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. దీనిని వచ్చే రెండు త్రైమాసికాల్లో అందుబాటులోకి తెస్తామన్నారు. 30 కోట్ల మందికి ముప్పు.. భారత్‌లో కంపెనీ అంచనాల ప్రకారం దాదాపు 30 కోట్ల మంది ఫిషింగ్ దాడులకు గురయ్యే అవకాశం ఉందని ఉదయ్ రెడ్డి వెల్లడించారు. ‘వీరిలో 5 లక్షల మంది మోసపోయే చాన్స్ ఉంది. బాధితుల్లో 7% మంది మాత్రమే వివిధ కారణాల వల్ల నేరం గురించి ఫిర్యాదు చేస్తున్నారు. ఫేక్ ఎలక్ట్రిసిటీ బిల్ అలర్ట్, నో యువర్ కస్టమర్ వెరిఫికేషన్ వంటి 10–11 పద్ధతుల్లో ఫిషింగ్ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. సిమ్, యాప్స్‌ను మోసగాళ్లు వేదికగా చేసుకుంటున్నారు. స్కామ్ సందేశాలు వినియోగదారులకు చేరకుండా చూసుకోవాలి. ఇందుకోసం ఈ టెక్నాలజీని మొబైల్ సర్వీస్ ప్రొవైడర్లతో మాత్రమే కాకుండా గూగుల్, వాట్సాప్ వంటి ప్లాట్‌ఫామ్స్‌తో కూడా అనుసంధానించాం. ఫిషింగ్ సైట్స్‌ను నిరోధించే కొన్ని సర్వీస్ ఏజెన్సీలతో కూడా భాగస్వామ్యం చేసుకున్నాం’ అని వివరించారు. -
క్లౌడ్ కంప్యూటింగ్‌తో కాల్ డ్రాప్స్‌కు చెక్
బార్సెలోనా: కాల్ అంతరాయాల (డ్రాప్స్) సమస్య పరిష్కారించేందుకు దృష్టి పెట్టాల్సిన అంశాలు మూడు ఉన్నాయని హెచ్‌సీఎల్ టెక్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ కల్యాణ్ కుమార్ తెలిపారు. క్లౌడ్ కంప్యూటింగ్ ఆధారిత టెలికం నెట్వర్క్, ఇళ్లకు చేరువలో ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయడం, నెట్‌వర్క్‌ను వర్చువల్ విధానానికి మార్చడం ఇందుకు సహాయపడగలదని ఆయన పేర్కొన్నారు. మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో పాల్గొన్న సందర్భంగా కుమార్ ఈ విషయాలు వివరించారు. కరోనా మహమ్మారి తర్వాత డేటాకు డిమాండ్ గణనీయంగా పెరిగిందని, టెల్కోలు తమ నెట్‌వర్క్‌ల నిర్వహణ కోసం క్లౌడ్ కంప్యూటింగ్ సిస్టమ్స్ వైపు మళ్లుతున్నాయని ఆయన పేర్కొన్నారు. నోకియా మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ ఇండెక్స్ నివేదిక ప్రకారం భారత్‌లో గత అయిదేళ్లలో మొబైల్ డేటా ట్రాఫిక్ 3.2 రెట్లు పెరిగింది. అయితే, టెల్కోల నెట్వర్క్ సాఫ్ట్వేర్ వినియోగం ఆ స్థాయిలో పెరగలేదని కుమార్ చెప్పారు. సాఫ్ట్‌వేర్‌ను, క్లౌడ్ సాంకేతికతలను పూర్తి స్థాయిలో వినియోగించుకుంటే కాల్ డ్రాప్ సమస్యను పరిష్కరించుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. -
అతిపెద్ద 5జీ ఆపరేటర్‌గా జియో!
బార్సిలోనా: సరసమైన సేవలతో ప్రపంచంలోనే అతిపెద్ద 5జీ (స్టాండలోన్) నెట్వర్క్ ఆపరేటర్‌గా ఈ ఏడాది జియో అవతరిస్తుందని సంస్థ తెలిపింది. రెండవ అర్ధ భాగంగా ఈ ఘనతను సాధిస్తామని రిలయన్స్ జియో ప్రెసిడెంట్ మాథ్యూ ఊమెన్ మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ సందర్భంగా వెల్లడించారు. ‘అన్ని అధునాతన సేవలు, సామర్థ్యాలు ప్రజలకు అందుబాటులో ఉండేలా కంపెనీ చూస్తుంది. భారత్‌కు సమ్మిళిత వృద్ధి అవసరం. ఈ విషయంలో జియో మద్దతునిస్తూనే ఉంటుంది’ అని చెప్పారు. -
Xiaomi AR Smart Glass: కళ్ళముందున్న ప్రపంచాన్ని చేతితో..
చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ షియోమీ తన వైర్లెస్ AR గ్లాస్ డిస్కవరీ ఎడిషన్ ప్రోటోటైప్‌ను మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2023లో ప్రదర్శించింది. ఇది ఏఆర్ హెడ్సెట్ స్నాప్‌డ్రాగన్ ఎక్స్ఆర్2 జెన్ 1 చిప్సెట్ ద్వారా పనిచేస్తుంది. ఇది వైర్‌లెస్‌గానే మొబైల్ ఫోన్‌కి కనెక్ట్ అవుతుంది. వైర్లెస్ ఏఆర్ గ్లాసెస్ చూడటానికి సింపుల్‌గా ఉండటమే కాకుండా, చాలా తేలికగా కూడా ఉంటుంది. కంపెనీ ఇందులో కార్బన్ ఫైబర్, మెగ్నీషియం టైటానియం వంటి మిశ్రమాలను ఉపయోగించింది. దీని బరువు కేవలం 126 గ్రాములు మాత్రమే. ఇది కస్టమ్ సిలికాన్-ఆక్సిజన్ యానోడ్ బ్యాటరీ కలిగి ఉంటుంది. షియోమీ ఏఆర్ గ్లాసెస్ తేలికగా ఉండటమే కాకుండా ఒక జత మైక్రో OLED స్క్రీన్లను కలిగి ఉండటం వల్ల లైట్ గైడింగ్ ప్రిజమ్లకి కనెక్ట్ చేయబడతాయి. ఇది 12 నకిల్స్ ఫంక్షన్‌కి సపోర్ట్ చేస్తుంది. చైనీస్ నైన్-కీ ఇన్పుట్ మాదిరిగా ఇది వినియోగదారుల థంబ్ ద్వారా టెక్స్ట్ ఇన్పుట్ చేయడానికి అనుమతిస్తుంది. ఏఆర్ గ్లాస్లో లెన్స్‌లు ఎలెక్ట్రోక్రోమిక్ టెక్నాలజీని ఉపయోగిస్తాయి, కావున ఆన్ చేయడం ఆఫ్ చేయడం రెండు సులభంగా ఉంటాయి. ఇది కేవలం స్ట్రీమింగ్కు మాత్రమే కాకుండా అంతకు మించిన ఉపయోగాలను వినియోగదారులకు అందిస్తుంది. ఇందులో హ్యాండ్ ట్రాకింగ్ టెక్నాలజీ కూడా ఉంది. షియోమీ విడుదల చేయనున్న లేటెస్ట్ ఏఆర్ గ్లాసెస్ చాలా ఆధునిక ఫీచర్స్ పొందుతుంది. అయితే కంపెనీ దీనిని ఎప్పుడు లాంచ్ చేస్తుంది, ధరలు ఎలా ఉంటాయనేది తెలియాలి. అయితే కంపెనీ దీనిని త్వరలోనే మార్కెట్లో విడుదల చేయడానికి కావలసిన అన్ని సన్నాహాలు చేస్తోంది. Boasting a retina-level near-eye display for AR glasses, Xiaomi Wireless AR Glass Discovery Edition delivers a truly immersive visual experience. Moreover, our self-developed Xiaomi AR Gesture Control empowers effortless control between virtual and real space. pic.twitter.com/EipqBWxkpW — Lei Jun (@leijun) February 27, 2023 -
సంస్కరణలకు గుర్తింపు
న్యూఢిల్లీ: జీఎస్ఎం అసోసియేషన్ (జీఎస్ఎంఏ) భారత్‌కు ‘గవర్నమెంట్ లీడర్షిప్ అవార్డ్ 2023’ ఇవ్వడం అన్నది దేశం చేపట్టిన టెలికం సంస్కరణలు, విధానాలకు గుర్తింపు అని టెలికం మంత్రి అశ్వని వైష్ణవ్ అన్నారు. అంతర్జాతీయంగా 750 మొబైల్ ఆపరేటర్లు, 400 కంపెనీలతో కూడినదే జీఎస్ఎంఏ. ఏటా ఒక దేశానికి ఈ అసోసియేషన్ అవార్డ్ ప్రకటిస్తుంటుంది. 2023 సంవత్సరానికి గాను జీఎస్ఎంఏ గవర్నమెంట్ లీడర్షిప్ అవార్డ్‌ను భారత్ గెలుచుకుంది. ఫిబ్రవరి 27న బార్సెలోనాలో జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో భారత్‌ను విజేతగా జీఎస్ఎంఏ ప్రకటించింది. ఈ సందర్భంగా మంత్రి వైష్ణవ్ మాట్లాడుతూ.. నరేంద్ర మోదీ సర్కారు చేపట్టిన సంస్కరణలకు అంతర్జాతీయ గుర్తింపుగా పేర్కొన్నారు. సంస్కరణల ఫలితాలను మనం చూస్తున్నట్టు చెప్పారు. భారత టెలికం ఉదయిస్తున్న రంగమని, ప్రపంచం ఈ వృద్ధిని గమనించినట్టు తెలిపారు. ‘‘రైట్ ఆఫ్ వే అనుమతికి గతంలో 230 రోజులు పట్టేది. ఇప్పుడు కేవలం ఎనిమిది రోజుల్లోనే వచ్చేస్తోంది. 85 శాతానికి పైగా టవర్ అనుమతులు తక్షణమే లభిస్తున్నాయి’’అని మంత్రి వివరించారు. 387 జిల్లాల్లో లక్ష సైట్లతో, 5జీ విస్తరణ వేగవంతంగా ఉన్నట్టు మంత్రి తెలిపారు. తయారీ, ఆవిష్కరణలు, ఉద్యోగ కల్పనపై భారత్ ప్రగతిని వివరించారు. 200 పట్టణాలకు మార్చి నాటికి 5జీ సేవలను అందుబాటులోకి తెస్తామని ఇచ్చిన హామీని గుర్తు చేస్తూ.. లక్ష్యానికంటే ముందే దాన్ని చేరుకున్నట్టు ప్రకటించారు. -
7 బిలియన్ డాలర్లకు ఆదాయం
బార్సిలోనా: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23)లో 7 బిలియన్ డాలర్ల ఆదాయం(రన్ రేటు)ను అందుకోగలమని ఐటీ సేవల దిగ్గజం టెక్ మహీంద్రా ఎండీ, సీఈవో సీపీ గుర్నానీ తాజాగా అభిప్రాయపడ్డారు. దీనిలో టెలికం విభాగం నుంచి 3 బిలియన్ డాలర్లు సమకూరగలదని అంచనా వేశారు. టెలికం కంపెనీలకు అందించే 5జీ సొల్యూషన్ల నుంచి ఇప్పటికే బిలియన్ డాలర్ల(రూ. 8,300 కోట్లు) రన్ రేటును సాధించినట్లు వెల్లడించారు. 6.6 బిలియన్ డాలర్ల రన్ రేటును అందుకున్న తాము త్వరలోనే 7 బిలియన్ డాలర్ల(సుమారురూ. 58,000 కోట్లు)కు చేరుకోగలమని తెలియజేశారు. ఇక్కడ జరుగుతున్న 2023 మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ సందర్భంగా గుర్నానీ ఈ వివరాలు వెల్లడించారు. లాభం డౌన్ ఈ ఏడాది అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో టెక్ మహీంద్రా కన్సాలిడేటెడ్ నికర లాభం 5 శాతం నీరసించి రూ. 1,297 కోట్లకు పరిమితమైంది. అయితే ఆదాయం మాత్రం 20 శాతం ఎగసి రూ. 13,735 కోట్లకు చేరింది. అమెరికా ప్రాంతాల నుంచే ఆదాయంలో 50 శాతం లభిస్తున్నట్లు కంపెనీ సీఎంఈ బిజినెస్ ప్రెసిడెంట్, నెట్వర్క్ సర్వీసుల సీఈవో మనీష్ వ్యాస్ తెలియజేశారు. యూరప్ నుంచి 30 శాతం, మిగిలిన ప్రపంచ దేశాల నుంచి 20 శాతం చొప్పున టర్నోవర్ నమోదవుతున్నట్లు వివరించారు. ఆయా ప్రాంతాలలో పెట్టుబడులు చేపడుతున్న నేపథ్యంలో ఈ ట్రెండ్ కొనసాగనున్నట్లు అభిప్రాయపడ్డారు. ఫైబర్, ఫిక్స్డ్ వైర్లెస్.. తదితర టెలికం సంబంధ అన్ని విభాగాలలోనూ వృద్ధి నమోదుకానున్నట్లు పేర్కొన్నారు. ప్రపంచ స్థూల ఆర్థిక పరిస్థితులు అనిశ్చితికి కారణమవుతున్నట్లు అభిప్రాయపడ్డారు. -
Bharti Airtel: ఈ ఏడాది మధ్యలో టారిఫ్‌ల పెంపు
బార్సెలోనా: ఈమధ్యే పలు దఫాలుగా ప్లాన్ల టారిఫ్‌లను పెంచిన టెలికం సంస్థ భారతి ఎయిర్టెల్ మరో విడత వడ్డింపునకు సిద్ధమవుతోంది. పెట్టుబడులపై రాబడులు అత్యంత తక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ ఏడాది మధ్యలో టారిఫ్‌లను పెంచే అవకాశం ఉందని కంపెనీ చైర్మన్ సునీల్ మిట్టల్ తెలిపారు. దీనివల్ల అట్టడుగున ఉన్నవారిపై పడే ప్రభావంపై స్పందిస్తూ.. ప్రజలు మిగతా వాటిపై చేసే ఖర్చులతో పోలిస్తే పెంపు చాలా స్వల్పమే ఉంటుందని పేర్కొన్నారు. ‘ఒక్కటి తప్ప.. అన్నీ పెరిగాయి. జీతాలు .. అద్దెలు పెరిగాయి. ఎవరూ ఫిర్యాదు చేయడం లేదు. ప్రజలు 30 జీబీ డేటాను దాదాపు ఏమీ కట్టకుండానే వినియోగిస్తున్నారు. దేశంలో మరో వొడాఫోన్ తరహా పరిస్థితి తలెత్తకూడదు. మనకు ఒక భారీ టెలికం సంస్థ అవసరం‘ అని మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో పాల్గొన్న సందర్భంగా మిట్టల్ చెప్పారు. కోటి మందికి ఎయిర్టెల్ 5జీ టెలికం కంపెనీ భారతీ ఎయిర్టెల్ కోటి మంది 5జీ చందాదార్లను సొంతం చేసుకుంది. 2024 మార్చి నాటికి దేశంలోని ప్రతి పట్టణం, ప్రధాన గ్రామీణ ప్రాంతాల్లో 5జీ సేవలను చేర్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు సోమవారం ప్రకటించింది. ప్రస్తుతం అన్ని రాష్ట్రాల్లో అడుగుపెట్టినట్టు తెలిపింది. ప్రపంచ స్థాయి 5జీ ప్లస్ అనుభూతిని అందించడానికి సరైన మార్గంలో ఉన్నట్టు విశ్వసిస్తున్నామని సంస్థ సీటీవో రన్‌దీప్ సిఖోన్ తెలిపారు. 2022 నవంబర్‌లో 10 లక్షల మంది కస్టమర్లు కంపెనీ 5జీ వేదికపైకి వచ్చారు. వాణిజ్య పరంగా సేవలు ప్రారంభించిన 30 రోజుల్లోనే ఈ ఘనతను సాధించామని ఎయిర్టెల్ తెలిపింది. దేశవ్యాప్తంగా ఉన్న ఎయిర్టెల్ రిటైల్ స్టోర్లను 5జీ ఎక్స్‌పీరియెన్స్ జోన్స్‌గా తీర్చిదిద్దామని కంపెనీ వివరించింది. -
నోకియా కొత్త లోగో చూశారా? నెటిజన్ల రియాక్షన్స్ మాత్రం..!
సాక్షి, ముంబై: టెలికాం పరికరాల తయారీదారు నోకియా సరికొత్త ప్లాన్లతో కస్టమర్లకు ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. సరికొత్త, బడ్జెట్ఫోన్లతో ప్రత్యేకతను చాటుకుంటున్న నోకియా తాజాగా తన ఐకానిక్ లోగోను మార్చింది. దాదాపు 60 ఏళ్లలో తొలిసారిగా నోకియా (NOKIA) లోగో మార్చుతూ నిర్ణయం తీసుకుంది. తన పాపులర్ లోగోతోపాటు బిజినెస్ వ్యూహాన్ని కూడా మార్చుతుండటం గమనార్హం. తద్వారా తన బ్రాండ్ గుర్తింపును మరింత విస్తరించాలని భావిస్తోంది. కొత్త లోగోతో కొత్త శకనాకి నాంది పలకాలని భావిస్తోంది. సోమవారం బార్సిలోనాలో ప్రారంభమైన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (MWC)లో చీఫ్ ఎగ్జిక్యూటివ్ పెక్కా లండ్మార్క్ తన ప్లాన్లను ప్రకటించారు. నోకియా తన బ్రాండ్ ఐడెంటిటీని రిఫ్రెష్ చేస్తున్నట్టు తెలిపారు. ఇకపై నోకియా కేవలం స్మార్ట్‌ఫోన్ కంపెనీ మాత్రమే కాదు బిజినెస్ టెక్నాలజీ కంపెనీ కూడా అని ప్రకటించారు. బిజినెస్-టు-బిజినెస్ ఇన్నోవేషన్లీడర్గా ఎదగనుందని తెలిపారు. దీని ప్రకారం నోకియా కొత్త లోగోలో ఐదు రకాల డిజైన్లతో NOKIA అనే పదాన్ని రూపొందించింది. (నోకియా అద్భుతమైన స్మార్ట్‌ఫోన్, మీరే రిపేర్ చేసుకోవచ్చు!) మరోవైపు నోకియా కొత్తలోగోపై సోషల్‌మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు లోగోను బాగా ఇష్టపడుతోంటే, మరింకొందరు అయిష్టతను వ్యక్తం చేస్తున్నారు. పాతదే బావుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యంగా కనెక్టింగ్ పీపుల్ అంటూ విపరీతంగా ఆకట్టుకున్న ఐకానిక్ లోగోను మార్చడంపై చాలామంది అసంతృప్తి వ్యక్తం చేశారు కాగా ఇటీవల రైట్ రిపేర్ లో భాగంగా కస్టమర్లు సొంతంగా రిపేర్ చేసుకునే జీ22ఫోన్‌ను పరిచయం చేసిన సంగతి తెలిసిందే. If you are eliminating vertical components from logo , then remove ‘I’ also. #Nokia pic.twitter.com/WclL5o0GZ6 — Anupam Biswas (@flyanupam) February 27, 2023 The new Nokia logo is mathematically correct. pic.twitter.com/uKu5O0kry8 — Arto Vartiainen (@artovartiainen) February 26, 2023 So disturbing #NokiaLogo #NokiaNewLogo The old one looked elegant and gorgeous. pic.twitter.com/ZYR6Ci3pU2 — Bernard D'sa (@bernarddsa) February 27, 2023 -
ట్రూకాలర్‌తో తాన్లా జట్టు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సీపాస్ (కమ్యూనికేషన్స్ ప్లాట్‌ఫాం యాజ్ ఎ సర్వీస్) దిగ్గజం తాన్లా ప్లాట్‌ఫామ్స్ తాజాగా కాలర్ ఐడెంటిఫికేషన్ సేవల సంస్థ ట్రూకాలర్‌తో జట్టు కట్టింది. ట్రూకాలర్ బిజినెస్ మెసేజింగ్‌కు తమ వైజ్లీ సీపాస్ ప్లాట్‌ఫామ్ సర్వీసులు అందించనుంది. బార్సెలోనాలో జరుగుతున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2022 సందర్భంగా ఇందుకు సంబంధించిన ఒప్పందం కుదుర్చుకుంది. సాంప్రదాయ ఎస్ఎంఎస్ సర్వీసులకు భిన్నంగా సందేశాలను వేగవంతంగా, చౌకగా డెలివరీ చేసేందుకు ఇది తోడ్పడుతుంది. వ్యాపార సంస్థలు తమ యూజర్లకు వ్యక్తిగతీకరించిన సందర్భోచిత సందేశాలను సురక్షితంగా అందించడానికి ఈ భాగస్వామ్యం ఉపయోగపడగలదని తాన్లా ప్లాట్‌ఫామ్స్ చైర్మన్ ఉదయ్ రెడ్డి తెలిపారు. దీనితో వ్యాపార సంస్థలకు సరళమైన, సమర్థమంతమైన కమ్యూనికేషన్ ప్లాట్‌ఫామ్‌ను అందించగలమని ట్రూకాలర్ సహ వ్యవస్థాపకుడు నామి జారింగ్హాలెమ్ తెలిపారు. -
మొబైల్స్‌కూ కరోనా కష్టాలు..!
న్యూఢిల్లీ: ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా వైరస్ .. దేశీ స్మార్ట్‌ఫోన్స్ పరిశ్రమను కూడా కలవరపెడుతోంది. పరికరాలు, సబ్–అసెంబ్లీస్ కోసం చైనాపై ఆధారపడిన దేశీ కంపెనీలకు .. సరఫరాపరమైన సమస్యలతో క్రమంగా సెగ తగులుతోంది. చైనాలో మూతబడిన ఫ్యాక్టరీలు మళ్లీ తెరుచుకుని, ఈ వారంలోనైనా ఉత్పత్తుల సరఫరా ప్రారంభమవుతుందేమోనని స్మార్ట్‌ఫోన్ సంస్థలు ఆశగా ఎదురుచూస్తున్నాయి. ‘దేశీ పరిశ్రమపై కరోనా వైరస్ ప్రభావం ఉంది. కొన్ని ఉత్పత్తులు, మోడల్స్‌పై ఇది స్పష్టంగా కనిపిస్తోంది. అయితే, కొన్ని ఫ్యాక్టరీలు దశలవారీగా మళ్లీ ఉత్పత్తి ప్రారంభించనున్న నేపథ్యంలో ప్రభావ తీవ్రతపై ఇప్పుడే ఒక అంచనాకు రావడం సాధ్యపడదు‘ అని ఇండియా సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) చైర్మన్ పంకజ్ మహింద్రూ తెలిపారు. దీనిపై మరింత వివరణ ఇచ్చేందుకు నిరాకరించిన మహింద్రూ.. దేశీ పరిశ్రమ ఈ వారమంతా వేచి, చూడాలని భావిస్తోందని పేర్కొన్నారు. మరోవైపు, దేశీ స్మార్ట్‌ఫోన్ సంస్థలకు అవసరమైన కీలక పరికరాలన్నీ చైనా నుంచే రావాల్సి ఉన్నందున.. క్షేత్రస్థాయిలో పరిస్థితులు అస్సలు బాగాలేవని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఇక డిమాండ్ లేక మార్కెట్లో మందగమనం పరిశ్రమను మరింత కలవరపెడుతోందని పేర్కొన్నాయి. కాగా, సరఫరాపరమైన సమస్యలకు సంబంధించి ప్రస్తుతానికైతే భారత్‌లో స్టాక్స్, ఉత్పత్తిపై పెద్దగా ప్రతికూల ప్రభావమేమీ లేదని స్మార్ట్‌ఫోన్స్ తయారీ సంస్థ రియల్మీ తెలిపింది. మరోవైపు, ఓ భారీ స్థాయి కాంట్రాక్ట్ తయారీ సంస్థ చైనాలోని ఒక ప్లాంటులో కార్యకలాపాలు తిరిగి ప్రారంభించినట్లు వార్తలు వచ్చాయి. కొద్ది సిబ్బందితో పనులు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. కరోనా వైరస్ బారిన పడి చైనాలో మరణించిన వారి సంఖ్య వెయ్యి దాటిపోయింది. చైనా వెలుపల ఇతర దేశాల్లో 350 పైగా కేసులు నమోదయ్యాయి. హాంకాంగ్, ఫిలిప్పీన్స్ దేశాల్లో కూడా ఇద్దరు మృత్యువాత పడ్డారు. మధ్యకాలికంగా సరఫరా ఇక్కట్లు: ఇండ్–రా కరోనా వైరస్ కారణంగా మధ్యకాలికంగా సరఫరా వ్యవస్థలు దెబ్బతినే ప్రమాదముందని రేటింగ్ ఏజెన్సీ ఇండ్–రా తెలిపింది. అయితే, వైరస్ ఒకవేళ హుబె ప్రావిన్స్‌కే పరిమితమైతే.. సమీప కాలంలో భారతీయ సంస్థలపై పెద్దగా ప్రతికూల ప్రభావం పడకపోవచ్చని తెలిపింది. కానీ, ‘కరోనా తీవ్రత మరో మూడు 4 నెలలు కొనసాగిందంటే మాత్రం ఫార్మా, టెక్స్టైల్స్, వాహన సంస్థలకు కీలకమైన ముడి వస్తువుల సరఫరాపరమైన సమస్యలు రావొచ్చు. ఇది 2003లో వచ్చిన సార్స్ ప్రభావాల కన్నా ఎక్కువగా ఉండొచ్చు‘ అని ఇండ్–రా వివరించింది. మొబైల్ కాంగ్రెస్‌కు దిగ్గజాలు దూరం.. కరోనా వైరస్ (ఎన్సీపీ) ప్రబలుతున్న నేపథ్యంలో త్వరలో జరగబోయే మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2020కి (ఎండబ్ల్యూసీ) దూరంగా ఉండాలని భావిస్తున్న కంపెనీల సంఖ్య పెరుగుతోంది. తాజాగా చైనాకు చెందిన హ్యాండ్సెట్ సంస్థ వివో, చిప్సెట్ సంస్థ ఇంటెల్‌తో పాటు పలు గ్లోబల్ బ్రాండ్స్ .. ఇందులో పాల్గొనడం లేదని ప్రకటించాయి. తమ ఉద్యోగులు, ఇతరత్రా ప్రజల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివో ఒక ప్రకటనలో తెలిపింది. జీఎస్ఎం అసోసియేషన్ తీసుకుంటున్న ముందస్తు జాగ్రత్త చర్యలు అభినందనీయమైనప్పటికీ ఎండబ్ల్యూసీకి దూరంగా ఉండటమే శ్రేయస్కరమని తాము భావిస్తున్నట్లు సాఫ్ట్వేర్ సేవలందించే యామ్‌డాక్స్ పేర్కొంది. అయితే, పరిస్థితులను బట్టి షెడ్యూల్ ప్రకారమే ఎండబ్ల్యూసీలో పాల్గొంటామని వివో అనుబంధ సంస్థ ఒపో వెల్లడించింది. ఎరిక్సన్, అమెజాన్, సోనీ వంటి దిగ్గజాలు ఇప్పటికే ఎండబ్ల్యూసీలో పాల్గొనటం లేదని ప్రకటించిన సంగతి తెలిసిందే. షెడ్యూల్ ప్రకారమే కాంగ్రెస్... ఫిబ్రవరి 24–27 తేదీల మధ్య స్పెయిన్‌లోని బార్సెలోనాలో మొబైల్ కాంగ్రెస్ జరగనుంది. అయితే, కరోనా వైరస్ భయాల కారణంగా చైనా నుంచి రావాల్సిన 5,000–6,000 మంది దాకా డెలిగేట్లు హాజరు కాలేకపోతున్నారని మొబైల్ కాంగ్రెస్ నిర్వహించే జీఎస్ఎం అసోసియేషన్ వెల్లడించింది. అయినప్పటికీ అన్ని జాగ్రత్తలూ తీసుకుని, షెడ్యూల్ ప్రకారమే ఎండబ్ల్యూసీని నిర్వహించనున్నట్లు పేర్కొంది. -
ప్రపంచ మొబైల్ కాంగ్రెస్‌కు అమెజాన్ ‘నో’
న్యూఢిల్లీ : స్పెయిన్‌లోని బార్సిలోనాలో ఫిబ్రవరి 24వ తేదీ నుంచి 28వ తేదీ వరకు కొనసాగనున్న ‘మొబైల్ వరల్డ్ కాంగ్రెస్–2020’ నుంచి తప్పుకుంటున్నట్లు తాజాగా అమెరికా దిగ్గజ ఆన్‌లైన సంస్థ అమెజాన్, జపాన్‌కు చెందిన ఎలక్ట్రానిక్ సంస్థలు తాజాగా సోమవారం ప్రకటించాయి. ఇప్పటికే ఈ కాంగ్రెస్‌కు హాజరు కావడం లేదని దక్షిణ కొరియాకు చెందిన ఎల్జీ ఎలక్ట్రానిక్స్, స్విడ్జర్లాండ్‌కు చెందిన ఎరిక్సన్, అమెరికాకు చెందిన చిప్ కంపెనీ ఎన్వీడియా కంపెనీలు ఇదిరవరకే ప్రకటించాయి. అందరి భయం ఒక్కటే. కరోనా వైరస్. ఇప్పటికే స్పెయిన్‌లో నలుగురికి ఈ వైరస్ సోకినట్లు నిర్ధారించారు. ఈ వైరస్ వెలుగులోకి వచ్చిన చైనాలో వుహాన్ పట్టణంలో ఎక్కువ మంది స్పెయిన్ ప్రజలు ఉండడం, వైరస్ గురించి తెలియగానే వారంతా స్పెయిన్ వచ్చేయడంతో ప్రపంచ దిగ్గజ కంపెనీలు కూడా అక్కడికి వెళ్లేందుకు భయపడుతున్నాయి. ప్రపంచ మొబైల్ సమ్మేళనం నిర్వాహకులు వుహాన్ రాజధానిగా ఉన్న చైనాలోని హుబీ రాష్ట్రం నుంచి ఏ కంపెనీ కూడా సమ్మేళనంకు రాకుండా ముందుగానే నిషేధం విధించింది. ఐదు దిగ్జజ కంపెనీలు సమ్మేళనంకు రాకపోయినా తాము మాత్రం సమ్మేళనాన్ని కొనసాగిస్తామని నిర్వాహకులు తెలిపారు. -
సోనీ ఎక్స్‌పీరియా 1 : సరికొత్త టెక్నాలజీతో
ప్రముఖ ఎలక్ట్రానిక్స్ సంస్థ సోనీ సరికొత్త టెక్నాలజీ , అద్భుతమైన ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్‌ను తాజాగా విడుదల చేసింది. సోనీ ఎక్స్ పీరియా 1ను స్పెయిన్ లోని బార్సిలోనాలో జరుగుతున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (ఎండబ్ల్యూసీ) 2019 ప్రదర్శనలో లాంచ్ చేసింది. ప్రపంచంలోనే తొలిసారి ఐ ఫోటో ఫోకస్ టెక్నాలజీతో తీసుకొచ్చినట్టు కంపెనీ వెల్లడించింది. దీని ధరను అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ సుమారు రూ. 74200గా ఉంటుందని అంచనా. బ్లాక్, పర్పుల్, గ్రే, వైట్ కలర్స్‌లో లభ్యం. దీంతోపాటు ఎక్స్ పీరియా ఎక్స్ జెడ్ 3 కి కొనసాగింపుగా ఎక్స్ జెడ్ 4 స్మార్ట్‌ఫోన్ , ఎక్స్‌పీరియా 10, ఎక్స్‌పీరియా 10 ప్లస్‌ను కూడా పరిచయం చేసింది. సోనీ ఎక్స్‌పీరియా 1 ఫీచర్లు 6.5 అంగుళాల 4కె డిస్ప్లే 1644×3840 పిక్సెల్స్ రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 9.0 పై 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ 512 జీబీ దాకా విస్తరించుకునే అవకాశం 12+12+12 ట్రిపుల్ రియర్ కెమెరా 8 ఎంపీ సెల్ఫీ కెమెరా 3300 ఎంఏహెచ్ బ్యాటరీ -
జియోకి షాక్ : నోకియా ఫీచర్ ఫోన్
హెచ్ఎండీ గ్లోబల్ తన నోకియా మరో ఫీచర్ ఫోన్‌ను మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (ఎండబ్ల్యూసీ) 2019లో విడుదల చేసింది. నోకియా 210 పేరుతో తీసుకొచ్చిన ఈ ఫీచర్ ఫోన్‌ను బడ్జెట్‌ధరలో అందుబాటులో ఉంచింది. 2జీ సపోర్టు, డ్యుయల్ సిమ్ సదుపాయం ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. ఫేస్బుక్ తోపాటు రెగ్యులర్ స్నేక్ గేమ్‌ను కూడా ఇందులో పొందుపర్చింది. చార్కోల్, రెడ్, గ్రే కలర్ ఆప్షన్లలో లభిస్తున్న ఈ మొబైల్ ధర సుమారు రూ.2,500. వచ్చే వారం ఈ ఫోన్ వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. నోకియా 210 ఫీచర్లు 2.4 ఇంచుల డిస్ ప్లే 2జీబీ ర్యామ్,16 ఎంబీ ఇంటర్నల్ స్టోరేజ్ వీజీఏ రియర్ కెమెరా విత్ ఫ్లాష్ ఎఫ్ఎం రేడియో, ఎంపీ3 ప్లేయర్ 1020 ఎంఏహెచ్ బ్యాటరీ 20 రోజుల స్టాండ్ బై టైం, మైక్రో యూఎస్బీ పోర్టు తదితర ఫీచర్లు నోకియా 210 సొంతం. అయితే భారత్ మార్కెట్లలో ఎపుడు అందుబాటులోకి వచ్చేదీ కంపెనీ ఇంకా వెల్లడించలేదు. -
మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ : అదరిపోయే స్మార్ట్ఫోన్లు
స్పెయిన్‌లోని బార్సిలోనాలో మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (ఎండబ్ల్యూసీ) అట్టహాసంగా ప్రారంభమైంది. ఫిబ్రవరి 25నుంచి 28వ తేదీ వరకు మూడు రోజుల పాటు ఈ ఇందులో భాగంగా పలు ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు తమ తమ నూతన స్మార్ట్ఫోన్లు, ఇతర ఉత్పత్తులను ప్రదర్శించనున్నాయి. ఈ సందర్భంగా శాంసంగ్, ఎల్జీ, మైక్రోసాఫ్ట్, షావోమి, హెచ్ఎండీ గ్లోబల్, హువావే లాంటి కంపెనీలు తమ అద్భుతమైన స్మార్ట్ఫోన్ల ప్రదర్శనకు పోటీ పడుతున్నాయి. ముఖ్యంగా ఎండబ్ల్యూసీ 2019 షోలో శాంసంగ్‌కు పోటీగా హువావే ఫోల్డబుల్ ఫోన్‌ను ఆవిష్కరించింది. ఇంకా ఎల్జీ జీ8 థింక్యూ, వన్ ప్లస్ 5జీ స్మార్ట్ఫోన్లను ప్రదర్శించింది. అలాగే హెచ్ఎండీ గ్లోబల్ నోకియా 9 ప్యూర్ వ్యూను, 8.1 ప్లస్‌ను, సోనీ ఎక్స్‌పీరియా 1, 10, 10 ప్లస్ , ఎల్3 ఫోన్లను, బ్లాక్‌బెర్రీ కీ 2 రెడ్ ఎడిషన్‌ను పరిచయం చేసింది -
వాటికి షాకే.. భారీ కెమెరాతో సోనీ స్మార్ట్‌ఫోన్
ఎలక్ట్రానిక్స్ తయారీదారు సోనీ తన నూతన స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించనుంది. బార్సిలోనాలో జరగనున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2019లో ఫిబ్రవరి 25న దీన్ని లాంచ్ చేయనుందట. తాజా నివేదికల ప్రకారం 52 మెగాపిక్సెల్ మెగా కెమెరాతో ఎక్స్‌పీరియా ఎక్స్‌జడ్4 పేరుతో ఈ స్మార్ట్‌ఫోన్ ప్రారంభించనుంది. దీంతో పాటు వెనుక భాగంలో మరో రెండు కెమెరాలను అంటే మొత్తం మూడు కెమెరాలను అమర్చినట్లు సమాచారం. 52+16 ఎంపీ టెలిఫోటో లెన్స్ + 0.3 ఎంపీ కెపాసిటీ ఉన్న 3డీ కెమెరాలను పొందపర్చడం విశేషం. అయితే ప్రస్తుతం హానర్ వ్యూ20, రెడ్మీ నోట్ 7 ఫోన్లలోమాత్రమే అతి పెద్ద రియర్ కెమెరా(48ఎంపీ)తో స్మార్ట్ఫోన్లు లాంచ్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కంపెనీలకు పోటీగా సోనీ తన ఎక్స్‌పీరియా ఎక్స్‌జడ్4 ఫోన్‌ను తీసుకు రానుంది. ఈ స్మార్ట్ ఫోన ఆవిష్కారమైతే సోనీ ఈ విషయంలో టాప్‌లోకి దూసుకు రావడం ఖాయం. అటు ఈ ఫోన్‌కు సంబంధించిన ఇతర స్పెసిఫికేషన్ల ఇంకా స్పష్టత లేదు. అయితే మాత్రం అంచనాలు ఇలా ఉన్నాయి ఎక్స్‌పీరియా ఎక్స్‌జడ్ 4 ఫీచర్లు 6.5 అంగుళాల ఓల్ఈడీ డిస్ప్లే విత్ 21.9 యాస్పెక్ట్ రేషియో 1440×3360 పిక్సెల్స్ రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 9పై 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ 4400 ఎంఏహెచ్ బ్యాటరీ -
నోకియా 7ప్లస్ కమింగ్ సూన్
సాక్షి,న్యూఢిల్లీ: నోకియాకు చెందిన మరో స్మార్ట్‌ఫోన్ నోకియా7 ప్లస్ ఇండియాలో త్వరలో లాంచ్ కానుంది. ఆండ్రాయిడ్ ఫ్యామిలీలోని కొత్త స్మార్ట్‌ఫోన్‌ను బార్సీలోనాలో జరగనున్న మొబైల్ వరల్డ్‌కాంగ్రెస్ 2018లో హెచ్ఎండీ గ్లోబల్ పరిచయం చేయనుందట. ముఖ్యంగా నోకియా9, నోకియా 1తో పాటు నోకియా 7 ప్లస్‌ను కూడా అందుబాటులోకి తీసుకురానుందన్నఅంచనాలు భారీగా నెలకొన్నాయి. ముఖ్యంగా బెజెల్ లెస్ డిస్ప్లేతో పాటు, కెమెరాపరంగా కూడా కార్ల్ జీస్ లెన్సెస్ను అమర్చినట్టు తెలుస్తోంది. కాగా ఫిబ్రవరి 25నంచి వరల్డ్ కాంగ్రెస్ (2018)లో నోకియా1, నోకియా 8 (2018) నోకియా 9 స్మార్ట్ఫోన్లను లాంచ్ చేస్తున్నట్టు ఇప్పటికే హెచ్ఎండీ గ్లోబల్ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజా అంచనాల ప్రకారం ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు ఇలా ఉండనున్నాయి. ఈడివైస్కు సంబంధించిన ఫోటోలు, ఫీచర్లు ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్నాయి. నోకియా 7 ప్లస్ ఫీచర్లు 6 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ ప్లే విత్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 2160 x 1080 పిక్సెల్ రిజల్యూషన్ క్వాల్కం స్నాప్ డ్రాగెన్ 600 ప్రాసెసర్ ఆండ్రాయిడ్ ఓరియో 8.0 4జీబీర్యామ్ 64 జీబీ స్టోరేజ్ 12-13 ఎంపీ డబుల్ రియర్ కెమెరా 16ఎంపీ సెల్పీ కెమెరా విత్ టెట్రాసెల్ టెక్నాలజీ -
మొబైల్ కాంగ్రెస్‌లో మనసు దోచినవి ఇవే
ప్రతి ఏటా దిగ్గజ టెక్నాలజీ కంపెనీలు నిర్వహించే మొబైల్ వరల్డ్ కాంగ్రెస్(ఎండబ్ల్యూసీ)-2017 ముగిసింది. మొత్తం ఐదు రోజుల పాటు జరిగిన కాంగ్రెస్‌లో పలు అంతర్జాతీయ మొబైల్ బ్రాండ్లు కొత్త మోడళ్లను పరిచయం చేశాయి. వీటిలో కొన్ని మొబైల్ ప్రేమికుల మనసును దోచేశాయి. అవేంటో ఓ లుక్కేద్దాం. బ్లాక్ బెర్రీ ఎండబ్ల్యూసీ కార్యక్రమానికి రెండు రోజుల ముందే బ్లాక్‌బెర్రీ కీ వన్ ఫోన్‌ను విడుదల చేసింది. టచ్ స్క్రీన్‌తో పాటు కీ ప్యాడ్‌ను కోరుకునే మొబైల్ లవర్స్ దీన్ని చూసి తెగ ముచ్చటపడిపోతున్నారు. టచ్ అండ్ టైప్ మోడల్ ఫోన్లను బ్లాక్ బెర్రీ గతంలో కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే. దీని ధర సుమారు రూ. 40 వేలుగా ఉండొచ్చు. హువాయి ఈ కంపెనీ తన ఫ్లాగ్షిప్ ఫోన్లు హువాయి పీ10, హువాయి పీ10 ప్లస్‌లను మార్కెట్లోకి విడుదల చేయబోతున్నట్లు ఎండబ్ల్యూసీలో ప్రకటించింది. డ్యూయల్ కెమెరా, 960 ఆక్టా కోర్ ప్రాసెసర్లు ఈ ఫోన్లో ప్రత్యేకతలు. హువాయి వాచ్ 2.0ను కూడా ప్రకటించింది. క్లాసిక్, స్పోర్ట్స్ రకాల్లో వాచ్ లభ్యమవనుంది. ఎల్జీ ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఎల్జీ జీ6 ఫోన్‌ను ఎల్జీ ఎండబ్ల్యూసీలో విడుదల చేసింది. 5.7 ఇంచుల స్క్రీన్, డాల్బీ విజన్ హెచ్డీఆర్, 821 క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్ దీని ప్రత్యేకతలు. ఈ ఫోన్ ధర, అందుబాటులోకి వచ్చే తేదీలను కంపెనీ ఇంకా ప్రకటించలేదు. మోటోరోలా గత మూడేళ్లుగా మోటో వెర్షన్లతో మార్కెట్లోకి దూసుకొచ్చిన మోటోరోలా(లెనోవో).. తాజాగా మోటో జీ5, మోటో జీ5 ప్లస్‌లను ఎండబ్ల్యూసీలో విడుదల చేసింది. 3 జీబీ ర్యామ్, 13 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా, 430 ప్రాసెసర్ తదితరాలు. ధర సుమారుగా రూ.17,500/-. ఇండియాలో మే నెల నుంచి అందుబాటులోకి రానుంది. నోకియా గతంలో మొబైల్ సామ్రాజ్యాన్ని ఏలిన నోకియా 2017 ఎండబ్ల్యూసీలో పునఃప్రవేశం చేసింది. నోకియా 3310 పాత ఫోన్‌ను కొత్త రూపుతో విడుదల చేసింది. ఈ ఫోన్‌కు సోషల్‌మీడియాలో విపరీతంగా క్రేజ్ వచ్చింది. చాలామంది ఎప్పుడెప్పుడూ ఈ ఫోన్ మార్కెట్లోకి వస్తుందా? అని ఎదురుచూస్తున్నారు. నోకియా 6, నోకియా 5 మొబైల్స్‌ను కూడా నోకియా ప్రకటించింది. జూన్ లోపు ఇవన్నీ భారత మార్కెట్లోకి వస్తాయి. శాంసంగ్ కొరియా దిగ్గజ కంపెనీ శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్3ను విడుదల చేసింది. దీంతోపాటు ఎస్ పెన్ను కూడా ప్రకటించింది. సోనీ ఈ కంపెనీ తన ఫ్లాగ్షిప్ ఫోన్ సోనీ ఎక్స్‌పీరియా ఎక్స్జెడ్ ప్రీమియం ఫోన్‌ను ఎండబ్ల్యూసీలో ప్రకటించింది. 4కే హెచ్డీఆర్, 19 మెగాపిక్సల్ మోషన్ ఐ కెమెరా, క్వాల్కామ్ 835 స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్‌లతో ఈ ఫోన్ లభించనుంది. సోనీ ఎక్స్‌పీరియా ఎక్స్ ఏ1, ఎక్స్ ఏ1 ఆల్ట్రా(మిడ్ రేంజ్ ఫోన్లు)ను విడుదల చేసింది. -
బ్లాక్‌బెర్రీ ఫైనల్ స్మార్ట్‌ఫోన్.. లాంచింగ్ డేట్స్ ఫిక్స్
ప్రపంచ ఫోన్ల మార్కెట్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న బ్లాక్‌బెర్రీ, తన ఇన్-హౌజ్‌లో డిజైన్ చేసిన ఆఖరి స్మార్ట్‌ఫోన్ లాంచింగ్‌కు సిద్ధమైంది. ఇన్-హౌజ్‌లో డిజైన్ చేసిన తన మెర్క్యూరీ స్మార్ట్‌ఫోన్‌ను వచ్చే నెలలో ప్రవేశపెట్టబోతున్నట్టు కంపెనీ వెల్లడించింది. చైనీస్ సంస్థ టీసీఎల్ భాగస్వామ్యంలో ఈ డివైజ్‌ను అధికారికంగా ఫిబ్రవరి 25న జరుగబోయే ఈవెంట్లో లాంచ్ చేయనున్నామని కంపెనీ ప్రకటించింది. బార్సిలోనాలో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగబోయే మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ ట్రేడ్ షో ప్రారంభం కావడానికి ఒక్క రోజు ముందే దీన్ని లాంచ్ చేసేందుకు కంపెనీ రంగం సిద్ధం చేసుకుంది. బ్లాక్‌బెర్రీ మొబైల్ అకౌంట్లో ఈ లాంచింగ్‌ను రివీల్ చేస్తూ ఓ ట్వీట్ చేసింది. ఎంతో కాలంగా వేచిచూస్తున్న కీబోర్డు ఫోన్‌ను విడుదల చేయనున్నామని, మెర్క్యూరీ పేరుతో దీన్ని లాంచ్ చేస్తున్నామని తెలిపింది. చైనా టీసీఎల్ కమ్యూనికేషన్ తయారుచేసిన బ్లాక్‌బెర్రీ డివైజ్‌లలో మెర్క్యూరీ మూడోవది. ఈ ఫోన్‌కు సంబంధించిన టీజర్ వీడియోను టీసీఎల్ ఉత్తర అమెరికా అధ్యక్షుడు స్టీవ్ సిస్టుల్లీ విడుదల చేశారు. జనవరి మొదట్లో లాస్వేంగాస్లో జరిగిన కన్సూమర్ ఎలక్ట్రానిక్స్ షోలో ఈ ఫోన్ గురించి బ్లాక్‌బెర్రీ, టీసీఎల్ మొదటిసారి రివీల్ చేశాయి. కానీ మిగతా వివరాలు వేటిని ఇవి ప్రకటించలేదు. కొత్త మెటాలిక్‌తో రాబోతున్న ఈ ఫోన్ 4.2 అంగుళాల టచ్‌స్క్రీన్, క్వార్టీ కీబోర్డు కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ కీబోర్డు మెసేజ్‌లు, ఈమెయిల్స్ చేసుకోవడానికి ఎంతో సహకరించనుందట. ఈ ట్రేడ్ షోలోనే శాంసంగ్ తన లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్‌ను కూడా విడుదల చేయనుంది. ఫోన్లు డిజైన్ చేయడం నుంచి తాము వైదొలుగుతామని బ్లాక్‌బెర్రీ సెప్టెంబర్‌లోనే ప్రకటించింది. సాప్ట్‌వేర్‌పై ఎక్కువగా ఫోకస్ చేస్తామని కంపెనీ పేర్కొంది. దీంతో కంపెనీ ఇన్-హౌజ్ నుంచి రాబోతున్న ఫైనల్ స్మార్ట్ఫోనని తెలుస్తోంది. -
బ్లాక్ బె ర్రీ నుంచి లీప్ 4జీ స్మార్ట్‌ఫోన్
బార్సిలోనా: బ్లాక్‌బెర్రీ కంపెనీ మధ్య రేంజ్ 4జీ స్మార్ట్‌ఫోన్, లీప్‌ను అందిస్తోంది. దాదాపు రూ.17,000(275 డాలర్లు) ధర ఉన్న ఈ ఫోన్‌ను ఇక్కడ జరుగుతున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో ఆవిష్కరించింది. శామ్సంగ్, యాపిల్ కంపెనీలకు దీటుగా, యువ నిపుణులు లక్ష్యంగా తెస్తున్న ఈ ఫోన్‌ను వచ్చే నెల కల్లా యూరప్ మార్కెట్లోకి అందుబాటులోకి తెస్తామని కంపెనీ పేర్కొంది. 5 అంగుళాల ఆల్-టచ్ స్క్రీన్, బ్లాక్‌బెర్రీ 10.3..1 ఆపరేటింగ్ సిస్టమ్, 16 జీబీ స్టోరేజ్, 8 మెగా పిక్సెల్ కెమెరా, 2,800 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలున్నాయని వివరించింది. ఈ లీప్ ఫోన్‌తో పాటు స్లైడర్ కీబోర్డ్ ఉన్న డ్యుయల్-కర్వ్డ్ టచ్‌స్క్రీన్‌ను ఈ ఏడాదిలోనే అందించనున్నామని కంపెనీ పేర్కొంది. ప్రస్తుతానికి ఈ ఫోన్‌ను ది స్లైడ్ పేరుతో వ్యవహరిస్తున్నామని బ్లాక్‌బెర్రీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జాన్ షెన్ చెప్పారు. హై-ఎండ్ పోర్షే ఎడిషన్ బ్లాక్బెర్రిలో త్వరలో ఫాలోఆప్ వేరియంట్‌ను అందిస్తామని తెలిపారు. -
హువాయ్ తొలి ఆండ్రాయిడ్ స్మార్ట్‌వాచ్, ఆల్ట్రా ఆక్టా ఫ్యాబ్లెట్లు
బార్సిలోనా: హువాయ్ కంపెనీ స్మార్ట్‌వాచ్, ఫ్యాబ్లెట్, బ్లూటూత్ హెడ్సెట్లు వంటి పలు రకాల కంపెనీ ఉత్పత్తులను స్పెయిన్‌లోని బార్సిలోనాలో జరిగిన ‘మొబైల్ వరల్డ్ కాంగ్రెస్’ కార్యక్రమంలో ఆవిష్కరించింది. మార్కెట్లో డిమాండ్ ఉన్న స్మార్ట్‌వాచ్ విభాగంలో అగ్రస్థానాన్ని చేరుకోవటమే తమ లక్ష్యమని హువాయ్ కన్సూమర్ బీజీ సీఈఓ రిచర్డ్ యు ఈ సందర్భంగా అన్నారు. హువాయ్ స్మార్ట్‌వాచ్- ఇది గూగుల్ ఆండ్రాయిడ్ ఓఎస్ మీద నడిచే తొలి స్మార్ట్‌వాచ్. ఈ ‘హువాయ్ వాచ్ ’ క్లాసిక్, బిజినెస్, స్పోర్టీ మోడళ్లలో లభించనుంది. 1.4 అంగుళాల తెరను (వాటర్ ప్రూప్) కలిగి ఉన్న ఈ వాచ్‌ను ఆండ్రాయిడ్ 4.3, అంతకన్నా ఎక్కువ ఓఎస్ పైన నడిచే స్మార్ట్ఫోన్లతో కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ వాచ్ మైక్రోఫోన్, హెల్త్ ట్రాకింగ్, హార్ట్ రేట్ మానిటర్ సెన్సార్ వంటి ప్రత్యేకతలను కలిగి ఉంది. టాల్క్‌బాండ్ ఎన్1 హెడ్‌ఫోన్- ఇది స్టీరియో అండ్ బ్లూటూత్ హెడ్సెట్, 4జీబీ ఎంపీ3 మెమరీ సామర్థ్యం ఫీచర్లను కలిగి ఉంది. దీని ధర రూ.8,200. టాల్క్‌బాండ్ బీ2 స్మార్ట్‌వాచ్- ఇది డూయెల్ మైక్రోఫోన్, నాయిస్ రిడక్షన్ టెక్నాలజీ, బ్లూటూత్ కనెక్టివిటీ, 6 యాక్సిస్ సెన్సార్లు వంటి ప్రత్యేకతలను కలిగి ఉంది. ధర రూ.11,700.