చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ షియోమీ తన వైర్‌లెస్ AR గ్లాస్ డిస్కవరీ ఎడిషన్ ప్రోటోటైప్‌ను మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2023లో ప్రదర్శించింది. ఇది ఏఆర్ హెడ్‌సెట్ స్నాప్‌డ్రాగన్ ఎక్స్ఆర్2 జెన్ 1 చిప్‌సెట్ ద్వారా పనిచేస్తుంది. ఇది వైర్‌లెస్‌గానే మొబైల్ ఫోన్‌కి కనెక్ట్ అవుతుంది.
వైర్‌లెస్ ఏఆర్ గ్లాసెస్ చూడటానికి సింపుల్‌గా ఉండటమే కాకుండా, చాలా తేలికగా కూడా ఉంటుంది. కంపెనీ ఇందులో కార్బన్ ఫైబర్, మెగ్నీషియం టైటానియం వంటి మిశ్రమాలను ఉపయోగించింది. దీని బరువు కేవలం 126 గ్రాములు మాత్రమే. ఇది కస్టమ్ సిలికాన్-ఆక్సిజన్ యానోడ్ బ్యాటరీ కలిగి ఉంటుంది.
షియోమీ ఏఆర్ గ్లాసెస్ తేలికగా ఉండటమే కాకుండా ఒక జత మైక్రో OLED స్క్రీన్‌లను కలిగి ఉండటం వల్ల లైట్ గైడింగ్ ప్రిజమ్‌లకి కనెక్ట్ చేయబడతాయి. ఇది 12 నకిల్స్ ఫంక్షన్‌కి సపోర్ట్ చేస్తుంది. చైనీస్ నైన్-కీ ఇన్‌పుట్ మాదిరిగా ఇది వినియోగదారుల థంబ్ ద్వారా టెక్స్ట్ ఇన్‌పుట్ చేయడానికి అనుమతిస్తుంది.
ఏఆర్ గ్లాస్‌లో లెన్స్‌లు ఎలెక్ట్రోక్రోమిక్ టెక్నాలజీని ఉపయోగిస్తాయి, కావున ఆన్ చేయడం ఆఫ్ చేయడం రెండు సులభంగా ఉంటాయి. ఇది కేవలం స్ట్రీమింగ్‌కు మాత్రమే కాకుండా అంతకు మించిన ఉపయోగాలను వినియోగదారులకు అందిస్తుంది. ఇందులో హ్యాండ్ ట్రాకింగ్ టెక్నాలజీ కూడా ఉంది.
షియోమీ విడుదల చేయనున్న లేటెస్ట్ ఏఆర్ గ్లాసెస్ చాలా ఆధునిక ఫీచర్స్ పొందుతుంది. అయితే కంపెనీ దీనిని ఎప్పుడు లాంచ్ చేస్తుంది, ధరలు ఎలా ఉంటాయనేది తెలియాలి. అయితే కంపెనీ దీనిని త్వరలోనే మార్కెట్లో విడుదల చేయడానికి కావలసిన అన్ని సన్నాహాలు చేస్తోంది.
Boasting a retina-level near-eye display for AR glasses, Xiaomi Wireless AR Glass Discovery Edition delivers a truly immersive visual experience. Moreover, our self-developed Xiaomi AR Gesture Control empowers effortless control between virtual and real space. pic.twitter.com/EipqBWxkpW
— Lei Jun (@leijun) February 27, 2023
Comments
Please login to add a commentAdd a comment