హువాయ్ తొలి ఆండ్రాయిడ్ స్మార్ట్‌వాచ్, ఆల్ట్రా ఆక్టా ఫ్యాబ్లెట్లు | Huawei presents smartwatch, other wearables at mobile world congress | Sakshi
Sakshi News home page

హువాయ్ తొలి ఆండ్రాయిడ్ స్మార్ట్‌వాచ్, ఆల్ట్రా ఆక్టా ఫ్యాబ్లెట్లు

Published Tue, Mar 3 2015 1:25 AM | Last Updated on Sat, Sep 2 2017 10:11 PM

హువాయ్ తొలి ఆండ్రాయిడ్ స్మార్ట్‌వాచ్, ఆల్ట్రా ఆక్టా ఫ్యాబ్లెట్లు

హువాయ్ తొలి ఆండ్రాయిడ్ స్మార్ట్‌వాచ్, ఆల్ట్రా ఆక్టా ఫ్యాబ్లెట్లు

బార్సిలోనా: హువాయ్ కంపెనీ స్మార్ట్‌వాచ్, ఫ్యాబ్లెట్, బ్లూటూత్ హెడ్‌సెట్‌లు వంటి పలు రకాల కంపెనీ ఉత్పత్తులను స్పెయిన్‌లోని బార్సిలోనాలో జరిగిన ‘మొబైల్ వరల్డ్ కాంగ్రెస్’ కార్యక్రమంలో ఆవిష్కరించింది. మార్కెట్‌లో డిమాండ్ ఉన్న స్మార్ట్‌వాచ్ విభాగంలో అగ్రస్థానాన్ని చేరుకోవటమే తమ లక్ష్యమని హువాయ్ కన్సూమర్ బీజీ సీఈఓ రిచర్డ్ యు ఈ సందర్భంగా అన్నారు. హువాయ్ స్మార్ట్‌వాచ్- ఇది గూగుల్ ఆండ్రాయిడ్ ఓఎస్ మీద నడిచే తొలి స్మార్ట్‌వాచ్.

ఈ ‘హువాయ్ వాచ్ ’ క్లాసిక్, బిజినెస్, స్పోర్టీ మోడళ్లలో లభించనుంది. 1.4 అంగుళాల తెరను (వాటర్ ప్రూప్) కలిగి ఉన్న ఈ వాచ్‌ను ఆండ్రాయిడ్ 4.3, అంతకన్నా ఎక్కువ ఓఎస్ పైన నడిచే స్మార్ట్‌ఫోన్లతో కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ వాచ్ మైక్రోఫోన్, హెల్త్ ట్రాకింగ్, హార్ట్ రేట్ మానిటర్ సెన్సార్  వంటి ప్రత్యేకతలను కలిగి ఉంది. టాల్క్‌బాండ్ ఎన్1 హెడ్‌ఫోన్- ఇది స్టీరియో అండ్ బ్లూటూత్ హెడ్‌సెట్, 4జీబీ ఎంపీ3 మెమరీ సామర్థ్యం ఫీచర్లను కలిగి ఉంది. దీని ధర రూ.8,200. టాల్క్‌బాండ్ బీ2 స్మార్ట్‌వాచ్- ఇది డూయెల్ మైక్రోఫోన్, నాయిస్ రిడక్షన్ టెక్నాలజీ, బ్లూటూత్ కనెక్టివిటీ, 6 యాక్సిస్ సెన్సార్లు వంటి ప్రత్యేకతలను కలిగి ఉంది.  ధర రూ.11,700.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement