
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సీపాస్ (కమ్యూనికేషన్స్ ప్లాట్‌ఫాం యాజ్ ఎ సర్వీస్) దిగ్గజం తాన్లా ప్లాట్‌ఫామ్స్ తాజాగా కాలర్ ఐడెంటిఫికేషన్ సేవల సంస్థ ట్రూకాలర్‌తో జట్టు కట్టింది. ట్రూకాలర్ బిజినెస్ మెసేజింగ్‌కు తమ వైజ్‌లీ సీపాస్ ప్లాట్‌ఫామ్ సర్వీసులు అందించనుంది. బార్సెలోనాలో జరుగుతున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2022 సందర్భంగా ఇందుకు సంబంధించిన ఒప్పందం కుదుర్చుకుంది. సాంప్రదాయ ఎస్‌ఎంఎస్ సర్వీసులకు భిన్నంగా సందేశాలను వేగవంతంగా, చౌకగా డెలివరీ చేసేందుకు ఇది తోడ్పడుతుంది. వ్యాపార సంస్థలు తమ యూజర్లకు వ్యక్తిగతీకరించిన సందర్భోచిత సందేశాలను సురక్షితంగా అందించడానికి ఈ భాగస్వామ్యం ఉపయోగపడగలదని తాన్లా ప్లాట్‌ఫామ్స్ చైర్మన్ ఉదయ్ రెడ్డి తెలిపారు. దీనితో వ్యాపార సంస్థలకు సరళమైన, సమర్థమంతమైన కమ్యూనికేషన్ ప్లాట్‌ఫామ్‌ను అందించగలమని ట్రూకాలర్ సహ వ్యవస్థాపకుడు నామి జారింగ్‌హాలెమ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment