బీరూట్‌పై ఇజ్రాయెల్‌ దాడి.. హెజ్‌బొల్లా నేత మృతి | Israel airstrike on Beirut and eliminates commander of Hezbollah communications unit | Sakshi
Sakshi News home page

బీరూట్‌పై ఇజ్రాయెల్‌ దాడి.. హెజ్‌బొల్లా నేత మృతి

Published Fri, Oct 4 2024 6:40 PM | Last Updated on Fri, Oct 4 2024 6:46 PM

Israel airstrike on Beirut and eliminates commander of Hezbollah communications unit

హెజ్‌బొల్లా లక్ష్యంగా లెబనాన్‌లోని బీరూట్‌పై ఇజ్రా​యెల్‌ వైమానిక దాడులు ఆపటం లేదు. బీరూట్‌లో ఉన్న హిజ్‌బొల్లా ఇంటెలిజెన్స్ హెడ్‌క్వార్టర్స్‌పై గురువారం వైమానిక దాడులు చేసినట్లు ఇజ్రాయెల్‌ శుక్రవారం ప్రకటించింది. ఈ దాడుల్లో  హిజ్‌బొల్లా  కమ్యూనికేషన్స్ నెట్‌వర్క్ చీఫ్‌ మహ్మద్ రషీద్ సకాఫీ  హతమైనట్లు  వెల్లడించింది.

ఇజ్రాయెల్‌ మిలిటరీ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్‌ వివరాల ప్రకారం.. బీరూట్‌పై గురువారం ఇజ్రాయెల్‌ ఎయిర్‌ ఫోర్స్‌ దాడులు నిర్వహించింది. హెజ్‌బొల్లా రహస్య స్థావరాలే లక్ష్యంగా ఈ దాడులను ఇజ్రాయెల్‌ సైన్యం చేపట్టింది. ఇక.. తమ దాడుల్లో మృతి చెందిన మహ్మద్ రషీద్ సకాఫీ.. 2000 సంవత్సరంలో హెజ్‌బొల్లాకు కమ్యూనికేషన్స్ నెట్‌వర్క్‌ చీఫ్‌గా నియమితులయ్యారు.

 

ఆయన హెజ్‌బొల్లాలో సీనియర్‌ నేతలతో మంచి సంబంధాలు కలిగి ఉన్నారని ఐడీఎఫ్‌ పేర్కొంది. అన్ని కార్యక్రమాలకు కమ్మూనికేషన్‌ వ్యవస్థలను నిర్వహించటంలో సకాఫీ.. హిజ్‌బొల్లాకు కీలకంగా వ్యవహరించేవారని ఇజ్రాయెల్‌ సైన్యం తెలిపింది.

చదవండి: మా శత్రువులను ఓడిస్తాం: ఇరాన్‌ సుప్రీం లీడర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement