ఇజ్రాయెల్‌ దాడుల్లో నస్రల్లా మృతి.. ధ్రువీకరించిన హెజ్‌బొల్లా | Hezbollah confirms chief Hassan Nasrallah death in Israeli airstrike in Beirut | Sakshi
Sakshi News home page

ఇజ్రాయెల్‌ దాడుల్లో నస్రల్లా మృతి.. ధ్రువీకరించిన హెజ్‌బొల్లా

Published Sat, Sep 28 2024 7:15 PM | Last Updated on Sat, Sep 28 2024 8:20 PM

Hezbollah confirms chief Hassan Nasrallah death in Israeli airstrike in Beirut

లెబనాన్‌ రాధాని బీరుట్‌లోని ఉగ్రవాద సంస్థ హెజ్‌బొల్లా ప్రధాన కార్యాలయం లక్ష్యంగా జరిపిన ఇజ్రాయెల్‌ వైమానిక దాడుల్లో తమ అధిపతి హసన్‌ నస్రల్లా హతమైనట్లు తాజాగా హెబ్‌బొల్లా ధృవీకరించింది. ఆపరేషన్‌ న్యూ ఆర్డర్‌ పేరుతో జరిపిన విధ్వంసకర పోరులో 64 ఏళ్ల నస్రల్లా మరణించినట్లు ఒక ప్రకటనలో వెల్లడించింది.

‘ఇజ్రాయెల్‌ జరిపిన వైమానిక దాడుల్లో మా నాయకుడు నస్రల్లా మృతి చెందారు. శనివారం తెల్లవారుజామున నస్రల్లా మృతదేహాన్ని గుర్తించాంి. నస్రల్లాతోపాటు మరో టాప్ కమాండర్ అలీ కరాకి మృతదేహం కూడా లభించింది. దీనికి తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటాం. పాలస్తీనాకు మద్దతుగా నిలవడంతో పాటు శత్రువుపై యుద్ధం కొనసాగిస్తాం’ అని’’ అని హెజ్‌బొల్లా బృందం ప్రకటించింది. 

కాగా ఇజ్రాయెల్‌ శుక్రవారం లెబనాన్‌పై భీకర స్థాయిలో విరుచుకుపడింది. ఈ క్రమంలోనే బీరుట్‌లోని హెజ్‌బొల్లా ప్రధాన కార్యాలయంపై విధ్వంసకర బాంబులను ప్రయోగించింది. ఈ దాడుల్లో హెజ్‌బొల్లా అధిపతి హసన్‌ నస్రల్లా మరణించినట్లు ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌ వెల్లడించింది. ‘నస్రల్లా ఇక ఈ ప్రపంచాన్ని ఉగ్రవాదంతో భయభ్రాంతులకు గురిచేయలేడు’ అని ఎక్స్‌లో రాసుకొచ్చింది. దీంతో ‘ఆపరేషన్‌ న్యూ ఆర్డర్‌’ మిషన్‌ అటు ఇజ్రాయెల్‌ వార్‌ రూమ్‌వెల్లడించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement