Hassan Nasrallah
-
హెజ్బొల్లా కొత్త చీఫ్‌గా నయీమ్ ఖాస్సేమ్
లెబనాన్ మిలిటెంట్ సంస్థ హెజ్బొల్లాకు కొత్త చీఫ్‌ను నియమించారు. నయీమ్ ఖాస్సేమ్‌ను కొత్త చీఫ్‌గా నియమించినట్లు హెజ్బొల్లా ఓ ప్రకటనలో తెలిపింది. హెజ్బొల్లా చీఫ్‌గా ఉన్న హసన్ నస్రల్లా ఇటీవల ఇజ్రాయెల్ చేసిన దాడిలో హతమైన విషయం తెలిసిందే. సుమారు నెల రోజుల తర్వాత హెజ్బొల్లా తమ తదుపరి చీఫ్‌ను ప్రకటించింది.ఇక.. నస్రల్లాను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ హత్య చేసినప్పటి నుంచీ నయీమ్ ఖాస్సేమ్ హెజ్బొల్లా గ్రూప్‌కు డిప్యూటీ చీఫ్‌గా ఉంటున్నారు. నస్రల్లాకు దీర్ఘకాలంగా డిప్యూటీగా ఉన్న నయీమ్ ఖాస్సేమ్.. నస్రల్లా మరణం అనంతరం మిలిటెంట్ గ్రూప్ యాక్టింగ్ లీడర్‌గా పనిచేశారు. ఈ నేపథ్యంలో నస్రల్లా స్థానంలో చీఫ్‌గా ఆయన నియామకాన్ని మంగళవారం హెజ్బొల్లా గ్రూప్ అధికారికంగా ప్రకటించింది.They used to say that the one who stays to the last is the traitor!Why wasn't Naim Qassem with all the leaders who were killed during the meetings? Now he is the head of the pyramid.#Hezbollah has appointed #naimkassem as the party's secretary general. #حزب_الله #نعيم_قاسم pic.twitter.com/KceS03tsRg— Ramez Homsi (@Ramez7m) October 29, 2024నయీమ్ ఖాస్సేమ్ ఎవరు?నయీమ్ ఖాస్సేమ్ దక్షిణ లెబనాన్‌లోని క్ఫర్ ఫిలా పట్టణంలో జన్మించారు. కెమిస్ట్రీ టీచర్‌గా చాలా సంవత్సరాలు పని చేశారు. దానికంటే ముందు లెబనీస్ విశ్వవిద్యాలయంలో రసాయన శాస్త్రాన్ని అభ్యసించారు. 1982లో ఇజ్రాయెల్ లెబనాన్‌పై దాడి చేసి దక్షిణ ప్రాంతాన్ని ఆక్రమించిన అనంతరం.. ఇరాన్ మద్దతుతో ఏర్పడిన హెజ్బొల్లాలో ఆయన చేరారు. 1991 నుంచి ఆయన హెజ్బొల్లా డిప్యూటీ సెక్రటరీ-జనరల్‌గా పనిచేశారు. -
నస్రల్లా బంకర్లో భారీ సంపద
జెరూసలేం: బీరుట్‌లోని ఓ ఆస్పత్రి కింద హెజ్బొల్లా మాజీ చీఫ్ హసన్ నస్రల్లా గడిపిన రహస్య బంకర్లో 50 కోట్ల డాలర్లకు పైగా విలువ చేసే బంగారం, నగదు లభ్యమైనట్టు ఇజ్రాయెల్ తెలిపింది. హమాస్‌తో పాటు హెజ్బొల్లా కూడా ఇలా ఆసుపత్రులు, పాఠశాలలు, ఇతర సున్నితమైన ప్రదేశాలను ఆయుధాల నిల్వకు, మిలిటెంట్లకు ఆశ్రయానికి వాడుతోందని ఆరోపించింది. బంకర్ నిర్మాణానికి సంబంధించిన గ్రాఫిక్ ఫొటో, అనుకరణ వీడియోను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) ప్రతినిధి రియర్ అడ్మిరల్ డేనియల్ హగరీ ఆదివారం విడుదల చేశారు.ఆస్పత్రికి కింద ఉన్నందుననీ బంకర్‌ను కూల్చే ఆలోచన లేదని వెల్లడించారు. హెజ్బొల్లాపై చర్యలు తీసుకోవాలని లెబనాన్ అధికారులకు హగరి విజ్ఞప్తి చేశారు. హెజ్బొల్లా డబ్బును ఉగ్రవాదానికి, ఇజ్రాయెల్‌పై దాడికి వాడేందుకు అనుమతించొద్దని లెబనాన్ ప్రభుత్వాన్ని, అధికారులను, అంతర్జాతీయ సంస్థలను కోరారు. ఇందులో హెజ్బొల్లా ఆర్థిక విభాగమైన అల్–ఖర్ద్ అల్– హసన్ పాత్ర ఉందన్నారు. హెజ్బొల్లా కార్యకలాపాలకు నిధులు సమకూ రుస్తున్న తీరును కూడా హగరి వివరించారు.లెబనాన్ ప్రజలు, ఇరాన్ ప్రభుత్వం హెజ్బొల్లాకు ప్రధాన ఆదాయ వనరులన్నారు. లెబనాన్, సిరియా, యెమెన్, టర్కీల్లో హెజ్బొల్లా నడిపే ఫ్యాక్టరీల నుంచి వచ్చే ఆదాయాన్ని ఉగ్ర కార్యకలాపాలకు వాడుతున్నట్టు చెప్పారు. ‘‘ఇజ్రాయెల్ పోరాటం లెబనాన్ పౌరులపై కాదు. కానీ వారిని హెజ్బొల్లా ఇలా కవచాలుగా వాడుకుంటోంది’’ అని ఆరోపించారు. లెబనాన్‌లో మరో బంకర్లో కూడా కోట్లాది డాలర్ల విలువైన బంగారం, నగదును సోమవారం గుర్తించినట్టు హగరి తెలిపారు. బీరుట్‌పై ఇజ్రాయెల్ దాడి..13 మంది మృతిబీరుట్/టెల్అవీవ్: లెబనాన్ రాజధాని బీరుట్‌పై సోమవారం రాత్రి ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో 13 మంది చనిపోగా 57 మంది గాయపడ్డారు. బీరుట్ దక్షిణ శివారుల్లో జరిపిన దాడిలో రఫిక్ హరారీ యూనివర్సిటీ ఆస్పత్రికి సమీపంలోని భవనం పూర్తిగా ధ్వంసమైందని అధికా రులు తెలిపారు. అయితే, తాము హెజ్బొల్లా లక్ష్యంగా దాడి చేశామని, ఆస్పత్రిపై కాదని ఇజ్రాయెల్ ఆర్మీ ప్రకటించింది. అంతకు మించి వివరాలను వెల్లడించలేదు. ఆస్పత్రి ప్రవేశ ద్వారానికి సమీపంలో జరిగిన దాడి దృశ్యాలు సోషల్ మీడియాలో ప్రచార మవుతున్నాయి. ఇలా ఉండగా, సెంట్రల్ ఇజ్రాయె ల్పైకి మంగళవారం హెజ్బొల్లా పలు రాకెట్లను ప్రయోగించింది. వీటిలో చాలా వరకు తమ గగన తల రక్షణ వ్యవస్థలు మధ్యలోనే అడ్డుకున్నాయని ఇజ్రాయెల్ తెలిపింది. ఒక రాకెట్ బహిరంగ ప్రదేశంలో పడిందని పేర్కొంది. -
నస్రల్లా వారసుడూ మృతి?
జెరుసలేం/బీరూట్/టెహ్రాన్: ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో ఇటీవలే సారథి హసన్ నస్రల్లాతో పాటు పలువురు అగ్ర నేతలను కోల్పోయిన లెబనాన్ మిలిటెంట్ సంస్థ హెజ్బొల్లాకు దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. నస్రల్లా స్థానంలో సంస్థ పగ్గాలు చేపట్టిన ఆయన సోదరుడు హషీం షఫియుద్దీన్ కూడా ఇజ్రాయెల్ దాడులకు బలైనట్టు చెబుతున్నారు. దీన్ని అటు హెజ్బొల్లా గానీ, ఇటు ఇజ్రాయెల్ గానీ ధ్రువీకరించడం లేదు.అయితే శుక్రవారం బీరుట్ శివార్లలోని దాహియేపై ఇజ్రాయెల్ వైమానిక దళం చేసిన లక్షిత దాడుల అనంతరం ఆయన ఆచూకీ లేకుండా పోయినట్టు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ రాయిటర్స్ తదితర వార్తా సంస్థలు పేర్కొన్నాయి. అక్కడి బంకర్లలో హెజ్బొల్లా అగ్ర నేతలతో హషీం సమావేశమై ఉండగా పక్కా సమాచారం మేరకు ఇజ్రాయెల్ భారీగా బాంబుల వర్షం కురిపించిందని తెలిపాయి. నిరంతరాయంగా కొనసాగుతున్న దాడుల వల్ల సహాయక బృందాలేవీ ఆ ప్రాంతానికి చేరలేకపోతున్నట్టు వివరించాయి. ఈ దాడుల్లో హషీం తీవ్రంగా గాయపడ్డట్టు హెజ్బొల్లా వర్గాలను ఉటంకిస్తూ వార్తలొస్తున్నాయి. మరోవైపు లెబనాన్‌పై దాడులను శనివారం ఇజ్రాయెల్ మరింత తీవ్రతరం చేసింది.దక్షిణం వైపునుంచి మొదలుపెట్టిన భూతల దాడులను కొనసాగిస్తూనే ఉత్తరాది నగరం ట్రిపోలీని కూడా వైమానిక దాడులకు లక్ష్యంగా చేసుకుంది. ట్రిపోలీలోని బెడ్డావీ పాలస్తీనా శరణార్థి శిబిరంపై జరిగిన బాంబు దాడుల్లో హమాస్ సాయుధ విభాగమైన అల్ ఖసాం బ్రిగేడ్స్ చీఫ్ సయీద్ అతల్లాతో పాటు భార్య, ఇద్దరు కుమార్తెలు కూడా మరణించారు. దీన్ని హమాస్ కూడా ధ్రువీకరించింది. వెస్ట్‌బ్యాంక్‌లోని శరణార్థి శిబిరంపై జరిగిన బాంబు దాడుల్లో చనిపోయిన 18 మందిలో తమ కమాండర్ తుల్కరెమ్ కూడా ఉన్నట్టు పేర్కొంది. దక్షిణాన ఒడైసే నగరాన్ని ఆక్రమించేందుకు ఇజ్రాయెల్ ప్రయతి్నస్తోందని హెజ్బొల్లా ఆరోపించింది. ఇప్ప టిదాకా 2,000 మందికి పైగా సామాన్యులు దాడులకు బలయ్యారని పేర్కొంది.లెబనాన్–సిరియా సరిహద్దుపై బాంబుల వర్షంలెబనాన్, సిరియాలను కలిపే కీలకమైన మస్నా బార్డర్ క్రాసింగ్‌ను ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు బాంబులతో విరుచుకుపడి నేలమట్టం చేశాయి. దారి పొడవునా ఎక్కడ చూసినా భారీ గోతులే దర్శనమిస్తున్నాయి. దాంతో రెండు దేశాల మధ్య రవాణా, రాకపోకలతో పాటు సర్వం స్తంభించిపోయింది. దాంతో దాడుల నుంచి తప్పించుకునేందుకు పొట్ట చేతపట్టుకుని సిరియాకు వెళ్తున్న లక్షలాది మంది లెబనీస్ పౌరులు సరిహద్దుల వద్దే పడిగాపులు కాస్తున్నారు. ఈ క్రాసింగ్ గుండా గత 10 రోజుల్లో కనీసం మూడున్నర లక్షల మంది సిరియాకు తరలినట్టు సమాచారం. ఇక్కడి రెండు మైళ్ల పొడవైన సొరంగం గుండా ఇరాన్ నుంచి హెజ్బొల్లాకు భారీగా ఆయుధాలు అందుతున్నాయని ఇజ్రాయెల్ చెబుతోంది. దీనికి అడ్డుకట్ట వేసేందుకే దాడులు చేసినట్టు వివరించింది. ఇరాన్ అణు స్థావరాలపై దాడికే ఇజ్రాయెల్ మొగ్గు? తనపై వందలాది క్షిపణులతో విరుచుకుపడ్డ ఇరాన్‌పై ఇజ్రాయెల్ ఎప్పుడు, ఎలా దాడి చేయనుందన్నది ఇంకా సస్పెన్స్‌గానే ఉంది. దీనిపై తమకు ఎలాంటి సమాచారమూ లేదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చెప్పారు. ఇరాన్‌లోని అణు స్థావరాలపై మాత్రం దాడులను సమర్థించబోమని ఆయన స్పష్టం చేయడం తెలిసిందే. కానీ వాటినే లక్ష్యంగా చేసుకోవాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పట్టుదలగా ఉన్నట్టు చెబుతున్నారు. అంతేగాక ఇరాన్ చమురు క్షేత్రాలపైనా బాంబుల వర్షం కురిపించే అంశాన్ని ఆయన తీవ్రంగా పరిశీలిస్తున్నట్టు చెబుతున్నారు. అదే జరిగితే పశి్చమాసియాలోని దేశాలన్నీ తీవ్రంగా ప్రభావితమవుతాయని, యుద్ధం ఊహాతీతంగా విస్తరిస్తుందని ఆందోళన వ్యక్తమవుతోంది. -
Israel Hezbollah War: పోరు ఆపం
బీరుట్: ఇజ్రాయెల్‌తో తమ పోరాటం కొన సాగుతుందని హెజ్ బొల్లా తాత్కాలిక చీఫ్ నయీం కస్సెమ్ స్పష్టం చేశారు. చీఫ్ హస్సన్ నస్రల్లాతో పాటు ఇతర టాప్ కమాండర్లను పోగొట్టుకున్నా సరే తాము వెనక్కి తగ్గేది లేదని కుండబద్దలు కొట్టారు. లెబనాన్‌లో భూతల దాడులు జరపాలని ఇజ్రాయెల్ నిర్ణయించుకున్న పక్షంలో అందుకు తమ శ్రేణులు సిద్ధంగా ఉన్నాయన్నారు. పోగొట్టుకున్న కమాండర్ల స్థానాలను భర్తీ చేశామని వెల్లడించారు. ఈ మేరకు ఆయన చేసిన ప్రకటన టీవీల్లో ప్రసారమైంది. ‘మా పోరాట సామర్థ్యాన్ని దెబ్బతీయడం ఇజ్రాయెల్ వల్లకాదు. డిప్యూటీ కమాండర్లు సిద్ధంగా ఉన్నారు. కమాండర్ ఎవరైనా గాయపడితే వారితో భర్తీ చేస్తాం. 2006లో ఇజ్రాయెల్‌తో నెలపాటు పోరాడాం. ఈసారి అంతకంటే ఎక్కువ కాలమే పోరు సాగుతుందని అనుకుంటున్నాం’అని నయీం కస్సెమ్ పేర్కొన్నారు. -
హిజ్బుల్లాపై యుద్ధంలో మా టార్గెట్ అతడే: నెతన్యాహు
బీరుట్: హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లాను పక్కా ప్లాన్ ప్రకారం ఇజ్రాయెల్ హత్య మార్చింది. ఈ నేపథ్యంలో నస్రల్లా మృతిపై ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. నస్రల్లాను అంతమొందించడం తమ యుద్ధ లక్ష్యాలను సాధించడంలో అతి ముఖ్యమైన విషయం అని చెప్పుకొచ్చారు.న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి పర్యటన తర్వాత నెతన్యాహు ఇజ్రాయెల్‌కు వెళ్లారు. హసన్ నస్రల్లా హత్యానంతరం ఈ ఘటనపై నెతన్యాహు మొదటిసారిగా బహిరంగంగా స్పందించారు. ఇజ్రాయెల్‌లో నెతన్యాహు మాట్లాడుతూ.. నస్రల్లాను హతమార్చడం మాతో అతి ముఖ్యమైన విషయం. హిజ్బుల్లాకు చెందిన ఇతర టాప్ కమాండర్లను తాము చంపినా, నస్రల్లాయే మాకు అసలు టార్గెట్. ఇజ్రాయెల్‌ను నాశనం చేయాలన్న ప్రణాళికకు సూత్రధారిగా అతడు వ్యవహరించాడు. అందుకే అతడినే మేము టార్గెట్‌గా పెట్టుకున్నాము. యుద్ధంలో నస్రల్లా హత్య చారిత్రక మలుపు. తన శత్రవులపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తుంది’ అంటూ కామెంట్స్ చేశారు.ఇదిలా ఉండగా.. లెబనాన్ తీవ్రవాద సంస్థ హిజ్బుల్లా అధినేత హసన్ నస్రల్లాను ఐడీఎఫ్ దళాలు మట్టుబెట్టాయి. ఈ నేపథ్యంలో హిజ్బుల్లాలకు కొత్త చీఫ్ ఎవరు అనే చర్చ మొదలైంది. అయితే, ఇరాన్ ఆమోదం ఉన్న వ్యక్తికే పగ్గాలు దక్కే అవకాశాలు ఉన్నాయన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. హిజ్బులా రాజకీయ వ్యవహారాలను పర్యవేక్షించే హషీమ్ సఫీ అల్ దిన్ ప్రస్తుతం రేసులో ఉన్నట్టు తెలుస్తోంది. నస్రల్లాకు హషీమ్ సఫీ అల్ దిన్ బంధువు. అలాగే, హిజ్బుల్లా జిహాద్ కౌన్సిల్లోనూ సభ్యుడుగా ఉన్నాడు.మరోవైపు.. ఇజ్రాయెల్ వైమానిక దాడులు బీరుట్ దక్షిణ శివారు ప్రాంతాలను తాకాయి. ఇజ్రాయెల్ సైన్యం హిజ్బుల్లా బలమైన కోట అయిన దహియేహ్‌లో దాడులు కొనసాగిస్తోంది. తాజాగా ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో తొమ్మిది మంది పౌరులు మృతిచెందారు. అలాగే, 90 మందికి పైగా గాయపడినట్టు లెబనాన్ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఇది కూడా చదవండి: Hassan Nasrallah: అరబ్బుల హీరో -
హెజ్బొల్లా వారసుడు హషీం?
ఎడతెరిపి లేకుండా ఇజ్రాయెల్ చేస్తున్న ప్రతీకార దాడుల ధాటికి లెబనాన్ ఉగ్రవాద సంస్థ హెజ్బొల్లా కకావికలవుతోంది. ముఖ్యంగా అగ్ర నాయకత్వమంతా దాదాపుగా తుడిచిపెట్టుకుపోయింది ముందు సంస్థ ఆపరేషన్స్ చీఫ్ ఇబ్రహీం అకీల్, తర్వాత టాప్ కమాండర్ ఫౌద్ షుక్ర్. ఇప్పుడు తాజాగా ఏకంగా సంస్థ అధినేత నస్రల్లా. ఇలా ఒకరి తర్వాత ఒకరుగా అగ్ర నేతలందరినీ రోజుల వ్యవధిలోనే మట్టుపెట్టింది ఇజ్రాయెల్. శుక్రవారం నాటి దాడుల్లో నస్రల్లాతో పాటు కనీసం మరో ఇద్దరు అగ్ర నేతలు కూడా మరణించారు. దాంతో హెజ్బొల్లాలో నాయకత్వ సంక్షోభం తలెత్తింది. మూడు దశాబ్దాల పైచిలుకు సారథ్యంలో సంస్థను తిరుగులేని సాయుధ శక్తిగా మార్చిన ఘనత నస్రల్లాది. ఆయన మృతితో ఇప్పుడు ఇజ్రాయెల్ నుంచి ఎదురవుతున్న పెను దాడులను కాచుకుంటూ కష్టకాలంలో సంస్థను ముందుండి నడిపేది ఎవరన్నది పెద్ద ప్రశ్నగా మారింది. కొత్త సారథిగా నస్రల్లాకు వరుసకు సోదరుడయ్యే హషీం సైఫుద్దీన్ పేరు గట్టిగా వినిపిస్తోంది. ద టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్‌లో ఇప్పటికే ఈ మేరకు కథనం కూడా వెలువడింది. హషీం ప్రస్తుతం హెజ్బొల్లా రాజకీయ వ్యవహారాల చీఫ్‌గా ఉన్నాడు. శుక్రవారం నాటి హెజ్బొల్లా ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్ లక్షిత దాడుల్లో అతను కూడా మరణించినట్టు తొలుత వార్తలొచి్చనా అదేమీ లేదని విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ రాయిటర్స్ తదితర వార్తా సంస్థలు తేల్చాయి. హషీం ప్రస్తుతం హెజ్బొల్లా రాజకీయ వ్యవహారాలు చూడటమే గాక సంస్థ జిహాద్ కౌన్సిల్లో కీలక సభ్యుడు కూడా. 2017 లోనే అమెరికా అతన్ని ఉగ్రవాదిగా ప్రకటించింది. పైగా హెజ్బొల్లాకు కొమ్ముకాసే ఇరాన్‌తో అతనికి అతి సన్నిహిత సంబంధాలున్నాయి. 2020లో అమెరికా మట్టుపెట్టిన ఇరాన్ సైనిక జనరల్ ఖాసీం సులేమానీ కూతురు జైనబ్‌కు హషీం మామ అవుతాడు. నస్రల్లా మాదిరిగానే ఇతను కూడా మతాధికారే. తలపాగతో అచ్చం నస్రల్లాను తలపిస్తాడు. 1964లో దక్షిణ లెబనాన్‌లో పుట్టాడు. 1990ల్లో ఇరాన్ లో ఉన్నత చదువులు చదువుతుండగానే హెజ్బొల్లా అతన్ని వెనక్కు పిలిపించింది. తర్వాత ఏడాదికే నస్రల్లా హెజ్‌బొల్లా్ల చీఫ్ అయ్యాడు. రెండేళ్లకే హషీం సంస్థ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సార థి అయ్యాడు. నాటినుంచే నస్రల్లా వారసునిగానూ గుర్తింపు పొందుతూ వస్తున్నాడు. విద్యా వ్యవస్థ, ఆర్థిక వ్యవహారాలు తదితరాలు చూసుకుంటున్నాడు. మారిన పరిస్థితుల్లో హెజ్బొల్లాకు సారథి కావాలంటే సంస్థ ఇతర అగ్ర నేతలతో పాటు ఇరాన్ మద్దతునూ హషీం కూడగట్టుకోవాల్సి ఉంటుందని అంటున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బంకర్ బాంబు దాడిలో... నస్రల్లా మృతి
బీరూట్: లెబనాన్ ఉగ్ర సంస్థ హెజ్బొల్లాకు కోలుకోలేని దెబ్బ తగిలింది. శుక్రవారం ఇజ్రాయెల్ జరిపిన భారీ వైమానిక దాడుల్లో సంస్థ చీఫ్ షేక్ హసన్ నస్రల్లా (64)తో పాటు పలువురు అగ్ర శ్రేణి కమాండర్లు మృతి చెందారు. హెజ్బొల్లా కూడా దీన్ని ధ్రువీకరించింది. ‘నస్రాల్లా తన తోటి అమరవీరులను చేరుకున్నారు’ అంటూ శనివారం ప్రకటన విడుదల చేసింది. ‘పాలస్తీనాకు మద్దతుగా శత్రువుపై పవిత్రయుద్ధం కొనసాగుతుంది’ అని ప్రతిజ్ఞ చేసింది. నస్రల్లాయే ప్రధాన లక్ష్యంగా లెబనాన్ రాజధాని బీరూట్‌పై ఇజ్రాయెల్ వైమానిక దళం శుక్రవారం భారీ బాంబు దాడులకు దిగి హెజ్బొల్లా ప్రధాన కార్యాలయాన్ని నేలమట్టం చేయడం తెలిసిందే. నిమిషాల వ్యవధిలోనే ఏకంగా 80కి పైగా బాంబులతో విరుచుకుపడింది. ఆ క్రమంలో ఏకంగా 2,200 కిలోల బంకర్ బస్టర్ బాంబులను కూడా ప్రయోగించింది. దాడిలో నస్రల్లాతో పాటు ఆయన కూతురు జైనబ్, òహెజ్బొల్లా సదరన్ కమాండర్ అలీ కరీ్కతో పాటు పలువురు కమాండర్లు మృతి చెందినట్టు ఇజ్రాయెల్ పేర్కొంది. నస్రల్లాతో పాటు తమ సీనియర్ సైనిక కమాండర్ అబ్బాస్ నిల్ఫోరుషన్ (58) కూడా దాడుల్లో మృతి చెందినట్టు ఇరాన్ వెల్లడించింది. ‘‘నస్రల్లా కదలికలను కొన్నేళ్లుగా అత్యంత సన్నిహితంగా ట్రాక్ చేస్తూ వస్తున్నాం. అతనితో పాటు హెజ్బొల్లా అగ్ర నేతలంతా బంకర్లో సమావేశమైనట్టు అందిన కచి్చతమైన సమాచారం మేరకు లక్షిత దాడులకు దిగాం’’ అని ఇజ్రాయెల్ సైన్యం అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ నదావ్ షొషానీ వివరించారు. ‘‘నస్రల్లాను మట్టుపెట్టాం. పలు రకాలైన నిఘా సమాచారం ఆధారంగా నిర్ధారణ కూడా చేసుకున్నాం’’ అని ప్రకటించారు. ‘‘అంతేకాదు, గత వారం రోజులుగా చేస్తున్న దాడుల్లో హెజ్‌బొల్లా్ల సాయుధ సంపత్తిని భారీగా నష్టపరిచాం. దాన్ని పూర్తిగా నాశనం చేసేదాకా దాడులు చేస్తాం’’ అని తెలిపారు. శుక్రవారం నాటి దాడిలో వాడిన బాంబులు తదితరాలపై మాట్లాడేందుకు నిరాకరించారు. ‘‘హెజ్బొల్లా ప్రతీకార దాడులకు దిగుతుందని తెలుసు. మేం సర్వసన్నద్ధంగా ఉన్నాం’’ అని ప్రకటించారు.హెజ్బొల్లాకు ఇరాన్, ఇరాక్ దన్నుహెజ్బొల్లాకు పూర్తిగా అండగా నిలుస్తామంటూ ఇరాన్, ఇరాక్ ప్రకటించాయి. అత్యంత శక్తిమంతమైన ఇరాన్ పార్లమెంటరీ కమిటీ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ శనివారం అత్యవసరంగా సమావేశమైంది. ఇజ్రాయెల్ దాడులకు గట్టిగా జవాబివ్వాల్సిందేనని ముక్త కంఠంతో తీర్మానించింది. అంతర్జాతీయ చట్టాల ప్రకారం తమ సైనిక కమాండర్ మృతికి ప్రతీకారం తీర్చుకునే హక్కుందని ఇరాన్ న్యాయవ్యవస్థ డిప్యూటీ చీఫ్‌రెజా పూర్ ఖగాన్ అన్నారు. ముస్లిం ప్రపంచమంతా పాలస్తీనా, హెజ్బొల్లాలకు దన్నుగా నిలవాలంటూ ఇరాక్ కూడా పిలుపునిచి్చంది. దేశవ్యాప్తంగా మూడు రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించింది. ఇరాక్ ప్రధాని మొహహ్మద్ సియా అల్ సుడానీ ఇరాన్, హెజ్బొల్లాతోనే అధికారంలోకి వచ్చారు. ఈ నేపథ్యంలో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరిగడం ఖాయమంటున్నారు. మరోవైపు, నస్రల్లా మృతితో అంతా అయిపోయినట్టు కాదని ఇజ్రాయెల్ సైన్యాధిపతి లెఫ్టినెంట్ జనరల్ హెర్జీ హలేవీ అన్నారు. హెజ్బొల్లాపై దాడులు మరింత తీవ్రంగా కొనసాగుతాయని ప్రకటించారు. ఇజ్రాయెల్ ఇప్పటికే అదనపు బలగాలను సమీకరించుకుంటోంది! భూతల దాడులను ఎదుర్కొనేందుకు రెండు బ్రిగేడ్లను ఉత్తర ప్రాంతానికి పంపింది. దేశవ్యాప్తంగా ఉన్న రిజర్వు బెటాలియన్లను కూడా రంగంలోకి దిగాల్సిందిగా ఆదేశించింది. దాంతో లెబనాన్, ఇజ్రాయెల్ మధ్య ఇప్పటికే తారస్థాయికి చేరిన ఘర్షణలు పూర్తిస్థాయి యుద్ధంగా మారవచ్చన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. హెజ్బొల్లా దాడుల వల్ల లెబనాన్ సరిహద్దుల్లో 60 వేల మందికి పైగా తమ ప్రజలు నిర్వాసితులయ్యారని ఇజ్రాయెల్ మండిపడుతోంది. దాడులకు పూర్తిగా స్వస్తి చెప్పేదాకా తగ్గేదే లేదంటోంది. ఇజ్రాయెల్ తాజా దాడుల దెబ్బకు లెబనాన్‌లో గత వారం రోజుల్లోనే ఏకంగా 2 లక్షల మందికి పైగా నిర్వాసితులయ్యారని ఐరాస చెబుతోంది.కోలుకోలేని దెబ్బ!మూడు దశాబ్దాలకు పైగా హెజ్బొల్లాను నడిపిస్తున్న నస్రల్లా మృతి ఆ సంస్థకు కోలుకోలేని దెబ్బే. హెజ్బొల్లాపై తలపెట్టిన తాజా దాడిలో ఇజ్రాయెల్‌కు ఇది అతి పెద్ద విజయంగా భావిస్తున్నారు. హెజ్బొల్లా హెడ్డాఫీస్‌తో పాటు ఆరు అపార్ట్మెంట్లను నేలమట్టం చేసిన శుక్రవారం నాటి దాడుల్లో మృతులు ఆరుకు, క్షతగాత్రుల సంఖ్య 91కి పెరిగినట్టు లెబనాన్ ఆరోగ్య శాఖ వెల్లడించింది. రెండు వారాల క్రితమే లెబనాన్ అంతటా పేజర్లు పేలి పదుల సంఖ్యలో చనిపోగా వేలాది మంది తీవ్రంగా గాయపడటం తెలిసిందే. దాన్నుంచి తేరుకోకముందే వాకీటాకీలు మొదలుకుని పలు ఎలక్ట్రానిక్ పరికరాలు పేలి మరింత నష్టం చేశాయి. ఇదంతా ఇజ్రాయెల్ పనేనని, మృతులు, క్షతగాత్రుల్లో అత్యధికులు హెజ్బొల్లా మిలిటెంట్లేనని వార్తలొచ్చాయి. -
ఇజ్రాయెల్ దాడుల్లో నస్రల్లా మృతి.. ధ్రువీకరించిన హెజ్బొల్లా
లెబనాన్ రాధాని బీరుట్‌లోని ఉగ్రవాద సంస్థ హెజ్బొల్లా ప్రధాన కార్యాలయం లక్ష్యంగా జరిపిన ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో తమ అధిపతి హసన్ నస్రల్లా హతమైనట్లు తాజాగా హెబ్బొల్లా ధృవీకరించింది. ఆపరేషన్ న్యూ ఆర్డర్ పేరుతో జరిపిన విధ్వంసకర పోరులో 64 ఏళ్ల నస్రల్లా మరణించినట్లు ఒక ప్రకటనలో వెల్లడించింది.‘ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో మా నాయకుడు నస్రల్లా మృతి చెందారు. శనివారం తెల్లవారుజామున నస్రల్లా మృతదేహాన్ని గుర్తించాంి. నస్రల్లాతోపాటు మరో టాప్ కమాండర్ అలీ కరాకి మృతదేహం కూడా లభించింది. దీనికి తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటాం. పాలస్తీనాకు మద్దతుగా నిలవడంతో పాటు శత్రువుపై యుద్ధం కొనసాగిస్తాం’ అని’’ అని హెజ్బొల్లా బృందం ప్రకటించింది. కాగా ఇజ్రాయెల్ శుక్రవారం లెబనాన్‌పై భీకర స్థాయిలో విరుచుకుపడింది. ఈ క్రమంలోనే బీరుట్‌లోని హెజ్బొల్లా ప్రధాన కార్యాలయంపై విధ్వంసకర బాంబులను ప్రయోగించింది. ఈ దాడుల్లో హెజ్బొల్లా అధిపతి హసన్ నస్రల్లా మరణించినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ వెల్లడించింది. ‘నస్రల్లా ఇక ఈ ప్రపంచాన్ని ఉగ్రవాదంతో భయభ్రాంతులకు గురిచేయలేడు’ అని ఎక్స్‌లో రాసుకొచ్చింది. దీంతో ‘ఆపరేషన్ న్యూ ఆర్డర్’ మిషన్ అటు ఇజ్రాయెల్ వార్ రూమ్వెల్లడించింది. -
ఇరాన్ హై అలర్ట్.. సురక్షిత ప్రాంతానికి సుప్రీమ్ లీడర్
టెహ్రాన్: పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొంది. లెబనాన్ సరిహద్దుల్లో హెజ్బొల్లా లక్ష్యంగా ఇజ్రాయెల్ జరుపుతున్న దాడులతో హెజ్బొల్లాకు భారీ నష్టం సంభవిస్తోంది. దక్షిణ బీరుట్‌లోని హెజ్బొల్లా ప్రధాన కార్యాలయంపై శుక్రవారం జరిపిన దాడుల్లో మిలటరీ గ్రూప్ అధిపతి హసన్ నస్రల్లా మరణించినట్లు తాజాగా ఇజ్రాయెల్ ఆర్మీ ధ్రువీకరించింది. అయితే నస్రల్లా మరణ వార్తలపై హెజ్బొల్లా కానీ, లెబనాన్ కానీ ఇంకా స్పందించలేదు.ఇదిలా ఉండగా దాడుల విషయంలో ఇజ్రాయెల్ సైన్యం దూకుడు ప్రదర్శిస్తున్న వేళ.. ఇరాన్ అప్రమత్తమైంది. తమ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని దేశంలోని సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు తెలుస్తోంది. ఆయనకు భద్రతా ఏర్పాట్లను కూడా పెంచినట్లు సమాచారం. ఈ మేరకు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. నస్రల్లాను అంతమొందించినట్లు ఇజ్రాయెల్ ప్రకటించిన తర్వాత.. తదుపరి చర్యపై లెబనాన్, హెజ్బొల్లా, ఇతర ప్రాంతీయ గ్రూపులతో ఇరాన్ నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. -
Who is Nasrallah: ఇజ్రాయెల్ మోస్ట్‌వాంటెడ్ ఇతనే!
పశ్చిమాసియాలో ఇప్పుడు ఇజ్రాయెల్-లెబనాన్ యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. పాలస్తీనా అనుకూల.. ఇరాన్ మద్దతు ఉన్న హెజ్బొల్లాను సమూలంగా తుడిచిపెట్టేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ రక్షణ బలగాలు(IDF) భీకర దాడులు కొనసాగిస్తోంది. మరీ ముఖ్యంగా ఆ సంస్థ చీఫ్ హసన్ నస్రల్లాను లక్ష్య్ంగా చేసుకుని బీరుట్‌లోని హెజ్బొల్లా ప్రధాన కార్యాలయంలో బాంబులు కుమ్మరించింది. అయితే ఆయన సురక్షితంగా ఉన్నారని హెజ్బొల్లా ప్రకటించుకున్నప్పటికీ.. ఆయన కుమార్తె జైనబ్ మరణించారనే వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఈ నజ్రల్లా ఎవరు?. ఆయన బ్యాక్‌గ్రౌండ్ ఏంటన్నది పరిశీలిస్తే..పాలస్తీనియన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ (పీఎల్‌వో) నిర్మూలనే లక్ష్యంగా 1980లో లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడి చేసింది. రాజధాని బీరుట్ నుంచి పీఎల్‌వోను తరిమికొట్టి విజయం సాధించింది. అయితే, ఎలాగైనా కక్ష తీర్చుకోవాలని ప్రయత్నంచిన పీఎల్ఓలోని కొందరు 1982 జూన్‌లో ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ప్రధాన కార్యాలయం షైన్ బెట్‌పై దాడి చేశారు. ఈ ఘటనలో దాదాపు 91 మంది ఇజ్రాయెల్ అధికారులు ప్రాణాలు కోల్పోయారు. దీనికి తామే కారణమని షియా ఇస్లామిస్టులు ప్రకటించుకున్నారు. ఆ తర్వాత వారంతా కలిసి హెజ్బొల్లాగా ఏర్పాటయ్యారు. ఈ సంస్థ ఏర్పాటులో ముసావితో కలిసి నస్రల్లా కీలక పాత్ర పోషించాడు.1992లో అప్పటి హెజ్బొల్లా అధినేత అబ్బాస్ అల్ ముసావి హెలికాఫ్టర్‌లో వెళ్తుండగా ఇజ్రాయెల్ దళాలు హతమార్చాయి. దీంతో సంస్థ పగ్గాలను తన మార్గదర్శి స్థానం నుంచి నస్రల్లా అందుకున్నాడు. అప్పటికి అతడి వయసు 32 ఏళ్లే. అతడి నాయకత్వంలో హెజ్బొల్లా ఇంతలా బలపడి ఉంటుందని బహుశా అప్పుడు ఇజ్రాయెల్ మిలిటరీ దళాలు ఊహించకపోవచ్చు.పశ్చిమాసియాలో సంస్థను బలోపేతం చేయడంతో పాటు లెబనాన్ ప్రభుత్వంలోనూ భాగస్వామిగా మార్చాడు. హెజ్బొల్లా ప్రభావాన్ని దేశ సరిహద్దులు దాటి విస్తరించగలిగాడు. 2011లో సిరియాలో ప్రభుత్వ వ్యతిరేక తిరుగుబాటుదారులకు ఈ సంస్థ సాయం చేసింది.దాదాపు రెండు దశాబ్దాల క్రితం ఇజ్రాయెల్‌తో హెజ్బొల్లా చేసిన భీకర పోరాటం తర్వాత నస్రల్లా పేరను అరబ్ దేశాల్లో మార్మోగింది. 2006లో లెబనాన్‌లో 34 రోజుల పాటు జరిగిన యుద్ధంలో ఇజ్రాయెల్‌ను ఓడించడంలో అతడు కీలక ప్రాత పోషించాడు. అప్పటి నుంచే ఇజ్రాయెల్‌కు బద్ధ శత్రువుగా మారాడు.నస్రల్లా కేవలం హెజ్బొల్లా చీఫ్‌గా మాత్రమే గుర్తింపు లేదు. బీరుట్ శివారులోని బుర్జ్ హమ్ముద్ ప్రాంతంలో 1960లో నస్రల్లా జన్మించాడు. అతని తండ్రి ఓ చిరు కూరగాయల వ్యాపారి. షియా కుటుంబంలో తొమ్మిది మంది తోబుట్టువుల్లో ఒకడైన నస్రల్లా.. చిన్నప్పుడే మత విద్యను అభ్యసించాడు. 16 ఏళ్ల వయసులోనే షియా పొలిటికల్, పారామిలిటరీ గ్రూప్ అయిన అమల్ ఉద్యమంలో చేరాడు. అప్పటి హెజ్బొల్లా సారథి అబ్బాస్ అల్ ముసావి దృష్టిలో పడడంతో ఆయన జీవితమే మలుపు తిరిగింది. నస్రల్లా భార్య ఫాతిమా యాసిన్. నలుగురు పిల్లలు. 1997లో ఇజ్రాయెల్ యుద్ధంలో తన పెద్ద కొడుకు హదీని కోల్పోయాడాయన. తాజాగా దక్షిణ లెబనాన్‌లోని దాహియా ప్రాంతంలోని హెజ్బొల్లా హెడ్‌క్వార్టర్స్‌పై ఇజ్రాయెల్ బలగాల దాడుల్లో నస్రల్లా కూతురు కుమార్తె జైనబ్ మృతిచెందినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇజ్రాయెల్ మీడియా సంస్థల్లో కథనాలు వస్తున్నా.. ఆమె మృతిని హెజ్బొల్లా గానీ, లెబనాన్ అధికారులు గానీ ధ్రువీకరించలేదు. హెజ్బొల్లాలో జైనబ్ కూడా క్రియాశీలక పాత్ర పోషిస్తోంది. జైనబ్ మృతి నిజమైతే గనుక.. ప్రతీకారంగా హెజ్బొల్లా దాడులను తీవ్రతరం చేసే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే ఇజ్రాయెల్ భూభాగాలను లక్ష్యంగా చేసుకుని 65 రాకెట్లతో విరుచుకుపడింది కూడా. ఇంతకీ నస్రల్లా ఎక్కడ?నస్రల్లా లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు జరుపుతోంది. తాజా దాడుల్లో నస్రల్లా మరణించాడా? లేదా సురక్షితంగానే ఉన్నాడా? అన్నదానిపై స్పష్టత లేదు. తాము జరిపిన దాడుల్లో అతడు బతికే అవకాశాలు లేవని ఇజ్రాయెల్ అంటోంది. మరోవైపు, హెజ్బొల్లా వర్గాలు మాత్రం తమ నాయకుడు ప్రాణాలతో ఉన్నట్లు చెబుతున్నాయి. ప్రస్తుతానికి నస్రల్లా ఎక్కడ ఉన్నాడన్నది తెలియరాలేదు. కానీ, కమ్యూనికేషన్ కట్ అయ్యినట్లు సమాచారం. మరోవైపు, హెజ్బొల్లా స్థావరాలపైకి యాంటీషిప్ క్షిపణులతో ఐడీఎఫ్ దాడులు కొనసాగిస్తోంది. దీంతో బీరుట్ సహా లెబనాన్‌లోని పలు ప్రాంతాల్లో సైరెన్ల మోత మోగుతోంది.