సమాధుల కింద హెజ్‌బొల్లా టన్నెల్‌.. ఐడీఎఫ్‌ వీడియో విడుదల | idf says Multiple hezbollah tunnels have been dismantled by troops | Sakshi
Sakshi News home page

సమాధుల కింద హెజ్‌బొల్లా టన్నెల్‌.. ఐడీఎఫ్‌ వీడియో విడుదల

Published Mon, Nov 11 2024 10:31 AM | Last Updated on Mon, Nov 11 2024 11:58 AM

idf says Multiple hezbollah tunnels have been dismantled by troops

లెబనాన్‌లో హెజ్‌బొల్లా గ్రూప్‌ సభ్యులు ఉపయోగించే పలు భూగర్భ సొరంగాలను ఇజ్రాయెల్ సైన్యం బయటపెట్టింది. ఆ సొరంగాలు స్మశానవాటిక కింద ఉండటం గమనార్హం. సుమారు కిలోమీటరు పొడవున్న సొరంగంలో.. కమాండ్‌, కంట్రోల్ రూమ్‌లు, స్లీపింగ్ క్వార్టర్‌లు, డజన్ల కొద్దీ ఆయుధాలు, గన్స్‌, రాకెట్లు, ఇతర సైనిక సామగ్రిని చూపించే వీడియోను ఇజ్రాయెలీ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) ‘ఎక్స్‌’ వేదికగా విడుదల చేసింది.

‘హెజ్‌బొల్లాకు మానవ జీవితం అంటే లెక్క లేదు. చనిపోయినా, బతికినా పట్టించుకోదు’ అని ఐడీఎఫ్‌ పేర్కొంది.ఈ సొరంగంలోకి 4,500 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పంపింగ్ చేసి సీల్ చేసినట్లు సమాచారం. గత ఏడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్ పట్టణాలపై హమాస్ దాడి చేసిన తర్వాత గాజాలో యుద్ధం చెలరేగినప్పటి నుంచి ఇజ్రాయెల్, ఇరాన్ మద్దతుగల హెజ్‌బొల్లా గ్రూప్‌ లెబనీస్ సరిహద్దులో దాడులు చేసుకుంటున్నాయి. సెప్టెంబరులో లెబనాన్‌లోకి ఇజ్రాయెల్‌ సైన్యం ప్రవేశించటం ప్రారంభించినప్పటి నుంచి ఐడీఎఫ్‌ పలు సొరంగాలను కనుగొంది. అందులో ఒకటి 25 మీటర్ల పొడవుతో ఇజ్రాయెల్‌ వైపు ఉండటం గమనార్హం.

గత నెలలో లెబనీస్ పౌరుడికి ఇంటి క్రింద హెజ్‌బొల్లా సభ్యులు వాడినట్లు ఆరోపింస్తూ.. ఇజ్రాయెల్‌ ఆర్మీ ఓ సొరంగం వీడియోను విడుదల చేసింది. అయితే.. ఆ సోరంగం గాజాలో హమాస్ సభ్యులు నిర్మించినటువంటిది కాదని పేర్కొంది. దక్షిణ లెబనాన్‌లోని ఆ సొరగంలో ఇనుప తలుపులు, వర్కింగ్‌ రూంలు, ఏకే-47 రైఫిల్స్, ఒక పడకగది, ఒక బాత్‌రూం, జనరేటర్ల నిల్వ గది, నీటి ట్యాంకుల దృష్యాలు వీడియోలో కనిపించాయి.

చదవండి: సిరియాలో ఇజ్రాయెల్‌ దాడులు.. హెజ్‌బొల్లా కమాండర్‌ హతం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement