Tunnels
-
సమాధుల కింద హెజ్బొల్లా టన్నెల్.. ఐడీఎఫ్ వీడియో విడుదల
లెబనాన్‌లో హెజ్బొల్లా గ్రూప్ సభ్యులు ఉపయోగించే పలు భూగర్భ సొరంగాలను ఇజ్రాయెల్ సైన్యం బయటపెట్టింది. ఆ సొరంగాలు స్మశానవాటిక కింద ఉండటం గమనార్హం. సుమారు కిలోమీటరు పొడవున్న సొరంగంలో.. కమాండ్, కంట్రోల్ రూమ్‌లు, స్లీపింగ్ క్వార్టర్లు, డజన్ల కొద్దీ ఆయుధాలు, గన్స్, రాకెట్లు, ఇతర సైనిక సామగ్రిని చూపించే వీడియోను ఇజ్రాయెలీ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) ‘ఎక్స్’ వేదికగా విడుదల చేసింది.‘హెజ్బొల్లాకు మానవ జీవితం అంటే లెక్క లేదు. చనిపోయినా, బతికినా పట్టించుకోదు’ అని ఐడీఎఫ్ పేర్కొంది.ఈ సొరంగంలోకి 4,500 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పంపింగ్ చేసి సీల్ చేసినట్లు సమాచారం. గత ఏడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్ పట్టణాలపై హమాస్ దాడి చేసిన తర్వాత గాజాలో యుద్ధం చెలరేగినప్పటి నుంచి ఇజ్రాయెల్, ఇరాన్ మద్దతుగల హెజ్బొల్లా గ్రూప్ లెబనీస్ సరిహద్దులో దాడులు చేసుకుంటున్నాయి. సెప్టెంబరులో లెబనాన్‌లోకి ఇజ్రాయెల్ సైన్యం ప్రవేశించటం ప్రారంభించినప్పటి నుంచి ఐడీఎఫ్ పలు సొరంగాలను కనుగొంది. అందులో ఒకటి 25 మీటర్ల పొడవుతో ఇజ్రాయెల్ వైపు ఉండటం గమనార్హం.⭕️ Operational update from Lebanon: Multiple underground terrorist tunnels have been dismantled by our troops, including a tunnel that was strategically located under a cemetery. Hezbollah doesn’t value human life—dead or alive. pic.twitter.com/77Ry4bQk0V— Israel Defense Forces (@IDF) November 10, 2024గత నెలలో లెబనీస్ పౌరుడికి ఇంటి క్రింద హెజ్బొల్లా సభ్యులు వాడినట్లు ఆరోపింస్తూ.. ఇజ్రాయెల్ ఆర్మీ ఓ సొరంగం వీడియోను విడుదల చేసింది. అయితే.. ఆ సోరంగం గాజాలో హమాస్ సభ్యులు నిర్మించినటువంటిది కాదని పేర్కొంది. దక్షిణ లెబనాన్‌లోని ఆ సొరగంలో ఇనుప తలుపులు, వర్కింగ్ రూంలు, ఏకే-47 రైఫిల్స్, ఒక పడకగది, ఒక బాత్రూం, జనరేటర్ల నిల్వ గది, నీటి ట్యాంకుల దృష్యాలు వీడియోలో కనిపించాయి.చదవండి: సిరియాలో ఇజ్రాయెల్ దాడులు.. హెజ్బొల్లా కమాండర్ హతం -
వెలిగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేయనున్న సీఎం జగన్
-
వెలిగొండ.. కల సాకారం
సాక్షి, అమరావతి: ప్రజాసంకల్ప పాదయాత్రలో రైతులకిచ్చిన మరో మాటను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలబెట్టుకున్నారు. ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ జిల్లాల్లో దుర్భిక్ష ప్రాంతాల ప్రజల దశాబ్దాల కల వెలిగొండ ప్రాజెక్టును సాకారం చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి వెలిగొండ ప్రాజెక్టులో అంతర్భాగమైన నల్లమలసాగర్‌కు కృష్ణా జలాలను తరలించేందుకు వీలుగా మొదటి టన్నెల్‌ను 2021, జనవరి 13 నాటికి పూర్తిచేయించిన సీఎం జగన్.. రెండో టన్నెల్ తవ్వకం పనులను ఈ ఏడాది జనవరి 21 నాటికి పూర్తిచేయించారు. ఆసియా ఖండంలోనే అత్యంత పొడవైన నీటిపారుదల సొరంగాల (ఇరిగేషన్ టన్నెల్స్)ను రికార్డు సమయంలో పూర్తిచేయడం ద్వారా ముఖ్యమంత్రి చరిత్ర సృష్టించారని సాగునీటిరంగ నిపుణులు ప్రశంసిస్తున్నారు. ఈ జంట సొరంగాలను బుధవారం సీఎం జగన్ జాతికి అంకితం చేయనున్నారు. వచ్చే సీజన్లో శ్రీశైలం ప్రాజెక్టుకు కృష్ణా వరద జలాలు చేరి, నీటి మట్టం కనీస స్థాయికి అంటే 854 అడుగులకు చేరుకున్న వెంటనే వెలిగొండ జంట సొరంగాల ద్వారా ఆ ప్రాజెక్టులో అంతర్భాగమైన నల్లమలసాగర్‌కు తరలించడానికి రంగం సిద్ధంచేశారు. తీగలేరు, గొట్టిపడియ, తూర్పు, పశ్చిమ కాలువల ద్వారా ఆయకట్టుకు నీళ్లందించి.. రైతులకు వెలిగొండ ప్రాజెక్టు ఫలాలను అందించనున్నారు. మరోవైపు ఈ ప్రాజెక్టును పూర్తిచేయడం ద్వారా ఎన్నికల్లో తమకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని రైతులు ఆనందోత్సాహాలు వ్యక్తంచేస్తున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ జిల్లాల్లో దుర్భిక్ష ప్రభావిత 30 మండలాల్లోని 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు.. 15.25 లక్షల మందికి తాగునీరు అందుతుంది. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కనిగిరి, యర్రగొండపాలెం, గిద్దలూరు, మార్కాపురం, ఉదయగిరి నియోజకవర్గాల్లో దశాబ్దాలుగా పీడిస్తున్న ఫ్లోరైడ్ సమస్యకు కూడా ఈ ప్రాజెక్టు పూర్తి ద్వారా సీఎం జగన్ శాశ్వత పరిషారం చూపారు. చంద్రబాబు దోపిడీని కడిగేసిన కాగ్.. ఎన్టీఆర్‌కు 1995లో వెన్నుపోటు పొడిచి అధికారాన్ని చేజిక్కించుకున్నాక.. 1996 లోక్‌సభ ఎన్నికల రూపంలో ఎదురైన తొలి గండాన్ని గట్టెక్కేందుకు ఆ ఏడాది మార్చి 5న గొట్టిపడియ వద్ద నాటి సీఎం చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత 2004 వరకూ ఈ ప్రాజెక్టు కోసం కేవలం రూ.పది లక్షలు మాత్రమే ఖర్చుచేశారు. అదీ శంకుస్థాపన సందర్భంగా నిర్వహించిన సభ కోసం మాత్రమే. రాష్ట్ర విభజన నేపథ్యంలో 2014లో మళ్లీ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ప్రజాధనాన్ని దోచుకోవడానికి వెలిగొండ ప్రాజెక్టును ప్రయోగశాలగా మార్చుకున్నారు. 2014–2019 వరకూ రూ.1,385.81 కోట్లు ఖర్చుచేసినా పనుల్లో ఏమాత్రం ప్రగతి కనిపించకపోవడమే చంద్రబాబు దోపిడీకి నిదర్శనం. జీఓ–22 (ధరల సర్దుబాటు), జీవో–63 (çపనుల పరిమాణం ఆధారంగా బిల్లుల చెల్లింపు)ను వర్తింపజేసి.. కాంట్రాక్టర్లకు ఉత్తినే రూ.630.57 కోట్లను దోచిపెట్టారు. 2017 నాటికే వెలిగొండను పూర్తిచేస్తామని ప్రకటించి.. టీబీఎం (టన్నెల్ బోరింగ్ మెషీన్)ల మరమ్మతుల కోసం కాంట్రాక్టర్లకు రూ.66.44 కోట్లను ఇచ్చేసి, కమీషన్లు వసూలు చేసుకున్నారు. మరమ్మతు చేయకపోవడంవల్ల టీబీఎంలు ఎందుకూ పనికిరాకుండాపోయాయి. ఇక 2018, 2019 నాటికి పూర్తిచేస్తామంటూ ఎప్పటికప్పుడు హామీలిస్తూ వచ్చిన చంద్రబాబు.. రెండో సొరంగం పనులు చేస్తున్న కాంట్రాక్టర్‌ను తొలగించి, మిగిలిన పనుల అంచనా వ్యయాన్ని పెంచి.. వాటిని అధిక ధరలకు సీఎం రమేష్‌కు కట్టబెట్టి, కమీషన్లు వసూలుచేసుకుని ప్రాజెక్టు పనులను గాలికొదిలేశారు. వెలిగొండ ప్రాజెక్టులో చంద్రబాబు దోచేయడాన్ని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) కడిగిపారేసింది. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న సీఎం జగన్.. ♦ 2019లో వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వెలిగొండ ప్రాజెక్టును పూర్తిచేయడంపై ప్రత్యేక దృష్టిపెట్టారు. గత 58 నెలల పాలనలో దాదాపు రెండేళ్లు కరోనావల్ల పనులు చేయలేని పరిస్థితి. అయినాసరే.. మొదటి సొరంగం పనుల్లో మిగిలిన 2.883 కిమీల పనులను 2019, నవంబరులో ప్రారంభించి.. 2021, జనవరి 13 నాటికి పూర్తిచేయించారు. 2014–19 మధ్య టీడీపీ సర్కార్ హయాంలో మొదటి సొరంగంలో రోజుకు సగటున 2.41 మీటర్ల మేర తవ్వితే.. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో రోజుకు సగటున 4.12 మీటర్ల మేర తవ్వడం గమనార్హం. అలాగే, శ్రీశైలం రిజర్వాయర్ నుంచి మొదటి సొరంగం ద్వారా నల్లమలసాగర్‌కు నీటిని విడుదలచేసే హెడ్ రెగ్యులేటర్ పనులను అదే ఏడాది పూర్తిచేయించారు. ♦ ఇక రెండో సొరంగం మిగిలిన పనుల అంచనా వ్యయాన్ని 2019 ఎన్నికలకు ముందు భారీగా పెంచేసిన చంద్రబాబు.. వాటిని అధిక ధరలకు సీఎం రమేష్‌కు కట్టబెట్టి, ప్రజాధనాన్ని దోచిపెట్టారు. వాటిని రద్దుచేసిన సీఎం జగన్.. రివర్స్ టెండరింగ్ నిర్వహించి టీడీపీ సర్కార్ అప్పగించిన ధరల కంటే రూ.61.76 కోట్లు తక్కువకు పూర్తిచేసేందుకు ముందుకొచ్చిన ‘మేఘా’ సంస్థకు 7.698 కి.మీ.ల సొరంగం పనులను అప్పగించారు. తద్వారా చంద్రబాబు అక్రమాలను ప్రజల ముందు పెట్టారు. ♦రెండో సొరంగంలో టీబీఎంకు కాలం చెల్లడంతో.. రోజుకు ఒక మీటర్ పని జరగడం కూడా కష్టంగా మారింది. దాంతో 2022లో మనుషుల ద్వారా పనులు చేయించాలని అధికారులకు సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. మొదటి సొరంగం నుంచి రెండో సొరంగంలోకి 17.8 కి.మీ, 16.555 కి.మీ, 14.5 కి.మీ, 13.5 కి.మీ, 12.5 కి.మీ వద్ద సొరంగాలను తవ్వి.. అక్కడ మనుషులతో సొరంగాన్ని తవ్వించేలా పనులు చేపట్టారు. మంగళవారం నాటికి రెండో సొరంగం తవ్వకం పనులు పూర్తయ్యాయి. 7.685 కి.మీల పొడవున తవ్వకం పనులు, హెడ్ రెగ్యులేటర్ పనులు కూడా పూర్తయ్యాయి. శ్రీశైలానికి వరద వచ్చేలోగా టీబీఎంను సొరంగం నుంచి బయటకు తీయనున్నారు. మరోవైపు.. 2014–19 మధ్య చంద్రబాబు సర్కార్ హయాంలో రెండో సొరంగం రోజుకు సగటున 1.31 మీటర్ల మేర తవ్వితే.. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో రోజుకు 7.25 మీటర్లు (టీబీఎం ద్వారా 1.45, మనుషుల ద్వారా 6.80 మీటర్లు) తవ్వడం గమనార్హం. ♦ఇక టీడీపీ సర్కార్ చేపట్టకుండా నిర్లక్ష్యం చేసిన తీగలేరు హెడ్ రెగ్యులేటర్, తూర్పు ప్రధాన కాలువ హెడ్ రెగ్యులేటర్ పనులను చేపట్టిన సీఎం వైఎస్ జగన్ యుద్ధప్రాతిపదికన పూర్తిచేయిస్తున్నారు. శ్రీశైలంలోకి కృష్ణా వరద జలాలు వచ్చిన వెంటనే.. సొరంగాల ద్వారా నల్లమలసాగర్‌కు తరలించి.. ఆయకట్టుకు నీళ్లందించనున్నారు. ♦ ప్రాజెక్టు పనులకు ఇప్పటివరకూ రూ.978.02 కోట్లను సీఎం వైఎస్ జగన్ ఖర్చుచేశారు. ప్రాజెక్టు పనులకు పెట్టిన ప్రతి పైసా సద్వినియోగమయ్యేలా జాగ్రత్తలు తీసుకుని.. శరవేగంగా పూర్తిచేయించారు. నల్లమలసాగర్.. ఓ ఇంజినీరింగ్ అద్భుతం ప్రకాశం జిల్లాలో విస్తరించిన నల్లమల పర్వత శ్రేణులకు సమాంతరంగా వెలుపల ఉన్న కొండలను వెలిగొండలు అంటారు. వెలిగొండ శ్రేణుల్లో సుంకేశుల, కాకర్ల, గొట్టిపడియ వద్ద కొండల మధ్య ఖాళీ ప్రదేశాల (గ్యాప్)ను కలుపుతూ 373.5 మీటర్ల పొడవు, 63.65 మీటర్ల ఎత్తు (సుంకేశుల డ్యామ్)తో.. 587 మీటర్ల పొడవు, 85.9 మీటర్ల ఎత్తు (గొట్టిపడియ డ్యామ్)తో 356 మీటర్ల పొడవు, 57 మీటర్ల ఎత్తు (కాకర్ల డ్యామ్)తో మూడు డ్యామ్‌లు నిర్మించడంతో నల్లమల పర్వత శ్రేణులు, వెలిగొండ కొండల మధ్య 62.40 చదరపు కిలోమీటర్ల ప్రదేశంలో 53.85 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో నల్లమలసాగర్ సహజసిద్ధంగా రూపుదిద్దుకుంది. ఇదో ఇంజినీరింగ్ అద్భుతమని సాగునీటిరంగ నిపుణులు ప్రశంసిస్తున్నారు. నల్లమలసాగర్ పనులను మహానేత వైఎస్ పూర్తి చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కొల్లంవాగు ద్వారా రోజుకు 11,583 క్యూసెక్కులు తరలించేలా కొల్లంవాగు కుడి వైపునున్న కొండను తొలచి, రెండు సొరంగాలు (టన్నెల్–1 ద్వారా 3,001 క్యూసెక్కులు, టన్నెల్–2 ద్వారా 8,582 క్యూసెక్కులు) తవ్వి.. ఫీడర్ ఛానల్ ద్వారా నల్లమలసాగర్‌కు కృష్ణా జలాలను తరలిస్తారు. వెలిగొండ ప్రాజెక్టులో 18.8 కి.మీ.ల పొడవున తవ్విన రెండు సొరంగాలు ఆసియా ఖండంలోనే అతిపెద్ద నీటిపారుదల సొరంగాలు కావడం గమనార్హం. దుర్భిక్ష ప్రాంతాల రూపురేఖల్లో సమూల మార్పు.. ప్రకాశం జిల్లాలో అత్యంత వెనుకబడిన ప్రాంతమైన దొనకొండ వద్ద 24,358 ఎకరాల్లో ఏపీఐఐసీ (ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ) మెగా ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటుకు సిద్ధంగా ఉంది. ఇందులో ఏర్పాటయ్యే పరిశ్రమలకు అవసరమైన నీటిని సరఫరా చేయడానికి వెలిగొండ ప్రాజెక్టులో 2.58 టీఎంసీలను ప్రభుత్వం కేటాయించింది. పామూరు, పెద్దచెర్లోపల్లి మండలాల్లో, ఉప్పలపాడు పరిసర ప్రాంతాల్లో 14 వేల ఎకరాల్లో నిమ్జ్ (నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చర్ జోన్) ఏర్పాటుకూ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇందులో ఏర్పాటయ్యే పరిశ్రమలకు అవసరమైన నీటిని సరఫరా చేసేందుకు వెలిగొండ ప్రాజెక్టులో 1.27 టీఎంసీలు కేటాయించింది. వెలిగొండ ప్రాజెక్టు పూర్తయిన నేపథ్యంలో మెగా ఇండస్ట్రియల్ హబ్, నిమ్జ్‌లలో భారీఎత్తున పరిశ్రమలు ఏర్పాటుకానున్నాయి. తద్వారా ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి. మరోవైపు.. సాగునీటి సరఫరా చేయడంవల్ల ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ జిల్లాలు సస్యశ్యామలం అవుతాయి. వెలిగొండ ప్రాజెక్టు పూర్తవడంతో ఈ జిల్లాల రూపురేఖలు సమూలంగా మారిపోతాయని అధికారవర్గాలు విశ్లేషిస్తున్నాయి. సీఎం జగన్ చిత్తశుద్ధికి నిదర్శనం వెలిగొండ ప్రాజెక్టులో అత్యంత కీలకమైన జంట సొరంగాలను సీఎం వైఎస్ జగన్ చిత్తశుద్ధి, అంకితభావంవల్లే పూర్తి చేయగలిగాం. టీబీఎంలు పనిచేయకపోవడంతో సంప్రదాయ పద్ధతి (బ్లాస్టింగ్ చేయడం, మనుషుల ద్వారా తవ్వడం)లో పనులు చేపట్టాలని సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. సంప్రదాయ పద్ధతిలో పనులు చేపట్టడంవల్లే రెండు సొరంగాలను పూర్తి చేయగలిగాం. – శశిభూషణ్‌కుమార్, ముఖ్య కార్యదర్శి, ఏపీ జలవనరుల శాఖ ఇదో మహోజ్వల ఘట్టం వెలిగొండ ప్రాజెక్టును మహానేత వైఎస్సార్ చేపడితే.. ఆయన తనయుడు సీఎం జగన్ పూర్తిచేసి బుధవారం జాతికి అంకితం చేయనున్నారు. తండ్రి చేపట్టిన ప్రాజెక్టును తనయుడు పూర్తిచేసి జాతికి అంకితం ఇవ్వడం నీటిపారుదలరంగ చరిత్రలో మహోజ్వల ఘట్టం. ప్రణాళికాబద్ధంగా ప్రాజెక్టులను పూర్తిచేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడానికి సీఎం జగన్ చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నారు.– సి.నారాయణరెడ్డి, ఇంజనీర్ ఇన్ చీఫ్, ఏపీ జలవనరుల శాఖ మహానేత వైఎస్సార్ ముందుచూపునకు తార్కాణం శ్రీశైలం ప్రాజెక్టుకు వరద వచ్చే 45 రోజుల్లో... రోజుకు 85 క్యూమెక్కులు (3,001 క్యూసెక్కులు) చొప్పున తరలించే సామర్థ్యంతో 7 మీటర్ల వ్యాసం, 18.80 కి.మీ.ల పొడవుతో సొరంగం తవ్వి.. వెలిగొండ కొండల్లో నిర్మించే నల్లమలసాగర్‌కు నీటిని తరలించి ప్రకాశం జిల్లాలో దుర్భిక్ష ప్రాంతాలకు సాగు, తాగునీరు అందించాలని 1993–94లో డీపీఆర్ రూపొందించారు. కానీ, 2004 వరకూ పట్టించుకోలేదు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించాక జలయజ్ఞం చేపట్టారు. ఈ క్రమంలో వెలిగొండ డీపీఆర్‌ను సమూలంగా మార్చేశారు. కృష్ణా నదికి వరద రోజులు క్రమేణ తగ్గుతున్న నేపథ్యంలో.. శ్రీశైలానికి వరద వచ్చే 45 రోజుల్లోనే రోజుకు 11,584 క్యూసెక్కులు చొప్పున 43.50 టీఎంసీలను తరలించేలా జంట సొరంగాలు (మొదటిది 85 క్యూమెక్కుల సామర్థ్యం, రెండోది 243 క్యూమెక్కుల సామర్థ్యం) తవ్వి.. కొత్తగా 53.85 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే నల్లమలసాగర్‌లో నిల్వచేసి.. ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ జిల్లాల్లో వర్షాభావ ప్రాంతాల్లో 4,47,300 (తీగలేరు కెనాల్ ద్వారా 62 వేలు, తూర్పు ప్రధాన కాలువ ద్వారా 3,70,800, గొట్టిç³డియ కాలువ ద్వారా 9,500 ఎకరాలు) ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించడంతోపాటు ఆ మూడు జిల్లాల్లోని 30 మండలాల్లో 15.25 లక్షల మంది దాహార్తిని తీర్చాలనే లక్ష్యంతో వైఎస్సార్ 2004, అక్టోబర్ 27న శ్రీకారం చుట్టారు. రూ.3,610.38 కోట్లు ఖర్చుచేసి.. నల్లమలసాగర్‌తోపాటు సొరంగాల్లో చాలావరకు పనులు పూర్తిచేయించారు. సొరంగాలను నల్లమలసాగర్‌ను అనుసంధానం చేసేలా 23 కి.మీల పొడవున ఫీడర్ చానల్ పనులను చేయించారు. తీగలేరు కెనాల్, తూర్పు, పశ్చిమ ప్రధాన కాలువ, గొట్టిపడియ కెనాల్ పనులను చేపట్టారు. నల్లమలసాగర్ రిజర్వాయర్సమగ్ర స్వరూపం ♦ పూర్తి నీటినిల్వ సామర్థ్యం 53.85 టీఎంసీలు ♦ వినియోగించే జలాలు 43.50 టీఎంసీలు ♦ గరిష్ఠ నీటి మట్టం 244 మీటర్లు (సముద్ర మట్టానికి) ♦ కనీస నీటి మట్టం214.3 మీటర్లు ♦ డెడ్ స్టోరేజ్ 10.35 టీఎంసీలు ♦ పంటలకు అవసరమైన జలాలు 38.57 టీఎంసీలు ♦ తాగునీటికి కేటాయించినవి 1.57 టీఎంసీలు ♦ ఆవిరి నష్టాలు3.36 టీఎంసీలు వెలిగొండ ప్రాజెక్టు పనులకు వ్యయం ఇలా.. ♦ ప్రాజెక్టు అంచనా వ్యయం: రూ.10,010.54 కోట్లు ♦ పరిపాలన అనుమతి: రూ.8,043.85 కోట్లు ♦ 2004–14 (మహానేత వైఎస్ హయాంలో) వ్యయం: రూ.3,610.38 కోట్లు పనులకు రూ.2,890.17 కోట్లు భూసేకరణకు రూ.262.64 కోట్లు పునరావాసం కల్పనకు రూ.20.53 కోట్లు అటవీ అనుమతులకు రూ.437.04 కోట్లు ♦ 2014–19 మధ్య వ్యయం (చంద్రబాబు హయాంలో) : రూ.1,385.81 కోట్లు పనులకు రూ.1,208.35 కోట్లు, భూసేకరణకు రూ.114.89 కోట్లు పునరావాసం కల్పనకు రూ.62.57 కోట్లు ♦ 2019 మే 30 నుంచి ఇప్పటివరకూ (సీఎం జగన్ హయాంలో) వ్యయం: రూ.978.02 కోట్లు పనులకు రూ.822.08 కోట్లు భూసేకరణకు రూ.79.21 కోట్లు పునరావాసం కల్పనకురూ.76.73 కోట్లు ♦ మొత్తం వ్యయం: రూ.5,974.21 కోట్లు ♦ ప్రాజెక్టు పూర్తికి ఇంకా అవసరమైన నిధులు: రూ.4,036.33 కోట్లు -
Israel-Hamas war: గాజా ఆస్పత్రిని చుట్టుముట్టిన ఐడీఎఫ్
రఫా: ప్రాణాలతో మిగిలి ఉన్న బందీలను హమాస్ మిలిటెంట్లు నాసిర్ ప్రాంగణం అడుగునున్న సొరంగాల్లో దాచినట్లు ఇజ్రాయెల్ రక్షణ బలగాలు (ఐడీఎఫ్)అనుమానిస్తున్నాయి. దీంతో, వారం రోజులుగా ఆస్పత్రిని దిగ్బంధించి అణువణువూ శోధిస్తున్నాయి. గత ఏడాది అక్టోబర్ 7వ తేదీ దాడితో సంబంధమున్నట్లుగా అనుమానిస్తున్న 20 మందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు ఐడీఎఫ్ తెలిపింది. ఆస్పత్రిలోని 460 మందికి పైగా సిబ్బంది, రోగులను ఎలాంటి సౌకర్యాలు లేని ఆ పక్కనే ఉన్న పాతభవనంలోకి తరలివెళ్లాలని ఆర్మీ ఆదేశించింది. విద్యుత్ సరఫరా నిలిపివేయడంతోపాటు, ఆక్సిజన్ నిల్వలు అడుగంటడంతో ఐసీయూలోని ఆరుగురు రోగుల్లో ఐదుగురు చనిపోయినట్లు గాజా అధికారులు శుక్రవారం తెలిపారు. -
హమాస్ సొరంగాలకు కృత్రిమ వరద..?
టెల్ అవీవ్: హమాస్ అంతమే ధ్యేయంగా ముందుకు కదులుతున్న ఇజ్రాయెల్ మరో కీలక ఎత్తుగడ వేస్తున్నట్లు తెలుస్తోంది. సొరంగాల్లో నక్కిన హమాస్ దళాలను బయటకు రప్పించడానికి కృత్రిమ వరదను సృష్టించనున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాలకు సైన్యం నీటి పంపులను తరలిస్తున్నట్లు సమాచారం. సొరంగాలను నీటితో నింపితే ప్రాణ రక్షణ కోసం ఉగ్రవాదులు బయటకు వస్తారని (ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్) ఐడీఎఫ్ వ్యూహ రచన చేస్తోందని వాల్‌స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. ఆల్-షతీ శరణార్థి క్యాంపుకు ఉత్తర ప్రాంతంలో ఇజ్రాయెల్ ఐదు భారీ పంపులను నవంబర్ ప్రారంభంలోనే ఏర్పాటు చేసింది. గంటకు వేల క్యూబిక్ మీటర్ల నీటి సామర్థ్యమున్న భారీ పంపులను సైన్యం తరలించింది. వీటితో కొన్ని వారాల్లోనే సొరంగాలన్నింటినీ నీటితో నింపేయవచ్చు. బందీల విడుదల ప్రక్రియ పూర్తైన తర్వాత ఐడీఎఫ్ ఈ వరద ఎత్తుగడను ఉపయోగిస్తుందా..? లేక అంతకు ముందే నీటిని విడుదల చేస్తుందా? అనే అంశం ప్రస్తుతానికి తెలియదు. మరోవైపు బంధీలను సురక్షిత ప్రాంతంలో ఉంచామని హమాస్ ఇప్పటికే ప్రకటించింది. హమాస్‌ను అంతం చేయడానికి ఇజ్రాయెల్ అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తోంది. ఐడీఎఫ్ మిలిటరీ, టెక్నికల్‌గా అన్ని దారుల్లో ముందుకు వెళుతోంది. కాల్పుల విరమణ తర్వాత భూతల దాడులను తీవ్రతరం చేసిన ఇజ్రాయెల్.. సరికొత్త యుద్ధ తంత్రాలను ఉపయోగిస్తోంది. అక్టోబర్ 7న ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం ప్రారంభమైన విషయం తెలిసిందే. మొదట హమాస్ దాడుల్ని ప్రారంభించినా.. ఇజ్రాయెల్ తేరుకుని చావు దెబ్బ కొడుతోంది. అధునాతన ఆయుధాలతో గాజాపై విరుచుకుపడుతోంది. బాంబుల మోతతో గాజా అంతటా విలయం తాండవం చేస్తోంది. ఇప్పటికే గాజాలో 12 వేలకు పైగా మంది ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్ వైపు 1400 మంది చనిపోయారు. ఇటీవల నాలుగు రోజులు కాల్పుల విరమణకు ఇరుపక్షాలు అంగీకరించాయి. కానీ గడువు ముగియగానే మళ్లీ యుద్ధం ప్రారంభించారు. ఇదీ చదవండి: విషాదం: ఘోర రోడ్డు ప్రమాదం.. 14 మంది మృతి -
Israel-Hamas War: చక్రబంధంలో గాజా సిటీ!
ఖాన్ యూనిస్/జెరూసలేం/న్యూఢిల్లీ: గాజాలో హమాస్ మిలిటెంట్లతో హోరాహోరీ పోరు కొనసాగుతోందని ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. తమ పదాతి సేనలు, వైమానిక దళాలు శత్రువులపై ఆధిపత్యం ప్రదర్శిస్తున్నాయని, ప్రశంసనీయమైన విజయాలు సాధిస్తున్నాయని హర్షం వ్యక్తం చేసింది. మిలిటెంట్ల దాడులను తమ జవాన్లు గట్టిగా తిప్పికొడుతున్నారని పేర్కొంది. శుక్రవారం జరిగిన దాడుల్లో చాలామంది మిలిటెంట్లు హతమయ్యారని, వారి సొరంగాలు నామరూపాల్లేకుండా పోయాయని తెలియజేసింది. గాజా సిటీలో దాడులు ఉధృతం చేయబోతున్నామని ప్రకటించింది. ఇజ్రాయెల్–హమాస్ ఘర్షణలో మృతుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. శుక్రవారం నాటికి గాజాలో 9,200 మందికిపైగా పాలస్తీనియన్లు మరణించారు. గాజాలో మిలిటెంట్ల అదీనంలో ఉన్న 240 మంది బందీల ఆచూకీ కోసం ఇజ్రాయెల్ సైన్యం ముమ్మరంగా ప్రయతి్నస్తోంది. ఇందుకోసం అమెరికా డ్రోన్లను ఉపయోగిస్తోంది. ఈ డ్రోన్లు గత వారం రోజులుగా గాజా ఉపరితలంపై చక్కర్లు కొడుతున్న దృశ్యాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. గాజాని చుట్టుముట్టాం: ఇజ్రాయెల్ గాజాలో ప్రధాన నగరం, హమాస్ మిలిటెంట్ల ముఖ్యమైన అడ్డా అయిన గాజా సిటీని తమ సేనలు చుట్టుముట్టాయని ఇజ్రాయెల్ సైన్యం అధికార ప్రతినిధి డేనియల్ హగారీ ప్రకటించారు. భూతల దాడులు ప్రారంభమైన వారం రోజుల తర్వాత గాజా సిటీ చుట్టూ తమ దళాలు పూర్తిస్థాయిలో మోహ రించినట్లు తెలిపారు. గాజాలో కాల్పుల విరమణ పాటించాలంటూ ప్రపంచ దేశాల నుంచి తమపై ఒత్తిడి వస్తున్నట్లు వెలువడుతున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. నల్ల బ్యాగుల్లో తిరిగి వెళ్తారు: హమాస్ గాజాలో ఇజ్రాయెల్ సైన్యానికి దారుణ పరాజయం ఎదురు కాబోతోందని హమాస్ మిలిటరీ విభాగమైన ఖాసమ్ బ్రిగేడ్స్ స్పష్టం చేసింది. తమ భూభాగంలో అడుగుపెట్టిన ఇజ్రాయెల్ సైనికులు నల్ల బ్యాగుల్లో తిరిగి వెళ్తారని హెచ్చరించింది. తద్వారా వారికి తమ చేతుల్లో చావు తప్పదని పేర్కొంది. కాల్పుల విరమణ లేదు: నెతన్యాహూ హమాస్ మిలిటెంట్ల చెరలో ఉన్న బందీలందరినీ విడుదల చేసే దాకా గాజాలో కాల్పుల విరమణ ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ తేలి్చచెప్పారు. మానవతా సాయం గాజాకు చేరవేయడానికి, విదేశీయులను బయటకు పంపించడానికి వీలుగా తాత్కాలికంగా కాల్పు ల విరమణ పాటించాలన్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అభ్యర్థనపై ఆయన స్పందించారు. నెతన్యాహూ శుక్రవారం అమెరి కా విదేశాంగ మంత్రి బ్లింకెన్‌తో సమావేశమైన అనంతరం మీడియాతో మాట్లాడారు. పాలస్తీనియన్లను కాపాడండి గాజాలో ఇజ్రాయెల్ దాడుల్లో సామాన్య పాలస్తీనియన్లు మరణిస్తుండడం పట్ల అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఆందోళన వ్యక్తం చేశారు. గాజాలో ప్రజలను కాపాడడానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని ఇజ్రాయెల్‌కు విజ్ఞప్తి చేశారు. లేకపోతే ‘శాంతికి భాగస్వాములు’ ఎవరూ ఉండరని చెప్పారు. గాజాను శ్మశానంగా మార్చొద్దని పరోక్షంగా తేలి్చచెప్పారు. గాజాకు భారీస్థాయిలో మానవతా సాయం అవసరమని, ఆ దిశగా ఇజ్రాయెల్ ప్రభుత్వం చర్యలు ప్రారంభించాలని అన్నారు. ప్రపంచ దేశాలు, స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్న మానవతా సాయాన్ని గాజాలోకి విస్తృతంగా అనుమతించాలని, ఈ విషయంలో ఆంక్షలు తొలగించాలని చెప్పారు. ఆంటోనీ బ్లింకెన్ శుక్రవారం ఇజ్రాయెల్‌లో పర్యటించారు. పవిత్ర యుద్ధం చేస్తున్నాం: హసన్ నస్రల్లా ఇజ్రా యెల్‌పై దా డుల విషయంలో అమెరికా హెచ్చరికలు తమను భయపెట్టలేవని లెబనాన్‌కు చెందిన షియా మిలిటెంట్ సంస్థ ‘హెజ్బొల్లా’ అధినేత హసన్ నస్రల్లా పేర్కొన్నారు. ఇజ్రాయెల్–హమాస్ యుద్ధానికి హెజ్బొల్లా దూరంగా ఉండాలంటూ అమెరికా చేసిన హెచ్చరికలపై ఆయన శుక్రవారం స్పందించారు. ఇజ్రాయెల్–హమాస్ యుద్ధం మొదలైన తర్వాత ఆయన మాట్లాడడం ఇదే తొలిసారి. ఇజ్రాయెల్‌పై తొలుత దాడిచేసిన హమాస్‌పై ఆయన ప్రశంసల వర్షం కురిపించారు. ఇజ్రాయెల్‌పై పవిత్ర యుద్ధంలో త్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని వివరించారు. మధ్యధరా సముద్రంలో అమెరికా సైనిక బలగాలను చూసి తాము బెదిరిపోవడం లేదని అన్నారు. తమ దగ్గర బలమైన సైన్యం ఉందని, అన్నింటికీ సిద్ధపడే ఇజ్రాయెల్‌పై దాడులు చేస్తున్నట్లు నస్రల్లా పేర్కొన్నారు. నస్రల్లా ప్రస్తుతం ఎక్కడున్నారో తెలియదు. ఆయన ప్రసంగాన్ని టీవీల్లో ప్రసారం చేశారు. ఇజ్రాయెల్ నుంచి పాలస్తీనా కారి్మకులు వెనక్కి తమ దేశంలో పని చేస్తున్న పాలస్తీనియన్ కారి్మకులను వారి సొంత ప్రాంతమైన గాజాకు పంపించాలని ఇజ్రాయెల్ నిర్ణయించింది. శుక్రవారం పదుల సంఖ్యలో కారి్మకులను గాజాకు పంపించింది. భారమైన హృదయంతో వారు వెనక్కి వెళ్లిపోయారు. ఇజ్రాయెల్–హమాస్ మధ్య అక్టోబర్ 7 నుంచి ఘర్షణ మొదలైంది. అంతకంటే ముందు 18,000 మంది పాలస్తీనియన్లకు ఇజ్రాయెల్ ప్రభుత్వం వర్క్ పరి్మట్లు జారీ చేసింది. వారిలో చాలామంది ఇజ్రాయెల్‌కు చేరుకొని, వేర్వేరు పనుల్లో కుదురుకున్నారు. మారిన పరిస్థితుల నేపథ్యంలో పాలస్తీనియన్లు వెనక్కి వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ ఆదేశించింది. -
Israel-Hamas War: గాజా కింద మరో గాజా!
సరిహద్దులు దాటి మెరుపు దాడులతో భయోత్పాతం సృష్టించిన హమాస్ పనిపట్టే లక్ష్యంతో ఇజ్రాయెల్ ఆర్మీ దూకుడుగా ముందుకు సాగుతోంది. ప్రస్తుతానికి గాజాస్ట్రిప్‌పై భారీ వైమానిక దాడులతో వందలాదిగా భవనాలను ఇజ్రాయెల్ ఆర్మీ నేలమట్టం చేస్తూ పోతోంది. సరిహద్దుల్లో యుద్ధ ట్యాంకులను మోహరించింది. దాని దృష్టంతా ఇప్పుడు హమాస్ శ్రేణులపైనే ఉంది. ఇజ్రాయెల్ ఆర్మీ అత్యాధునిక సాంకేతికత, ఆయుధ బలంతో హమాస్ ఏమాత్రం సరితూగదు. అయితే, గాజా స్ట్రిప్‌లో ఇజ్రాయెల్ ఆర్మీ పని అనుకున్నంత సులువు కాదన్నది నిపుణుల మాట. ఏళ్లపాటు శ్రమించి ఏర్పాటు చేసుకున్న రహస్య భూగర్భ సొరంగాల విస్తారమైన నెట్వర్క్ హమాస్‌కు పెట్టని కోటగా మారింది. గత వారం నరమేథం సృష్టించిన హమాస్ మిలిటెంట్లు సరిహద్దులు దాటేందుకు సముద్ర, భూ, ఆకాశ మార్గాలతోపాటు ఈ సొరంగమార్గాలను కూడా వాడుకున్నారనే అనుమానాలున్నాయి. శత్రుదుర్బేధ్యమైన టన్నెల్ నెట్ వర్క్ ఎలా, ఎక్కడుందన్నది ఇజ్రాయెల్ ఆర్మీకి అంతుచిక్కడం లేదు. ఈ టన్నెళ్లలోనే హమాస్ ఆయుధ సామగ్రి, నెట్వర్క్ అంతా ఉన్నట్లు భావిస్తున్నారు. ఇజ్రాయెల్ బందీలను అండర్‌గ్రౌండ్‌లోనే దాచినట్లు ఆర్మీ అంటోంది. ఇజ్రాయెల్ 2014 నుంచి గాజా స్ట్రిప్‌తో ఉన్న 60 కిలోమీటర్ల సరిహద్దుల్లో భూగర్భంలో బారియర్లను ఏర్పాటు చేసింది. ఇందుకోసం రూ.7,500 కోట్లకు పైగా ఖర్చు చేసింది. సరిహద్దులకు ఆవలి వైపు ఏర్పాటయ్యే సొరంగాలను సైతం గుర్తించేందుకు ఎల్బిట్ సిస్టమ్స్, రఫేల్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్స్‌కు బాధ్యతలు అప్పగించింది. ఈ రెండు సంస్థలే ఇజ్రాయెల్‌కు క్షిపణి దాడులను అడ్డుకునే ఐరన్ డోమ్‌ను సమకూర్చాయి. ఐరన్వాల్, ఐరన్ స్పేడ్ పేరుతో కోట్లాది రూపాయలు ఖర్చు చేసి, ఇవి సాంకేతికతలను అభివృద్ధి పరిచాయి. అయితే, అవేవీ ఆశించిన ఫలితాలనివ్వలేదు. టన్నెళ్ల మధ్య లింకులను అవి కనిపెట్టలేకపోయాయి. ‘గాజా స్ట్రిప్‌లో రెండు లేయర్లున్నాయి. ఒకటి పౌరులది కాగా, రెండోది హమాస్‌ది. హమాస్ నిర్మించుకున్న ఆ రెండో లేయర్ ఎక్కడుందో కనిపెట్టేందుకు మేం ప్రయత్నిస్తున్నాం’అని ఇజ్రాయెల్ రక్షణ శాఖ ప్రతినిధి జొనాథన్ కొన్రికస్ చెప్పారు. అండర్‌గ్రౌండ్ నెట్‌వర్క్‌ను ఛేదించడం అంత సులువు కాదు. గతంలోనూ ఇజ్రాయెల్ అనేక మార్లు ప్రయత్నించి భంగపడింది. 2021లో గాజాపై భారీ చేపట్టిన బాంబు దాడులతో 100 కిలోమీటర్ల పరిధిలోని టన్నెళ్లను ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. అయితే, తమకు 500 కిలోమీటర్ల అండర్‌గ్రౌండ్ నెట్వర్క్ ఉన్నట్లు హమాస్ ఆ తర్వాత ప్రకటించుకోవడం గమనార్హం. భూగర్భ మార్గాలు ప్రమాదకరమా? సాంకేతికత ఎంతగా వృద్ధి చెందినప్పటికీ భూతల పోరాటంలో ఆధిపత్యం సాధించిన వారిని అక్షరాలా అణగదొక్కేందుకు టన్నెలింగ్ అత్యంత ప్రభావ వంతమైన మార్గంగా మారిపోయిందని స్కాట్ సవిట్జ్ అనే మిలటరీ నిపుణుడు అంటున్నారు. సొరంగాలు ఉన్నా యా, ఉంటే ఎన్ని ఉన్నాయి? అవి ఎక్కడ ఉ న్నాయి? అనేది వాటిని నిర్మించిన వారికే తప్ప ప్రత్యర్థికి తెలిసే అవకా శాలు చాలా తక్కువని ఆయన చెబుతు న్నారు. సైనిక పరమైన నష్టాన్ని తగ్గించేందుకు రోబోట్లను పంపి సంక్లిష్టమైన సొరంగాలను కనిపెట్టొచ్చు. అయితే, లోపల జాగా తక్కువగా ఉండటం, బూబీ ట్రాప్‌లు, ఇతర ఆత్మరక్షణ ఏర్పాట్లను మిలిటెంట్లు ఏర్పాట్లు చేసుకొని ఉండే ఉంటారు. భూగర్భ టన్నెళ్ల వాతావరణం వారికే తప్ప ఇతరులకు తెలిసే అవకాశం లేదు. ఈ పరిస్థితుల్లో ఇజ్రాయెల్ బలగాలు అందులోకి ప్రవేశించి తీవ్ర ప్రతికూలతను ఎదుర్కోవాల్సి రావచ్చు’అని సవిట్జ్ హెచ్చరించారు. ఎన్నో ఏళ్లుగా టన్నెళ్లను ఉపయోగించుకుంటున్న హమాస్ ‘అత్యంత జనసాంద్రత కలిగిన గాజాలో హమాస్ ఎన్నో ఏళ్లుగా టన్నెళ్లను ఉపయోగించుకుంటోంది. ఆయుధాలు, కమాండ్ వ్యవస్థలు, ఫైటర్లను వాటిలోనే దాచిపెడుతోంది. వాటిలోకి వెంటిలేషన్ మార్గాలు, విద్యుత్ తదితర సౌకర్యాలను సైతం సమకూర్చుకుంది. కొన్ని టన్నెళ్లయితే 35 మీటర్ల లోతులో కూడా ఉన్నాయి. రైల్ రోడ్ మార్గాలు, కమ్యూనికేషన్ గదులూ ఉన్నాయి. వాటి ప్రవేశ మార్గాలు ఎక్కువగా నివాస భవనాలు, కార్యాలయాల్లోనే ఉన్నాయి’అని నిపుణులు అంటున్నారు. మొదట్లో ఈ సొరంగాలను ఈజిప్టు నుంచి దొంగచాటుగా ఆయుధాలు, సరుకులను తరలించేందుకు వాడారు. సరిహద్దుల అవతల దాడులు జరిపేందుకు సైతం వీటిని ఉపయోగించుకున్నారు. 2006లో గిలాడ్ షలిట్ అనే ఇజ్రాయెల్ జవానును మిలిటెంట్లు సొరంగం ద్వారా దాడి చేసి, ఎత్తుకుపోయారు. అయిదేళ్ల తర్వాత వెయ్యి మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేశాక అతడిని వదిలిపెట్టారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
దొంగ తెలివి మామూలుగా లేదు!. ఆయిల్ చోరీకి ఏకంగా సొరంగమే తవ్వేశాడు
తాళం వేసిన ఇళ్లలోకి చొరబడి, డబ్బులు, బంగారం, నగలు చోరీ చేసిన ఘటనలు చూసే ఉంటాం. చైన్ స్నాచింగ్‌లు సైతం పెరిగిపోయాయి. జేబులోని పర్సులు, మొబైల్ విషయాల్లోనూ కొందరు చేతివాటం ప్రదర్శిస్తూ ఉంటారు. తాజాగా ఢిల్లీలో జరిగిన ఓ దొంగతనం గురించి తెలిస్తే షాక్ అవ్వకుండా అస్సలు ఉండలేదు. ఆయిల్‌ను దొంగతనం చేసేందుకు ఓ వ్యక్తి ఏకంగా సొరంగం తవ్వేశాడు. పోచన్‌పూర్‌కు చెందిన రాకేష్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీఎల్) పైపుల నుంచి ఆయిల్‌ను అపహరించడానికి పెద్ద పథకమే వేశాడు. ఢిల్లీ - పానిపట్ ఇండియన్ ఆయిల్ పైప్‌లైన్ ప్రాంతానికి సొరంగం తవ్వాడు. ప్లాస్టిక్ పైపులు ఏర్పాటుచేసి పైపులైన్‌లోని ఆయిల్‌ను తోడేయడం ప్రారంభించాడు. ఆయిల్ సరఫరా తగ్గడంతో అనుమానం వచ్చిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. చదవండి: ఇదెక్కడి వింత.. దోమలను ఆసుపత్రికి తీసుకొచ్చిన వ్యక్తి, షాకైన వైద్యులు సెప్టెంబర్ 29న పైప్‌లైన్‌ను తనిఖీ చేయగా.. ఢిల్లీలోని ద్వారక ప్రాంతంలో ఆయిల్ దొంగిలిస్తున్నట్లు తెలిసిందని ఫిర్యాదులో తెలిపింది. కంపెనీ ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించి అక్కడ తవ్వకాలు జరిపి ఆశ్చర్యపోయారు. మెయిన్ ఆయిల్ లైన్‌కు డ్రీల్లింగ్ ద్వారా రంధ్రాలు చేసి ప్లాస్టిక్ పైపులు పెట్టి ఆయిల్ దొంగతనం చేసేందుకు ఓ మిషన్‌ను అమర్చినట్లు గుర్తించారు. సొరంగం ద్వారా ఐఓసీఎల్ పైప్‌లైన్‌కు 40 మీటర్ల దూరం వరకు పైపులు వేసినట్లు తేలింది. ఈ పైపులు 52 ఏళ్ల రాకేష్ అలియాస్ గోలు అనే వ్యక్తికి చెందిన పొలంలోకి ఉండటంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. నిందితుడిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నామని, మిగతా వారిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. -
అవుకుపై అవాకులేల రామోజీ!
సాక్షి, అమరావతి: కళ్లార్పకుండా నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబు ఎంత నేర్పరో.. సిగ్గూఎగ్గూ లేకుండా ‘ఈనాడు’లో పచ్చి అబద్ధాలను అచ్చేసి సీఎం జగన్‌పై బురదజల్లడంలో రామోజీరావూ అంతే ఘనాపాటి. గాలేరు–నగరి సుజల స్రవంతి వరద కాలువలో అంతర్భాగమైన అవుకు జంట సొరంగాలపై ‘అవుకుపై.. చిలక పలుకులు మరిచారా జగన్?’ అనే శీర్షికతో శనివారం ప్రచురించిన కథనమే అందుకు తార్కాణం. అస్మదీయుడు చంద్రబాబు చేయలేక, చేతులెత్తేసిన పనిని తస్మదీ యుడు సీఎం వైఎస్ జగన్ పూర్తిచేయడంతో జీర్ణించుకోలేని రామోజీరావు.. యథేచ్ఛగా నీతిమాలిన రాతలతో ప్రభుత్వంపై విషం చిమ్మారు. ఆ కథనంలో రామోజీ ఆరోపణలు, వాస్తవాలు ఏమిటంటే.. ఈనాడు ఆరోపణ: సొరంగాల పనుల్లో జాప్యానికి చంద్రబాబే కారణమంటూ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్ మండిపడ్డారు. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లయినా ఇప్పటికీ పూర్తి చేయలేదు. వాస్తవం: గాలేరు–నగరి వరద కాలువలో అంతర్భాగంగా అవుకు జలాశయానికి ముందు భాగంలో కొండలో 5.7 కి.మీల పొడవున, పది వేల క్యూసెక్కుల సామర్థ్యంతో, 11 మీటర్ల వ్యాసంతో రెండు సొరంగాలు తవ్వాలి. ఇందులో చాలావరకు పనులు 2009 నాటికే పూర్తయ్యా యి. మొదటి సొరంగంలో 265 మీటర్లు, రెండో సొరంగంలో 165 మీటర్ల మేర ఫాల్ట్ జోన్ (మట్టి పొరలు పెళుసుగా ఉన్న ప్రాంతం)లో మాత్రమే పనులు మిగిలాయి. 2014 లో చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఇక్కడ పనులు చేయలేక చేతులెత్తేశారు. మొదటి సొరంగంలో ఫాల్ట్‌జోన్ ఉన్న 265 మీటర్లలో సొరంగానికి బదులుగా లూప్(కెనాల్) తవ్వి.. ఐదారు వేల క్యూసెక్కులను మాత్రమే తరలించారు. కానీ, వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక మొదటి సొరంగంలో లూప్ ను అభివృద్ధిచేసి పది వేల క్యూసెక్కులను తరలించారు. అలాగే, 2019 నుంచి గత నాలుగేళ్లుగా గాలేరు–నగరి వరద కాలువ ద్వారా గండికోట, వామి కొండ, సర్వారాయసాగర్, పైడిపాలెం, ఛిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లను నింపి.. రైతులకు సమృద్ధిగా నీళ్లందిస్తున్నారు. రెండో సొరంగంలో 165 మీటర్ల పొడవున ఫాల్ట్‌జోన్‌లో ఫాలీయురిథేన్ ఫోమ్ గ్రౌటింగ్ విధానంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పనులను లైనింగ్‌తో సహా పూర్తిచేయించారు. దాంతో ప్రస్తుత డిజైన్ మేరకు గాలేరు–నగరి వరద కాలువ ద్వారా 20 వేల క్యూసెక్కులను తరలించడానికి మా ర్గం సుగమం చేశారు. చంద్రబాబు చేయలేని పనిని జగన్ పూర్తిచేస్తే ఎందుకంత కడుపుమంట రామోజీ? ఈనాడు ఆరోపణ: కడప జిల్లా సాగునీటి అవసరాలను తీర్చాలన్న ఉద్దేశ్యంతో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఈ సొరంగ మార్గాల పనులను ప్రతిపాదించారు.. వాస్తవం: ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి 1995లో అధికారంలోకి వచ్చాక 1996 లోక్‌సభ ఎన్నికలకు ముందు గాలేరు–నగరికి గండికోట వద్ద మొదటిసారి.. 1999 ఎన్నికలకు ముందు వామికొండ వద్ద రెండోసారి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. కానీ, 1996 నుంచి 2004 వరకూ తట్టెడు మట్టి ఎత్తలేదు. అలాంటప్పుడు అవుకు సొరంగ మార్గాలను చంద్రబాబు ఎలా ప్రతిపాదించగలరు అన్న ఇంగితజ్ఞానం లేకపోతే ఎలా రామోజీ? శ్రీశైలానికి వరద వచ్చే రోజుల్లో 30 రోజుల్లో 38 టీఎంసీలను తరలించి ఉమ్మడి కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో 2.60 లక్షల ఎకరాలకు సాగునీరు, 640 గ్రామాల్లోని 20 లక్షల మందికి తాగునీరు అందించే లక్ష్యంతో 20 05లో నాటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి గాలేరు–నగరి సుజల స్రవంతి పథకాన్ని చేపట్టి.. 2009 నాటికే చాలావరకూ పనులు పూర్తిచేశారు ఈనాడు ఆరోపణ: అవుకు సొరంగాలకు లైనింగ్ చేయకుండానే నీటి విడుదలకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.. వాస్తవం: ఓ వైపు జగన్ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లయినా ఇప్పటికీ సొరంగాలను పూర్తి చేయలేదని రామోజీరావే ఓ పక్క ఆరోపిస్తారు.. మరోవైపు, లైనింగ్ చేయకుండానే నీటి విడుదలకు సన్నాహాలు చేస్తున్నారంటూ సన్నాయినొక్కులు నొక్కుతారు. అంటే.. తాను ప్రచురించిన కథనంలో వీసమెత్తు నిజం లేదన్నది రామోజీరావే అంగీకరిస్తున్నట్లు స్పష్టమవుతోంది. శ్రీశైలానికి వచ్చే వరద ఆధారంగా ఈ ఏడాదే ప్రస్తుత డిజైన్ మేరకు 20 వేల క్యూసెక్కులను గాలేరు–నగరి ద్వారా తరలించడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. కృష్ణానదికి వరద రోజు లు తగ్గిన నేపథ్యంలో శ్రీశైలానికి వరద వచ్చే 30 రోజుల్లోనే గాలేరు–నగరి ప్రాజెక్టులను నింపేలా వరద కాలువ సామర్థ్యం 20 వేల క్యూసెక్కుల నుంచి 30 వేల క్యూసెక్కులకు పెంచుతూ సీఎం వైఎస్ జగన్ చేపట్టిన పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ పనుల్లో భాగంగా అవుకు వద్ద చేపట్టిన మూడో సొరంగం పనులు దాదాపుగా పూర్తికావొస్తున్నాయి. -
లోయలు.. సొరంగాల్లోంచి ప్రయాణం.. సూపర్ లొకేషన్స్.. ఎక్కడంటే!
తాటిచెట్లపాలెం (విశాఖ ఉత్తర): అద్భుతమైన ప్రకృతి అందాలు, ఎత్తయిన, పచ్చని కొండలు, వీటిని మించి మరపురాని సొరంగ మార్గాల ద్వారా ప్రయాణాన్ని ఆస్వాదించాలని ఉందా? ఇంకెందుకు ఆలస్యం.. మన పక్కనే ఉన్న ఒడిశాలోని కోరాపుట్‌కు వెళ్తే చాలు.. ఈ అనుభూతులన్నీ మీ సొంతమతాయి. అవేమిటో.. ఈ రూట్ విశేషాలను పర్యాటక ప్రేమికుల కోసం ప్రత్యేకం.. కే–ఆర్ (కోరాపుట్–రాయగడ) రైల్వే లైన్ వాల్తేర్ డివిజన్‌కు ప్రధానంగా ఆదాయాన్నిచ్చే కిరండూల్, బచేలిలో ఉన్న ఐరన్ ఓర్ రవాణా మార్గానికి ప్రత్యామ్నాయంగా వేరే లైన్‌ను ఏర్పాటుచేసి ఈ సరకు రవాణాను మరింతగా అభివృద్ధి పరచాలనే ఉద్దేశ్యంతో 1980లలో కోరాపుట్ – రాయగడ (కే–ఆర్) లైన్‌ను ప్రారంభించగా.. 1993–92మధ్య ఈ లైన్ పూర్తయింది. నాటి ప్రధాని పీవీ నరసింహారావు 1995 అక్టోబర్ 31న ప్రారంభించారు. కోరాపుట్ నుంచి రాయగడకు మొత్తం 167 కిలోమిటర్ల మేర ఈ లైన్ ఏర్పాటు చేశారు. ఈ మార్గంలో మొత్తం 36 సొరంగాలు, 76 ప్రధాన వంతెనలు, 180 అందమైన మలుపులు ఉన్నాయి. అప్పట్లో ప్రధానంగా ఈ మార్గం వైజాగ్ స్టీల్‌ప్లాంట్, వైజాగ్ పోర్ట్ ట్రస్ట్‌లకు అసవరమైన ఐరన్‌ఓర్‌ను రవాణాను పెంచేందుకు ప్రత్యామ్నాయ మార్గంగా వినియోగించేవారు. పారిశ్రామిక కారిడార్‌గా అభివృద్ధి ఈ మార్గంలో అల్యూమినా పౌడర్ సరఫరా చేసే నాల్కో, ఉత్కళ్ అల్యూమినా, వేదాంత, జేకే పేపర్, ఇంఫా (ఇండియా మెటల్ అండ్ ఫెర్రో అల్లాయ్), హెచ్‌పీసీఎల్ గ్యాస్ బాట్లింగ్ ప్లాంట్ వంటి పరిశ్రమలకు ఎంతో అనుకూలంగా ఈ మార్గం ఉండేది. ప్రస్తుతం ఈ మార్గంలో రెండో లైన్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. దీనికోసం 2015–16లో రూ.2500 కోట్లు బడ్జెట్ మంజూరు చేశారు. ప్రస్తుతం ఈ పనులు చురుగ్గా సాగుతున్నాయి. 2026నాటికి రెండోలైన్ పూర్తి చేయనున్నారు. పర్యాటక, పుణ్యక్షేత్రాల సమాహారం... ఆంధ్రా, ఒడిశా సదరన్ డివిజన్లో ప్రసిద్ధిచెందిన మజ్జిగైరమ్మ ఆలయం రాయగడ ప్రాంతంలోనే ఉంది రాయగడకు కేవలం 50కి.మీల దూరంలో చిత్రకోన వాటర్ ఫాల్స్ తెరుబలిలో గల ఇంఫా ప్యాక్టరీ వద్ద ప్రసిద్ధి చెందిన లక్ష్మీనారాయణ ఆలయం కోరాపుట్‌లో రాణి డుడుమ వాటర్‌ఫాల్స్, జగన్నాథస్వామి ఆలయం గుప్తేశ్వర గుహలు డియోమలి హిల్స్ కూడా కోరాపుట్ ప్రాంతంలోనే ఉన్నాయి. కోరాపుట్లోనే కోలాబ్ రిజర్వాయర్ కూడా ఉంది. గుహల్లో, వంతెనలపై మరపురాని ప్రయాణం ఈ మార్గంలో సొరంగాలలో నుండి రైలు దూసుకుపోతుంటే ఆ అనుభూతులే వేరు. సుమారు 36 చిన్న, పెద్ద సొరంగాలు. ఈ మార్గంలోనే రౌలీ స్టేషన్‌కు సమీపంలో తూర్పుప్రాంతంలోనే అత్యంత పొడవైన సొరంగమార్గం ఉంది. దీని పొడవు 1,599 మీటర్లు (1.59 కిలోమిటర్లు). ప్రకృతి సోయగాలు, లోతైన, ఎత్తైన కొండలపై ప్రయాణం. సముద్రమట్టానికి ఆరువేల అడుగుల ఎత్తులో కోరాపుట్ రైల్వే స్టేషన్. అందమైన వంతెనలు ఇటువంటి ఎన్నో ప్రత్యేకతలు ఈ మార్గంలో ఉన్నాయి. సాధారణంగా అరకు, బొర్రాగుహలుకు అధిక సంఖ్యలో పర్యాటకులు వెళ్తుంటారు, కానీ ఒకసారి ఈ ప్రాంతాలను సందర్శిస్తే మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది. వెలుగులోకి తీసుకువచ్చిన వాల్తేర్ డివిజన్ కోరాపుట్–రాయగడ రైల్వే మార్గం ఇప్పటివరకు చాలామందికి తెలియదు. వాల్తేర్ డివిజన్‌కు డివిజనల్ రైల్వే మేనేజర్ గా వచ్చిన అనూప్‌కుమార్ సత్పతి అతి తక్కువ సమయంలో ఈ మార్గంలో పర్యటించి, తనిఖీలు చేసి దీనిని పర్యాటకులకు పరిచయం చేశారు. ఈ మార్గంలో పర్యాటకుల కోసం తొలిసారిగా విస్టాడోమ్ కోచ్‌ను జతచేశారు. వారానికి మూడుసార్లు నడిచే విశాఖపట్నం–కోరాపుట్ స్పెషల్ ప్యాసింజర్ రైలుకు ఈ విస్టాడోమ్ కోచ్ జతచేస్తున్నారు. (క్లిక్ చేయండి: అడవుల్లోనూ ఆహార పంటలు) 20 ఏళ్ల తరువాత ప్రెస్‌టూర్... దాదాపు 20 ఏళ్ల తరువాత వాల్తేర్ డివిజన్ ఆధ్వర్యంలో ఈ మార్గంలో శనివారం ఆంధ్రప్రదేశ్, ఒడిశాలలో గల ప్రముఖ పాత్రికేయులకు ప్రెస్టూర్ను ఏర్పాటుచేశాం. బహుశా కొద్ది డివిజన్లు మాత్రమే ఇటువంటివి ఏర్పాటు చేస్తాయి. ఈ టూర్లో ఆంధ్రప్రదేశ్, ఒడిశాలకు చెందిన పర్యాటకరంగ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. ప్రత్యేక ప్యాకేజీలు పరిచయం చేస్తే బాగుంటుంది. – అనూప్ కుమార్ సత్పతి, డీఆర్ఎం అద్భుతంగా ఉంది మొదటిసారిగా ఈ ప్రాంతాలను సందర్శించా. విస్టాడోమ్కోచ్లో ప్రయాణించడం కూడా మరచిపోలేని అను భూతి. ఈ ప్రాంతాల అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేసేందుకు తనతో పాటు మార్కెటింగ్ డివిజన్ నుంచి కృష్ణమోహన్, రాజేంద్రరావు, లోకనాథరావు కూడా ఈ టూర్లో పాల్గొన్నారు. – కె హరిత, డివిజనల్ మేనేజర్, ఏపీ టూరిజం -
రహదారులపై ప్రధానంగా దృష్టి
న్యూఢిల్లీ: రహదారుల నిర్మాణం వంటి కీలకమైన మౌలిక సదుపాయాల కల్పనపై కేంద్రం ప్రధానంగా దృష్టి పెడుతోందని కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. 22 ఎక్స్‌ప్రెస్‌వేలతో పాటు అసంఖ్యాకంగా వ్యూహాత్మక టనెల్స్, వంతెనలు నిర్మిస్తున్న నేపథ్యంలో రాబోయే రెండేళ్లలో అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా వంటి సంపన్న దేశాల సరసన భారత్ కూడా నిలవగలదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. దాదాపు రూ. 3.10 లక్షల కోట్ల వ్యయంతో వీటిని నిర్మిస్తున్నట్లు గడ్కరీ పేర్కొన్నారు. మధ్యప్రదేశ్‌లో సుమారు రూ. 8,250 కోట్ల వ్యయంతో చంబల్ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణానికి సంబంధించిన చర్చలు తుది దశలో ఉన్నాయని, రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో చేపడుతున్న ఈ తరహా ప్రాజెక్టుల్లో ఇదే మొదటిది కాగలదని ఆయన వివరించారు. విద్యుత్ పంపిణీ వ్యవస్థను పటిష్టం చేసేందుకు విద్యుత్ శాఖ, ఆప్టికల్ ఫైబర్ కేబుల్ నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు ఐటీ శాఖ ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాయని, అలాగే రహదారుల వెంబడి గ్యాస్ పైప్‌లైన్ నిర్మాణం కూడా జరగనుందని మంత్రి చెప్పారు. పర్యావరణ అనుకూల 22 గ్రీన్ ఎక్స్‌ప్రెస్‌వేలకు సంబంధించి ఇప్పటికే ఏడు ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయని.. సుమారు రూ.1 లక్ష కోట్లతో తలపెట్టిన ఢిల్లీ–ముంబై ఎక్స్‌ప్రెస్‌వే కూడా వీటిలో ఉందని ఆయన తెలిపారు. ‘వ్యూహాత్మక టనెల్స్, వంతెనలు, హైవేలు వంటి కీలక ఇన్ఫ్రా ప్రాజెక్టులు అమలవుతున్న వేగం చూస్తుంటే వచ్చే రెండేళ్లలో భారత్ ముఖ స్వరూపం మారిపోతుందని ధీమాగా చెప్పవచ్చు. అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో కనిపించే రహదారులు, టన్నెల్స్, వంతెనలు మొదలైన వాటిని మన దేశంలో కూడా చూడవచ్చు‘ అని గడ్కరీ చెప్పారు. 2 నెలల్లో జోజిలా టన్నెల్ పనులు ప్రారంభం... జమ్మూకశ్మీర్‌కి సంబంధించి దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న జీ–మోర్ టన్నెల్ ప్రాజెక్టుకు అనుమతులు మంజూరు చేసినట్లు, త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభం కానున్నట్లు మంత్రి చెప్పారు. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం సుమారు రూ. 2,379 కోట్లు. సాధారణంగా చలికాలంలో భారీగా మంచు కురుస్తుండటం వల్ల జమ్మూకశ్మీర్‌లోని కొన్ని ప్రాంతాల్లో రహదారులు మూసివేయాల్సి వస్తుంటుంది. అయితే, ఏడాది పొడవునా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా రవాణాకు అవరోధం లేకుండా చూసేందుకు జీ–మోర్, జోజిలా తదితర టన్నెల్స్ ఉపయోగపడనున్నాయి. జోజిలా టన్నెల్ పనులు రెండు నెలల్లో ప్రారంభమవుతాయని గడ్కరీ చెప్పారు. మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (ఎంఈఐఎల్) సంస్థ ఈ కాంట్రాక్టు దక్కించుకుంది. లార్సన్ అండ్ టూబ్రో, ఇర్కాన్ ఇంటర్నేషనల్ వంటి దిగ్గజాలు దీనికోసం పోటీపడ్డాయి. -
చెక్‌డ్యామ్‌లు.. తూముల నిర్మాణం
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో చెరువుల పునరుద్ధరణ కోసం మిషన్ కాకతీయ చేపట్టిన మాదిరే ఈ ఐదేళ్ల కాలంలో యుద్ధ ప్రాతిపదికన చెక్‌డ్యామ్‌లు, తూముల నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. మిషన్ కాకతీయ కింద ఇప్పటికే 35వేలకు పైగా చెరువుల పునరుద్ధరణ పూర్తయిన దృష్ట్యా, ఇకపై ప్రతినీటి బొట్టును చెరువుకు మళ్లించేలా ప్రాజెక్టు కాల్వల నుంచి తూముల నిర్మాణం, అవసరమైన చోట్ల వాగులపై చెక్‌డ్యామ్‌ల నిర్మాణం చేపట్టేలా ప్రణాళిక రూపొందిస్తోంది. దీనిపై ఇప్పటికే సీఎం కేసీఆర్ రెండు దఫాలుగా అధికారులకు మాస్టర్ ప్లాన్ వివరించగా, ఇరిగేషన్ ఇంజనీర్లు సైతం వర్క్‌షాప్‌లు నిర్వహించి రాష్ట్రంలో చెక్‌డ్యామ్, తూముల నిర్మాణంపై సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) సిద్ధం చేస్తున్నారు. కృష్ణా బేసిన్లో 250 చెక్‌డ్యామ్‌లకు చాన్స్ కృష్ణా బేసిన్లో 311 నీటి ప్రవాహ వాగులపై ఇప్పటికే 281 చెక్‌డ్యామ్‌లు ఇప్పటికే ఉండగా, మరో 250 వరకు నిర్మించే అవకాశం ఉందని అధికారులు గుర్తించారు. ఇక ఇదే బేసిన్ పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల ప్రాజెక్టులు చేపడుతుండగా, ఆ ప్రాజెక్టుల పరిధిలోని కాల్వలను, సమీప చెరువులకు అనుసంధానించి, ఇందుకు అవసరమైన చోట తూముల నిర్మాణం చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే ప్రాజెక్టుల కాల్వల నుంచి సుమారు 3 వేల చెరువులను నింపే అవకాశాలను గుర్తించినట్లు తెలుస్తోంది. ఇక గోదావరి బేసిన్లో ఇప్పటికే 372 ప్రధాన వాగులను గుర్తించగా, వీటిపై 229 చెక్‌డ్యామ్‌లు ఉండగా, మరో 200 నుంచి 300 కొత్త చెక్‌డ్యామ్‌లు నిర్మించేలా ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. ఎస్సారెస్పీ పరిధిలో 19 తూములకు ఓకే.. ఇక కాళేశ్వరం, సీతారామ, దేవాదుల, ఎస్సారెస్పీ, వరద కాల్వ ప్రాజెక్టుల ద్వారా చెరువులను నింపాలని యోచిస్తున్నారు. ఇప్పటికే ఎస్సారెస్పీ పరిధిలో కొత్తగా 19 తూముల నిర్మాణానికి లైన్‌క్లియర్ అయింది. మిగతా చోట్ల తూముల నిర్మాణంపై సర్వే జరుగుతోంది. 15 రోజుల్లో సమగ్ర ప్రాజెక్టు నివేదిక రూపొందించి బడ్జెట్లో ఈ పనులకే రూ.వెయ్యి కోట్ల మేర నిధులు కేటాయించాలని ప్రభుత్వం భావిస్తోంది. కేంద్రంలో అధికారంలోకి వచ్చే ప్రభుత్వాన్ని బట్టి కేంద్రం నుంచి నిధులు రాబట్టడం లేని పక్షంలో భారీ ప్రాజెక్టులకు తీసుకుంటున్న మాదిరే బ్యాంకు రుణాల ద్వారా నిధులు సమకూర్చాలన్నది ప్రభుత్వ ఆలోచనగా ఉందని నీటి పారుదల వర్గాలు వెల్లడించాయి. -
కాళేశ్వరం సొరంగాలు సిద్ధం
సాక్షి, హైదరాబాద్: గోదావరి జలాలను పడావు భూములకు తరలించే లక్ష్యంతో చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు భారీ సొరంగాల నిర్మాణాలన్నీ తుది దశకు చేరుకున్నాయి. మేడిగడ్డ నుంచి అన్నారం, సుందిళ్ల ద్వారా ఎల్లంపల్లికి తరలించే నీరు దిగువన మల్లన్నసాగర్ వరకు ఆటంకాలు లేకుండా ప్రవాహించేలా సొరంగాలను నీటి పారుదల శాఖ సిద్ధం చేసింది. వివిధ ప్యాకేజీల పరిధిలో 94.27 కిలోమీటర్ల మేర సొరంగాలు తవ్వాల్సి ఉండగా ఇప్పటికే 89.85 కిలోమీటర్ల నిర్మాణాలు (90 శాతం పనులు) పూర్తయ్యాయి. మిగిలిన పనులు మరో 2 నెలల్లో పూర్తయ్యే అవకాశం ఉంది. మొత్తం పనులు పూర్తయితే సాగునీటి రంగంలో ఆసియాలోనే అత్యంత పొడవైన టన్నెల్ గల ప్రాజెక్టుగా కాళేశ్వరం చరిత్రకెక్కనుంది. జూన్‌లో వెట్‌రన్! ఈ 149 కిలోమీటర్ల నిర్మాణాల్లో ప్యాకేజీ–6 నుంచి ప్యాకేజీ–12 వరకు టన్నెళ్ల నిర్మాణమే 94.27 కి.మీ. మేర ఉంది. ఇందులో ఇప్పటికే 89.85 కి.మీ. టన్నెల్ నిర్మాణం పూర్తయింది. మరో 4.42 కి.మీ. మాత్రమే మిగిలింది. ఇందులో ప్యాకేజీ–7 పరిధిలో 22.48 కి.మీ. ఉండగా, 22.36 కి.మీ. పని పూర్తయింది. ప్యాకేజీ–6లోని మొత్తం 19.06 కి.మీ. నిర్మాణం పూర్తయింది. మిడ్‌మానేరు దిగువన ప్యాకేజీలు–10, 11, 12ల పరిధిలో 32.42 కి.మీ. టన్నెల్ తవ్వాల్సి ఉండగా 31.54 కి.మీ. తవ్వకం పూర్తయింది. వచ్చే నెలాఖరుకు మిగతా పనులు పూర్తి కానున్నాయి. టన్నెళ్ల లైనింగ్ పనులు మాత్రం ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. 94.27 కి.మీ.లలో 53.78 కి.మీ పనులు పూర్తయ్యాయి. మిగిలిన 40 కి.మీ మేర పనులు మే చివరికి పూర్తయ్యే అవకాశం ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే జూన్ నాటికి పనులన్నీ పూర్తి చేసి వెట్‌రన్‌కు సిద్ధంగా ఉంచేలా అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు. జూన్ నుంచి కనిష్టంగా రోజుకు ఒక టీఎంసీ చొప్పున 90 టీఎంసీల నీటిని నిర్ణీత ఆయకట్టుకు తరలించేలా ప్రణాళికలు వేస్తున్నారు. రూ.80 వేల కోట్లతో.. కాళేశ్వరం ఎత్తిపోతలను రూ.80,400 కోట్లతో చేపట్టగా ఇప్పటివరకు రూ.60,922 కోట్ల పనులు ప్రారంభమయ్యాయి. వాటిలో ఇప్పటివరకు రూ.22,875 కోట్ల పనులు పూర్తయినట్లు శనివారం శాసనమండలిలో సమర్పించిన ప్రగతి నివేదికలో నీటి పారుదల మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. వివిధ పనుల ప్రగతిని నివేదికలో పొందుపరిచారు. ఆ ప్రకారం.. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు, పంప్‌హౌజ్‌ల పనులు 50 శాతానికి పైగా పూర్తయ్యాయి. ఇందులో అన్నారం బ్యారేజీ పనులు 67 శాతం పూర్తయ్యాయి. ఈ 3 బ్యారేజీల ద్వారా ఎల్లంపల్లికి నీరు తరలించి అటు నుంచి మల్లన్నసాగర్ వరకు తీసుకెళ్లాలంటే అప్రోచ్ చానళ్లు, లింక్ కెనాల్స్, గ్రావిటీ కెనాల్స్, టన్నెళ్లు నిర్మించాలి. మొత్తంగా 149 కిలోమీటర్ల మేర కెనాల్స్, టన్నెళ్ల నిర్మాణం చేయాల్సి ఉంది. -
అరుణాచల్‌లో సొరంగ మార్గాలు
చైనా సరిహద్దుకు 10 కి.మీ. తగ్గనున్న దూరం ఈటానగర్: అరుణాచల్‌ప్రదేశ్‌లోని సేలా పాస్ గుండా రెండు సొరంగ మార్గాలు నిర్మించేందుకు సరిహద్దు రోడ్ల సంస్థ (బీఆర్ఓ) ప్రణాళికలు సిద్ధం చేసింది. హిమాలయాల్లో 4,170 మీటర్ల ఎత్తున నిర్మించే ఈ సొరంగాలు పూర్తయితే చైనా సరిహద్దు ప్రాంతమైన తవాంగ్‌కు 10 కి.మీ. దూరం తగ్గుతుంది. అంతేకాకుండా పర్వతాలపై ఎత్తుపల్లాల రోడ్లు, సన్నని మలుపులతోపాటు భారీగా మంచు కురిసే సమయాల్లో తలెత్తే ఇబ్బందులు తప్పుతాయి. వీటిల్లో ఒక సొరంగం పొడవు 475 మీటర్లు కాగా, మరొక మార్గం పొడవు 1,790 మీటర్లు. ఈ ‘ప్రాజెక్ట్ వర్టాక్’లో భాగంగా బైసాకి నుంచి 12.37 కి.మీ. మేర ఎన్‌హెచ్13ను డబుల్ లేన్ రోడ్డుగా కూడా అభివృద్ధి చేస్తారు.‘ఈ మార్గం వల్ల తేజ్‌పూర్, తవాంగ్ల్లోని ఆర్మీ 4 కాప్స్ హెడ్‌క్వార్టర్స్‌కు కనీసం గంట ప్రయాణ సమయం కలిసొస్తుంది. ముఖ్యంగా బోండిలా–తవాంగ్ మధ్యనున్న జాతీయ రహదారి 13కు అనుసంధానంగా ఉంటుంది’అని బీఆర్ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ సొరంగ మార్గాలు పూర్తయితే అటు సైన్యంతో పాటు ప్రజలు సులువుగా రాకపోకలు సాగించవచ్చని స్వరూప్ తెలిపారు. ఇది భారత ఆర్మీకి వరం వంటిదన్నారు. -
అక్కడ ఉగ్రవాదులు భూగర్భం చీల్చుకుంటూ..!
రామాది(ఇరాక్): రామాది.. ఇరాక్ లో ఇది కీలక నగరం. నిత్యం దాడులకు గురవుతూ మానని గాయాలతో మూలుగుతుంటుంది. ఈ నగరాన్ని ఎలాగైనా సొంతం చేసుకోవాలని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు చేస్తున్న ప్రయత్నం అంతా ఇంతా కాదు. మరోపక్క, ఈ ప్రాంతాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకునే ప్రసక్తి లేదని, ఉగ్రవాదులకు గుప్పెడు జాగ వదిలేది లేదని ఇరాక్ సేనలు చేస్తున్న పోరాటం కూడా తక్కువేం కాదు. ఇ వీరికి తోడుగా అమెరికాతో సహా ప్రపంచ దేశాల వైమానిక సేనలు వరుస బాంబులు కురిపిస్తూ చేస్తున్న సాహసం కూడా అంత ఈజీ ఏం కాదు. ఇలా, అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అక్కడ ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల ప్రభావం ఏమాత్రం తగ్గలేదు. దాదాపు 25శాతం రామాది ప్రాంతం ఉగ్రవాదుల చెరలోనే ఉంది. ప్రభుత్వ బలగాలు, విదేశీ సేనలు ఈ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో ఉగ్రవాదం నుంచి విడిపించేందుకు ప్రయత్నిస్తున్నా ఎందుకు ఆ ప్రాంతం ఇప్పటికీ విముక్తి కాలేకపోతుంది. అసలు ఇలా ఎందుకు జరుగుతుందనే విషయంపై ఆరా తీయగా పలు కీలక అంశాలు వెలుగుచూశాయి. ఈ ప్రాంతంలో ఉగ్రవాదుల ఊపిరి అంతా కూడా రామాది భూగర్భంలో ఉందట. అంటే వారంతా అక్కడి భూగర్బంలో పెద్దపెద్ద బొరియలు, గుహలు ఏర్పాటుచేసుకోవడంతోపాటు పెద్ద మొత్తంలో బంకర్లను కూడా ఏర్పాటుచేసుకున్నారని బయటపడింది. వారు ఆక్రమణలకు దిగే సమయంలో తప్ప ఎప్పుడూ భద్రతా బలగాలు దాడికి వచ్చినా, వైమానిక దాడులు జరిగినా వెంటనే గుట్టుచప్పుడు కాకుండా ఈ కలుగుల్లోకి, బొరియల్లోకి, బంకర్లోకి చొరబడి తమ ప్రాణాలను రక్షించుకొని టార్గెట్ చేసేవారికి కొరకరాని కొయ్యగా తయారయ్యాయని తాజాగా వెలుగుచూసిన అంశాల ఆధారంగా తెలుస్తోంది. గిరిజనులతో నిండిన రామాది ప్రాంతంలో భారీ సంఖ్యలో ఉగ్రవాదులు తలదాచుకుంటున్నారని, వారంతా దాదాపు పది మీటర్ల దిగువున ఒకటి నుంచి రెండు మీటర్ల వెడల్పు మేర ఉండే సొరంగ మార్గాల్లో నక్కి ఉంటున్నారని తెలిసింది. ఎవరికీ అనుమానం రాకుండా వైమానిక సేనకు కనిపించకుండా ఒక ఇంటిలో నుంచి మరో ఇంటిలోకి సొరంగ మార్గాలు ఏర్పాటుచేసుకొని వాటి ద్వారా కన్నుగప్పి తిరుగుతారని కూడా వెల్లడైంది. ఇలా భూగర్భం నుంచి పలు నివాసాలను అనుసంధానం చేసుకుంటూ దాదాపు కిలో మీటర్ దూరం పొడవునా సొరంగ మార్గాలు ఏర్పాటుచేసుకున్నట్లు తెలిసింది. మరికొన్ని సొరంగ మార్గాలు 700 నుంచి 800 మీటర్ల పొడవు కూడా ఉన్నాయని మరికొన్ని ఆధారాలు చెబుతున్నాయి. వీటిని ధ్వంసం చేస్తే తప్ప అక్కడి ఉగ్రవాదులను ఏం చేయలేరని తెలుస్తోంది. -
తాబేళ్ల కోసం సొరంగ మార్గం
టోక్యో: శత్రుసేనల ఆటకట్టించడం కోసం, తమ వ్యక్తిగత విషయాల కోసం సొరంగాలు తవ్వారన్న విషయాన్ని మనం చరిత్రలో చదివాం. ఈ మధ్య జపాన్‌లో తాబేళ్ల కోసం కూడా సొరంగాలు తవ్వారు. అయితే ఈ సొరంగ మార్గాల వెనుక ఆసక్తికర విషయం ఉంది. రోడ్డు ప్రమాదాల్లో నిత్యం మూగ జీవాలు బలవుతుంటాయి. వాటిని కాపాడేందుకు మనం ఎలాంటి ప్రయత్నం చేయం. అసలు అవెందుకు అలా బలవుతున్నాయనే విషయాన్ని కూడా ఆలోచించం. కానీ రైల్వే ట్రాక్‌లు దాటుతూ తరచూ తాబేళ్లు చనిపోతాయన్న విషయం జపనీయులను కదిలించింది. ఈ కారణంగా అక్కడ రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుండటం వారిని ఆలోచింపజేసింది. దీంతో తాబేళ్లను సంరక్షించాలనే సంకల్పంతో కోబెలోని సుమా ఆక్వాలైఫ్ పార్క్, వెస్ట్ జపాన్ రైల్వే కంపెనీలు సంయుక్తంగా రైల్వే ట్రాక్‌ల కింద వాటి కోసం సొరంగ మార్గాన్ని ఏర్పాటు చేశాయి. ఇప్పుడు అక్కడ తాబేళ్లు ఎంచక్కా తమ దారిలో పోతూ రహదారి గండం నుంచి తప్పించుకున్నాయి.