సాక్షి, అమరావతి: కళ్లార్పకుండా నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబు ఎంత నేర్పరో.. సిగ్గూఎగ్గూ లేకుండా ‘ఈనాడు’లో పచ్చి అబద్ధాలను అచ్చేసి సీఎం జగన్‌పై బురదజల్లడంలో రామోజీరావూ అంతే ఘనాపాటి. గాలేరు–నగరి సుజల స్రవంతి వరద కాలువలో అంతర్భాగమైన అవుకు జంట సొరంగాలపై ‘అవుకుపై.. చిలక పలుకులు మరిచారా జగన్?’ అనే శీర్షికతో శనివారం ప్రచురించిన కథనమే అందుకు తార్కాణం.
అస్మదీయుడు చంద్రబాబు చేయలేక, చేతులెత్తేసిన పనిని తస్మదీ యుడు సీఎం వైఎస్ జగన్ పూర్తిచేయడంతో జీర్ణించుకోలేని రామోజీరావు.. యథేచ్ఛగా నీతిమాలిన రాతలతో ప్రభుత్వంపై విషం చిమ్మారు. ఆ కథనంలో రామోజీ ఆరోపణలు, వాస్తవాలు ఏమిటంటే..
ఈనాడు ఆరోపణ: సొరంగాల పనుల్లో జాప్యానికి చంద్రబాబే కారణమంటూ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్ మండిపడ్డారు. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లయినా ఇప్పటికీ పూర్తి చేయలేదు.
వాస్తవం: గాలేరు–నగరి వరద కాలువలో అంతర్భాగంగా అవుకు జలాశయానికి ముందు భాగంలో కొండలో 5.7 కి.మీల పొడవున, పది వేల క్యూసెక్కుల సామర్థ్యంతో, 11 మీటర్ల వ్యాసంతో రెండు సొరంగాలు తవ్వాలి. ఇందులో చాలావరకు పనులు 2009 నాటికే పూర్తయ్యా యి. మొదటి సొరంగంలో 265 మీటర్లు, రెండో సొరంగంలో 165 మీటర్ల మేర ఫాల్ట్ జోన్ (మట్టి పొరలు పెళుసుగా ఉన్న ప్రాంతం)లో మాత్రమే పనులు మిగిలాయి. 2014 లో చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఇక్కడ పనులు చేయలేక చేతులెత్తేశారు.
మొదటి సొరంగంలో ఫాల్ట్‌జోన్ ఉన్న 265 మీటర్లలో సొరంగానికి బదులుగా లూప్(కెనాల్) తవ్వి.. ఐదారు వేల క్యూసెక్కులను మాత్రమే తరలించారు. కానీ, వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక మొదటి సొరంగంలో లూప్ ను అభివృద్ధిచేసి పది వేల క్యూసెక్కులను తరలించారు. అలాగే, 2019 నుంచి గత నాలుగేళ్లుగా గాలేరు–నగరి వరద కాలువ ద్వారా గండికోట, వామి కొండ, సర్వారాయసాగర్, పైడిపాలెం, ఛిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లను నింపి.. రైతులకు సమృద్ధిగా నీళ్లందిస్తున్నారు.
రెండో సొరంగంలో 165 మీటర్ల పొడవున ఫాల్ట్‌జోన్‌లో ఫాలీయురిథేన్ ఫోమ్ గ్రౌటింగ్ విధానంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పనులను లైనింగ్‌తో సహా పూర్తిచేయించారు. దాంతో ప్రస్తుత డిజైన్ మేరకు గాలేరు–నగరి వరద కాలువ ద్వారా 20 వేల క్యూసెక్కులను తరలించడానికి మా ర్గం సుగమం చేశారు. చంద్రబాబు చేయలేని పనిని జగన్ పూర్తిచేస్తే ఎందుకంత కడుపుమంట రామోజీ?
ఈనాడు ఆరోపణ: కడప జిల్లా సాగునీటి అవసరాలను తీర్చాలన్న ఉద్దేశ్యంతో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఈ సొరంగ మార్గాల పనులను ప్రతిపాదించారు..
వాస్తవం: ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి 1995లో అధికారంలోకి వచ్చాక 1996 లోక్‌సభ ఎన్నికలకు ముందు గాలేరు–నగరికి గండికోట వద్ద మొదటిసారి.. 1999 ఎన్నికలకు ముందు వామికొండ వద్ద రెండోసారి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. కానీ, 1996 నుంచి 2004 వరకూ తట్టెడు మట్టి ఎత్తలేదు.
అలాంటప్పుడు అవుకు సొరంగ మార్గాలను చంద్రబాబు ఎలా ప్రతిపాదించగలరు అన్న ఇంగితజ్ఞానం లేకపోతే ఎలా రామోజీ? శ్రీశైలానికి వరద వచ్చే రోజుల్లో 30 రోజుల్లో 38 టీఎంసీలను తరలించి ఉమ్మడి కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో 2.60 లక్షల ఎకరాలకు సాగునీరు, 640 గ్రామాల్లోని 20 లక్షల మందికి తాగునీరు అందించే లక్ష్యంతో 20 05లో నాటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి గాలేరు–నగరి సుజల స్రవంతి పథకాన్ని చేపట్టి.. 2009 నాటికే చాలావరకూ పనులు పూర్తిచేశారు
ఈనాడు ఆరోపణ: అవుకు సొరంగాలకు లైనింగ్ చేయకుండానే నీటి విడుదలకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది..
వాస్తవం: ఓ వైపు జగన్ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లయినా ఇప్పటికీ సొరంగాలను పూర్తి చేయలేదని రామోజీరావే ఓ పక్క ఆరోపిస్తారు.. మరోవైపు, లైనింగ్ చేయకుండానే నీటి విడుదలకు సన్నాహాలు చేస్తున్నారంటూ సన్నాయినొక్కులు నొక్కుతారు. అంటే.. తాను ప్రచురించిన కథనంలో వీసమెత్తు నిజం లేదన్నది రామోజీరావే అంగీకరిస్తున్నట్లు స్పష్టమవుతోంది.
శ్రీశైలానికి వచ్చే వరద ఆధారంగా ఈ ఏడాదే ప్రస్తుత డిజైన్ మేరకు 20 వేల క్యూసెక్కులను గాలేరు–నగరి ద్వారా తరలించడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. కృష్ణానదికి వరద రోజు లు తగ్గిన నేపథ్యంలో శ్రీశైలానికి వరద వచ్చే 30 రోజుల్లోనే గాలేరు–నగరి ప్రాజెక్టులను నింపేలా వరద కాలువ సామర్థ్యం 20 వేల క్యూసెక్కుల నుంచి 30 వేల క్యూసెక్కులకు పెంచుతూ సీఎం వైఎస్ జగన్ చేపట్టిన పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ పనుల్లో భాగంగా అవుకు వద్ద చేపట్టిన మూడో సొరంగం పనులు దాదాపుగా పూర్తికావొస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment