
రఫా: ప్రాణాలతో మిగిలి ఉన్న బందీలను హమాస్ మిలిటెంట్లు నాసిర్ ప్రాంగణం అడుగునున్న సొరంగాల్లో దాచినట్లు ఇజ్రాయెల్ రక్షణ బలగాలు (ఐడీఎఫ్)అనుమానిస్తున్నాయి. దీంతో, వారం రోజులుగా ఆస్పత్రిని దిగ్బంధించి అణువణువూ శోధిస్తున్నాయి.
గత ఏడాది అక్టోబర్ 7వ తేదీ దాడితో సంబంధమున్నట్లుగా అనుమానిస్తున్న 20 మందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు ఐడీఎఫ్ తెలిపింది. ఆస్పత్రిలోని 460 మందికి పైగా సిబ్బంది, రోగులను ఎలాంటి సౌకర్యాలు లేని ఆ పక్కనే ఉన్న పాతభవనంలోకి తరలివెళ్లాలని ఆర్మీ ఆదేశించింది. విద్యుత్ సరఫరా నిలిపివేయడంతోపాటు, ఆక్సిజన్ నిల్వలు అడుగంటడంతో ఐసీయూలోని ఆరుగురు రోగుల్లో ఐదుగురు చనిపోయినట్లు గాజా అధికారులు శుక్రవారం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment