గాజా్రస్టిప్/జెరూసలేం: కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరొక రోజు పొడిగించేందుకు ఇజ్రాయెల్–హమాస్ గురువారం అంగీక రించాయి. వాస్తవానికి గురువారం ఉదయం 7 గంటలకు ఒప్పందం ముగిసింది. బందీలంతా ఇంకా విడుదల కాకపోవడం, గాజాలోని పాలస్తీనియన్లకు మరింత మానవతా సాయం అందాల్సి ఉండడంతో ఒప్పందం పొడిగింపునకే ఇరుపక్షాలు మొగ్గుచూపాయి. గాజాలోని శాంతి కోసం ఇజ్రాయెల్, హమాస్‌పై అంతర్జాతీయ సమా జం నుంచి ఒత్తిడి పెరుగుతోంది.
అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ బుధవారం రాత్రి ఇజ్రాయెల్ చేరుకున్నారు. ఇజ్రాయెల్–హమాస్ మధ్య ఘర్షణలకు తెరదించే దిశగా ఆయన ప్రయత్నాలు ముమ్మరం చేయనున్నట్లు తెలిసింది. కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా హమాస్ మిలిటెంట్లు ఇప్పటిదాకా 73 మంది ఇజ్రాయెలీలను, 24 మంది ఇతర దేశస్తులను విడుదల చేశారు. ఇంకా 126 మంది హమాస్ చెరలో బందీలుగా ఉన్నట్లు అంచనా.
జెరూసలేంలో కాల్పులు.. ముగ్గురి మృతి
జెరూసలేంలో ఉద్రిక్తత పరిస్థితుల నెలకొన్నాయి. బుధవారం ఉదయం 7.40 గంటలకు వీచ్‌మ్యాన్ వీధిలో బస్‌స్టాప్‌లో నిల్చున్న ప్రయాణికులపై ఇద్దరు సాయుధ పాలస్తీనియన్ దుండగులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు ఇజ్రాయెలీలు మృతిచెందారు. మరో ఆరుగురు గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు చెప్పారు. భద్రతా సిబ్బంది జరిపిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు దుండుగులు హతమయ్యారు. వారిద్దరూ తూర్పు జెరూసలేంకు చెందిన సోదరులని తెలిసింది. గతంలో ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొని జైలుకు వెళ్లొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment