చెర నుంచి విడుదలైన ఎడాన్
గాజా్రస్టిప్: ఇజ్రాయెల్–హమాస్ గ్రూప్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం అమలు విషయంలో సందిగ్ధత వీడింది. ఒప్పందానికి ఇరుపక్షాలు కట్టుబడి ఉంటున్నాయి. మూడో విడత కింద ఆదివారం మరో 17 మంది బందీలకు హమాస్ విముక్తి కలిగించింది. వీరిలో 14 మంది ఇజ్రాయెలీలు, ముగ్గురు విదేశీయులు ఉన్నారు. అలాగే 39 మంది పాలస్తీనియన్ ఖైదీలను ఇజ్రాయెల్ అధికారులు విడుదల చేశారు.
కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ ఉల్లంఘిస్తోందని ఆరోపిస్తూ హమాస్ మిలిటెంట్లు శనివారం బందీలను విడుదల చేయడానికి నిరాకరించారు. ఒప్పందం అమలుపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ, ఒప్పందం యథాతథంగా అమలవుతున్నట్లు కొన్ని గంటల తర్వాత తేటతెల్లమయ్యింది. శనివారం బందీల్లోని 13 మంది ఇజ్రాయెలీలను, నలుగురు థాయ్‌లాండ్ జాతీయులను హమాస్ విడుదల చేసింది. వీరిలో నాలుగేళ్ల అమెరికన్–ఇజ్రాయెలీ చిన్నారి అబిగైల్ ఎడాన్ కూడా ఉంది.
ఆమె తల్లిదండ్రులను అక్టోబర్ 7న మిలిటెంట్లు హత్య చేశారు. అమెరికా బందీలంతా సైతం అతిత్వరలో విడుదలవుతారని ఆశిస్తున్నామని శ్వేతసౌధం జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలీవన్ చెప్పారు. అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై అనూహ్యంగా దాడి చేసిన హమాస్ మిలిటెంట్లు 240 మందిని బందీలుగా మార్చి, గాజాకు తరలించిన సంగతి తెలిసిందే.
ఇజ్రాయెల్–హమాస్ మధ్య నాలుగు రోజుల కాల్పుల విరమణ ఒప్పందం శుక్రవారం నుంచి ప్రారంభమైంది. ఇప్పటిదాకా మూడు విడతల్లో మొత్తం 58 మంది బందీలకు హమాస్ స్వేచ్ఛ కలి్పంచింది. నాలుగో విడత కింద సోమవారం మరికొంత మంది విడుదల కానున్నారు. మరోవైపు శనివారం రాత్రి ఆక్రమిత వెస్ట్‌బ్యాంకులో ఇజ్రాయెల్ దాడుల్లో ఆరుగురు పాలస్తీనియన్లు మరణించారు.
హమాస్ సీనియర్ కమాండర్ హతం
ఇజ్రాయెల్ దాడిలో హమాస్ సీనియర్ కమాండర్ అహ్మద్ అల్–ఘందౌర్(56) మృతి చెందాడు. ఈ విషయాన్ని హమాస్ ఆదివారం స్వయంగా ప్రకటించింది. అయితే, ఈ దాడి ఎప్పుడు, ఎక్కడ జరిగిందన్న సంగతి బయటపెట్టలేదు. ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటిదాకా మరణించిన హమాస్ కమాండర్లలో అహ్మద్ అల్–ఘందౌర్ అత్యంత పెద్ద హోదా ఉన్న నేత కావడం గమనార్హం. ఉత్తర గాజాలో హమాస్ గ్రూప్‌నకు నాయకత్వం వహిస్తున్నాడు. హమాస్ సాయుధ విభాగంలో హై–ర్యాకింగ్ కలిగి ఉన్నాడు. 2002నుంచి ఇజ్రాయెల్ సైన్యం సాగించిన హత్యాయత్నాల నుంచి మూడుసార్లు తప్పించుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment