extensions
-
Israel-Hamas war: ఇజ్రాయెల్–హమాస్ ఒప్పందం పొడిగింపు
గాజా్రస్టిప్/జెరూసలేం: కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరొక రోజు పొడిగించేందుకు ఇజ్రాయెల్–హమాస్ గురువారం అంగీక రించాయి. వాస్తవానికి గురువారం ఉదయం 7 గంటలకు ఒప్పందం ముగిసింది. బందీలంతా ఇంకా విడుదల కాకపోవడం, గాజాలోని పాలస్తీనియన్లకు మరింత మానవతా సాయం అందాల్సి ఉండడంతో ఒప్పందం పొడిగింపునకే ఇరుపక్షాలు మొగ్గుచూపాయి. గాజాలోని శాంతి కోసం ఇజ్రాయెల్, హమాస్‌పై అంతర్జాతీయ సమా జం నుంచి ఒత్తిడి పెరుగుతోంది. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ బుధవారం రాత్రి ఇజ్రాయెల్ చేరుకున్నారు. ఇజ్రాయెల్–హమాస్ మధ్య ఘర్షణలకు తెరదించే దిశగా ఆయన ప్రయత్నాలు ముమ్మరం చేయనున్నట్లు తెలిసింది. కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా హమాస్ మిలిటెంట్లు ఇప్పటిదాకా 73 మంది ఇజ్రాయెలీలను, 24 మంది ఇతర దేశస్తులను విడుదల చేశారు. ఇంకా 126 మంది హమాస్ చెరలో బందీలుగా ఉన్నట్లు అంచనా. జెరూసలేంలో కాల్పులు.. ముగ్గురి మృతి జెరూసలేంలో ఉద్రిక్తత పరిస్థితుల నెలకొన్నాయి. బుధవారం ఉదయం 7.40 గంటలకు వీచ్మ్యాన్ వీధిలో బస్‌స్టాప్‌లో నిల్చున్న ప్రయాణికులపై ఇద్దరు సాయుధ పాలస్తీనియన్ దుండగులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు ఇజ్రాయెలీలు మృతిచెందారు. మరో ఆరుగురు గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు చెప్పారు. భద్రతా సిబ్బంది జరిపిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు దుండుగులు హతమయ్యారు. వారిద్దరూ తూర్పు జెరూసలేంకు చెందిన సోదరులని తెలిసింది. గతంలో ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొని జైలుకు వెళ్లొచ్చారు. -
కేటీఆర్ సార్.. మెట్రో మాక్కూడా!
హైదరాబాద్: నగరవాసుల ప్రయాణ బాధల్ని తీరుస్తూ.. లక్షల మందికి ఊరట ఇస్తోంది మెట్రో రైలు వ్యవస్థ. ఫేజ్‌ల వారీగా మరింత దూరం పట్టాలపై పరుగులు పెట్టేందుకు సిద్ధమైపోతోంది ఇది. అయితే.. ఈ సర్వీసులను తమ ప్రాంతంలోనూ ఏర్పాటు చేయాలంటూ పలువురు ప్రజాప్రతినిధులు మంత్రి కేటీఆర్ చెంతకు క్యూ కడుతున్నారు. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా ప్రతినిధులు మంత్రి కేటీఆర్‌కు మెట్రో సర్వీస్ పొడిగింపుపై విజ్ఞప్తులు చేశారు. ఎల్బీనగర్-రామోజీ ఫిలింసిటీ, ఎల్బీనగర్-తుర్కయాంజాల్, ఆదిభట్ల-కొంగరకలాన్, ఉప్పల్-బోడుప్పల్-ఫిర్జాదీగూడ, మియాపూర్-పటాన్ చెరు మార్గాల్లో మెట్రో ప్రాజెక్టు నిర్మించాలని కోరారు. ఈ ప్రాజెక్టుల విషయంలో డీపీఆర్ తయారు చేయాలంటూ అధికారులను ఆదేశించాలని మంత్రి కేటీఆర్‌కు ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. మెట్రో పొడిగింపుతో ఆయా ప్రాంతాల్లో పర్యాటకం, వాణిజ్యం ఊపందుకుంటాయని వారు పేర్కొన్నారు. ట్రాఫిక్ సమస్యలకు ముగింపు పడుతుందని చెప్పారు. ఈ విజ్ఞప్తులను పరిశీలిస్తామని ఆయన వాళ్లకు చెప్పినట్లు తెలుస్తోంది. -
ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థలకు ఊరట
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థలకు ఊరట లభించింది. బ్యాటరీలకు సంబంధించి అదనపు భద్రతా ప్రమాణాల అమలును కేంద్ర ప్రభుత్వం వాయిదా వేసింది. వాస్తవానికి అయితే అక్టోబర్ 1 నుంచి కొత్త భద్రతా ప్రమాణాలు అమల్లోకి రావాల్సి ఉంది. కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ తాజా ఆదేశాల ప్రకారం.. నూతన బ్యాటరీ భద్రతా ప్రమాణాలను రెండంచెల్లో అమలు చేయనున్నారు. మొదటి దశ నిబంధనలు ఈ ఏడాది డిసెంబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. రెండో దశ నిబంధనలు 2023 మార్చి 31 నుంచి అమల్లోకి రానున్నాయి. దేశవ్యాప్తంగా ఇటీవలి కాలంలో ద్విచక్ర వాహనాల్లో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోవడం తెలిసిందే. ప్రమాదాలకు కారణం బ్యాటరీలేనని తేలింది. దీంతో నిపుణుల సూచనల మేరకు కేంద్ర రవాణా శాఖ అదనపు భద్రతా ప్రమాణాలను రూపొందించి, ఆ మేరకు నిబంధనల్లో సవరణలు చేసింది. బ్యాటరీ సెల్స్, ఆన్ బోర్డ్ చార్జర్, బ్యాటరీ ప్యాక్ డిజైన్, వేడిని తట్టుకోగలగడం తదితర అంశాల విషయంలో నిబంధనలను కఠినతరం చేసింది. -
గూగుల్ క్రోమ్ యూజర్లకు అలర్ట్, వెంటనే ఈ ఎక్స్‌టెన్షన్స్‌ను డిలీట్ చేయండి!
ప్రముఖ సైబర్ సెక్యూరిటీ సంస్థ మెకాఫీ (McAfee) గూగుల్ క్రోమ్ యూజర్లకు హెచ్చరికలు జారీ చేసింది. సైబర్ నేరస్తులు ఈ కామర్స్ సైట్‌లోని అఫిలియేషన్ లింక్స్‌ను అడ్డుపెట్టుకొని యూజర్లను ఫిషింగ్ సైట్లకు మళ్లిస్తున్నట్లు తెలిపింది. గూగుల్ క్రోమ్‌లో ఉన్న ఐదు ఎక్స్ టెన్షన్లను 1,400,000 కంటే ఎక్కువ మంది ఇన్ స్టాల్ చేసుకున్నారని, తద్వారా యూజర్ల డేటాకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని వార్నింగ్ ఇచ్చింది. మెకాఫీ వెల్లడించిన ఎక్స్ టెన్షన్లలో నెట్ ఫ్లిక్స్ పార్టీ (800,000 యూజర్లు), నెట్ ఫ్లిక్స్ పార్టీ 2 (300,000 యూజర్లు), ఫ్లిప్ షోప్ ప్రైస్ ట్రాకర్ ఎక్స్ టెన్షన్ (80,000 యూజర్లు), ఫుల్ పేజీ స్క్రీన్ షాట్ క్యాప్చర్ స్క్రీన్ షాట్ (200,000 యూజర్లు), ఆటోబ్యూయ్ ఫ్లాష్ సేల్స్ (20,000 యూజర్లు) ఉన్నట్లు వెల్లడించింది. క్రోమ్ స్టోర్‌లో ఎక్స్ టెన్షన్ లు లభ్యం కావడం లేదు. అయితే యూజర్లు వాటిని తమ పర్సనల్ కంప్యూటర్లలలో ఇన్ స్టాల్ చేసుకున్నట్లయితే, వెంటనే డిలీట్ చేయాలని విజ్ఞప్తి చేసింది. ఫిషింగ్ దాడులు తెలివి మీరిన సైబర్ నేరస్తులు యూజర్ నేమ్, పాస్ వర్డ్‌లను దొంగిలించేందుకు ఫిషింగ్ దాడులకు పాల్పడుతున్నారు. ఈ-కామర్స్ సైట్లు అందించే అఫిలియేట్ కమిషన్ లింక్స్‌ను క్లిక్ చేస్తే..వారికి అనుకూలమైన సైట్లకు మళ్లిస్తున్నారు. అనంతరం యూజర్లకు సంబంధించిన వ్యక్తిగత వివరాలు, బ్యాంక్ డీటెయిల్స్‌ను కాజేస్తున్నారు. ఇదే విషయాన్ని మెకాఫీ గుర్తించింది. యూఆర్ఎల్ క్లిక్ చేస్తే అందులో అక్షర దోషాల్ని గుర్తించాలి. అక్షర దోషాలున్న లింక్స్‌ను క్లిక్ చేయోద్దంటూ సూచించింది. -
ప్రధానితో మమత భేటీ
న్యూఢిల్లీ: సరిహద్దు రాష్ట్రాల్లో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎస్) అధికార పరిధి పెంపును బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్రంగా వ్యతిరేకించారు. బుధవారం ప్రధాని మోదీతో సమావేశం సందర్భంగా ఆమె ఈ విషయం ప్రస్తావించారు. అంతర్జాతీయ సరిహద్దు నుంచి 15 కిలోమీటర్లుగా ఉన్న బీఎస్ఎఫ్ పరిధిని 50 కి.మీ.లకు పెంచుతూ జారీ చేసిన ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. బీఎస్ఎఫ్కు మరిన్ని అధికారాలు కట్టబెడితే రాష్ట్ర పరిధిలో ఉన్న శాంతిభద్రతల విషయంలో ఘర్షణలకు దారితీయవచ్చని ఆమె వ్యాఖ్యానించారు. అకారణంగా దేశ సమాఖ్య వ్యవస్థకు భంగం కలిగించేందుకు యత్నించడం సరికాదని ప్రధానిని కోరినట్లు చెప్పారు. వచ్చే ఏడాదిలో కోల్‌కతాలో జరగనున్న గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ ప్రారంభానికి ప్రధాని మోదీని ఆహ్వానించినట్లు ఆమె వెల్లడించారు. త్రిపురలో బీజేపీ శ్రేణులు టీఎంసీ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నట్లు అంశాన్ని కూడా ప్రస్తావించినట్లు చెప్పారు. సోనియాను కలవాలని నిబంధనేం లేదు కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీతో సమావేశమయ్యారా అని మీడియా ప్రశ్నించగా ఆమె సుదీర్ఘ సమాధానమిచ్చారు. ‘ఈసారి ఢిల్లీ టూర్లో కేవలం ప్రధాని మోదీ అపాయింట్మెంట్ మాత్రమే తీసుకున్నా. పంజాబ్ ఎన్నికలపై పార్టీల నేతలంగా బిజీగా ఉన్నారు. పనికే మొదటి ప్రాధాన్యం. ఢిల్లీ వచ్చిన ప్రతిసారీ సోనియాను ఎందుకు కలవాలి? అదేమీ రాజ్యాంగ నిబంధన కాదు’ అని చెప్పారు. -
కరోనా : పాలసీదారులకు గుడ్ న్యూస్
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ విజృంభణ, దేశ వ్యాప్త లాక్ డౌన్ నేపథ్యంలో పాలసీ దారులకు ఊరటనిస్తూ ఆర్థికమంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మోటారు , ఆరోగ్య బీమా చెల్లుబాటును ఏప్రిల్ 21 వరకు పొడిగించినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. లాక్ డౌన్ సమయంలో ఈ బీమా చెల్లింపుల పునరుద్ధరణ తేదీలు వచ్చే వ్యక్తుల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ గురువారం విడుదల చేసిన నోటిఫికేషన్ లో తెలిపింది. 2020 మార్చి 25 - ఏప్రిల్ 14 (లాక్ డౌన్ సమయం) మధ్యకాలంలో చెల్లింపులు చేయాల్సిన వాహన, ఆరోగ్య పాలసీ దారులకు భారీ ఉపశమనం కల్పించింది.ఈ ఉత్తర్వు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చినట్టు వెల్లడించింది. పాలసీ దారులు ప్రీమియం బకాయిలు మొత్తాన్ని ఏప్రిల్ 21 న లేదా అంతకన్నా ముందుగానీ చెల్లించవచ్చని మంత్రిత్వ శాఖ తెలిపింది. కరోనా నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా వారి పునరుద్ధరణ ప్రీమియాన్ని సకాలంలో చెల్లించలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో దేశంలో చట్టబద్ధమైన మోటారు వాహనం థర్డ్ పార్టీ భీమా కవరేజీని కొనసాగించాలని పేర్కొంది. 2020 ఏప్రిల్ 21 ని పాలసీ పునరుద్ధరణ తేదీగా పరిగణించాలని చెప్పింది. ఆరోగ్య బీమా పాలసీల విషయంలో కూడా ఇదే వర్తిస్తుందని ప్రకటించింది. చదవండి : (హెచ్డీఎఫ్సీ గ్రూప్ : రూ.150 కోట్ల సాయం) చైనా నగరంలో కుక్క మాంసంపై శాశ్వత నిషేధం (కరోనాపై పోరు : గూగుల్ భారీ సాయం) The government has provided relief for third-party auto insurance policy holders and health insurance policy holders in light of the #Covid19 situation. The relevant notifications are attached below. #IndiaFightsCorona pic.twitter.com/5YK86vdXBw — NSitharamanOffice (@nsitharamanoffc) April 2, 2020 -
స్టూడెంట్ ప్లాన్ గడువు పొడిగింపు
అనంతపురం రూరల్ : బీఎస్ఎన్ఎల్ సంస్థ ప్రకటించిన స్టూడెంట్ ప్లాన్ గడువు ఈనెల 15న ముగియనుంది. అయితే బీఎస్ఎన్ఎల్ వినియోగదారులను ఆకట్టుకునేందుకు స్టూడెంట్ ప్లాన్‌ను 2017 మార్చి వరకు గడువు పొడిగించినట్లు సంస్థ డిప్యూటీ జనరల్ మేనేజర్ వెంకటనారాయణ తెలిపారు. ఈ ఆఫర్ రూ.118 ఎఫ్ఆర్సీతో రీచార్జ్ చేయించుకుంటే బీఎస్ఎన్ఎల్ టు బీఎస్ఎన్ఎల్ నిమిషానికి 10 పైసలు, ఇతర నెట్ వర్క్‌లకు 30 పైసలు, వీటితో పాటు 1జీబీ డేటా కూడా ఉచితంగా అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. వినియోగదారులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.