అనంతపురం రూరల్ : బీఎస్‌ఎన్‌ఎల్ సంస్థ ప్రకటించిన స్టూడెంట్ ప్లాన్ గడువు ఈనెల 15న ముగియనుంది. అయితే బీఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారులను ఆకట్టుకునేందుకు స్టూడెంట్ ప్లాన్‌ను 2017 మార్చి వరకు గడువు పొడిగించినట్లు సంస్థ డిప్యూటీ జనరల్ మేనేజర్ వెంకటనారాయణ తెలిపారు.
ఈ ఆఫర్ రూ.118 ఎఫ్‌ఆర్సీతో రీచార్జ్ చేయించుకుంటే బీఎస్‌ఎన్‌ఎల్ టు బీఎస్‌ఎన్‌ఎల్ నిమిషానికి 10 పైసలు, ఇతర నెట్ వర్క్‌లకు 30 పైసలు, వీటితో పాటు 1జీబీ డేటా కూడా ఉచితంగా అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. వినియోగదారులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
స్టూడెంట్ ప్లాన్ గడువు పొడిగింపు
Published Fri, Sep 2 2016 11:02 PM | Last Updated on Fri, Nov 9 2018 4:32 PM
Advertisement
Advertisement