కరోనా : పాలసీదారులకు గుడ్ న్యూస్  | Coronavirus impact: Motor and health insurance validity extended till April 21 | Sakshi
Sakshi News home page

కరోనా : పాలసీదారులకు గుడ్ న్యూస్ 

Published Thu, Apr 2 2020 1:52 PM | Last Updated on Thu, Apr 2 2020 1:57 PM

Coronavirus impact: Motor and health insurance validity extended till April 21 - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ విజృంభణ, దేశ వ్యాప్త లాక్ డౌన్ నేపథ్యంలో  పాలసీ దారులకు ఊరటనిస్తూ ఆర్థికమంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మోటారు , ఆరోగ్య బీమా చెల్లుబాటును ఏప్రిల్ 21 వరకు పొడిగించినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. లాక్ డౌన్ సమయంలో  ఈ బీమా చెల్లింపుల పునరుద్ధరణ తేదీలు వచ్చే వ్యక్తుల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ గురువారం విడుదల  చేసిన నోటిఫికేషన్ లో తెలిపింది.  2020 మార్చి 25 - ఏప్రిల్ 14 (లాక్ డౌన్ సమయం)  మధ్యకాలంలో  చెల్లింపులు చేయాల్సిన వాహన, ఆరోగ్య పాలసీ దారులకు భారీ ఉపశమనం కల్పించింది.ఈ ఉత్తర్వు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చినట్టు వెల్లడించింది.

పాలసీ దారులు  ప్రీమియం  బకాయిలు మొత్తాన్ని ఏప్రిల్ 21 న లేదా అంతకన్నా ముందుగానీ చెల్లించవచ్చని మంత్రిత్వ శాఖ తెలిపింది. కరోనా  నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా వారి పునరుద్ధరణ ప్రీమియాన్ని సకాలంలో చెల్లించలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో  దేశంలో చట్టబద్ధమైన మోటారు వాహనం థర్డ్ పార్టీ భీమా కవరేజీని కొనసాగించాలని  పేర్కొంది.  2020 ఏప్రిల్ 21 ని పాలసీ పునరుద్ధరణ  తేదీగా పరిగణించాలని చెప్పింది. ఆరోగ్య బీమా పాలసీల విషయంలో కూడా ఇదే  వర్తిస్తుందని ప్రకటించింది.

 చదవండి : (హెచ్‌డీఎఫ్‌సీ గ్రూప్ : రూ.150  కోట్ల సాయం) 
 చైనా నగరంలో కుక్క మాంసంపై శాశ్వత నిషేధం

(కరోనాపై పోరు : గూగుల్ భారీ సాయం)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement